pizza
Gaali Sampath Pre Release function
ఫ‌న్ అండ్ ఎమోష‌న్స్‌తో రూపొందిన `గాలిసంప‌త్` చిత్రాన్ని నా ప్ర‌తి సినిమాలాగే మీఫ్యామిలీతో చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను - బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి
You are at idlebrain.com > News > Functions
Follow Us


7 March -2021
Hyderabad

బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పణ‌లో యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం గాలి సంప‌త్. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనిల్ ఈ చిత్రానికి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రించడంతో పాటు స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ కూడా చేస్తుండ‌డం విశేషం. అనిల్ కో-డైరెక్టర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ జేఆర్‌సి క‌న్‌వెన్ష‌న్స్ లో గాలి సంప‌త్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వ‌హించింది చిత్ర యూనిట్‌. ఈ కార్య‌క్ర‌మానికి ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ముఖ్య అతిథిగా హాజ‌రై గాలి సంప‌త్ బిగ్ టికెట్‌ని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా..

అనిల్ రావిపూడి బ్రాండ్ ఉంటుంది.
ప్ర‌ముఖ నిర్మాత ఎంఎల్ కుమార్ చౌద‌రి మాట్లాడుతూ - ``గాలి సంప‌త్ ఒక అద్భుత‌మైన టైటిల్‌, అలాగే ఎంట‌ర్‌టైన్ మెంట్ టైటిల్‌. రాజేంద్ర ప్ర‌సాద్ గారితో 92లోనే జోక‌ర్‌ సినిమా తీశాను. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్ప‌టికీ అలాగే ఉన్నాడు అంత క‌న్నా ఇంకా ఏం కావాలి చెప్పండి. శ్రీ విష్ణు మంచి కంటెంట్ బేస్డ్ మూవీస్ చేస్తూ సక్సెస్‌లు సాధిస్తున్నాడు. ఇప్పుడు రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు కాంబినేష‌న్‌లో ఇంత ఎంట‌ర్‌టైన్ మెంట్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అనిల్ రావిపూడి గారి ఆద‌ర్వ‌ర్యంలో ఈ సినిమా జ‌రుగుతున్న‌ప్పుడే ప్రేక్షకులకి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంద‌నేది ముందే తెలుసు. అనిల్ రావిపూడి బ్రాండ్ ఈ సినిమాలో ఉండే ఉంటుంది. మార్చి 11న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమా త‌ర్వాత రాబోయే శ్రీ విష్ణు రాజ రాజ చోర సినిమా కూడా బిగ్ హిట్ అవ్వాలి`` అన్నారు.

నిర్మాత బివిఎస్ ర‌వి మాట్లాడుతూ - ``నేను రాజేంద్ర ప్ర‌సాద్ గారికి పెద్ద ఫ్యాన్‌ని. స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమా చాలా పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు.

రాజేంద్ర ప్ర‌సాద్ గారికి ప్ర‌తి ఇంట్లో ఫ్యాన్స్ ఉంటారు
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని మాట్లాడుతూ - ``తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో న‌న్ను అత్యంత ఆప్యాయంగా అన్నా అని పిలిచేది నా త‌మ్ముడు అనిల్ రావిపూడి. అనిల్ ఈ రోజు ఒక పెద్ద స్టార్ డైరెక్ట‌ర్. అనిల్ త‌ను ఎదుగుతూ వ‌చ్చిన క్ర‌మంలో త‌న మిత్రుడు సాయిని మ‌ర్చిపోకుండా ఒక నిర్మాత‌గా ప‌రిచ‌యం చేయ‌డం అనిల్ గొప్ప‌త‌నం. అనిల్ మంచి త‌న‌మే ఆయ‌న్ని మరింత మంచి స్థాయికి తీసుకెళ్తుంది. రాజేంద్ర ప్ర‌సాద్ గారికి ప్ర‌తి ఇంట్లో ఫ్యాన్స్ ఉంటారు. ఈ క‌థ గురించి నాకు తెలుసు. రాజేంద్ర ప్ర‌సాద్‌గారికి ఇది టైల‌ర్ మేడ్ ఫిలిం. శ్రీ విష్ణు మంచి ఆర్టిస్ట్. సెల‌క్టివ్‌గా సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. గాలి సంప‌త్ గురించి చెప్పాలంటే టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లు అన్ని బాగున్నాయి. సినిమా కూడా ఇంకా బాగుంటుంద‌ని న‌మ్ముతున్నాను. అచ్చు మంచి సంగీతం ఇచ్చాడు. ఈ సినిమా హిట్ అయితే నా త‌మ్ముడితో పాటు నాకు హిట్ వ‌చ్చిన‌ట్లే.. త‌ప్ప‌కుండా పెద్ద హిట్ చేస్తార‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``సాయి, అనిల్‌కి రైట్ హ్యాండ్‌. ఈ సినిమా నిర్మాత‌లు సాయి, మా సాహూ గార‌పాటి అనుకున్న‌ప్పుడు అనిల్ స‌పోర్ట్‌తో మంచి మూమెంట్ తీసుకున్నాడు అనుకున్నాం. స్టోరీ చెప్పిన‌ప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఈ సినిమా క‌థ‌ రాజేంద్ర ప్ర‌సాద్ గారి చుట్టే తిరుగుతుంది. ఆయ‌న న‌ట‌న గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక శ్రీ‌విష్ణు గుడ్ ఆర్టిస్ట్. ఆయ‌న చేస్తున్న సినిమాలు చూస్తే అన్ని ఎమోష‌న్స్ చాలా ఈజ్‌తో పెర్ఫామ్ చేస్తున్నాడు. మంచి పెర్‌ఫార్మ‌ర్‌. డైరెక్ట‌ర్ అనిష్‌కి ఆల్ ది బెస్ట్‌. మంచి టీమ్ కుదిరింది. అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.

జెన్యూన్ థాట్ తో అనిల్ ఈ సినిమాకి స‌పోర్ట్ చేశారు.
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ మాట్లాడుతూ - ``గాలి సంప‌త్ టీమ్ ని విష్ చేయ‌డానికి రామ్ రావ‌డం ఒక మంచి ఇన్షియేటివ్‌. రోజు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్స్‌, రిలీజ్‌ల‌తో టాలీవుడ్ షైన్ అవుతోంది. హీరోలు ఒక‌రికొక‌రు సపోర్ట్ చేసుకోవ‌డం మంచి ప‌రిణామం. మంచి హార్ట్ ఉంటేనే అలా చేయ‌డం సాధ్యం అవుతుంది. షైన్ స్క్రీన్స్ లో నేను రెండు సినిమాలు చేశాను. నా హోమ్ బ్యాన‌ర్ లాంటిది. అనిల్ రావిపూడి చాలా క్లోజ్ ప‌ర్స‌న్‌. అనిల్ చేయాల‌నుకున్నది త‌ప్ప‌కుండా చేస్తాడు.. స‌క్సెస్ అవుతాడు. గాలి సంప‌త్‌లాంటి ఒక మంచి కాన్సెప్ట్ సాయి రాసి తీసుకొచ్చిన‌ప్పుడు ఇలాంటి స‌బ్జెక్ట్స్‌కి నా స‌పోర్ట్ ఉంటే ఎలివేట్ అవుత‌ది అనే ఒక జెన్యూన్ థాట్ తోని ఈ సినిమాకి స‌పోర్ట్ చేశారు. రాజేంద్ర ప్ర‌సాద్ లాంటి ఎక్స్‌ట్రార్డిన‌రీ ఆర్టిస్ట్ ని ప‌ట్టుకుని ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ శ్రీ‌విష్ణు లాంటి మంచి హీరోతో చేయ‌డం నిజంగా అభినంద‌నీయం. సాయి కూడా చాలా కాలంగా తెలుసు. ఇలాంటి కాన్సెప్ట్స్‌తో నిర్మాత‌గా మారుతున్నందుకు హ్యాపీగా ఉంది`` అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు అచ్చురాజ‌మ‌ణి మాట్లాడుతూ - ``ఇంత‌ మంచి సినిమాలో సంగీతం చేసే అవ‌కాశం ఇచ్చిన అనిల్‌గారికి థ్యాంక్యూ. ఈ సినిమా త‌ప్ప‌కుండా బిగ్ హిట్ అవుతుంది. నిర్మాతలు సాయి, సాహూ గార‌పాటి గారికి మై కంగ్రాట్స్‌`` అన్నారు.

హీరోయ‌న్ ల‌వ్‌లీ సింగ్ మాట్లాడుతూ - ``ఇది నా ఫ‌స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌. స్పెష‌ల్‌డే..ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన అనిల్, అనీష్, సాయి గారికి థ్యాంక్స్‌. మార్చి 11న త‌ప్ప‌కుండా గాలి సంపత్ సినిమా చూసి అంద‌రూ ఎంజాయ్ చేయండి`` అన్నారు.

ఫ‌న్ అండ్ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ..
చిత్ర ద‌ర్శ‌కుడు అనీష్ మాట్లాడుతూ - ``గాలి సంప‌త్ సినిమా విష‌యానికి వ‌స్తే ఆన్ స్క్రీన్ తండ్రి కొడుకుల మ‌ధ్య ఉండే ఫ‌న్ అండ్ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ..అదే ఆఫ్ స్క్రీన్ వ‌స్తే అనిల్, సాయి గారి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్లిద్ద‌రిది ప‌టాస్ కి ప‌దేళ్ల ముందు ఫ్రెండ్‌షిప్‌. సాయి గారికి లైమ్ లైట్ లోకి తీసుకురావ‌డానికి అనిల్ గారు చేస్తోన్న ఈ ప్ర‌య‌త్నంలో నాకు అవ‌కాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ వెరీ మ‌చ్‌. రాజేంద్ర ప్ర‌సాద్ గారు సెట్లో న‌వ్వులు పండిస్తూనే ఉంటారు. ఆయ‌న‌తో చేసిన ప్ర‌తి మూమెంట్ ఐ యామ్ చెరీష్‌. ఈ సినిమాలో ఒక కొత్త విష్ణుగారిని చూస్తారు. మా టీమ్ ని విష్ చేయ‌డానికి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్‌`` అన్నారు.

నా జీవితంలో ఒక ఆణిముత్యం
న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ - ``గాలి సంప‌త్ సినిమా చూశాక నాకు రెండు మూడు విష‌యాలు అర్ధం అయ్యాయి. జీవితంలో మనం ఏం చేసినా భ‌గ‌వంతుడు మ‌న‌కు ఇచ్చే అవ‌కాశం. అది రానిదే ఎవ‌రూ జీవితంలో ఏమీ చేయ‌లేరు. 44 సంవ‌త్స‌రాల సినిమా జీవితం.. న‌న్ను న‌టుడిగా నిల‌బెట్టిన మొద‌టిసినిమా లేడిస్ టైల‌ర్‌. ఆ సినిమా లేక‌పోతే నేను లేను. ఇక నా జీవితంలో జ‌న్మాంతం న‌టుడిగా గుర్తించుకునే ఒక అద్భుత‌మైన‌ క‌థ రాశారు సాయి. ఆ క‌థ‌కి ఆయ‌న్నే నిర్మాత‌గా మార్చారు న‌న్ను డాడీ అని పిలిచే అనిల్ రావిపూడి. ఈ క‌థ చెప్ప‌గానే నేను భ‌య‌ప‌డ్డాను. మాట‌లు లేకుండా ఎలా అనుకున్నాం. కానీ క‌రోనా త‌ర్వాత ఫుల్ ఎన‌ర్జీతో సినిమా చేశారు. నా జీవితంలో మ‌ర్చిపోలేని సినిమా ఇది. శ్రీ విష్ణుతో క‌లిసి న‌టించ‌డం హ్యాపీగా ఉంది. ల‌వ్‌లీ సింగ్ బాగా చేసింది. అనీష్ అద్భుతంగా తెర‌కెక్కించాడు. గాలి సంప‌త్ నా జీవితంలో ఒక ఆణిముత్యం`` అన్నారు.

ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎమోష‌న్ ప‌ర్‌ఫెక్ట్‌గా కుదిరింది
చిత్ర నిర్మాత ఎస్.క్రిష్ట మాట్లాడుతూ - ``ముందుగా ఈ ఈవెంట్ కి వ‌చ్చిన రామ్ గారికి థ్యాంక్స్‌. గాలి సంప‌త్ ఒక చిన్న క‌థ . ఈ క‌థ రాసుకుని దీన్ని సినిమాగా తీయాలి అన‌గానే నా మ‌న‌సులో గుర్తొచ్చిన మాట రాజేంద్ర ప్ర‌సాద్‌గారు. సినిమా చూస్తున్న‌ప్పుడు ప‌లికించిన ఎక్స్‌ప్రెష‌న్స్ డెఫినెట్ గా ఒక బుక్‌గా చెప్పుకోవ‌చ్చు. ఈ సినిమాని గొప్ప సినిమాగా తీయాల‌నుకున్న‌ప్పుడు నాకు ఉన్న ఒకే ఒక్క ఎలిమెంట్ ఫ్రెండ్‌ అనిల్ రావిపూడి. త‌న‌ని క‌లిసిన ద‌గ్గ‌రినుండి చాలా స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చాడు. హ‌రీష్ పెద్ది, సాహూ గార‌పాటి న‌న్ను ముందు నిల్చోబెట్టి చాలా గ్రాండ్ గా తీశారు. అనీష్ నా ఫ్రెండ్. అచ్చు ఎక్స్ట్రార్డిన‌రీ మ్యూజిక్ ఇచ్చాడు. త‌మ్మిరాజు చాలా క్రిస్పీగా ఎడిట్ చేశారు. అనిల్ ఈ క‌థ చెప్ప‌గానే నేను చేస్తాను అని చెప్పి విష్ణుగారు అద్భుతంగా పెర్‌ఫామ్ చేశారు. ఈ మూవీ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌. ఎక్క‌డో ఒక చోట డెఫినెట్‌గా మీకు క‌న్నీళ్లు వ‌స్తాయి. మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎమోష‌న్ అన్ని ప‌ర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. అంద‌రూ ఈ సినిమా చూసి మ‌మ్మ‌ల్ని బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను`` అన్నారు.

కొత్త ప్ర‌య‌త్నాన్ని ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను.
బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ``నేను సాయి బెస్ట్ ఫ్రెండ్స్‌. మేం దూరంగా ఉన్నా చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటాం. అంత మంచి ఫ్రెండ్‌షిప్ మాది. 2005లో బ్ర‌మ‌రాంబ థియేట‌ర్‌లో అత‌డు సినిమాలో సాయి నాకు క‌లిశాడు. నా క‌ష్ట న‌ష్టాల్లో, నా ఆనందంలో అన్నింటిలో సాయి ఉన్నాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే సాయి నా ఫ్యామిలీ మెంబ‌ర్‌. నా స‌క్సెస్ అన్నింటిలో చాలా కీ రోల్ పోషించాడు అలాంటి సాయి నెక్ట్స్ లెవ‌ల్‌కి ఎలా రావాలి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఎప్పుడూ సాయి నువ్వేం చేసిన నీ వెనుక నేను ఉంటాను అని చెప్పాను. అలాంటి సాయి మంచి క‌థ రాశాడు, గాలి సంప‌త్ క‌థ దీంతో నేను ప్రొడ్యూస‌ర్ అవ్వాలి అనుకున్నాడు. దానిని ముందుకు తీసుకు వెళ్లడానికి మాకు సాహూ గార‌పాటి, హ‌రీష్ పెద్ది చాలా హెల్ప్ చేశారు. త్వ‌ర‌లో వారితో ఒక మంచి సినిమా చేయ‌బోతున్నాను. గాలి సంప‌త్ త‌ను చెప్పిన‌ట్టు కొత్త క‌థ‌. కొత్త ప్ర‌య‌త్నం. స‌క్సెస్ పై మీమంద‌రం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అనీష్‌కి ఈ సినిమా త‌ర్వాత మంచి సినిమాలు రావాలి. మంచి టీమ్ కుదిరింది. అంద‌రు టెక్నీషియ‌న్స్ చాలా బాగా వ‌ర్క్ చేశారు. గాలి సంప‌త్ గా రాజేంద్ర ప్ర‌సాద్ ఫిక్స్ అయ్యాక ఆయ‌న కొడుకుగా ఎవ‌రు చేయాలి అని అనుకున్న‌ప్పుడు మాకు శ్రీ విష్ణు త‌ప్ప ఇంకో ఆప్ష‌న్ కూడా క‌న‌ప‌డ‌లేదు. విష్ణుకి ఈ సినిమా డైఫినెట్ గా ఒక మంచి సినిమా అవుతుంది. రాజేంద్ర ప్ర‌సాద్ గారితో సుప్రీమ్ నుండి మా జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది. ఎంట‌ర్‌టైన్ మెంట్లో ఆయ‌న్ని కొట్టేవారే లేరు. ఈ సినిమాలో మ‌రో లెవ‌ల్‌లో ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతున్నాడు. ఆయ‌న క‌ష్టం రేపు స్క్రీన్ మీద చూస్తారు. ఆయ‌న ఒక లెజెండ్‌. ఎన్నో హాస్య భ‌రిత సినిమాలు చేసి మ‌నల్ని ఎంట‌ర్టైన్ చేసిన ఒక గొప్ప న‌టుడు ఈ వ‌య‌సులో ఒక గొప్ప సినిమాలో యాక్ట్ చేశారు. మ‌న‌ల్ని కొన్నేళ్లు న‌వ్వించిన రాజేంద్ర ప్ర‌సాద్ గారి కోసం నేను నా ఫ్యామిలీతో క‌లిసి మార్నింగ్ షో సినిమా చూస్తున్నాను, మీరు కూడా సినిమా చూసి ఆయ‌న‌కి ఒక సెల‌బ్రేష‌న్ ఇవ్వాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. నా ఐదు సినిమాల జ‌ర్నీలో నా వెంట ఉంది ప్రేక్ష‌కులు. ప్ర‌తి సినిమాని మీ కుటుంభంతో వ‌చ్చి ఆద‌రించారు. ఒక కొత్త ప్ర‌య‌త్నం చేస్తున్నాను. ఈ సినిమాని కూడా మీరు వ‌చ్చి ఆద‌రించాల‌ని నా హంబుల్ రిక్వెస్ట్. రామ్ గారితో నా జ‌ర్నీ చాలా కాలం నుండి ఉంది. త్వ‌ర‌లో ఆయ‌న‌తో అద్భుత‌మైన సినిమా చేయాల‌నుకుంటున్నాను`` అన్నారు.

వ‌ర‌ల్డ్‌లో బెస్ట్ యాక్ట‌ర్ ద‌గ్గ‌ర ట్రైన్ అయ్యాను.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ - ``మేం అడిగిన వెంట‌నే వ‌చ్చిన రామ్ గారికి థ్యాంక్స్‌. నేను డైరెక్ట‌ర్ అవ్వాల‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. నేను ఏ క‌థ రాసుకున్నా హీరోగా రామ్‌ మైండ్‌లోకి వ‌చ్చేవారు. కంప్లీట్ యాక్ట‌ర్ ఆయ‌న‌. గాలి సంప‌త్ జ‌ర్నీ.. నా లైన‌ప్ లో నేను ఉన్న‌ప్పుడు ఏదో అద్భుతాలు జ‌రుగుతాయి అంటారు క‌దా అలా ఈ కథ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. ఈ క‌థ విన‌గానే ఎవ‌రు చేస్తున్నారు అన‌గానే రాజేంద్ర ప్ర‌సాద్‌గారు అన‌గానే చాలా హ్యాపీగా అనిపించింది. ఆయ‌న ఈ క‌రోనా స‌మ‌యంలో ప్రాణాల‌ను కూడా లెక్క చేయ‌కుండా ఈ సినిమా చేశారు. నేను ఇంత వ‌ర‌కూ ఏ ఇనిస్ట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకోలేదు. కాని ఈ సినిమాతో వ‌ర‌ల్డ్‌లో బెస్ట్ యాక్ట‌ర్ ద‌గ్గ‌ర నేను ట్రైన్ అయ్యాను. అది నా త‌ర్వాతి చిత్రాల్లో మీరు కూడా చూస్తారు. క్లైమాక్స్ స‌న్నివేశంలో ఆయ‌న న‌ట‌న‌కి రెండు చేతులు ఎత్తి దండం పెడ‌తారు. అంత అద్భుతంగా న‌టించారు`` అన్నారు.

నేష‌న‌ల్ అవార్డ్ రావాల‌ని కోరుకుంటున్నాను.
ఎన‌ర్జిటిక్ స్టార్‌ రామ్ మాట్లాడుతూ - ``మా స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ స్టార్ట్ అయ్యిందే రాజేంద్ర ప్ర‌సాద్ గారి లేడిస్ టైల‌ర్ సినిమాతో..ఆయ‌న సినిమాలు వ‌స్తున్నాయంటే చాలు హ్యాపీగా న‌వ్వుకోవ‌చ్చు. ఆయ‌న పేరు ముందు ఏ బిరుదు పెట్టినా అది చాలా చిన్న‌గా క‌న‌ప‌డుతుంది. సినిమా ప‌రిశ్ర‌మ‌కి దొరికిన ట్రెజ‌ర్ ఆయ‌న‌. గాలి సంప‌త్ సినిమాకి రాజేంద్ర ప్ర‌సాద్ గారికి హండ్రెడ్ ప‌ర్సెంట్ నేష‌న‌ల్ అవార్డ్ రావాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఆయ‌న యాక్టింగ్ చూడ‌గానే ఇది త‌ప్ప‌కుండా అవార్డ్ విన్నింగ్ ఫిలిం అనిపించింది. శ్రీ విష్ణు మంచి స్నేహితుడు. మోస్ట్ జెన్యూన్ ప‌ర్స‌న్. ఈ సినిమా శ్రీ విష్ణుకి కూడా మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను. నిర్మాత‌లు సాహూ గారికి, హ‌రీష్ గారికి ఆల్ ది బెస్ట్‌. ఈ సినిమాతో నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్న రైట‌ర్ సాయి నాకు చాలా కాలంగా తెలుసు. ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తుంటే రాజ్ కుమార్ హిరాణి స్టైల్ క‌నిపించింది. ఈ సినిమా సాయి కెరీర్‌లోనే కాదు ఇండ‌స్ట్రీలో కూడా ఒక మైల్ స్టోన్ మూవీ అవ్వాల‌ని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సాయి. అచ్చు మంచి సంగీతం ఇచ్చాడు. ల‌వ్ లీ సింగ్ స్క్రీన్ మీద ల‌వ్‌లీగా ఉంది. అనీష్ కి ఇంత మంచి సినిమాలో అవ‌కాశం రావ‌డం హ్యాపీగా ఉంది. అనిల్ నాకు అసోసియేట్ డైరెక్ట‌ర్ ‌నుండి బాగా తెలుసు. ఎన్నో సూప‌ర్‌హిట్ సినిమాలకి కెమెరా వెన‌క సూప‌ర్‌వైజ్ చేశారు. అలా చాలా బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఇచ్చారు. కాని బ‌య‌ట‌కు రాలేదు.. ఫ‌స్ట్ టైమ్ బ‌య‌ట‌కు వ‌చ్చి బ్లాక్ బస్ట‌ర్ ఇవ్వ‌బోతున్నారు అని నేను న‌మ్ముతున్నాను. చాలా జెన్యూన్ ప‌ర్స‌న్‌. అనిల్ వ‌న్ ఆఫ్ ద బెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ ఇన్ తెలుసు సినిమా. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.

న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి,
క‌థ‌: ఎస్‌. క్రిష్ణ‌,
ర‌చ‌నా స‌హ‌కారం: ఆదినారాయ‌ణ‌,
సినిమాటోగ్ర‌ఫి: సాయి శ్రీ రామ్‌,
సంగీతం: అచ్చురాజ‌మ‌ణి,
ఆర్ట్‌: ఎ ఎస్ ప్ర‌కాశ్‌,
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: నాగ‌మోహ‌న్ బాబు. ఎమ్‌,
మాట‌లు: మిర్చికిర‌ణ్‌,
లిరిక్స్‌: రామ‌జోగ‌య్య శాస్ర్తి,
ఫైట్స్‌: న‌భ‌,
కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్, భాను,
మేక‌ప్‌: ర‌ంజిత్‌,
క్యాస్ట్యూమ్స్‌: వాసు,
చీఫ్ కో డైరెక్ట‌ర్‌: స‌త్యం బెల్లంకొండ‌.
నిర్మాణం: ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్, షైన్ స్క్రీన్స్,
నిర్మాత‌: ఎస్. క్రిష్ణ‌,
స్క్రీన్ ప్లే, సమ‌ర్ప‌ణ‌, దర్శకత్వ పర్యవేక్షణ: అనిల్ రావిపూడి,
ద‌ర్శ‌క‌త్వం: అనీష్.

 

 

 

Photo Gallery

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved