pizza
Guna 369 pre release function
గుణ 369` ప్రీ రిలీజ్ ఈవెంట్
You are at idlebrain.com > News > Functions
Follow Us


29 July 2019
Hyderabad

ఆర్‌.ఎక్స్‌.100' ఫేమ్‌ కార్తికేయ, అనఘ హీరోహీరోయిన్లుగా స్ప్రింట్‌ మీడియా, జ్ఞాపిక ఎంటర్‌ ప్రైజస్‌. వీరిద్దరూ సంయుక్తంగా శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌జీ మూవీ మేకర్స్‌ పతాకాలపై అర్జున్‌ జంధ్యాలను దర్శకుడిగా పరిచయం చేస్తూ అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మించిన చిత్రం 'గుణ 369'. సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బోయపాటి శ్రీను విడుదల చేశారు. ఈ సందర్భంగా...

వల్లూరి పల్లి రమేశ్ మాట్లాడుతూ - `కొత్త దర్శకుడైనా అర్జున్ సినిమాను చక్కగా తెరకెక్కించాడని బయట అందరూ మాట్లాడుకుంటున్నారు. కార్తికేయకు, నిర్మాతలకు, ఎంటైర్ టీమ్‌కు అభినందనలు`` అన్నారు.

జెమిని కిరణ్ మాట్లాడుతూ - ``ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు. సినిమా మంచి సక్సెస్ సాధించాలి`` అన్నారు.

అనీల్ రావిపూడి మాట్లాడుతూ - ``టీం అందరికీ నా బెస్ట్ విషస్. అనీల్ కడియాల, తిరుమల్ రెడ్డి, ప్రవీణ గారు టీవీ రంగంలో ఎన్నో విజయవంతమైన ప్రాజెక్ట్స్ చేశారు. తొలిసారి నిర్మాణ రంగంలో అడుగు పెడుతున్నారు. అలాగే కార్తికేయ ఆర్.ఎక్స్ 100 సినిమాలో అద్భుతంగా నటించాడు. ఈ సినిమా అంత కంటే పెద్ద హిట్ కావాలి`` అన్నారు. 369 చాలా లక్కీ నెంబర్. అప్పట్లో ఆదిత్య 369 చాలా పెద్ద హిట్ అయ్యింది. అలా కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.

విష్ణు ఇందూరి మాట్లాడుతూ - ``ఈ సినిమా నిర్మాతలతో నాకు 15 ఏళ్ల అనుబంధం ఉంది. వీరనుకుంటే పెద్ద దర్శకుడితో పెద్ద సినిమాను నిర్మించవచ్చు.స్టోరీని బేస్ చేసుకుని ఓ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నారంటే వాళ్ల గట్స్‌కు హ్యాట్సాఫ్. ఈ సినిమాను వాళ్లు ఎంత ప్యాషనేట్‌గా చేశారో నాకు తెలుసు. మేం సినిమాను చూశాం. వాళ్లు చాలా గొప్ప సినిమాను చేశారనుకుంటున్నాను. కార్తికేయ ఆర్.ఎక్స్ 100తో హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో హీరోగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాడు. అనఘ తొలిసారి తెలుగులో నటించినా, తన నటనతో యూత్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. టీమ్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ మాట్లాడుతూ - ``నాతో పాటు ట్రావెల్ చేస్తున్న టీమ్స్ అన్ని బావున్నాయి. అందరూ బాగా సపోర్ట్ చేశారు. చక్కటి లిరికట్స్ కుదిరాయి. దర్శక నిర్మాతలు మంచి ఫ్రీడమ్ ఇచ్చి ఔట్ పుట్ రాబట్టుకున్నారు`` అన్నారు.

`మా` అధ్యక్షుడు నరేశ్ మాట్లాడుతూ - ``కార్తికేయలో ఎంత ఇన్నోసెన్స్ ఉందో.. నటనతో అంత ఇన్‌టెన్స్ ఉంది. `గుణ 369` సినిమాను కార్తికేయ తప్ప మరెవరూ చేయలేరనేలా చేశారు. అనఘ చాలా చక్కగా నటించింది. బోయపాటిగారి దగ్గర పనిచేసిన అర్జున్ అనుభం, ఎగ్జిక్యూషన్ అంతా మేకింగ్‌లో కనపడుతుంది. చైతన్ మంచి సోల్‌ఫుల్ మ్యూజిక్ అందించాడు. నిర్మాతలు మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుంది`` అన్నారు.

సంజనా మాట్లాడుతూ - ``ఆర్.ఎక్స్ 100` మూవీని నేను 3 సార్లు చూశాను. గ్రేట్ ప్రొడ్యూసర్స్. నాకు మంచి మిత్రులు. దర్శకుడు అర్జున్‌గారు బోయపాటిగారిలా సక్సెస్ కావాలి. కార్తికేయలో రవితేజలాంటి ఎనర్జి ఉంది. తను గొప్ప స్థాయికి చేరాలి`` అన్నారు.

చిత్ర సమర్పకురాలు ప్రవీణ కడియాల మాట్లాడుతూ - ``మా బ్యానర్‌లో వస్తున్న తొలి సినిమా ఇది. మా సినిమాకు 24 శాఖల పరంగా మేం వేసిన అడుగుతో ఇక్కడి వరకు చేరుకున్నాం. మా అడుగులు సరైనవే అని ప్రేక్షకులు నిరూపిస్తారని భావిస్తున్నాం. ఓ కామన్ మ్యాన్ బయోపిక్ ఇది. మిమ్మల్ని మీరు తెరపై చూసుకుంటారు. కార్తికేయయ వన్ మ్యాన్ షో. అర్జున్ జంధ్యాల తొలి రోజు కథ చెప్పగానే వెంటనే చేస్తామని అన్నాను. మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నామని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం`` అన్నారు.

నిర్మాత తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ - ```గుణ 369` మంచి కథ, కథనంతో సాగే పొయే సినిమా ఇది. మా తొలి ప్రయత్నంలో ఎక్కడా కూడా ఇది మా తొలి సినిమా అనే భావనతో ఎక్కడా అనిపించలేదు. అర్జున్ జంధ్యాల మాకు ఏ కథైతే చెప్పాడో, దాన్ని స్క్రీన్‌పై అలాగే చూపించాడు. కార్తికేయ పవర్ ప్యాక్, ఎమోషన్ జర్నీ ఇది. ఈ సినిమాతో తను అందరి గుండెల్లో నిలిచిపోతాడు. అనఘకు తెలుగు సినిమాల్లోకి ఈ సినిమా ద్వారా స్వాగతం చెబుతున్నాను. అందరికీ థ్యాంక్స్`` అన్నారు.

చిత్ర దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ - ``మా నాన్నగారు నేను ఎంత బావుండాలని కోరుకుంటారో.. మా గురువుగారు బోయపాటిగారు కూడా నేను అంతే బావుండాలని కోరుకుంటారు. అలాగే బాలుగారు ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. సినిమా ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాను పూర్తి చేశాం. ఔట్ పుట్ చూసిన తర్వాత అందరం హ్యాపీగా ఫీలయ్యారు. ఒక వంద మంది సినిమా చూస్తే.. ఎవరూ బాగా లేదని చెప్పలేదని చెప్పలేరు. పరావాలేదని అంటారో, సూపర్‌గా ఉందని అంటారో ఇప్పుడే చెప్పలేను. బాగా లేదని ఎవరూ చెప్పరు. అందరూ ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. అలాగే నిర్మాత అశోక్ రెడ్డిగారికి థ్యాంక్స్. అందరూ ఎంతగానో కో ఆపరేట్ చేస్తూ వచ్చారు. అలాగే నటీనటులందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇంత మంచి నిర్మాతలు దొరకడం నా లక్. ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఇదేంటి? అదేంటి? అని అడగలేదు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. కథ వినగానే, గ్యారెంటీగా హిట్ కొడతామని నమ్మి నా వెనుక నిలబడిన ప్రవీణగారికి, తిరుమల్ రెడ్డిగారికి, అనీల్‌గారికి థ్యాంక్స్. నా టీమ్ ఓ ఆర్గనైజ్డ్‌గా సినిమాను నడిపించారు. నేను డైరెక్టర్ అయ్యానంటే కార్తికేయగారే కారణం. ఆయనకు రుణపడి ఉంటాను. అనఘ చక్కగా యాక్ట్ చేసింది. తప్పకుండా హిట్ కొడుతామని నమ్మకంగా చెప్పగలను. మంచి సినిమా చేశామని చెప్పగలను. మనల్ని మనం చూసుకునే సినిమా. మన ఆనందం, బాధ, ఎమోషన్స్ అన్నీ తెరపై కనపడుతుంది. ఆగస్ట్ 2న విడుదలవుతుంది.. చూసి ఎంజాయ్ చేయండి`` అన్నారు.

హీరోయిన్ అనఘ మాట్లాడుతూ - ``నేను గీతగా మీ ముందుకు వస్తున్నాను. కచ్చితంగా గీత అందరికీ నచ్చుతుంది. డైరెక్టర్ అర్జున్‌గారు గీత క్యారెక్టర్‌ను నేను చేయగలను అని భావించి అవకాశం ఇచ్చారు. నిర్మాతలకు థ్యాంక్స్. ప్రతి అమ్మాయికి గుణలాంటి అబ్బాయి కావాలనిపిస్తుందట. కార్తికేయ బ్రిలియంట్ యాక్టర్. తను తప్ప ఎవరూ చేయలేరనే విధంగా నటించాడు. చైతన్‌గారు బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. తప్పకుండా ఆగస్ట్ 2న అందరూ సినిమా చూసి ఆశీర్వదించండి`` అన్నారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ``మంచి సినిమాను మంచి మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన సినీ ప్రేక్షకులు, పెద్దలకు థ్యాంక్స్. అర్జున్ నా దగ్గర పనిచేశాడని చెప్పడం కంటే .. తనని నా బద్రర్ అని చెబుతాను. తను డైరెక్టర్ కావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. గర్వంగా ఉంది. అనీల్, ప్రవీణ, తిరుమల్ రెడ్డి నాకు ఎంతో కావాల్సిన వాళ్లు. అర్జున్ జంధ్యాలకి, నిర్మాతలకు, హీరోయిన్‌కి ఫస్ట్ ఫిలిమ్. సినిమా చూశాను. ఈ సినిమాను ఎంతో వేల్యూస్‌తో చేశారు. తొలి సినిమాలా కాకుండా 10 సినిమాలు చేసిన నిర్మాతల అనుభవంతో చేసినట్లు చేశారు. మేకింగ్ చూస్తే తెలుస్తుంది. అర్జున్ జంధ్యాల.. తొలి సినిమానే అయినా ఎన్నో సినిమాల అనుభవమున్న దర్శకుడిలా తెరకెక్కించాడు. భవిష్యత్‌లో తను అద్భుతంగా నిలబడతాడు. మంచి కథ, స్నేహితుల్లాంటి నిర్మాతలు దొరకడంతో అద్భుతమైన సినిమా. ఆర్.ఎక్స్ 100 తర్వాత కార్తికేయ నటన చూస్తే.. 20 సినిమాలు చేసిన నటుడిలా తన నటనలో ఇంప్రూవ్ మెంట్ కనపడింది. తనలో తపన కనపడింది. అనఘపైనే కథ మొత్తం నడుస్తుంది. టెక్నీషియన్స్ అందరూ ప్రాణం పెట్టి చేశారు. సినిమా చాలా పెద్ద హిట్ సినిమా అవుతుంది`` అన్నారు.

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ - ```ఆదిత్య 369` సినిమాకు నేను సమర్పకుడిగా వ్యవహరించాను. `గుణ 369` సినిమా ప్రారంభోత్సవం రోజున స్క్రిప్ట్‌ను నా చేతులతోనే ఇప్పించారు. లైట్ బాయ్ నుండి నిర్మాత వరకు ఒళ్లు దాచుకోకుండా పనిచేసే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే.. అది సినిమా ఇండస్ట్రీ మాత్రమే. యజమాని బావుంటే పనిచేసే వాళ్లందరూ బావుంటారు. నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలని కోరుకుంటాను. సినిమా చూస్తున్నప్పుడు క్వాలిటీ తెలిసిపోతుంది. ఈ సినిమా అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నాను`` అన్నారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ - ``ఆర్.ఎక్స్ 100` రిలీజ్ తర్వాత.. సినిమా హిట్ అయిపోతుందని నేను ప్రిపేర్ కాలేదు. హిట్ తర్వాత ఎలా డిసిషన్స్ తీసుకోవాలో అర్థం కాలేదు. మనకు తెలిసిన మేర కొన్ని కథలను ఎంచుకుంటాం. బోయపాటిగారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి మల్లి అనే వ్యక్తి కథ చెబుతాడంటూ చెప్పారు. బోయపాటిగారి శిష్యుడంటున్నారు. పెద్ద స్కేల్‌లో ఉంటుదేమో మనకు సూట్ అవుతుందా? అనుకుంటూ కథ విన్నాను. ఆయన 20 నిమిషాల్లో కథను చెప్పాను. వెంటనే సినిమా చేస్తున్నామని చెప్పాను. సినిమా ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదు. ఎలాంటి లెక్కలూ వేసుకోలేదు. ఇప్పుడు స్క్రీన్‌పై చూసుకుంటూ ఉంటే, అద్భుతాలు లెక్కలేసుకుంటే జరగవు. అలా జరిగిపోతాయనిపించింది. నా నిర్ణయం ఎంత కరెక్టో అనుకున్నాను. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందో.. స్టార్ డమ్ తెస్తుందనో కాదు...నన్ను నేను తెరపై చూసుకున్న సినిమా కావడంతో నాకు ఇది స్పెషల్ మూవీగా భావించాను. నాతోటి వారందరూ గర్వంగా ఫీలవుతారు. నేను నచ్చని వారికి కూడా నచ్చేస్తాననే నమ్మకం ఉంది. నెరేషన్‌లో తెలియని మ్యాజిక్ కనిపించింది. ఆయనతో పనిచేస్తుంటే ప్రతి సెకనుకి 100 కోట్ల లాటరీ తగులుతున్నట్లు అనిపించింది. అంత కిక్ ఇచ్చింది. నా జీవితంలోకి వచ్చినందుకు అర్జున్‌కి థ్యాంక్స్. తను జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతారు. సినిమాటోగ్రాఫర్ రామిరెడ్డిగారుంటే .. సీన్‌లో మూడ్ క్రియేట్ చేయడానికి ఎంత కష్టపడతారో, ఆర్టిస్ట్‌ను అందంగా చూపించడానికి అంతే కష్టపడతారు. గుణ 369కు అద్భుతమైన సంగీతం ఇచ్చినందుకు థ్యాంక్స్. బ్యాగ్రౌండ్ స్కోర్ కుమ్మేశాడు. అనఘ అందమైన హీరోయినే కాదు.. చాలా తెలివైన అమ్మాయి. `గుణ 369` హిట్ కావాలని అర్జున్ కంటే బాగా కోరుకున్న వ్యక్తి బోయపాటిగారికి స్పెషల్ థ్యాంక్స్. మా సినిమాపై ఎంతో ప్రేమించారు. ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే నిర్మాతలను కూడా ఆయనే ఇచ్చారు. మా నిర్మాతలు.. డార్లింగ్ ప్రొడ్యూసర్స్. సినిమాలో అన్ని సవ్యంగా ఉన్నప్పుడు అసలు నిర్మాతలు గుర్తుకు రారు. ఏదైనా సమస్య వస్తేనే వారు గుర్తుకు వస్తారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్లే కనపడుతున్నారు. ఇంత మంచి సినిమా ప్రొడక్షన్‌లో నేను పార్ట్ కావాల్సిందనే జెలసీగా ఉంది. నెక్ట్స్ సినిమాను వారితో కలిసి చేయాలనుకుంటున్నాను. నటుడిగా ఎంత వరకు వెళతానో తెలియదు కానీ గుణ అనే పాత్ర పోషించినందుకు గర్వపడతాను. అదెందుకో సినిమా చూస్తే అర్థమవుతుంది. మహేశ్‌కి, నరేశ్‌గారికి, హేమగారికి సహా ఇతర నటీనటులకు, టెక్న
ీషియన్స్‌కు థ్యాంక్స్. గుణతో నేను ఫ్రెష్‌గా కనపడతాను`` అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved