pizza
Bhagyanagara Veedullo Gammathu grand press meet
`భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


2 December 2019
Hyderabad

యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నారు. డిసెంబ‌ర్ 6న విడుద‌ల సినిమాను విడుద‌లవుతుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథులుగా అనిల్ రావిపూడి, ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ పాల్గొన్నారు. బ్యాన‌ర్ లోగోను అనిల్ రావిపూడి విడుద‌ల చేశారు. టైటిల్ యానిమేష‌న్‌ను ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా..

ద‌ర్శ‌క నిర్మాత శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ - ``ఈ సినిమాను ముందుగా చిన్న కాన్సెప్ట్‌గానే స్టార్ట్ చేశాం. అంద‌రూ త‌మ వంతు స‌పోర్ట్ చేశారు. ముందు ఈ సినిమాకు నిర్మాత‌గా మాత్ర‌మే సినిమా చేద్దామ‌ని అనుకున్నాను. కానీ వేరే డైరెక్ట‌ర్‌ను పెట్టినా ఆయన వెన‌క ఏమైందంటూ నేను నిల‌బ‌డాల్సి వ‌స్తుంది. దీంతో నేనే డైరెక్ట్ చేశాను. ద‌ర్శ‌కుడు కావాల‌నే కోరిక అలా తీరింది. సినిమా చూసిన దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, సాయిగారు స‌హా కొంత‌మంది చిన్న చిన్న క‌రెక్ష‌న్స్ చెప్పారు. అదంతా మా సినిమాకు ఎంతో హెల్ప్ అయ్యింది. సినిమాను డిసెంబ‌ర్ 6న విడుద‌ల చేస్తున్నాం. జౌట్ అండ్ ఔట్ కామెడీ. 1గంట 53 నిమిషాలున్న మా సినిమాలో గంట‌న్న‌ర సేపు ప‌డి ప‌డి న‌వ్వుతారు. ఆ విష‌యంలో నాది గ్యారెంటీ. నో యాక్ష‌న్‌, నో సెంటిమెంట్ .. ఓన్లీ కామెడీ`` అన్నారు.

ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ మాట్లాడుతూ - ``ఈ సినిమాకు రెండోసారి సాకేత్ మ్యూజిక్ అందించాడు. త‌న ప‌నితో అంద‌రినీ క‌లుపుకుపోయే ర‌కం. త‌ను మంచి సింగ‌ర్‌, మ్యూజిషియ‌న్‌. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌తిరోజూ క‌ష్ట‌ప‌డాల్సిందే. ఆ క‌ష్ట‌మేంటో నాకు తెలుసు. అలాగే శ్రీనివాస‌రెడ్డిగారికి థ్యాంక్స్‌. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ - `` ఇండ‌స్ట్రీలో నేను వ‌చ్చిన‌ప్ప‌టి నుండి నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్‌లో శ్రీనివాస్‌రెడ్డి ఒక‌రు. అందుక‌నే నా సినిమాల్లో త‌నుంటాడు. `స‌రిలేరు నీకెవ్వ‌రు`లో త‌ను మిస్స‌య్యాడు. ఈ సినిమా చేయాల‌నుకోగానే న‌న్ను స‌ల‌హా అడిగాడు. త‌ను మా సినిమా షూటింగ్‌లో కూడా ఆర్టిస్ట్ కంటే అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా క‌ష్ట‌ప‌డుతుంటాడు. త‌ను డైరెక్ష‌న్‌తో పాటు ఈ సినిమాకు ప్రొడ‌క్ష‌న్ కూడా చేస్తున్నాన‌ని చెప్ప‌గానే కాస్త భ‌య‌ప‌డ్డాను. ఎందుకున్నా.. రిస్క్ ఏమో! అని అన్నాను. త‌ను ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేశాడు. త‌న‌కు ఆల్ ది బెస్ట్ అలాగే వాళ్ల ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ గ్రూప్ త‌న‌ను బాగా న‌మ్మారు. నేను సినిమాను చూశాను. నాకు స‌న్నివేశాలు బాగా న‌చ్చాయి. ప్రేక్ష‌కులు కూడా శ్రీనివాస్‌రెడ్డిగారి తొలి ప్ర‌య‌త్నాన్ని స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు. సాకేత్‌కు అభినంద‌న‌లు`` అన్నారు.

నిర్మాత ప‌ద్మ‌నాభ రెడ్డి మాట్లాడుతూ - ``శ్రీనివాస‌రెడ్డిగారితో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌రిచ‌యం ఎర్ప‌డిన‌ప్ప‌టికీ ఆ ప్ర‌యాణం బావుంది. ఈ సినిమా విష‌యంలో ఆయ‌న కేవ‌లం భాగ్య‌న‌గ‌ర వీధుల్లోనే కాదు. రెండు రాష్ట్రాల్లోనూ గ‌మ్మ‌త్తు చేస్తార‌న‌డంలో సందేహం లేదు. గ‌ట్టిగా న‌వ్విస్తున్నారు. చాలా క్లారిటీగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది`` అన్నారు.

స‌త్యం రాజేష్ మాట్లాడుతూ - ``సాధార‌ణంగా మ‌న‌కు క్లోజ్‌గా ఉండేవాళ్ల సినిమాల్లో న‌టించేట‌ప్పుడు ఎంజాయ్ చేస్తూ న‌టిస్తాం. కానీ ఈ సినిమా విష‌యానికి వ‌స్తే డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రెడ్డిని ఓ ఆటాడుకున్నాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. అంద‌రూ అద్భుతంగా న‌టించారు`` అన్నారు.

ష‌క‌ల‌క శంక‌ర్ మాట్లాడుతూ - ``శ్రీనివాస్‌రెడ్డన్న‌తో నా కెరీర్ ప్రారంభం నుండి ట్రావెల్ అవుతున్నాను. ఆయ‌న నాకు పెద్ద‌న్న‌లాంటి వ్య‌క్తి. 37 రోజుల పాటు ప‌నిచేశాను. సినిమా స‌క్సెస్ సాధిస్తుంద‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాకేత్ మాట్లాడుతూ - ``

ఈ కార్య‌క్ర‌మంలో చిత్రం శ్రీను, ప్రవీణ్‌, అశోక్ త‌దిరులు పాల్గొన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved