pizza
24 Kisses pre release function
`24 కిస్సెస్‌` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


17 November 2018
Hyderabad

సిల్లీ మాంక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ‌ర్ప‌ణ‌లో రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై అరుణ్ ఆదిత్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా నటిస్తోన్న చిత్రం `24 కిస్సెస్‌`. అయోధ్య‌కుమార్ క్రిష్ణంసెట్టి ద‌ర్శ‌కుడు. స‌ంజ‌య్ రెడ్డి, అనిల్ ప‌ల్లాల‌, అయోధ్యకుమార్ కృష్ణంసెట్టి నిర్మాత‌లు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ...

మంచు ల‌క్ష్మి మాట్లాడుతూ - ``సంజ‌య్‌, అదిత్‌, హెబ్బా బాగా తెలుసు. విజువ‌ల్స్ చాలా బావున్నాయి. మిణుగురులు సినిమాతో 7 నంది అవార్డులు, జాతీయ అవార్డును కూడా అయోధ్య‌కుమార్ గారు ద‌క్కించుకున్నారు. ఈ సినిమాతో చాలా డ‌బ్బులు రావాలి. నవంబ‌ర్ 23న సినిమా విడుద‌ల‌వుతుంది. సినిమాను త‌ప్ప‌కుండా ఆద‌రించండి`` అన్నారు.

న‌వ‌దీప్ మాట్లాడుతూ - ``అరుణ్ అదితి నాకు మంచి మిత్రుడు. అయోధ్య‌కుమార్‌గారికి మంచి పేరు రావాలి. హెబ్బా చాలా బోల్డ్ స్టోరీస్‌తో సినిమాలు చేస్తుంది. ఎంటైర్ టీంకు అభినంద‌న‌లు`` అన్నారు.

సందీప్ కిష‌న్ మాట్లాడుతూ - ``సంజ‌య్ రెడ్డిగారు చాలా మంచి వ్య‌క్తి. ఆయ‌న‌తో ప్ర‌స్థానం నుండి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అయోధ్య‌కుమార్‌గారి మిణుగురులు సినిమా చూశాను. ఇక 24 కిస్సెస్ విష‌యానికి వ‌స్తే విజువ‌ల్స్ చాలా బావున్నాయి`` అన్నారు.

సీనియ‌ర్ న‌రేశ్ మాట్లాడుతూ - ``ప్ర‌స్తుతం కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌తో పాటు క‌ల్ట్ చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తున్నాయి. అయితే 24 కిస్సెస్ విష‌యానికి వ‌స్తే ఇది క‌ల్ట్ మూవీ కాదు. చాలా డెప్త్‌తో ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్ ఈసినిమాను తెర‌కెక్కించారు. ముద్దు అనేది బ్యూటీఫుల్ ఎమోష‌న్‌. దాన్ని క‌వితాత్మ‌కంగా అయోధ్య‌కుమార్ తెర‌కెక్కించారు. నా సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి విజ‌యాల‌ను అందుకున్నాను. ఈ సినిమాతో మ‌రో స‌క్సెస్‌ను సాధిస్తాన‌నే న‌మ్మ‌కం ఉంది. ల‌వ్ సినిమాల్లో మంచి మ్యూజిక్ ఉండాలని జాయ్ బ‌రువా అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. అరుణ్‌, అదిత్ చాలా క‌ష్ట‌ప‌డి ఎమోష‌న్‌ను పండించారు. ఎంటైర్ యూనిట్ కంగ్రాట్స్‌`` అన్నారు.

న‌వీన్ చంద్ర మాట్లాడుతూ - ``ముద్దు అనేది బ్యూటీఫుల్ ఎమోష‌న్స్‌. దాన్ని తెర‌పై చూపించ‌డం అంత సుల‌భం కాదు. ద‌ర్శ‌కుడి గారి విజ‌న్‌ను అర్థం చేసుకుని ఓ ఎమోష‌న్‌ను క్యారీ చేయ‌డం గొప్ప విష‌యం. అరుణ్‌, హెబ్బాప‌టేల్ చ‌క్క‌టి ఎమోష‌న్స్‌ను క్యారీ చేసుంటార‌ని భావిస్తున్నాను`` అన్నారు.

నిర్మాత అనిల్ ప‌ల్లాల మాట్లాడుతూ - ``ఈ జ‌ర్నీ లో చాలా ఎగుడుదిగుడుల‌ను చూశాం. అన్ని స‌మ‌స్య‌ల‌ను దాటి సినిమాను ఈ నెల 23న విడుద‌ల చేస్తున్నాం. మా ప్ర‌య‌త్నం త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు.

చంద్ర‌సిద్ధార్థ మాట్లాడుతూ - ``మిణుగురులు చిత్రంతో జాతీయ‌స్థాయిలో అవార్డులు అందుకున్న చిత్రాన్ని తెర‌కెక్కించి అయోధ్య కుమార్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రంతో మ‌న ముందుకు వ‌చ్చారు. సినిమా క‌ళాత్మ‌క‌మైన క‌మ‌ర్షియ‌ల్ సినిమాను అయోధ్య‌కుమార్ తెర‌కెక్కించి ఉంటాడ‌నేది నా న‌మ్మ‌కం. అరుణ్ అదితి, హెబ్బాప‌టేల్ స‌హా యూనిట్‌కి అభినంద‌నలు`` అన్నారు.

సిద్ధు మాట్లాడుతూ - ``యూనిట్‌తో మంచి అనుబంధం ఉంది. వారు ఎంతో క‌ష్ట‌ప‌డి చేశారు. ఈ సినిమా చాలా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్ మాట్లాడుతూ - ``మిణుగురులు సినిమాను మూడేళ్లు క‌ష్ట‌ప‌డి చేస్తే.. చాలా అవార్డులు వ‌చ్చాయి. అభినంద‌న‌లు వ‌చ్చాయి. అయితే మ‌ళ్లీ నేను స్టార్ట్ చేయాల్సి వ‌చ్చింది. 2016లో 24 కిస్సెస్ స్టార్ట్ చేశాను. అప్ప‌టికి `అర్జున్ రెడ్డి`, `ఆర్‌.ఎక్స్ 100` సినిమాలు రాలేదు. ఆ రెండు సినిమాలు ముద్దుల వ‌ల్ల హిట్ కాలేదు. ఏ సినిమా కూడా ముద్దుల వ‌ల్ల హిట్ కాదు. కంటెంట్ ఉండాలి. కంటెంట్‌ను న‌మ్మిన నిర్మాత‌లు సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. మిణుగురులు సినిమా కోసం 40 స్సెష‌ల్ షోస్ వేశాను. ఒక‌రిద్ద‌రు త‌ప్ప ఎవ‌రూ పెద్ద‌గా ముందుకు రాలేదు. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత ఒక్కొక్క ఏరియా నుండి ఇద్ద‌రు ముగ్గురు సినిమా కోసం పోటీ ప‌డ్డారు. సినిమా స‌క్సెస్‌పై నాకు న‌మ్మ‌కం ఉంది. అందుకే నైజాంలో నేనే సినిమాను రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమా వ‌ల్ల డిస్ట్రిబ్యూష‌న్‌లోకి కూడా వ‌చ్చాను. నాతో పాటు ఎంతో మంది రాత్రింబ‌గ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డారు. అంత క‌ష్ట‌ప‌డ్డాం కాబ‌ట్టే మంచి అవుట్‌పుట్ వ‌చ్చింది. సినిమాటోగ్రాఫ‌ర్ ఉద‌య్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ్యో బారువా సినిమా కోసం చాలా స‌పోర్ట్ చేశారు. నా స్నేహితులు, యూనిట్ స‌భ్యుల‌కు థాంక్స్‌. నిజాయ‌తీగా చేసిన ప్ర‌య‌త్నం. ముద్దు, కౌగిలింత ఏదైనా ఓ ఎక్స్‌ప్రెష‌న్‌. చీప్ ట్రిక్స్ మీద ఆధార‌ప‌డ‌లేదు. మంచి కంటెంట్ ఉన్న మూవీ`` అన్నారు.

హెబ్బా ప‌టేల్ మాట్లాడుతూ - ``నాకు లైఫ్ చేజింగ్ మూవీ ఇది అని నేను భావిస్తున్నాను. చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ఇంత మంచి సినిమాలో నాకు అవ‌కాశం ఇచ్చిన అయోధ్య‌కుమార్‌గారికి థాంక్స్‌. నా కెరీర్‌లో గ‌ర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది. ఈ నెల 23న విడుద‌ల‌వుతున్న సినిమాయే మిగిలిన విష‌యాల‌ను మాట్లాడుతుంది`` అన్నారు.

హీరో అరుణ్ అదిత్ మాట్లాడుతూ - ``చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్‌. దానికి త‌గిన‌ట్టు గ్రేట్ టీం కుదిరింది. ముద్దు పెట్టే సినిమా చేయ‌డం అంత సుల‌భం కాదు. అన్‌కంఫ‌ర్ట్‌గా ఉంటుంది. ముద్దు పెట్టాలంటే అది చూసేవాడికి ఓ ఎమోష‌న్‌ను క్యారీ చేయించాలి. వ‌ల్గ‌ర్‌గా ఉండాలంటే చాలా క‌ష్టం. అందుకు త‌గిన స్పేస్‌ను ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్‌గారు ఇచ్చారు. నవంబ‌ర్ 23న సినిమా విడుద‌ల‌వుతుంది. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్, న‌రేష్, రావు ర‌మేష్, అదితి మైఖెల్, శ్రీ‌ని కాపా, మ‌ధు నెక్కంటి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: హ‌రి వ‌ర్మ‌, సాహిత్యం: రామ‌జోగ‌య్య శాస్త్రి, మ‌నోజ్ యాద‌వ్, ఎడిట‌ర్: ఆల‌యం అనిల్, బ్యాగ్రౌండ్ స్కోర్: వివేక్ ఫిలిప్, సంగీతం: జోయ్ బ‌రువా, సినిమాటోగ్ర‌ఫ‌ర్: ఉద‌య్ గుర్రాల‌, లైన్ ప్రొడ్యూస‌ర్: చ‌ందా గోవింద రెడ్డి, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: గిరిధ‌ర్ మామిడిప‌ల్లి, నిర్మాత‌లు: స‌ంజ‌య్ రెడ్డి, అనిల్ ప‌ల్లాల‌, అయోధ్యకుమార్ కృష్ణంసెట్టి, ద‌ర్శ‌కుడు: అయోధ్య‌కుమార్ క్రిష్ణంసెట్టి

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved