pizza
Kalyana Vaibhogame Platinum Disc Function
You are at idlebrain.com > News > Functions
Follow Us

07 March 2016
Hyderabad

నాగ‌శౌర్య‌, మాళ‌విక నాయ‌ర్ జంట‌గా న‌టించిన సినిమా `క‌ల్యాణ వైభోగ‌మే`. నందినిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ రంజిత్ మూవీస్ ప‌తాకంపై దామోద‌ర‌ప్ర‌సాద్ నిర్మించారు. ఈ సినిమా ఇటీవ‌ల విడుద‌లై మంచి పేరు తెచ్చుకుంది. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ప్లాటిన‌మ్ వేడుక‌ను నిర్వ‌హించారు.

నందిని రెడ్డి మాట్లాడుతూ ``ఈ సినిమాను మేం బ్రెయిన్‌తో కాదు హార్ట్ తో చేశాం. చిన్నాచిత‌కా త‌ప్పులు, స్క్రీన్ ప్లే లోపాలు, ఫాల్ట్స్ ఉంటాయి. కానీ ఆద‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ నేను హార్ట్ ఫుల్‌గా థాంక్స్ చెబుతున్నాను. ఇష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది. క‌ల్యాణ్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు. నాకు ఈ సినిమాతో 10 రెట్లు పేరు వ‌స్తుంద‌ని క‌ల్యాణ్‌ ముందే చెప్పాడు. అలాగే అయింది. ల‌క్ష్మీ భూపాల్ ఈ సినిమాకు ప్రాణం పెట్టి ప‌నిచేశాడు. కెమెరామేన్ రాజు, మా జునైద్ అంద‌రూ క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. జునైద్ అయితే ర‌ష్ చూసిన త‌ర్వాత ఆనందం ప‌ట్ట‌లేక వాటేసుకున్నాడు. సాయిరిత్విక్‌, నా ఫేవ‌రేట్ యాక్ట‌ర్‌. శౌర్య‌, మాళ‌విక 100 శాతం యాప్ట్ అయ్యారు. ఈ సినిమా డీవీడీలు త‌ర‌త‌రాలుగా ఇళ్ళ‌ల్లో ఉండాలి. ఇండ‌స్ట్రీలో న‌న్ను ఎవ‌రూ న‌మ్మ‌న‌ప్పుడు దామూగారు న‌మ్మారు. ఆయ‌న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టినందుకు గ‌ర్వంగా ఉంది`` అని అన్నారు.

తాగుబోతు ర‌మేష్ మాట్లాడుతూ ``అలా మొద‌లైంది సినిమా క్లైమాక్స్ లో నా వ‌ల్ల ఆడింద‌ని చాలా మంది చెప్పేవారు. కానీ ఈ సినిమా చూశాక నందినిరెడ్డిగారిలో ఉన్న టాలెంట్ తెలిసింది. క‌థ మొత్తం తెలిసిన నేనే కొన్ని సీన్ల‌లో కంట‌త‌డి పెట్టాను`` అని అన్నారు.

జెమిని సురేశ్ మాట్లాడుతూ ``అద్భుత‌మైన వేషం వేస్తున్నాను. అచ్చ‌మైన‌, స్వ‌చ్ఛ‌మైన తెలుగు చిత్ర‌మిది. న‌న్ను నిల‌బెట్టే సినిమా అవుతుంది. సిల్వ‌ర్ స్క్రీన్‌మీద నేను చేసే ఓ పాత్ర న‌న్ను నిల‌బెట్టాలి అని అనుకున్నాను. అది ఈ సినిమాతో నెర‌వేరింది. స‌ర్వ‌త్రా పాజిటివ్ రివ్యూలు వ‌చ్చాయి`` అని తెలిపారు.

న‌వీన్ మాట్లాడుతూ ``ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవారు ఈ సినిమాను చూస్తే టెన్ష‌న్ రిలీవ్ అవుతుంది`` అని చెప్పారు.

నాగశౌర్య మాట్లాడుతూ ``ఇప్ప‌టిదాకా 8 సినిమాల్లో న‌టించాను. ఏ సినిమాకూ రాని అప్రిషియేష‌న్ ఈ సినిమాకు వ‌చ్చింది. చాలా బాగా చేశావ‌ని అంటున్నారు. నా మునుప‌టి ఫ్లాప్ అయినా స‌రే మార్కెట్ ప‌రంగా కాకుండా, క‌థ ప‌రంగా ఆలోచించి స‌బ్జెక్ట్ కోసం న‌న్ను సెల‌క్ట్ చేసుకున్న దాముగారికి థాంక్స్. ఈ సినిమాలో పెళ్ళి పాట ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. నేను పెళ్ళి చేసుకుంటూ అదే పాట పెట్టుకుంటాను. ఇందులో నేను క‌ష్ట‌ప‌డింది ఏమీ లేదు. డైర‌క్ట‌ర్‌ని కాపీ పేస్ట్ చేశాను. మ‌ధ్య‌లో కొన్ని మాస్ సినిమాల‌ను చేయ‌బోయా. కానీ ఈ సినిమాలో మ‌ళ్ళీ ఫామ్‌లోకి రావ‌డం ఆనందంగా ఉంది. మాళ‌విక చాలా చిన్న పిల్ల‌. కానీ ఎమోష‌న్స్ ను బాగా పండించింది.

క‌ల్యాణి కోడూరి మాట్లాడుతూ ``ఈ సినిమా హిట్ అయినందుకుగానీ, మ్యూజిక్ . నందినిరెడ్డి, దామూగారికి విజ‌యం దొరికినందుకు ఆనందంగా ఉంది

దామూ మాట్లాడుతూ ``ఈ సినిమాకు సంబంధించి జెన్యూన్ రిపోర్ట్స్ వ‌చ్చాయి. థియేట‌ర్ల ద‌గ్గ‌ర చాలా మంది అప్రిషియేట్ చేశారు. ఈ టీమ్ నా ఫ్యామిలీ లాంటిది. అలా మొద‌లైంది త‌ర్వాత అదే కాంబినేష‌న్‌లో హిట్ కొట్ట‌డం ఆనందంగా ఉంది. ఇదే టీమ్‌తో త్వ‌ర‌లోనే సినిమా చేస్తాను. 50 రోజుల ఫంక్ష‌న్‌లో మాట్లాడుతాను`` అని చెప్పారు.

ల‌క్ష్మీ భూపాల్ మాట్లాడుతూ ``ఒక సినిమాకు మాట‌ల‌తో పాటు సింగిల్ కార్డు పాట‌లు రాసిన ర‌చ‌యిత‌లు ఆత్రేయ త‌ర్వాత‌నేనే అని అంటున్నాను. ఒక సినిమాకు ఇంత పేరు తెచ్చుకున్న‌వాడిని మాత్రం ఈ మ‌ధ్య‌కాలంలో నేనే. క‌థ‌లోని కీల‌కాంశాన్ని అలాగే ఉంచి, ఈ సినిమాను మాస్ ఆడియ‌న్స్ కి న‌చ్చేలా తీసుకెళ్ళాం.

ఈ కార్య‌క్ర‌మంలో రాజ్ మాదిరాజు, పృథ్విరాజ్‌, జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, వివేక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved