pizza
Padamati Sandhyaragama London lo movie launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

15 July 2014
Hyderabad

గణేష్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2, "పడమటి సంధ్యారాగం లండన్ లో " అనే కొత్త సినిమా ప్రారంభం లండన్ లో ని శ్రీ మహాలక్ష్మి టెంపుల్ లో వైభవంగా జరిగింది , ఈ సినిమా మొదటి షాట్ కి క్లాప్ సినీ హీరో ఆకాష్ ఇవ్వగా లండన్ లో స్థిర పడిన Dr .Raj గారు కెమెరా స్విచ్ ఆన్ చేసారు .

సినిమా నిర్మాత లండన్ గణేష్, సినిమా దర్శకుడు వంశీ మునిగంటి , హీరో చైతు శాంతారాం తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు, ముఖ్య అతిధి గ విచ్చేసిన ఆకాష్ సినిమా టీం కి తన అభినందలు తెలిపారు

గణేష్ క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న రెండో సినిమా , లండన్ లో స్థిర పడిన software engineers కొంత మంది కలిసి మంచి సినిమా నిర్మించాలని ఉద్దేశం తో పడమటి సంధ్యారాగం చిత్రాన్ని లండన్ లో మొదలు పెట్టారని, ఈ చిత్రాన్ని అందరి కి నచ్చేలా చక్కని లవ్ స్టొరీ ప్రాధాన్యంగా సాగుతూ మారుతున్న కల్చర్ నేపధ్యం, ఇతివృత్తంగా చూపిస్తున్నామని , అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చేలా తీస్తున్నామని ప్రొడ్యూసర్ లండన్ గణేష్ ఈ సందర్బంగా తెలిపారు

1987 లో స్వర్గీయ జంధ్యాల గారి దర్శకత్వం లో వచ్చిన పడమటి సంధ్యారాగం, కల్చర్ బాక్ డ్రాప్ లో తీసిన ప్రేమ కధ అప్పట్లో ఎంతగానో ఆకర్శించిది ,అలంటి పడమటి సంధ్యారాగం 40 సంవత్సరాల తరువాత ముఖ్యంగా మారుతున్న కల్చర్ దాని ప్రభావం ఇండియా లో విదేశాల్లో మానవ సంబంధాల పై ఎలా ఉంటుందో చెప్తూ అందమైన, సున్నితమైన ప్రేమ కధ ను తెరకెక్కిస్తున్నామని రచయత ,దర్శకుడు వంశీ మునిగంటి తెలిపారు

ఈ చిత్రానికి సహా నిర్మాతలుగా రమేష్ ఈసం పల్లి,ధీరజ్ తోట ,ఆర్విన్ ,ఫెరోజ్ షైక్ ,సలాం అలీన

ఇతర ప్రధాన తారాగణం : Dr రాములు ,ధర్మవతి ,సన్నిహిత ,ఫెరోజ్ షైక్ ,ధీరజ్ తోట, శ్రవణ్ గౌడ్ ,బేబీ నిత్య
సంగీతం కేశవ కిరణ్ ,పాటలు కిట్టు విస్సా ప్రాగడ .కెమెరా: వరప్రసాద్ , లైన్ ప్రొడ్యూసర్ : నవీన్ మేడారం

కో-డైరెక్టర్ సునీల్ ,శ్రవణ్ .


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved