pizza

Goat Pre Release Event
'The GOAT' మూవీ హోల్సమ్ ఎంటర్ టైనర్. చాలా సర్ ప్రైజ్ లు వున్నాయి. ఆడియన్స్ డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు: ప్రీరిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ వెంకట్ ప్రభు

You are at idlebrain.com > News > Functions
Follow Us


2 September 2024
Hyderabad

దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో నేషనల్ వైడ్ గా ఈ సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. 'The GOAT' సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. The GOAT మూవీ హోల్సమ్ ఎంటర్ టైనర్. థియేటర్స్ లో అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. దళపతి విజయ్ ని చాలా కొత్తగా ప్రజెంట్ చేశాం. సెప్టెంబర్ 5న థియేటర్స్ లో సినిమా చూసి ఎలా వుందో చెప్పండి. విజయ్ గారు, ప్రశాంత్, ప్రభుదేవ, జయరాం ఇలా ఎంతోమంది బిగ్ స్టార్స్ తో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. స్నేహ,లైలా, మీనాక్షి, యోగిబాబు, ప్రేమ్ జీ ఇలా హ్యుజ్ స్టార్ కాస్ట్ వున్న సినిమా ఇది. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ తో వర్క్ చేయడం ఇదే తొలిసారి. విజయ్ గారి సినిమా, అలాగే ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ 25వ సినిమాని డైరెక్టర్ చేయడం ఆనందంగా వుంది. ఏడాదిలో ఈ సినిమా చేశాం. ఇదే సినిమా హాలీవుడ్ లో చేస్తే చాలా టైం, బడ్జెట్ తీసుకుంటారు. ఇలా చేయడానికి రాజమౌళి గారే స్ఫూర్తి. ఆయనకి పెద్ద ఫ్యాన్. మైత్రీ మూవీ మేకర్స్ కి థాంక్ యూ. వారు ఈ సినిమాని రిలీజ్ చేయడం ఒక హానర్ గా భావిస్తున్నాను. సెప్టెంబర్ 5న సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. బాలయ్య గారు సినీ పరిశ్రమలో యాభై ఏళ్ళు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. ఆయనకి మనస్పూర్తిగా శుభాకాంక్షలు. జై బాలయ్య. తెలుగు ఇండస్ట్రీలో 'GOAT' బాలయ్య గారు' అన్నారు.

నిర్మాత అర్చన కల్పాతి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రవి గారు, శశి గారు, మైత్రీమూవీ మేకర్స్ కి థాంక్ యూ. మైత్రీ మూవీ మేకర్స్ The GOAT. నా ఆల్ టైం ఫేవరేట్ మూవీ పుష్ప ని నిర్మించారు. The GOAT సినిమా కూడా గొప్ప విజయాన్ని సాధిస్తుంది. మ్యాగ్జిమం స్క్రీన్స్ లో రిలీజ్ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ తో కొలబరేట్ అవ్వడం ఆనందంగా వుంది. ఇది మా 25వ సినిమా. విజయ్ గారు మా GOAT. డైరెక్టర్ వెంకట్ ప్రభు గారుకి థాంక్. యువన్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు.సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ. సెప్టెంబర్ 5న అందరూ థియేటర్స్ లో సినిమా ఎంజాయ్ చేయండి' అన్నారు.

యాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఇది. ఆడియన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. నిర్మాతలు చాలా గ్రాండ్ గా ఈ సినిమాని నిర్మించారు. ఇంతమంది స్టార్స్ ని ఒక ఫ్రేంలో చూపించి మూవీ తీయడం అంత తేలిక కాదు. వెంకట్ ప్రభు గారు అద్భుతంగా ఈ సినిమాని తీశారు. చాలా గ్రేట్ విజన్ తో సినిమాని రూపొందించారు. చాలా హ్యుజ్ ఫిలిం ఇది. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు. ఆడియన్స్ కి ఒక ట్రీట్ లా వుంటుంది. విజయ్ చాలా సాఫ్ట్ పర్శన్. విజయ్, ప్రభుదేవ, నేను కలసి చేసిన సీన్స్ ప్రేక్షకులని విశేషంగా అలరిస్తాయి. యువన్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ సపోర్ట్. నిర్మాత అర్చన గారు చాలా పాషన్ తో సినిమా చేశారు. ఆడియన్స్ తప్పకుండా చాలా ఎంజాయ్ చేస్తారు' అన్నారు.

హీరోయిన్ స్నేహ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన విజయ్ గారు, వెంకట్ ప్రభు గారు, అర్చన గారికి థాంక్ యూ. ఇదొక మెగా ఫిల్మ్. సెట్స్ లో విజయ్, ప్రశాంత్, లైలా, మీనాక్షి ఇలా ఎందరో స్టార్స్ వుండేవారు. ఈ అందరితో పని చేయడం చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. చాలా రోజుల తర్వాత నా సినిమా వస్తోంది. సినిమా అదిరిపోతుంది' అన్నారు.

హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. నా కెరీర్ బిగినింగ్ లోనే ఇంత బిగ్ స్టార్స్ తో వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. విజయ్ గారు చాలా కామ్ పర్శన్. చాలా డెడికేటెడ్ గా వుంటారు. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. ఈ మూవీ జర్నీ చాలా మెమరబుల్. సెట్స్ లో చాలా ఫన్ వుండేది. ఇందులో పని చేసిన అందరికీ పేరుపేరున థాంక్స్. వెంకట్ ప్రభుగారు చాలా కూల్ గా వుంటారు, ఎలాంటి సమస్యనైన కూల్ పరిష్కరిస్తారు. యువన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. విజయ్ గారితో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. సినిమాలో చాలా సర్ప్రైజ్ లు వున్నాయి. సెప్టెంబర్ 5న మూవీని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి' అన్నారు.

యాక్ట్రెస్ లైలా మాట్లాడుతూ.. విజయ్ గారు వెంకట్ ప్రభు గారితో కలసి ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా ఆనందంగా వుంది. ఈ మూవీ లవ్ లవ్లీ జర్నీ. తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. అందరూ సెప్టెంబర్ 5న సినిమా చూసి ఎంజాయ్ చేయండి' అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ జీవన్ శంకర్ రాజా మాట్లాడుతూ.. అందరికీ హాయ్. విజయ్ గారి సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయడం ఎప్పుడూ స్పెషల్ గా వుంటుంది. తప్పకుండా ఈ సినిమాని మీరంతా లవ్ చేస్తారు. నా లైఫ్ లో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మై ఫాదర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ గారు' అన్నారు

డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాత అర్చన గారికి థాంక్యూ. బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ తో చాలా గ్రాండ్ గా నిర్మించిన సినిమా ఇది. ట్రైలర్, టీజర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ రవి గారు, నవీన్ గారు మేమంతా కలిసి ఈ సినిమాని మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేయడం జరుగుతుంది. విజయ్ గారి కెరీర్ హయ్యస్ట్ రిలీజ్. ఎర్లీ మార్నింగ్ షోస్ ప్లాన్ చేస్తున్నాం. సినిమా తప్పకుండా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది' అన్నారు.


Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved