pizza
Allu Sirish's Srirastu Subhamastu Audio Celebrations
'శ్రీరస్తు శుభమస్తు' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

31 July 2016
Hyderaba
d

గీతాఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లుశిరీష్‌లావణ్యత్రిపాఠి హీరో హీరోయిన్లుగా పరుశురాం దర్శకత్వంలో అల్లు అరవింద్‌ నిర్మాతగా రూపొందించిన చిత్రం 'శ్రీరస్తు శుభమస్తు'. ఈ సినిమా ఆగస్టు 5న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి,  అల్లు అరవింద్‌బోయపాటి శ్రీను,  జెమిని కిరణ్‌డా. వెంకటేశ్వరరావుఅల్లు శిరీష్‌లావణ్య త్రిపాఠిఎన్‌.వి. ప్రసాద్‌ఎస్‌.ఎస్‌. థమన్‌సినిమాటోగ్రాఫర్‌ మణికంఠన్‌మార్తాండ్‌ కె.వెంకటేష్‌సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ ''శ్రీరస్తు శుభమస్తు అనే సినిమా టైటిల్‌ ఎందుకు పెట్టారో తెలియదు కానీ నేనుసరిత కలిసి కట్టా సుబ్బారావుగారి దర్శకత్వంలో యాక్ట్‌ చేశాం. చాలా బాగా ఆడింది. తిరిగి ఆ టైటిల్‌ వినగానే నేను కనెక్ట్‌ అయ్యాను. నాకు అత్యధిక సినిమాలు ఇచ్చిన సినిమాలువిజయవంతమైన సినిమాలు ఇచ్చిన సంస్థ గీతాఆర్ట్స్‌. చక్కటి అభిరుచి గల అరవింద్‌లాంటి నిర్మాత దొరకడం కూడా నా అదృష్టం. సినిమాల పరంగా అరవింద్‌గారు ఎప్పుడూ అప్‌డేట్‌ అవుతుంటారు. ఇప్పుడు గీతాఆర్ట్స్‌ సంస్థ నెంబర్‌వన్‌గా ఉందంటే కారణం ఆయన అభిరుచే కారణం. నిర్మాతగా పెద్ద చిన్న సినిమాలు చేస్తూ విజయపరంపర కొనసాగిస్తున్నారు. ఆయన అభిరుచికి తగినట్టు రూపొందిన ఈ సినిమా కచ్చితంగా మరో సక్సెస్‌ను సాధిస్తుంది. ఈ సినిమా ఫస్ట్‌కాపీని ఈరోజు చూశాను. దర్శకుడు పరుశురాం సినిమాను ఎక్కడా డ్రాప్‌ కాకుండా సున్నితంగా హ్యండిల్‌ చేశాడు. తను ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని చక్కగాకట్టిపడేసేలా సినిమా తీశాడు. ఈ సబ్జెక్ట్‌ ఎలాంటి అభ్యంతరాలు చెప్పే ఫాదర్‌కిఅభ్యుదయ భావాలున్న బిడ్డలకు మధ్య జరిగే సంఘర్షణ. దీన్ని చాలా చక్కగా చూపించారు. సినిమా చూస్తుంటే సక్సెస్‌ఫుల్‌ సినిమా బొమ్మరిల్లు సినిమా గుర్తుకు వచ్చింది. శిరీష్‌ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు. శిరీష్‌ ఆలోచనా విధానంకానీనడవడిక కానీ చూసి తను ఆర్టిస్ట్‌ అవుతాడనుకోలేదు. తను చాలా మంచి ప్రొడ్యూసర్‌ అవుతాడనిపించింది. కానీ తను ఆర్టిస్ట్‌ అయ్యాడు. ఏదో సినిమా చేసేయాలని కాకుండా విలక్షణంగాప్రత్యేకంగా ఉండాలని ఆలోచించేవాడు. తన ప్రయతానికి నేను తనను అభినందిస్తున్నాను. ఈ సినిమాతో తన భవిష్యత్‌కు మంచి పునాది వేసుకుంటాడు. లావణ్య గ్లామర్‌తో సినిమాకు మరింత అందాన్ని తెచ్చింది. వండర్‌ఫుల్‌గా నటించింది. పరుశురాం డైలాగ్స్‌ చాలా పొందికగా రాశాడు. మణికంఠన్‌ మంచి సినిమాటోగ్రఫీ అందించాడు. థమన్‌ మంచి మ్యూజిక్‌ అందించాడు. భవిష్యత్‌లో 151వ చిత్రం చేస్తేట్యూన్స్‌ బావుంటే తన మ్యూజిక్‌లో సినిమా చేయడానికి నేను రెడీ. ముఖ్యంగా యూత్‌,ఫ్యామిలీస్‌తో సహా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ''పరుశురాం మహా శ్రద్ధతో ఆరు నెలలు పాటు స్క్రిప్ట్‌ వర్క్‌ చేయడమే కాకుండా తొమ్మిది నెలలు పాటు షూటింగ్‌ చేశాడు అందుకనే తనకు స్పెషల్‌ థాంక్స్‌. నిన్న సరైనోడుఈరోజు శ్రీరస్తు శుభమస్తురేపు ధ్రువ పెద్ద సక్సెస్‌ అవుతుంది. దర్శకుడు సురేందర్‌ సినిమా బాగా తీస్తున్నాడు. అందరికీ థాంక్స్‌'' అన్నారు.

అల్లు శిరీష్‌ మాట్లాడుతూ ''కొత్తజంట తర్వాత రెండు సంవత్సరాలు బ్రేక్‌ తీసుకుని మంచి కథతో సినిమా చేయాలని వెయిట్‌ చేసి నేనుపరుశురాంగారు ఎలాంటి టెన్షన్‌ లేకుండా ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయాలనే ఈ సినిమా చేశాం. టీం అందరూ బెస్ట్‌ సినిమా ఇవ్వాలనే టీం అందరం కష్టపడి సినిమా చేశాం. నిజాయితీగా చెప్పాలనుకున్నది చెప్పాం. ఏ ఇంట్లో ఆడవాళ్ళు గౌరవింపబడతారోఆ ఇంట్లో దేవతలు కొలువు తీరుతారు అనేదే సినిమా పాయింట్‌. దీన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిపి చేశాం. చాలా మంచి ప్రకాష్‌రాజ్‌రావు రమేష్‌తనికెళ్ళ భరణి సహా చాలా మంచి సీనియర్‌ నటీనటులతో వర్క్‌ చేశాను. మణికంఠన్‌గారు చాలా మంచి సినిమాటోగ్రఫీ ఇచ్చారు. థమన్‌గారు మ్యూజిక్‌ చేసేటప్పుడు మెలోడీ మ్యూజిక్‌ కావాలని అడిగాం. ఆయన కూడా అలాగే మంచి మెలోడీ మ్యూజిక్‌ ఇచ్చారు. మా బ్యానర్‌లో మరోసారి పనిచేశాను. మా నాన్నకు థాంక్స్‌. లావణ్య చాలా చక్కగా యాక్ట్‌ చేసింది. ప్రతి కుర్రాడు ఈ సినిమా తర్వాత లావణ్యలాంటి గర్ల్‌ఫ్రెండ్‌ ఉండాలని కోరుకుంటున్నాను. చిరంజీవిగారి గురించి చెప్పాలంటే ఆయన నాకు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నాకు రోల్‌ మోడల్‌. అందులో మూడు విషయాలు ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను. ఒక భాధ్యతను క్రియేట్‌ చేశారు..నేను ఇంటర్‌ చదివేటప్పుడు లావుగా ఉండేవాడిని అప్పుడు నాన్నగారు కూడా శిరీష్‌ ఏమౌతాడోనని అనుకుంటుంటే మావయ్యే ఒక సంవత్సరం పాటు వాళ్ళ ఇంట్లో ఉంచుకుని నేనేం తింటున్నానో కూడా దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పుడు నా అన్నయ్య పిల్లల్ని చూస్తున్నప్పుడు నేను కూడా అలాగే బాధ్యతగా ఉండాలని నేర్చుకున్నాను. చిన్నప్పుడు నేను ఫారిన్‌ కంట్రీస్‌కు వెళ్ళినాఊటీకొడైకెనాల్‌కు వెళ్ళినా మా మావయ్య తీసుకెళ్లాడు. అక్కడ నుండి వచ్చేటప్పుడు మాకోసం గిఫ్ట్స్‌ తీసుకొచ్చేవారు. చిరంజీవిగారిలాంటి ఫాదర్‌మావయ్య కావాలనే బాధ్యతను చిరంజీవిగారి దగ్గరనుండే నేర్చుకున్నాను. నిన్ను కలిసే ప్రతి వ్యక్తికి ఓ మధుర జ్ఞాపకంలా ఉండేలా చూసుకో అనే విషయాన్ని కూడా చెప్పారు. మనిషి కోరుకునేది గుర్తింపు,నీ చుట్టు పక్కల ఉండేవారు మంచి పనిచేసినప్పుడు అప్రిసియేట్‌ చెయ్‌..అన్నారు. అప్పటి నుండి నా పక్కనుండే వారి మనసులను ప్రేమతో గెలుచుకోవడం ప్రారంభించాను. మా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ పిలిచినా ఏ మాత్రం బరువు అనుకోకుండా వస్తూ మమ్మల్ని ఎంకరేజ్‌ చేశారుప్రోత్సాహించారు. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

Glam galleries from the event

చిత్ర దర్శకుడు పరుశురాం మాట్లాడుతూ ''నన్ను నమ్మిఅరవింద్‌గారికి చెప్పి నాకు సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు ముందు శిరీష్‌కు థాంక్స్‌. ఈ సినిమా చేసేటప్పుడు నాకు ఒక మాట చెప్పారు. బంగారంలాంటి నా కొడుకును నీ చేతిలో పెడుతున్నాను...నువ్వేం చేస్తావో అని అన్నారు. ఆయనకు నేను చెప్పేదొక్కటే సార్‌..మీ బంగారాన్ని ఓమంచి అభరణంగా మలిచి దాని విలువ పెంచి మీ చేతికిస్తున్నాను. నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్‌. ఈ ప్రాజెక్ట్‌లో నన్ను ముందుకు నడిపించిన బన్నివాస్‌గారికిమ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌గారికి థాంక్స్‌ చెబుతున్నాను. లావణ్యకు ఈ సినిమా ముందుఈ సినిమా తర్వాత అంటారు. మణికంఠన్‌ మంచి సినిమాటోగ్రఫీ అందించారు. ప్రతి ఒక్కరూ విజువల్స్‌ బావున్నాయని అంటున్నారు. అహంకారానికిఆత్మాభిమానికి చిన్న లైన్‌ ఉంటుంది. చాలా మందికి అది తెలియదు. తెలిసోతెలియకో మనం హార్ట్‌ చేసుకుంటూ పోతుంటాం. చాలా మంది ఆలోచించంకుండా వెళ్ళిపోతుంటారు. అలా రెండు అంశాల మధ్య జరిగే కథ ఇది. ఇందులో నెగటివ్‌ క్యారెక్టర్స్‌ ఏవీ ఉండవు. మంచికిమంచికీ మధ్య జరిగే పోరాటం ఇది. అరవింద్‌గారు నాకు పెద్ద బాధ్యతను అప్పజెప్పారుఆయనకు థాంక్స్‌'' అన్నారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ ''శ్రీరస్తు శుభమస్తు చాలా శుభప్రదమైన పేరు. ఇంత మంచి పేరు పెట్టిన యూనిట్‌ను అభినందిస్తున్నాను. ఈ సినిమా కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ బ్యానర్‌లో నేను సరైనోడు అనే సినిమా చేశాను. అలాగే సినిమా కూడా అద్భుతమైన సినిమా అవుతుందని భావిస్తున్నాను'' అన్నారు.

ఎన్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా ఆడియో అల్రెడి పెద్ద హిట్టయ్యింది. సినిమా కూడా పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్లు అరవింద్‌గారికి చిరంజీవిగారంటే ఎంతిష్టమో మనకు తెలిసిందే. ఆయన సినిమా హిట్‌ అయితే అంతే ఇష్టపడతాడు. ఇప్పుడు అలాగే ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

డా.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ''డెఫనెట్‌గా ఈ సినిమా అల్లుశిరీష్‌కు మంచి సినిమా అవుతుంది. అల్లుశిరీష్‌కుఅల్లు అరవింద్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

జెమినికిరణ్‌ మాట్లాడుతూ ''టీంకు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

ఎస్‌.ఎస్‌.థమన్‌ మాట్లాడుతూ ''నా కెరీర్‌లోనే ఫస్ట్‌ సాఫ్ట్‌ టైటిల్‌ ఇదే. పరుశురాంకు నేను నా లవ్‌స్టోరీస్‌ చెపుతుండేవాడిని నీతో తప్పకుండా ఓ లవ్‌స్టోరీ చేస్తానని ఆయన అనేవాడు. కానీ ఇంత త్వరగా కుదురుతుందని అనుకోలేదు. ఈ సినిమా తర్వాత శ్రీరస్తు శుభమస్తు థమన్‌ అంటారనుకుంటున్నా. సరైనోడు సినిమా సమయంలోనే ఈ సినిమా చేశాను. దానికి అపోజిట్‌ మూవీ. నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన అరవింద్‌గారికి థాంక్స్‌. శిరీష్‌లో సూపర్బ్‌ చేంజ్‌ కనపడింది. చాలా ఈజీగా పెర్‌ఫార్మ్‌ చేశాడు. సరైనోడు వంటి సక్సెస్‌ కళ కనపడుతుంది. సరైనోడులా ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుంది. '' అన్నారు.

సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ ''సూపర్బ్‌ టైటిల్‌. టైటిల్‌లోనే సక్సెస్‌ ఉంది. దర్శకుడు పరుశురాంశిరీష్‌ కెరీర్‌లోనే పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

మణికంఠన్‌ మాట్లాడుతూ ''మంచి బ్యానర్‌లో పనిచేసే అవకాశం కలిగింది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌'' అన్నారు.

అల్లు శిరీష్లావణ్య త్రిపాఠిప్రకాష్ రాజ్సుమలత,  సుబ్బరాజుప్రగతిఆలీతనికెళ్ల భరణిరావ్ రమేష్రవి ప్రకాష్రణధీర్సుబ్బరాజుహంసానందినిసుమిత్ర త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్.య‌స్‌.య‌స్‌యాక్షన్ - రామ్లక్ష్మణ్, ఆర్ట్ : రామాంజనేయులుడిఓపి:  మణి కంఠన్ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: నాగ‌రాజుఎడిటర్: మార్తాడ్ కె.వెంకటేష్నిర్మాత: అల్లు అరవింద్దర్శకుడు: పరశురామ్.

 

 

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved