pizza
Bhairava Geetha pre release function
`భైర‌వ‌గీత‌` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


23 November 2018
Hyderabad

రామ్‌గోపాల్ వ‌ర్మ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై సిద్ధార్థ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామ‌, భాస్క‌ర్ రాశి నిర్మిస్తోన్న చిత్రం `భైర‌వ‌గీత‌`. న‌వంబ‌ర్ 30న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో...

చిత్ర స‌మ‌ర్ప‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మాట్లాడుతూ - ``భైర‌వగీత నాకు చాలా స్పెష‌ల్ మూవీ. ఇన్నేళ్ల‌లో నేను ఎన్నో సినిమాల‌ను డైరెక్ట్ చేశాను, ప్రొడ్యూస్ చేశాను. డైరెక్ష‌న్ అంటే ఓవరాల్ ఎఫెక్ట్ అని అంద‌రూ అనుకుంటారు. కానీ ఉన్న మెటీరియ‌ల్‌ను ఉప‌యోగించి సినిమాటిక్‌గా యాంగిల్‌లో మార్చేవాడే డైరెక్ట‌ర్ అని భావ‌న‌. కొన్ని సీన్స్ ను పేప‌ర్ మీద రాసేట‌ప్పుడు ఎలా ఉంటుంది. దాన్ని సినిమాగా డైరెక్ట‌ర్ ఎంత ఎక్కువ‌, త‌క్కు వ ఎఫెక్ట్‌తో డైరెక్ట్ చేశాడ‌నే దానిపై దాని లైఫ్ ఆధార‌ప‌డి ఉంటుంది. సిద్ధార్థ తాతోలు అసిస్టెంట్ ఎడిట‌ర్‌గా నా ద‌గ్గ‌ర ఏదో ఓ సినిమాకు ప‌నిచేశాడు. ఆ స‌మ‌యంలో త‌ను ఎడిటింగ్‌కు సంబంధించి విలువైన స‌ల‌హాలు ఇచ్చేవాడు. త‌ను ఇంటెలిజెంట్‌. ఓసారి క‌డ‌ప వెబ్ సిరీస్ చేయ‌డానికి ఆఫీస్‌లో డిస్క‌స్ చేస్తూ ఉంటే, సిద్ధార్థ ఆ ట్రైల‌ర్‌ను నేను చేస్తాన‌ని చెప్పి చేశాడు. త‌న‌లో స్పార్క్ అప్పుడు నాకు న‌చ్చింది. సినిమాలో సీన్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ ఉంటుంది. సిద్ధూ అస‌లు ఎలా చేస్తాడ‌నే డౌట్ ఉండేది. నువ్వు నిజంగా చేయ‌గ‌లుగుతావా! అని కూడా అడిగాను. ఎవ‌రైనా చేయలేని ప‌నిని చేస్తాన‌ని చెబుతున్నారంటే వాడు ఫ్రాడ్ అయ్యుండాలి.. లేదా పిచ్చోడైనా అయ్యుండాలి. సిద్ధూ పిచ్చోడు కాదు.. త‌నే డైరెక్ట‌ర్ కాబ‌ట్టి ఫ్రాడ్ చేయాల్సిన అవ‌స‌రం త‌న‌కు ఉండ‌దు అనే న‌మ్మ‌కంతో సినిమా అవ‌కాశాన్ని ఇచ్చాను. నేను చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. కొన్ని బాగా వ‌స్తాయి. కొన్ని బాగా రావు. ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ ర‌షెష్ చూసి నేను షాక‌య్యాను. నేను స్క్రిప్ట్ చ‌దివిన‌ప్పుడు, డైరెక్ట‌ర్‌గా నాకొక విజ‌న్ ఉంటుంది. దాన్ని బ‌ట్టి నేను ఇమాజినేష‌న్‌తో ఎడిటింగ్ రూమ్‌లోకి వెళితే.. నేను షాకయ్యాను. ఈ సీన్‌ను ఇలా తీయ్యొచ్చా అని కూడా అనిపించింది. అది నాకొక లెర్నింగ్ లెస‌న్‌. డైరెక్ష‌న్ అనుభ‌వం లేకుండా సినిమా చేయ‌డ‌మ‌నేది రేర్‌గా జ‌రిగే విష‌యం. నా టైంలో నేనున్నాను. మ‌ణిర‌త్నంగారు కూడా అసిస్టెంట్‌గా ప‌నిచేయాలేదు. శేఖ‌ర్ క‌పూర్ కూడా అసిస్టెంట్‌గా ప‌నిచేయ‌లేదు. ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది అలాగే డైరెక్ట్ చేస్తున్నారు. భైర‌వ‌గీత చాలా కాంప్లెక్స్ మూవీ. 90 శాతం మంది కొత్త‌వాళ్లే.. వాళ్ల నుండి అంత పెర్ఫామెన్స్‌లు రాబ‌ట్ట‌డ‌మ‌నే గొప్ప విష‌యం. చాలా పెద్ద డైరెక్ట‌ర్ చిన్న పిల్ల‌ల కోసం తీసిన సినిమా 2.0 అయితే చాలా చిన్న‌వాడు పెద్ద‌వాళ్ల కోసం తీసిన సినిమా భైర‌వగీత‌`` అన్నారు.

సుధీర్ వ‌ర్మ మాట్లాడుతూ - ``కంగ్రాట్స్‌! వ‌ర్మ‌గారు.. మరొక‌రిని డైరెక్ట్ చేయ‌మ‌ని అన్నారంటే సినిమాలో కంటెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌విశంక‌ర్ మాట్లాడుతూ - ఇందులో సాంగ్స్ అన్నీ మెలోడి సాంగ్సే. రాముగారు మాకు ఫ్రీడమ్ ఇచ్చి సాంగ్స్ చేయ‌మ‌ని అన్నారు. సిద్ధార్థ‌తో డే అండ్ నైట్ ట్రావెల్ చేశాం`` అన్నారు.

సిరాశ్రీ మాట్లాడుతూ - ``సాంగ్స్ గురించి డిస్క‌స్ చేయాలి. ముంబై రావాలి అని రామ్‌గోపాల్ వ‌ర్మ అన‌గానే వెళ్లాను. ఇన్‌టెన్స్ ఉన్న క‌థ అని స్టోరీ విన‌గానే అర్థ‌మైంది. అయితే రాముగారు డైరెక్ట‌ర్ కాదని తెలిసింది. డైరెక్ట‌ర్ ఎవ‌రండి అని అడిగితే సిద్ధార్థ్ అన్నారు. నాకు సిద్ధార్థ్ ఎవ‌రో కూడా తెలియ‌లేదు. స్కూల్ పిల్లోడిలా ఉంటాడు. మ‌రి ఇంత ఇన్‌టెన్స్ మూవీని హ్యాండిల్ చేయ‌గ‌ల‌డా? అని అన్నాను. అయితే ఫ‌స్ట్ షెడ్యూల్‌లో కొన్ని షాట్స్ చూసిన త‌ర్వాత షాక‌య్యాను. నాకు సిద్ధు వామ‌నావ‌తారంలా క‌న‌ప‌డ్డాడు. రాముగారి నిర్ణ‌యం ఎప్పుడూ క‌రెక్ట్‌గానే ఉంటుంది`` అన్నారు.

అజ‌య్ భూప‌తి మాట్లాడుతూ - ``రామ్‌గోపాల్‌వ‌ర్మ‌గారి స‌మ‌ర్ప‌ణ‌లో సినిమాలు చేసే అదృష్టం మాకు ద‌క్క‌లేదు. సిద్ధార్థ‌కి ద‌క్కింది. నేను చూసిన నా టీమ్‌లో సిద్ధార్థ్ చాలా బెస్ట్ అని వ‌ర్మ‌గారు అప్రిషియేట్ చేస్తుంటే కుళ్లుకున్నాను. అయితే ట్రైల‌ర్ విడుద‌లైంది. అందులో షాట్స్‌.. రియ‌లిస్టిక్ లొకేష‌న్స్ చిత్రీక‌రించిన విధానం చూసి నిజంగానే సిద్ధార్థ ఇర‌గ‌దీశాడ‌నిపించింది. డిఫ‌రెంట్ మూవీ. 100 శాతం యూత్ ఫిలిం`` అన్నారు.

సిద్ధార్థ తాతోలు మాట్లాడుతూ - ``ఇంజ‌నీరింగ్ చ‌దివిన నేను సినిమాల్లోకి వెళ‌తాను అన‌గానే.. ఇప్ప‌టి వ‌ర‌కు స‌పోర్ట్ చేసిన నా త‌ల్లిదండ్రుల‌కు థాంక్స్‌. నా గురువుగారు రాముగారికి థాంక్స్ చెప్పి.. నాకు ఇచ్చిన అవ‌కాశాన్ని చిన్న‌దిగా చేయ‌డం నాకు ఇష్టం లేదు. నిర్మాత అభిషేక్‌గారు ఎంతో స‌పోర్ట్ అందించారు. సినిమాటోగ్రాఫ‌ర్ జ‌గ‌దీష్ గారు అద్భుత‌మైన విజువ‌ల్స్ వ‌చ్చాయి. వంశీ చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు. సిరాశ్రీగారు చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. ధ‌నుంజ‌య‌ను ఈ సినిమాతో భైర‌వ అని పిలుస్తారు. హీరోయిన్‌తో అంద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు. న‌న్ను న‌మ్మి, నాతో ప‌నిచేసిన అంద‌రికీ థాంక్స్`` అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved