pizza
College Kumar pre release function
మమ్మల్ని యక్షన్ హీరోలుగా మలచిన విజయ్ మాస్టర్ కొడుకు రాహుల్ కూడా పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నాను.. కాలేజ్ కుమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గోపీచంద్
You are at idlebrain.com > News > Functions
Follow Us


1 March 2020
Hyderabad

ఎమ్ ఆర్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడా సమర్సణ లో ఎల్ పద్మనాభ నిర్మించిన చిత్రం కాలేజ్ కుమార్. కన్నడ ఘన విజయం సాధించిన ఈ మూవీ తో తెలుగు లో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు హారి సంతోష్. రాహుల్ విజయ్, ప్రియ వడ్డమాని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ లో నట కిరీటి రాజంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ , దర్శకుడు మలినేని గోపిచంద్, యాక్షన్ హీరో గోపీచంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింన

మ‌ధుబాల మాట్లాడుతూః ‘
ఈ క‌థ అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది.. ప్ర‌తి కొడుకుకూ, తండ్రికి క‌నెక్ట్ అవుతుంది. అంద‌రూ రిలేట్ అవుతారు.ప్ర‌తి ఇంట్లో ఈ ప‌రిస్థ‌తి ఎద‌ర‌వుతుంది. దానిని అందంగా ద‌ర్శ‌కుడు హారి తెర‌మీద‌కు తెచ్చారు. ఇలాంటి క‌థ‌లో పార్ట్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను.’ అన్నారు.

ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్ మాట్లాడుతూః

‘స్ర్కీన్ మీద రాజేంద్ర ప్ర‌సాద్ గారి టైమింగ్ ని ప‌ట్టుకోవ‌డం తేలికైన విష‌యం కాదు.. రాహుల్ ఈ సినిమాలో బెట‌ర్ ఆర్టిస్ట్ గా క‌నిపిస్తాడు అని న‌మ్ముతున్నాను. ప్ర‌తి ఇంట్లో ఫాద‌ర్ కి స‌న్ కి మ‌ద్య ఉండే క‌థ‌ను ప‌ట్టుకోని చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు.. కొడుక్కి కోపం వ‌చ్చి తండ్రిని చ‌దువుకోవ‌డానికి పంపుతున్నాడు అది నాకు బాగాన‌చ్చింది కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను ఆల్ ద బెస్ట్ టు ద టీమ్’ అన్నారు.

రామ్ ల‌క్ష్మ‌ణ్ మాట్లాడ‌తూః

‘రాహుల్ కి నేను చెప్పేది ఒక్క‌టే నీవు నీ ప‌ని ని న‌మ్ముకో.. అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది.. మ‌న‌స్ఫూర్తిగా నిన్ను నివ్వు న‌మ్ముకోని ముందుకు వెళ్ళు .. అదే నిన్ను నిల‌బడెతుంది.. అదే మ‌మ్మ‌ల్ని ఇంత వ‌ర‌కూ తెచ్చింది...
లక్ష్మణ్ మాట్లాడుతూ: ‘

ఇందులో నీ న‌ట‌న నాకు బాగా న‌చ్చింది.. చాలా ఈజ్ తో చేసావు ఇది తెర‌మీద క‌నిపిస్తుంది. రాజేంద్ర ప్ర‌సాద్ గారి తో క‌ల‌సి ప‌నిచేయ‌డం ఒక అదృష్టం’ అన్నారు.

ద‌ర్శ‌కుడు హరి మాట్లాడుతూః

‘మంచి సినిమా తెలుగు, త‌మిళ్ లో చేయ‌డానికి న‌న్ను ఎంచుకున్నందుకు నిర్మాత‌కు థ్యాంక్స్..మాస్ట‌ర్ నన్ను న‌మ్మి రాహుల్ ని చెప్పారు.. మంచి క‌థ ఉంటే ఏ లాంగ్వేజ్ లో అయినా క‌థ చెప్ప‌వ‌చ్చు అని న‌మ్ముతాను.. ఒక సెట్ అసిస్టెంట్ కొడుకుగా జ‌ర్నీ మొద‌లు పెట్టి ఇక్క‌డి వ‌ర‌కూ వ‌చ్చాను అంటే ఈ ప్ర‌యాణం లో నాకు స‌పోర్ట్ చేసిన వారికి థ్యాంక్స్. ఈ క‌థ కు లాంగ్వేజ్ బారియ‌ర్స్ ఉండ‌వు.. ఒక యూనివ‌ర్స‌ల్ పాయింట్ క‌నిపిస్తుంది..మీ ఆశిస్సులు కావాలి’ అన్నారు.

హీరోయిన్ ప్రియ వ‌డ్ల‌మాని మాట్లాడుడూః

‘ చాలా మంచి బ్యాక్ డ్రాప్ లో క‌థ చెప్పారు.. ఒక ఫాద‌ర్ స‌న్ రిలేష‌న్ ని చాలా బ్యూటిఫుల్ గా తెర‌మీద‌కు తెచ్చారు.. మిడిల్ క్లాస్ ఎమోష‌న్స్ ని రియ‌లిస్టిక్ గా క‌నిపిస్తాయి.. మా పాట‌లు.. ట్రైల‌ర్ న‌చ్చితే సినిమా కి రండి త‌ప్ప‌కుండా మిమ్మ‌ల్ని సంతోష పెడ‌తాము.. మా సినిమాలో ట్విస్ట్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మార్చ్ 6న రిలీజ్ అవుతుంది. ఆర్టిస్ట్ గా నాకు ఈసినిమాలో ప‌నిచేయ‌డం ఎప్ప‌టికీ గుర్తిండిపోతుంది.. త‌మిళ్ లో కూడా చేయ‌డం నాకు మంచి ఎక్స్ పీరియ‌న్స్ గా మారింది. రాజేంద్ర ప్ర‌సాద్ గారి కాంబినేష‌నల్ సీన్స్ మీకు బాగాన‌చ్చుతాయి.. రాహుల్ బెస్ట్ కో ఆర్టిస్ట్’ అన్నారు.
హీరో

రాహుల్ః ‘
చ‌ద‌వ‌డం గొప్పా,.. చ‌దివించ‌డం గొప్పా అనే లైన్ ఫాద‌ర్ అండ్ స‌న్ మ‌ద్య వ‌చ్చే కాన్ ప్లిక్ట్ ని ద‌ర్శ‌కుడు బాగా హ్యాండిల్ చేసారు.. ఈసినిమా నా కెరియ‌ర్ లోమెమ‌రబుల్ గా మారుతంది. త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ నచ్చుతుంది అని న‌మ్ముతున్నాను. రాజేంద్ర ప్రాస‌ద్ గారితో క‌ల‌సి ప‌నిచేయ‌డం నన్ను బెట‌ర్ ఆర్టిస్ట్ ని చేసింది. ఈసినిమా మీకున‌చ్చితే అందులో ఎక్కువ క్రెడిట్ రాంజేంద్ర ప్రాస‌ద్ గారికే చెందుతుంది.’
అన్నారు.

 


హీరో గోపిచంద్ మాట్లాడుతూ :

ఈ కథ లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి.
ట్రైలర్ చాలా బాగుంది. రాహుల్, రాజేంద్రప్రసాద్ గారి కెమిస్ట్రీ బాగుంటుందని ట్రైలర్ చూస్తే తెలిసింది. రాజేంద్రప్రసాద్ గారి ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఆయనకు వయస్సు పెరుగుతుందో, తగ్గుతుందో తెలియడం లేదు ఆయన ఎనర్జీ అలా అనిపిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు సెట్స్ లో ఉంటే ఒక యాక్టింగ్ డిక్షనరీ సెట్ లో ఉన్నట్లే.. అంత హెల్పింగ్ నేచర్ ఉన్న ఆర్టిస్ట్ ఆయన.. ఎదుటి వారు కూడా బాగా చేయాలని కోరుకునే రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమా లో మెయిన్ రోల్ చేయడం సినిమా బాగా వచ్చిందనే నమ్మకాన్ని పెంచింది. దర్శకుడికి ఈ సినిమా తెలుగు లో మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఈవెంట్ కి రావడానికి కారణం విజయ్ మాస్టర్ . ఆయన మాట నేనెప్పుడూ కాదనను.. మాలాంటి హీరోలకు యాక్షన్ ఇమేజ్ వచ్చిందంటే కారణం విజయ్ మాస్టర్, రామలక్ష్మణ్ మాస్టర్ ల కృషే కారణం. అలాంటి మాస్టర్ ఇంట్లో నుండి వస్తున్న అబ్బాయి రాహుల్ మమ్మల్ని హీరోలను చేసిన మాస్టర్ కొడుకు పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నాను.. నెక్ట్స్ సినిమాలో నీ యాక్షన్ అంటే ఏంటో చూపించు.. ఆల్ ద బెస్ట్ ’ అన్నారు.

నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ:
సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం అని ఈ ఈవెంట్ మరోసారి ప్రూవ్ చేసింది స్టార్టింగ్ డేస్ తమకు విజయ్ మాస్టర్ ఎలా సాయం చేసాడో రామ్ లక్ష్మణ్ లు చెప్పారు.. గోపీచంద్ తనకు యాక్షన్ ఇమేజ్ తెచ్చిన విజయ్ మాస్టర్ కొడుకు రాహుల్ హీరో గా నిలబడాలని అతని కోసం ఇక్కడికి వచ్చాడు.. ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరయినా నన్ను ఇంత ఎనర్జీ గా ఎలా ఉండగలుగుతున్నావు అంటే నేను వారికి ఇచ్చే సమాధానం నాకు ఇంకా పని దొరకడమే అంటాను.. ఏ ఆర్టిస్ట్ అయినా నటిస్తున్నంత కాలం చాలా సంతోషంగా ఉంటాడు.. అదే అతని ఎనర్జీ.. ఇన్ని సంవత్సరాలు నేను మీకు ఎంటర్ట్ టైన్మెంట్ అందిస్తున్నానంటే అది నా పూర్వ జన్మ సుకృతం.. జనవరిలో నేను నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ.. అల వైకుంఠపురం మంచి విజయాలు సాధించాయి. ఈ కాలేజ్ కుమార్ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను, సాధిస్తుందని నమ్ముతున్నాను. సెంకండాఫ్ లో మీరు నవ్వలేక మీ పొట్టలు చక్కలవుతాయి. అలాగే దర్శకుడు హారి చాలా టాలెంటెడ్ .. అతను తనకున్న వనరులతోనే అద్బుతమైన కంటెంట్ ని తీసుకురాగలడు.. అతని కోసం ఈ సినిమా మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. గోపీచంద్ మనకున్న మంచి హీరోలలో ఒకరు.. అతను ఈ ఈవెంట్ లో భాగం అవడం సంతోషంగా ఉంది. ఒక తండ్రిని కోడుకు ఎందుకు చదవించాడు.. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గమ్మత్తుగా ఉంటుంది. ఈ పాయింట్ తోనే ఇంట్రెస్ట్ గా తెరమీదకు తీసుకొచ్చాడు దర్శకుడు. విషయం సీరియస్ గా ఉన్న చెప్పే విధానం హాయిగా ఉంటుంది. అదే ఈ సినిమాను ప్రేక్షకులను దగ్గర చేస్తుంది. ’’ అన్నారు.

 

ఈ నెల 6న ప్రేక్షకుల ము్ందుకు రాబోతున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా మలచబడింది.

 

బ్యానర్: ఎమ్ ఆర్ పిక్చర్స్.
సమర్పణ: లక్ష్మణ గౌడ,
ప్రొడ్యూసర్: ఎల్. పద్మనాభ
డైరెక్టర్: హారి సంతోష్
డిఓపి: గురు ప్రశాంత్ రాజ్
మ్యూజిక్: కుతుబ్ ఇ క్రిప
ఎడిటర్: గ్యారీ బి. హెచ్. పవన్ కుమార్
స్టంట్స్: విజయ్
పిఆర్ ఓ: జియస్ కె మీడియా
డైలాగ్స్: సందీప్ రాజ్

నటీ నటులు: రాహుల్ విజయ్ , ప్రియ వడ్లమాని, రాజేంద్ర ప్రసాద్ , మధుబాల తదితరులు

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved