pizza
Paayal Rajput, Happy Movies Production No 5 Launch
హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ నిర్మాతగా ప్రారంభ‌మైన కొత్త చిత్రం `RDX`
You are at idlebrain.com > News > Functions
Follow Us


31 March 2019
Hyderabad

Happy Movies Production House has launched its fifth project.

This film is going to star Paayal Rajput of ‘RX100’ fame and Tejus of ‘Husharu’ fame in the lead roles.

The film is titled ‘RDX’ and it is a female lead oriented movie.

Shankar Bhanu is providing story and screenplay for the movie as well as he is the director.

AP Film Development Corporation Chairman, Ambica Krishna and TDP MLC Buddha Venkanna have graced the launch event as chief guests held in Amaravati.

Radhan will compose music for the film while C Ram Prasad will handle the cinematography.

The regular shooting has commenced after the launch.

C Kalyan is bankrolling ‘RDX’ under Happy Movies banner.

Cast: Paayal Rajput, Tejus, Naresh VK, Amani, Nagineedu, Aditya Menon, Tulasi, Aishwarya, Vidyullekha Raman, Chammak Chandra, Satti Pandu, Gemini Suresh, Satya Sri, , Zoya, Devi Sree, Sahithi and others

Crew:
Story, Screenplay & Direction: Shankar Bhanu
Producer: C Kalyan
Banner: Happy Movies
Music: Radhan
Cinematography: C Ram Prasad
Editor: Prawin Pudi
Production Design: Chinna
Production Controller: B Ravinder
Dialogues: Parasuram
Script Association: Anil
Co-director: Raja Rajesh
Fight Master: Nandu
Lyrics: Bhaskarbhatla, Kittu Vissapragada
Costume Designer: Harsha
Publicity Design: Dhani Aelay
PRO: Vamsi Shekar

హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ నిర్మాతగా ప్రారంభ‌మైన కొత్త చిత్రం `RDX`

చంద‌మామ‌, లోఫ‌ర్‌, జైసింహా వంటి ఎన్నో మంచి చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్రొడ్యూస‌ర్ సి.క‌ల్యాణ్‌. సినీ ఇండ‌స్ట్రీలో కీలక వ్య‌క్తిగా డిస్ట్రిబ్యూట‌ర్‌గా, ఫిలించాంబ‌ర్‌లోనూ ఎన్నో ఉన్న‌త ప‌దవుల‌తో సేవ‌లు అందించడ‌మే కాదు, ప్ర‌స్తుతం FIAPF వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్ధ‌వంత‌గా నిర్వ‌హిస్తున్నారు. ఇలాంటి మంచి అభిరుచిగ‌ల సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.5 `RDX` ఆదివారం విజ‌య‌వాడ కె.ఎల్‌.యూనివ‌ర్సిటీలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ అర్బ‌న్ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు బుద్ధా వెంక‌న్న‌, ఆంధ‌ప్ర‌దేశ్ FDC చైర్మ‌న్ అంబికా కృష్ణ త‌దిత‌రులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ప‌వ‌ర్‌ఫుల్ హీరోయిన్ సెంట్రిక్ కాన్సెప్ట్‌తో శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో `RX 100` వంటి సెన్సేష‌న‌ల్ హిట్ చిత్రంలో న‌టించిన పాయల్ రాజ్‌పుత్ న‌టిస్తుంది. అలాగే `అవ‌కాయ బిర్యానీ`, `హుషారు` చిత్రాల్లో న‌టించి మెప్పించిన తేజ‌స్ హీరోగా న‌టిస్తున్నారు. పాయ‌ల్ రాజ్‌పుత్‌, తేజ‌స్‌ల‌తో దేవుడి ప‌టాల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ అంబికా కృష్ణ కొట్ట‌గా.. బుద్ధా వెంక‌న్న కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సి.క‌ల్యాణ్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బుద్ధా వెంక‌న్న‌, అంబికా కృష్ణ స్క్రిప్ట్‌ను అందించారు.

నిర్మాత సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడు శంక‌ర్ భాను చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో `RDX` సినిమా నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌య్యాను. ప‌వ‌ర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ స‌బ్జెక్ట్. పాయ‌ల్ రాజ్‌పుత్ పాత్ర అద్భుతంగా.. అంద‌రినీ మెప్పించేలా ఉంటుంది. అలాగే తేజ‌స్ స‌హా ప్ర‌తి పాత్ర‌కు ఎంతో ప్రాముఖ్య‌త ఉంటుంది. మంచి క‌థ‌కు త‌గ్గ‌ట్టుగానే మంచి ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ టీం కుదిరింది. రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ఈరోజు నుండే ప్రారంభిస్తున్నాం. విజ‌య‌వాడ‌లో 4 రోజులు షూటింగ్ చేస్తాం. త‌ర్వాత పోల‌వ‌రం, రాజమండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో ఏక‌ధాటిగా 40 రోజులు షూటింగ్ చేస్తాం. మొత్తం షూటింగ్ ఆంధ‌ప్ర‌దేశ్‌లోనే పూర్తి చేస్తాం`` అన్నారు.

పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ - ```RX 100` త‌ర్వాత మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర చేస్తున్నాను. ఇది లేడీ ఓరియెంటెడ్ స‌బ్జెక్ట్‌. డైరెక్ట‌ర్ శంక‌ర్ భానుగారు నా పాత్ర‌కు అద్భుతంగా డిజైన్ చేశారు. ఆయ‌న నెరేష‌న్‌, పాత్ర తీరు తెన్నులు న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పేశాను. నా పాత్ర చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. ఇలాంటి పాత్ర చేయ‌డం చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపిస్తుంది. సి.క‌ల్యాణ్‌గారికి థాంక్స్‌`` అన్నారు.

హీరో తేజ‌స్ మాట్లాడుతూ - ``డైరెక్ట‌ర్ శంక‌ర్ భానుగారు ప్ర‌తి పాత్ర‌కు ఇంపార్టెన్స్ ఉండేలా స్క్రిప్ట్‌ను డిజైన్ చేశారు. పాయల్ రాజ్‌పుత్ వంటి కోస్టార్‌తో ఓ మంచి చిత్రంలో భాగ‌మ‌వుతున్నందుకు ఆనందంగా ఉంది`` అన్నారు.

ద‌ర్శ‌కుడు శంక‌ర్ భాను మాట్లాడుతూ - ``అద్భుత‌మైన స‌బ్జెక్ట్‌. ఆర్‌.ఎక్స్ 100తో న‌టిగా త‌నెంటో ప్రూవ్ చేసుకున్న పాయ‌ల్ రాజ్‌పుత్ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆమె పాత్ర చాలా ఇన్‌టెన్స్‌గా ఉంటుంది. రెగ్యుల‌ర్ షూటింగ్ ఈరోజు నుండే ఉంటుంది. అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం సినిమాను పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాం. క‌థ విన‌గానే ఎంతగానో ఎంక‌రేజ్ చేసి మా ప్రాజెక్ట్‌కు వెన్నుద‌న్నుగా నిలుస్తున్న సి.క‌ల్యాణ్‌గారికి థాంక్స్‌`` అన్నారు.

న‌టీన‌టులు:
న‌రేష్ వి.కె
నాగినీడు
ఆదిత్య మీన‌న్‌
ఆమ‌ని
తుల‌సి
ఐశ్వ‌ర్య‌
విద్యుల్లేఖ
చమ్మ‌క్ చంద్ర‌
స‌త్తిపండు
జెమిని సురేష్‌
స‌త్య శ్రీ
జోయ
దేవిశ్రీ
సాహితి త‌దిరులు

సాంకేతిక వ‌ర్గం:
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: హ‌ర్ష‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: ధ‌ని ఏలే
పి.ఆర్‌.ఒ: వంశీ శేఖ‌ర్‌
పాట‌లు: భాస్క‌ర భ‌ట్ల‌, కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌
కో డైరెక్ట‌ర్ : రాజా ర‌మేష్‌
స్క్రిప్ట్ అసోసియేష‌న్‌: అనీల్‌
డైలాగ్స్‌: ప‌రుశురాం
ప్రొడ‌క్ష‌న్ కంట్రోట‌ర్‌: బి.ప‌రుశురాం
ఫైట్ మాస్ట‌ర్ : న‌ందు
ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ పూడి
మ్యూజిక్ : ర‌ధ‌న్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: చిన్నా
సినిమాటోగ్రాఫ‌ర్‌: సి.రాంప్ర‌సాద్‌
నిర్మాత‌: సి.క‌ల్యాణ్‌
స్టోరి, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శంక‌ర్ భాను

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved