4 December 2023
Hyderabad
నితిన్ , శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకుడు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్ల మీద ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. ఈ మూవీ డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో
హీరో నితిన్ మాట్లాడుతూ.. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా నాకు చాలా స్పెషల్. ఇంత వరకు నేను ఇలాంటి కారెక్టర్ చేయలేదు. ఇలాంటి పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు వక్కంతం వంశీకి థాంక్స్. ఖ్యాతీ, రిత్విక్ పాత్రలతో ప్రేమలో పడతారు. ప్రతీ పాత్రకు ఇందులో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. రాజశేఖర్ గారు చేసిన మగాడు సినిమాతో మా నాన్న డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆ సినిమా హిట్ అయింది కాబట్టే మా నాన్న ఈ ఇండస్ట్రీలో ఉన్నారు.. ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టే నేను హీరోగా ఉన్నాను. ఇలా మళ్లీ మీరు నా సినిమాలో ఇలా స్పెషల్ రోల్ చేసినందుకు థాంక్స్. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. హ్యారిస్ జైరాజ్ గారు మంచి పాటలు ఇచ్చారు. ఆర్ఆర్ చాలా కొత్తగా ఉంటుంది. మా డీఓపీ యువరాజ్‌తో మూడు సినిమాలు చేశాను. నన్ను ఎలా చూపించాలో ఆయనకు తెలుసు. శ్రీలీల ఎంత బిజీగా ఉన్నా కూడా మాకు అవసరమైనప్పుడు డేట్స్ ఇచ్చారు. సినిమాలో నేను ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ కానీ.. రియల్ లైఫ్‌లో శ్రీలీల ఎక్స్‌ట్రా ఆర్డినరీ వుమెన్. నాకు, నా దర్శకుడికి ఈ సినిమా చాలా ముఖ్యం. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. నిర్మాతలకు లాభాలు రావాలి. సినిమాను చూసి నా ఫ్యాన్స్, ప్రేక్షకులు అంంతా కాలర్ ఎగరేసుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు. డిసెంబర్ 8న గట్టిగా కొట్టబోతోన్నామ’ని అన్నారు.
శ్రీలీల మాట్లాడుతూ.. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా డిసెంబర్ 8న రాబోతోంది. మా పాటలు, టీజర్, ట్రైలర్‌ను అందరూ ఎంజాయ్ చేశారు. సినిమాను కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. డేంజర్ పిల్ల సాంగ్ షూట్ టైంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుకున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. నితిన్ చాలా మంచి వ్యక్తి. ప్రతీ పాత్రకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. హ్యారీస్ జైరాజ్ సంగీతం నాకు చాలా ఇష్టం. ఈ సినిమా అందరినీ నవ్విస్తుంది. అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.
నిర్మాత నిఖితా రెడ్డి మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 8న సూపర్ డూపర్ హిట్ సినిమా వస్తుంది. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సూపర్ హిట్ కాబోతోంది. అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.
సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. రాజశేఖర్ గారు స్పెషల్ రోల్ చేసినందుకు థాంక్స్. ఆయన పాత్రను ఒప్పుకున్నందుకు, ఇంత బాగా చేసినందుకు థాంక్స్. ఆదిత్య మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్స్, రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా ఈ సినిమాను తీశాం. సక్సెస్ మీట్‌లో అందరం కలుద్దామ’ని అన్నారు.
వక్కంతం వంశీ మాట్లాడుతూ.. ‘నేను ఒక్కడ్ని కల కంటే సరిపోదు. హీరో, నిర్మాత, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కలిస్తే నిజం అవుతుంది. ప్రతీ విషయంలో నాకు తోడుగా ఉన్న నితిన్, సుధాకర్ రెడ్డి గార్లకు థాంక్స్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ప్రతీ పాత్ర ప్రేక్షకుడికి రిజిస్టర్ అవుతుంది. రాజశేఖర్ గారు లేకపోయి ఉంటే ఈ సినిమాను ఊహించుకునేవాడ్ని కాదు. ఆయన ఈ పాత్రను చేయాలని బలంగా కోరుకున్నాను. నా నమ్మకమే నిజం అయింది. ఆయన ఈ సినిమాతో ప్రేక్షకుల్ని మామూలుగా ఎంటర్టైన్ చేయరు. రాజశేఖర్ గారి పాత్ర బాగా వస్తుందా? లేదా? బాగా రాస్తున్నావా? లేదా? అని నితిన్ రోజూ అడిగేవారు. అది ఆయన గొప్పతనం. డిసెంబర్ 8న సినిమా రాబోతోంది. హ్యారీజ్ జైరాజ్ లాంటి సంగీత దర్శకుడితో పని చేసే అవకాశం రావడం అదృష్టం. ఆర్ధర్ విల్సన్, సాయి శ్రీరామ్, యువరాజ్‌ల కెమెరా వర్క్ అందరినీ ఆకట్టుకుంటుంది. నా డైరెక్షన్ టీం, రైటర్స్ టీంకు థాంక్స్. మన ఫ్యామిలీ కోసం ఏం చేయడానికైనా సిద్దం పడతాం. వాళ్ల నవ్వు చూడటానికి ఏమైనా చేస్తాం. అలా రెండున్నర గంటల సేపు ఫ్యామిలీ అంతటిని కడుపుబ్బా నవ్విస్తామ’ని అన్నారు.
రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘నన్ను ఒకసారి సడెన్‌గా పిలిచారు. ఈ కథ చెప్పారు. నన్ను కన్విన్స్ చేశారు. స్పెషల్ అప్పియరెన్స్ పాత్రను చేశాను. నాకు నచ్చింది. బాగుందని చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు, నితిన్‌కు థాంక్స్. జీవిత చెబితే నేను వింటాను అని అంతా అనుకుంటారు. కానీ నేను చెప్పిందే జీవిత వింటుంది. ఆమె నా మంచికే చెబుతుంటుంది కాబట్టి ఏం చెప్పినా నేను వింటాను. తెరపై జాలీగా, ఆకతాయిగా నటిస్తారు కదా? సెట్‌లోనూ అలానే ఉంటారని అనుకున్నాను. కానీ సెట్స్ మీద హీరోగా, నిర్మాతగా ఎంతో బాధ్యతతో ఉండేవారు. దర్శకుడు నన్ను బాగా చూపించారు’ అని అన్నారు.
జీవిత మాట్లాడుతూ.. ‘భార్యభర్తలు అంటూ ఒకరి మాట ఒకరు వినాలి.. ఒకరి గురించి ఇంకొకరు బతకాలి.. అలాంటి మైండ్ సెట్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. మేం ఇద్దరం ఒకరికొకరం బతుకుతాం. మంచి పాత్ర దొరికితే ఆయన విలన్‌గా అయినా, ఓ స్పెషల్ అప్పియరెన్స్ అయినా చేస్తారు. మాకు వంశీ ఏం చెప్పారో అదే తీశారు. సుధాకర్ రెడ్డి గారు మా ఆయన చేసిన మగాడు సినిమాతో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. అది చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీలీలకు పెద్ద విజయం రావాలి’ అని అన్నారు.
అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ టీంకు ఆల్ ది బెస్ట్. నితిన్, శ్రీలీల, దర్శక నిర్మాతలందరికీ థాంక్స్’ అని అన్నారు.
వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. హీరో నితిన్, శ్రీలీలకు కంగ్రాట్స్. యాంగ్రిమెన్ కాస్త అల్లరి ప్రియుడిగా కనిపించారు. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.