pizza
Samudrudu movie launch
`స‌ముద్రుడు` ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us


13 August 2019
Hyderabad

కీర్త‌న ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `స‌ముద్రుడు`. శ్రీ బ‌దావ‌త్ కిష‌న్ నిర్మిస్తున్నారు. న‌గేష్ నార‌దాశి ద‌ర్శ‌కుడు. ర‌మాకాంత్‌, మోన‌ల్‌, సిమ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులు. సుమ‌న్‌, శ్రావ‌ణ్‌, రామ‌రాజు, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్, జ‌బ‌ర్ద‌స్త్ శేషు, దిల్ ర‌మేష్‌, బి.హెచ్‌.ఇ.ఎల్‌.ప్ర‌సాద్‌, సుమ‌న్‌శెట్టి, ప్ర‌భావ‌తి, రాజ్య‌ల‌క్ష్మి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు.బుధ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్న ఈ చిత్రం గురించి

ద‌ర్శ‌కుడు న‌గేష్ నార‌దాశి మాట్లాడుతూ ``స‌ముద్రం, మ‌త్య్స‌కారుల బ్యాక్‌డ్రాప్‌లో క‌మ‌ర్షియ‌ల్‌గా మాస్‌కి చేరువ‌య్యే రీతిలో మా క‌థ‌, క‌థ‌నం ఉంటాయి. ప్రాణాల‌ను ప‌ణంగా పెడుతూ, నిత్యం sక‌ష్టాలు అనుభ‌విస్తున్న జాల‌ర్ల జీవితాల‌కు అనుకోని అదృష్టం క‌లిసి వ‌స్తున్న స‌మ‌యంలో వారికి ఏ విధ‌మైన ఆప‌ద వ‌చ్చింది. దాన్ని హీరో ఏ విధంగా ప‌రిష్క‌రించాడు అనే పాయింట్‌తో వినోదాత్మ‌కంగా క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో అంద‌ర్నీ అల‌రించే రీతిలో ఈ చిత్రాన్ని మ‌లిచేందుకు సిద్ధ‌మ‌వుతున్నాను`` అని చెప్పారు.

హీరో మాట్లాడుతూ ``ఆరు నెల‌ల నుంచి ప‌నులు జ‌రుగుతున్నాయి. మా ద‌ర్శ‌కుడు సీన్ టు సీన్ చాలా బాగా చేశారు. మ‌త్య్స‌కారుల జీవితాల‌కు అద్దం ప‌ట్టే సినిమా అవుతుంది`` అని అన్నారు.

సుమ‌న్ మాట్లాడుతూ ``ఈ ద‌ర్శ‌కుడితో నేను ఇంత‌కు ముందు అన్న‌వ‌రం స‌త్య‌నారాయ‌ణ‌స్వామి మీద ఓ సినిమా చేశాను. అందులో ఐదుగురు దేవుళ్లుగా, రెండు మారువేషాలు.. మొత్తం ఏడు పాత్ర‌ల్లో న‌టించాను. ఈ సినిమాలో పోలీసుగా న‌టిస్తున్నాను`` అని అన్నారు.

సుమన్ శెట్టి మాట్లాడుతూ ``చాలా రోజులైన‌ప్ప‌టికీ, న‌న్ను గుర్తుపెట్టుకుని మంచి వేషం ఇచ్చినందుకు చిత్ర యూనిట్‌కి ధ‌న్య‌వాదాలు`` అని చెప్పారు.

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved