pizza
Paidi Jairaj birthday celebrations 2019
లెజెండ్ స్టార్ హీరో, తెలంగాణ ముద్దుబిడ్డ 'పైడి జయరాజ్' జయంతి వేడుక
You are at idlebrain.com > News > Functions
Follow Us


28 September 2019
Hyderabad

తెలంగాణ రాష్టం కరీంనగర్ లో 1909 సంవత్సరం సెప్టెంబర్ 28న జన్మించిన పైడి జయరాజ్ తన పంతొమ్మిదవ యేటనే సినిమాలపై మక్కువతో ముంబాయికి పయనమయ్యి 1930 సంవత్సరం లో 'జగమతి జవాని' అనే మూకీ చిత్రంలో నటించి మెప్పించారు. అనంతరం వరుసగా 200 లకు పైగా చిత్రాల్లో నటించి అనేక అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా 1980 సంవత్సరం లో దాదా సాహెబ్ అవార్డ్ ను కైవసం చేసుకున్న మొట్టమొదటి తెలుగు వ్యక్తిగా కూడా పేరొందారు స్వర్గీయ పైడి జైరాజ్. ఇలాంటి మహోన్నత వ్యక్తిని గతకొన్నేళ్ళుగా అభిమానిస్తూ... ఆయన జయంతిని తూచా తప్పకుండా ప్రతి యేటా ఘనంగా నిర్వహిస్తూన్నారు నిర్మాత మరియు నటుడు అయినటువంటి పంజా జైహింద్ గౌడ్. ఈదిశలోనే ఈ ఏడాది కూడా పైడి జైరాజ్ గారి జయంతిని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించారు పంజా జైహింద్ గౌడ్. ఈ జయంతి వేడుకలో ముఖ్య అథితులుగా పైడి జైరాజ్ గారి మనవడు దీరజ్ నాయిడు, మనవరాలు సునీత నాయిడు, శ్రవణ్, ప్రముఖ రచయిత చిన్నికృష్ణ, శ్రావణ్ కుమార్ గౌడ్, మానిక్, చిన్నా, వెంకటేష్ గుప్తా, స్వామి గౌడ్, వైభవ్, రోషం బాలు, బి. సురేందర్ గౌడ్, ఆకుల మహేందర్, రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన నిర్వహించి ఆయనకు జోహారులు తెలియచేసారు. అనంతరం ఈ కార్యక్రమంలో రచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ.. పైడి జైరాజ్ తెలుగు బిడ్డని ఒక రచయితగా ఉండి కూడా నాకు తెలియకపోవడం బాధపడుతూ అలానే క్షమాపణలు తెలియచేసుకుంటున్నా.. నాకు తెలియకపోవడానికి కారణం ఇంతకు ముందు ఉన్న జెనెరేషన్ అని భావిస్తున్నా.. ఎందుకంటే.. బాలీవుడ్ లో రెండువందల సినిమాలకు పైగా నటించి అనేక అవార్డులను కైవసం చేరుకున్న మహాన్నోత వ్యక్తి గురుంచి తెలియకుండా చేయడమే వారి తప్పిదం అని కూడా భావిస్తున్నా... ఇప్పటికైనా.. ఆయన సేవలను మన తెలుగు ఇండస్ట్రీ గుర్తించి పంజా జైహింద్ గౌడ్ గారిలా పైడి జైరాజ్ గారి పేరిట తగిన కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను. వచ్చే నెలలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారిని కలసి పైడి జైరాజ్ గారి విగ్రహ ఏర్పాటు గురుంచి ప్రస్తావించి తప్పకుండా ఆ ఏర్పాటు కార్యక్రమాన్ని చేపడతానని ఈ సందర్భంగా తెలియచేస్తున్నా అన్నారు.

పంజా జైహింద్ గౌడ్ మాట్లాడుతూ... మొదటి నుంచి నేను పైడి జైరాజ్ గారి అభిమానిని నేను. 2008 సంవత్సరం లో నాకు ఆయన కళామతల్లికి చేసిన గురుంచి తెలిసి చాలా బాధపడి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఆయన ఫోటోను ప్రదర్శించమని ఫైట్ చేసి పెట్టంచాను. అలానే ఆయనను మరచిపోకుండా ఏ స్వార్ధం లేకుండా పైడి జైరాజ్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాను. నేడు 110 వ జయంతి వేడుక జరుపుకుంటోంది. మొన్నామధ్య 'సకల కళా సమ్మేళనం' లో పైడి జైరాజ్ గారి విగ్రహ ప్రతిష్ట గురుంచి, ఆయన పీరైత అవార్డ్స్ గురుంచి హరీష్ రావు గారికి అలానే కేశవరావు గారికి పలుమార్లు తెలియచేసాను కానీ ఆ పెద్దలు మాట దాటేయడం చాలా బాధాకరం. మన తెలంగాణ బిడ్డకు తగిన గౌరవం దక్కేదాక పోరాటాన్ని చేపడుతామని ఈ సందర్భంగా పైడి జైరాజ్ గారిని పట్టించుకోని వారిని హెచ్చరిస్తున్నా.. అని అన్నారు.

పైడి జైరాజ్ గారి మనవరాలు సునీత నాయుడు మాట్లాడుతూ... మా నాన్న గారి తమ్ముడు జైరాజ్ గారు. నా చిన్నతనం నుంచి మా తాత గారితో మంచి అనుబంధం ఉంది. మమ్మల్ని చాలా బాగా చూసుకునే వారు. అయన ఒక గ్రేట్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు.. గుడ్ హ్యూమన్ బీయింగ్ పర్సన్, హుంబుల్ పర్సన్ కూడా.. అంతేకాదు ఏ సబ్జెక్ట్ గురుంచి అయినా ధారాళంగా మాట్లాడే నాలెడ్జ్ మా తాత గారికి ఉంది. అలాంటి మహోన్నత వ్యక్తి ని ఈ విదంగా స్మరించుకువడం, జ్ఞాపకాలను పంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన పంజా జైహింద్ గౌడ్ గారికి నా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నా అన్నారు.

 

Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved