pizza
Nani's Shyam Singha Roy Launched
నాని 'శ్యామ్ సింగ రాయ్' చిత్రం ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us


10 December -2020
Hyderabad

The powerhouse of talent that he is, Natural Star Nani is opting for some original characters and films of late. Produced by Venkat S Boyanapalli under Niharika Entertainment and directed by creative genius Rahul Sankrityan of Taxiwala fame, Shyam Singha Roy is the most ambitious project of Nani, not just because it will be made on grand scale, it’s because the film’s story and screenplay will be as captivating as the title and he got to play a never-seen-before role in the film.

Award winning actress Sai Pallavi, the gorgeous Krithi Shetty will be playing leading ladies opposite Nani and Madonna Sebastian, Rahul Ravindran, Murali Sharma, Abhinav Gomatam are roped in for important roles in Shyam Singha Rao which will have distinguished technical team working for it.

The muhurtham ceremony of the film has been held today. Anil Ravipudi directed the muhurtham shot on Nani, Sai Pallavi and Krithi Shetty. Nani’s father Ghanta Rambabu sounded the clapboard, while Merlapaka Gandhi switched on the camera. Shiva Nirvana and Venky Kudumula handed over the film’s script to the makers.

The Production No 1 of Niharika Entertainment has original story by Satyadev Janga. Melody songs specialist Mickey J Meyer is on board to compose soundtracks, while Sanu John Varghese will crank the camera. Naveen Nooli is the editor.

Shyam Singha Roy will start rolling from this month.

Cast: Nani, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Rahul Ravindran, Murali Sharma, Abhinav Gomatam

Technical Crew:
Director: Rahul Sankrityan
Producer: Venkat S Boyanapalli
Banner: Niharika Entertainment
Original Story: Satyadev Janga
Music Director: Mickey J Meyer
Cinematography: Sanu John Varghese
Production Designer: Avinash Kolla
Executive Producer: S Venkata Rathnam (Venkat)
Editor: Naveen Nooli
PRO: Vamsi-Shekar

 

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా క్రియేటివ్ జీనియ‌స్ రాహుల్ సాంకృత్యాన్ ('టాక్సీవాలా' ఫేమ్‌) డైరెక్ట్ చేస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' చిత్రం గురువారం పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర్నుంచీ ప్రేక్ష‌కుల్లో దీనిపై మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఈ మూవీలో ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని అత్యంత ఆస‌క్తిక‌ర పాత్ర‌ను నాని చేస్తున్నారు.

నాని స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి ('ఉప్పెన' ఫేమ్‌) నాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో మ‌డోన్నా సెబాస్టియ‌న్ ('ప్రేమ‌మ్' ఫేమ్‌), రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ‌, అభిన‌వ్‌ గోమ‌టం ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

గురువారం నాని, సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టిల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి నాని తండ్రి గంటా రాంబాబు క్లాప్ నివ్వ‌గా, డైరెక్ట‌ర్ మేర్ల‌పాక గాంధీ కెమెరా స్విచ్చాన్ చేశారు. డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డైరెక్ట‌ర్లు శివ నిర్వాణ‌, వెంకీ కుడుముల స్క్రిప్టును ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు అంద‌జేశారు.

నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ తొలి చిత్రానికి స‌త్య‌దేవ్ జంగా క‌థ‌ను స‌మ‌కూర్చ‌గా, మెలోడీ సాంగ్స్ స్పెష‌లిస్ట్ మిక్కీ జె. మేయ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. స‌ను జాన్ వ‌ర్ఘీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

ఈ నెల‌లోనే 'శ్యామ్ సింగ రాయ్' రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వ‌నున్న‌ది.

తారాగ‌ణం:
నాని, సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం

సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: రాహుల్ సాంకృత్యాన్‌
ప్రొడ్యూస‌ర్‌: వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి
బ్యాన‌ర్: నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
ఒరిజిన‌ల్ స్టోరీ: స‌త్య‌దేవ్ జంగా
మ్యూజిక్‌: మిక్కీ జె. మేయ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌ను జాన్ వ‌ర్ఘీస్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌టర‌త్నం (వెంక‌ట్‌)
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌


Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved