pizza
Premaku Raincheck Title Launch
"ప్రేమకు రెయిన్ చెక్" టైటిల్ లాంచ్
You are at idlebrain.com > News > Functions
Follow Us


14 July 2018
Hyderabad

Popular production house North Star Entertainment is presenting and Stone Media is bankrolling an upcoming entertainer “Premaku Raincheck”. The word Raincheck is a promise that an invitation/offer cannot be taken now, but would be taken at a later time.

Akella Peri Srinivas is directing this trendy love story and is presented by Sharrath Maraar under North Star Entertainment Banner, which is indeed an interesting aspect. The film’s title logo has been released today.

The film unit hopes that, the working title of ‘Project Victory’ that was used during initial stages of production will be justified after its theatrical release. Abhilash Vadada, Priya Vadlamani and Mounica Tavanam are the lead cast.

On the occasion of the film’s title launch, Akella Peri Srinivas said, “Premaku Rain Check is very different love story. I am an investment banker with passion in filmmaking. The theme of the film is about Life, career and romance choices of the protagonists. It would be interesting to see the characters, who have given Raincheck to love, by neither rejecting it nor accepting it. We will soon release first look poster. We are also planning to release the movie in August.”

Deepak Kiran has scored music, wherein cinematography is handled by Sarath Guruvugari. North Star Entertainment is presenting the film and Akella Peri Srinivas looked after writing, direction and production departments.

"ప్రేమకు రెయిన్ చెక్" టైటిల్ లాంచ్

ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం "ప్రేమ రెయిన్ చెక్". "రెయిన్ చెక్" అంటే ఇచ్చిన ఆఫర్ ను భవిష్యత్ లో తీసుకుంటాను అని అర్ధం. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్ స్టార్ ఎంటర్ టైనెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పిస్తుండడం విశేషం. ఈ చిత్రం టైటిల్ లోగోను ఇవాళ విడుదల చేశారు.

"ప్రొజెక్ట్ విక్టరీ" అనే వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ చిత్రం విడుదల తర్వాత ఆ వర్కింగ్ టైటిల్ ను జస్టిఫై చేస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు చిత్రబృందం.

అభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్ లోగో విడుదల సందర్భంగా చిత్ర దర్శకనిర్మాత ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. "ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా "ప్రేమకు రెయిన్ చెక్" చిత్రాన్ని తెరకెక్కుతోంది. ఒక ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ అయిన నేను సినిమా మీద ప్యాషన్ తో ఈ చిత్రం నిర్మించాను. లైఫ్, కెరీర్ & రొమాన్స్ నేపధ్యంలో ఈ సినిమా ఉంటుంది. తిరస్కరించకుండా, ఒప్పుకోకుండా ప్రేమను పోస్ట్ పోన్ చేసి రెయిన్ చెక్ ఇచ్చిన పాత్రల కథ ఇది. త్వరలోనే ఫస్ట్ లుక్ ను విడుదల చేసి.. ఆగస్ట్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: దీపక్ కిరణ్, ఛాయాగ్రహణం: శరత్ గురువుగారి. సమర్పణ: నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్, రచన-దర్శకత్వం: ఆకెళ్ళ పేరి శ్రీనివాస్.

Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved