pizza
3 Monkeys pre release function
గ్రాండ్ గా "త్రీ మంకీస్" ప్రి రిలీజ్ ఈవెంట్..
You are at idlebrain.com > News > Functions
Follow Us


4 February 2020
Hyderabad

జబర్దస్థ్ షో ద్వారా బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ వెండి తెర పై ‘త్రీ మంకీస్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. కారుణ్య చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో నగేష్ .జి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని దస పల్లా కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్ గా నిర్వహించారు. రాఘవేంద్రరావు గారు, మంచు లక్ష్మి, ఆకాష్ పూరి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. త్రీ మంకీస్ ట్రైలర్ ను, బిగ్ టికెట్ ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు లాంచ్ చేసారు.

రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ..చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ద బెస్ట్.ఫిబ్రవరి 7న జబర్దస్త్ జర్నీ మొదలు పెట్టి.. అదే రోజు ఈ సినిమా విడుదల అవ్వడం యాదృచ్చికం అన్నారు. అలాగే నేను తీసిన దేవత హిందీ రీమేక్ తోఫా సినిమా ఫిబ్రవరి ౩కి 36ఏళ్లు అవుతుంది. అదే రోజు సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీను నన్ను కలిశారు. ఇండస్ట్రీ లో ఇంతమంది పెద్ద వాళ్ళుంటే మంచు లక్ష్మిని, అలీని, నన్నే ఎందుకు పిలిచారు. ఇండస్ట్రీ లో ఉన్న త్రీ మంకీస్ మనమే అని మనల్ని పిలిచారు. మేంముగ్గురం చేసే పిచ్చి చేష్టలు ఉహించుకొని మా ముగ్గుర్ని పిలిచినట్టున్నారు. దర్శక నిర్మాతలు అమోఘమైన టైటిల్ పెట్టారు. సరిలేరు నీకెవ్వరూ, శ్రీమంతుడు, ఘరానా బుల్లోడు లాంటి టైటిల్స్ ఏ హీరో కి పెట్టిన మ్యాచ్ అవుతాయి. త్రీ మంకీస్ టైటిల్ మాత్రం వీరికి తప్పితే మరెవరికీ పనికిరాదు. సినిమా చూడలేదు కానీ .. కథ లో డెప్త్ ఉంటుందని ఊహించి చెబుతున్నా. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అనే విధంగా మెసెజ్ ఉంటుంది. జబర్దస్త్ తో అమెరికా వరకు వెళ్లిన ఈ ముగ్గురు ఈ సినిమా తో మరింత గుర్తింపు వస్తుంది. ఈ సినిమాకు కలెక్షన్ లతో పాటు అవార్డులు కూడా వస్తాయి.అన్నారు.

మంచు లక్ష్మి
మాట్లాడుతూ..'టీవీ షో తో మొదలు పెట్టి సినిమా తీసినా కొన్ని సంవత్సరాలుగా ఫ్రెండ్ షిప్ కొనసాగించడం మాములు విషయం కాదు. నేను జబర్దస్త్ షో కి వెళ్ళి చూసాను. సినిమా లో నటించడం కంటే జబర్దస్త్ లో చేయడమే కష్టం. ఈ ముగ్గురు మరెన్నో సినిమాలు తీయాలని మరింత గుర్తింపు తెచ్చుకోవాలని .. సినిమా టీం మొత్తానికి ఆల్ ద బెస్ట్' చెప్పారు.

అలీ
మాట్లాడుతూ..'5000 సంవత్సరాల క్రితం మనుషులు కూడా కోతుల్లా ఉండేవాళ్ళం. అప్పట్లో కోతులకు తెలివితేటలు ఉండేవి కాదు అందుకే ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు మనుషులకు తెలివితేటలు ఎక్కువై ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. త్రీ మంకీస్ టైటిల్ పెట్టాలని ఆలోచన రావడం డైరెక్టర్ గొప్పతనం. పెద్ద హీరోల ఫంక్షన్ లకు వెళ్లి రెండు, మూడు నిముషాలు మాట్లాడే రాఘవేంద్రరావు గారు ఈ సినిమా గురించి, దర్శకుడు గురించి 15 నిముషాలు మాట్లాడారు. ఆయనకు కమెడియన్స్ అంటే చాల ఇష్టం. హిందీ లో త్రీ ఇడియట్స్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుగు లో త్రీ మంకీస్ కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుతున్నా. చిన్న సినిమాలను బతికిస్తే ఇండస్ట్రీ తో పాటు చిన్న దర్శకులు బాగుంటారు''అన్నారు.

ఆకాష్ పూరి మాట్లాడుతూ..'సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీను లను నేను కమెడియన్స్ గా చూడలేదు. వాళ్ళని యాక్టర్స్ గానే చూసాను. వీరు మంచి నటులు అని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. చిన్న స్టేజి నుంచి ఇక్కడ వరకు వచ్చారంటే వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ కారణం. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా'అన్నారు.

హీరోయిన్ కారుణ్య చౌదరి మాట్లాడుతూ..'మా టీంకి విషెస్ చెప్పడానికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. డైరెక్టర్ అనిల్ ఎప్పుడు కూల్ గా ఉంటారు. డీ.ఓ.పీ సన్నీ మమ్మల్ని చాలా అందంగా చూపించారు;అన్నారు .

నిర్మాత నగేష్ మాట్లాడుతూ..'దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు మా ఈవెంట్ కి రావడంతో మా జన్మ ధన్యం అయినట్టు అనిపిస్తుంది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. అలాగే మంచు లక్ష్మి, అలీ, ఆకాష్ పూరి కూడా ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా రిలీజ్ కి ముందు నిర్మాతలు కొంచెం టెన్షన్ పడతారు. కానీ నాకు అసలు టెన్షన్ లేదు. డైరెక్టర్ నాకు చిన్నప్పటి నుచి ఫ్రెండ్, అలాగే హీరోలు సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీను బాగా సహకరించారు. ఫిబ్రవరి 7 న సినిమా విడుదల అవుతుంది. మీరు పెట్టె టికెట్ ఖరీదుకి హ్యాపీ గా ఫీల్ అవుతారు. సినిమా అందరికి కచ్చితంగా నచ్చుతుంది'అన్నారు.

రామ్ ప్రసాద్
మాట్లాడుతూ..'ఇలాంటి క్యారెక్టర్ చేస్తానని నేను లైఫ్ లో అనుకోలేదు. నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. నేను పంచ్ లు వేయడమే కానీ నవ్వను. డైరెక్టర్ అనిల్ కథ చెప్పినప్పుడు మాత్రం తెగ నవ్వాను. తర్వాత సుధీర్, శ్రీను కి కథ చెప్పారు.

గెటప్ శ్రీను
మాట్లాడు..'మమ్మల్ని బ్లేస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్. మేం ముగ్గురం కలిసి చేయడానికి కారణం ముక్కు అవినాష్. రామ్ ప్రసాద్ కి, నాకు, అవినాష్ కి అవకాశం వస్తే సుధీర్ తో కలిపి మీరు ముగ్గురు చేస్తే బాగుంటుందని తనకు వచ్చిన అవకాశం మాకు ఇచ్చాడు. గుర్తిండిపోయే మెమరీ మాకు ఇచ్చాడు. నా లైఫ్ లో నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. మా సినిమాను పెద్ద హిట్ చేయాలి'అన్నారు.

సుధీర్
మాట్లాడుతూ..'మా ముగ్గురికి ఇంతకన్నా మంచి ప్రాజెక్ట్ రాదు. మాకు సపోర్ట్ చేసిన వారందరికీ చాలా థాంక్స్. దేవుడిచ్చిన నా ఫ్యాన్స్ కి ధన్యవాదాలు. బుల్లి తెరపై మమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారో, అలాగే వెండి తెరపై కూడా అలాగే ఆదరించాలాని కోరుతున్నా. ఫిబ్రవరి 7 న విడుదల అవుతున్న సినిమాని చూసి నచ్చితే మరో పది మందికి చెప్పండి. ఆ ఆశీర్వాదం మాకు చాలు'అన్నారు.

దర్శకుడు అనిల్ మాట్లాడుతూ..'ఈ సినిమాను ఎంకరేజ్ చేసిన హీరోలు, దర్శకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎందుకు ఎక్కడ కలుస్తారో ఎవరికీ తెలీదు. కానీ ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది అనే లైన్ మీద తీసినా సినిమానే త్రీ మంకీస్. సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీను ల కామెడీకి ఫస్ట్ ఆఫ్ అంత సీట్లలో కూర్చోలేరు. అంతలా నవ్విస్తారు. సెకండ్ ఆఫ్ అంత ఎమోషన్ ఉంటుంది. సెట్ మీద మమ్మల్ని కూడా ఏడిపించారు. ఏది నిజం, ఏది అబద్దం అనే తికమకలో సుధీర్ చేసే పెర్ఫార్మెన్స సూపర్బ్ గా ఉంటుంది. రామ్ ప్రసాద్ ఎక్సప్రెషన్స్ తోనే కామెడీ పండించాడు. శ్రీను నటన చూస్తే కమల్ హాసన్ గుర్తుకొస్తారు. పంచతంత్రం లాంటి కామెడీ చేయగలడు. ఈ ప్రపంచంలో అందరు ఊరికే చనిపోవడం లేదు. సాయం అనే మందు లేక చనిపోతున్నారు అనే కంటెంట్ ని గట్టిగ చెప్పాము. ప్రేక్షకుల హృదయాలను తాకే విధంగా సినిమా ఉంటుంది' అన్నారు.

పూరి జగన్నాథ్, వెంకటేష్, బ్రహ్మనందం, రోజా, సాయి కుమార్ త్రీ మంకీస్ టీం కి వీడియో ద్వారా బెస్ట్ విషెస్ తెలిపారు.

ఈ కార్యక్రమం లో జబర్దస్ నటులు వేణు, చంటి, అభి, భాస్కర్, సుధాకర్, రాఘవ, డైలాగ్ రైటర్ అరుణ్, డీ.ఓ.పీ సన్నీ మాట్లాడారు.

కథ, సంగీతం, దర్శకత్వం: అనిల్ కుమార్. జి,
నిర్మాత: నగేష్. జి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి బాబు వాసిరెడ్డి,
లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ సాయి,
సినిమాటోగ్రఫీ: సన్నీదోమల,
ఎడిటింగ్: ఉదయ్ కుమార్,
సంగీతం: అనిల్ కుమార్ జి.
మాటలు: అరుణ్. వి,
లిరిక్స్: శ్రీమణి,
పిఆర్ఓ: వంశీ – శేఖర్.

Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved