pizza
Pawan Kalyan meets cancer patient and consoles
క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడిని పరామర్శించి ధైర్యం చెప్పిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
You are at idlebrain.com > News > Functions
Follow Us


20 August 2019
Hyderabad


* Janasenani fulfills his fan’s desire
* Extends financial aid of Rs 1 lakh


Janasena Party president Sri Pawan Kalyan has met Sri Pathakuti Budigaiah, Janasena activist and his fan follower, who was suffering from cancer. Sri Budigaiah and his family members called on Sri Pawan Kalyan at the Janasena Party office in Hyderabad on Tuesday morning. On the occasion, Sri Pawan Kalyan enquired about his health condition and he gave Rs 1 lakh for his medical expenses. He also presented him the idol of Lord Ganesh praying his fan’s early recovery and prayed the Lord for ushering in his blessings on Budigaiah.

Budigaiah, a resident of Annasamudram village in Tripuranthakam mandal of Prakasam district was a hardcore fan of Sri Pawan Kalyan. He is suffering from cancer for the past few months. He was actively participating in the party activities despite his regular hospital visits for chemo therapy. He was confined to bed in the recent times with severity of his disease. When he expressed his desire to the party local leaders to meet Sri Pawan Kalyan, they brought it to his notice. He promised to visit Annasamudram village to see Budigaiah. He also enquired Budigaiah’s wife about treatment details. He also promised to speak to doctors at NRI Hospital, Mangalagiri who were treating Budigaiah for better treatment. He further suggested Dr Gowtham, Janasena candidate from Yerragondapalem to keep on updating him about the health condition of Budigaiah time and again.

క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడిని పరామర్శించి ధైర్యం చెప్పిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు


* అభిమాని ఆకాంక్షను నెరవేర్చిన జనసేనాని
* రూ.లక్ష ఆర్ధిక సాయం

క్యాన్సర్ వ్యాధితో బాధప‌డుతున్న త‌న అభిమాని, జనసైనికుడు శ్రీ పాత‌కూటి బుడిగ‌య్య‌ను జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు ప‌రామ‌ర్శించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో శ్రీ బుడిగయ్య, ఆయన కుటుంబం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అత‌ని ఆరోగ్య ప‌రిస్థితిపై కుటుంబ స‌భ్యుల‌ను ఆరా తీశారు. వైద్య ఖ‌ర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్ధికస‌హాయం అందించారు. త‌న అభిమాని త్వ‌ర‌గా కోలుకోవాల‌ని భ‌గ‌వ‌తుండిని ప్రార్ధిస్తూ వినాయ‌కుడి విగ్ర‌హాన్ని బ‌హూక‌రించారు. దేవుడు బుడిగ‌య్య‌కు మంచి చేయాల‌ని ఆకాంక్షించారు. ప్ర‌కాశం జిల్లా త్రిపురాంతకం మండ‌లం, అన్న‌స‌ముద్రం గ్రామానికి చెందిన బుడిగ‌య్య శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారికి వీరాభిమాని. గ‌త కొంత‌కాలంగా క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. కీమో థెర‌పీ తీసుకుంటూ కూడా జ‌న‌సేన పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాధి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌డంతో కొంత‌కాలంగా మంచానికే ప‌రిమితం అయ్యారు. శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారిని చూడాల‌న్న త‌న కోరిక‌ను స్థానిక జ‌న‌సేన నాయ‌కుల‌కు తెలియ‌ప‌ర‌చ‌గా, విష‌యం పార్టీ అధినేత దృష్టికి తీసుకు వచ్చారు. బుడిగయ్యను పరామర్శించేందుకు అన్నసముద్రం వస్తానని చెప్పారు. ఈలోగా అత‌న్ని అంబులెన్స్ లో ప్ర‌శాస‌న్‌న‌గ‌ర్‌లో జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యానికి తీసుకువ‌చ్చారు. వ్యాధి ఎంత కాలం నుంచి ఉంది? చికిత్స ఎక్క‌డ చేయిస్తున్నారు అన్న విష‌యాల‌ను అత‌ని భార్య‌ను అడిగి తెలుసుకున్నారు. మంగళగిరిలో ఎన్‌.ఆర్‌.ఐ ఆసుప‌త్రి వైద్యుల‌తో తాను స్వ‌యంగా మాట్లాడుతాన‌ని శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు తెలిపారు. బుడిగయ్య ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు చూడాలని ఎర్రగొండపాలెం నుంచి జనసేన అభ్యర్థిగా నిలిచిన డా.గౌతమ్ కు సూచించారు.

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved