pizza
Chikati Gadilo Chithakotudu pre release function
`చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు` ప్రీ రిలీజ్ ఈవెంట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


16 March 2019
Hyderabad


బ్లూ ఘోస్ట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఆదిత్‌, నిక్కి తంబోలి, హేమంత్‌, తాగుబోతు ర‌మేష్‌, ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు`. సంతోష్‌పి.జ‌య‌కుమార్ ద‌ర్శకుడు. ఈ సినిమా మార్చి 21న విడుద‌ల‌వుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా...

ద‌ర్శ‌కుడు సంతోష్ పి.జ‌య‌కుమార్ మాట్లాడుతూ - ``ఈ సినిమా ట్రైల‌ర్‌, వీడియోస్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త‌మిళంలో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. తెలుగులో కూడా సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని అనుకుంటున్నాను. హోలీడే రోజున సినిమా విడుద‌లవుతుంది.17 రోజుల్లో సినిమా పూర్తి చేశామంటే ఆర్టిస్ట్‌, టెక్నీషియ‌న్స్ స‌పోర్ట్ చాలా అవ‌సరం. అలాంటి స‌పోర్ట్ నాకు ద‌క్కింది. ఇది 18 సంవత్స‌రాలు దాటిన వారు మాత్ర‌మే చూడాల్సిన సినిమా. ఈ విష‌యాన్ని చెబుతూనే ఉన్నాం. మార్చి 21న సినిమా విడుద‌ల‌వుతుంది`` అన్నారు.

తాగుబోతు రమేష్ మాట్లాడుతూ - `` స‌త్యం రాజేష్ అన్న‌కు ఈ సినిమా ప‌రంగా నేను థాంక్స చెప్పాలి. త‌మిళంలో ఈ సినిమా విడుద‌ల‌వ‌తుందంటే చాలా పెద్ద గొడ‌వ‌లే అయ్యాయి. అలాంటి సినిమా ఇక్క‌డ చేస్తున్నారంటే, స‌త్యం రాజేష్ అన్న‌.. నా పేరు స‌జెస్ట్ చేశాడ‌ట‌.ఆల్ రెడీ హిట్ అయిన డ‌బ్బింగ్ సినిమాలో క్యారెక్ట‌ర్ ప‌డితే ముందుగానే ఆ క్యారెక్ట‌ర్‌ను వాళ్లు బాగా చేసుంటారు. కాబ‌ట్టి ఆ క్యారెక్ట‌ర్‌ను డిఫ‌రెంట్ ట్రై చేశాను. నేను డిఫ‌రెంట్ చేశాన‌ని నాకు న‌మ్మ‌కం క‌లిగేలా చేసింది.. న‌న్ క్యారెక్ట‌ర్‌. ఆ క్యారెక్ట‌ర్‌కు కూడా నేనే డ‌బ్బింగ్ చెప్పాను. త‌ర్వాత నా క్యారెక్ట‌ర్‌కి క‌ష్ట‌ప‌డ్డాను. న‌న్ను నేను ప్రూవ్ చేసుకోవాల‌ని చాలా క‌ష్ట‌ప‌డ్డాను. దర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

స‌త్యం రాజేష్ మాట్లాడుతూ `` ఇది ప్యూర్ అడ‌ల్ట్ మూవీ. ద‌య‌చేసి ఫ్యామిలీ వెళ్లొద్దు. ఆ విష‌యాన్ని ట్రైల‌ర్‌లో కూడా చెప్పాం. నా ఫ్రెండ్ సంతోష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. త‌ను చాలా ఫోక‌స్‌డ్‌. త‌మిళంలో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇది ఆయ‌న స‌ర‌దాగా చేసిన సినిమా. త‌మిళంలో వ‌చ్చినంత పేరు ఇక్క‌డ కూడా వ‌చ్చింది. ఆదిత్ ఈ సినిమాలో చాలా అందంగా ఉన్నాడు. హేమంత్ వ‌న్ ఆఫ్ ది హీరో. చ‌క్క‌గా చేశాడు`` అన్నారు.

ఆదిత్ మాట్లాడుతూ - ``ఇలాంటి సినిమా ఎందుకు చేస్తున్నార‌ని చాలా మంది అడిగారు. మాకు ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్స్ లేవు. రికార్డులు, రివార్డ్స్ లాంటివి లేవు. ఎవ‌రూ చేయ‌లేని స్క్రిప్ట్ చేయాల‌ని అనుకుని చేసిన సినిమా ఇది. నిజానికి ఈ స్క్రిప్ట్ బావుందనిపించింది. టైటిల్ ప‌రంగా ప‌ర్‌ఫెక్ట్ జ‌స్టిఫికేష‌న్ చేశారు. ఇది ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కాదు. సినిమాలో ఏముంద‌ని ముందుగానే చెప్పేశాం. ఇంకా మంచి సినిమాలు చేస్తాను. ఇది ఫాస్టెస్ సినిమా. 19 రోజుల్లో సినిమాను పూర్తి చేశారు. సినిమా అంటే మ‌నోరంజ‌న్‌. మ‌రో ప్ర‌పంచానికి తీసుకెళ్లాలి. అలా చూసి న‌వ్వుకునేలా ఉండే సినిమా ఇది.యూత్ సినిమా ఇది. మార్చి 21న సినిమా విడుద‌ల‌వుతుంది`` అన్నారు.

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved