pizza
Hippi pre release function
`హిప్పీ` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


1 June 2019
Hyderabad

`RX 100` ఫేమ్ కార్తికేయ హీరోగా న‌టించిన చిత్రం `హిప్పీ`. స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మాత‌గా, టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. వీ క్రియేషన్స్ పతాకం పై రూపొందుతోంది. జూన్ 6న సినిమా విడుద‌ల‌వుతుంది. శుక్ర‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా..

అనంత శ్రీరామ్ మాట్లాడుతూ ``వ‌య‌సు వ‌చ్చిన ఆడ‌, మ‌గ మ‌ధ్య ఒక వ‌య‌సు వ‌చ్చాక ఏది ప్రేమో, ఏది ఆక‌ర్ష‌ణో అనే వాద‌న‌లు జ‌రుగుతూ ఉంటాయి. వాటి గురించి ఇప్ప‌టిదాకా వ‌చ్చిన సినిమాలు ఏవీ పెద్ద‌గా చెప్ప‌లేదు. కానీ ఆ ప‌నిని సంపూర్ణంగా చేసింది మాత్రం హిప్పీ అని నేను చెప్ప‌గ‌ల‌ను. ప్రేమ‌ను ప్రేమ‌గా, ఆక‌ర్ష‌ణ‌ను ఆక‌ర్ష‌ణ‌గా, కామాన్ని కామంగా, మోజును మోజుగా విడ‌మ‌రిచి చెప్పారు. అన్నిటికీ మించి ఏదో అలౌకిక బంధం ఉంటే త‌ప్ప అది ప్రేమ కాద‌నే విష‌యాన్ని విడ‌మరిచి చెప్పింది ఈ సినిమా. హిప్పీ అంటే సంచార జీవి అని మ‌న‌కు తెలుసు. ఈ సినిమాలో క‌థానాయ‌కుడు సంచారం చేసేది లోకంలో కాదు. త‌న‌లోకి తానే ప్ర‌యాణం చేసి చివ‌ర‌కు ప్రేమ‌ను క‌నుగొంటాడు. ఈ సినిమాలో నాచేత అన్ని ర‌కాల పాట‌లు రాయించారు. నా మీద అన్ని కోణాల్లోనూ న‌మ్మ‌కం ఉంచినందుకు ధ‌న్య‌వాదాలు. `హిప్పీ` విజ‌యాన్ని మ‌న‌స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను`` అని అన్నారు.

తిరుమ‌ల రెడ్డి మాట్లాడుతూ ``పాట‌లు చాలా బావున్నాయి. సినిమా బాగా ఆడాలి. థానుగారికి ఆల్ ది బెస్ట్. మేం `గుణ 369`ను కార్తికేయ‌తో చేస్తున్నాం `` అని చెప్పారు.

హ‌రితేజ మాట్లాడుతూ ``ఈ సినిమాలో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది. మా ద‌ర్శ‌కుడికి చాలా థాంక్స్. జె.డిచ‌క్ర‌వ‌ర్తిగారితో క‌లిసి చేయ‌డం చాలా ఆనందంగా అనిపించింది. అమ్మాయిలాగా కార్తికేయ‌కూడా ఏదో ర‌కంగా చొక్కా విప్పుతూనే ఉన్నారు. ఈ సినిమా ఆర్.ఎక్స్. 100 కి రెండు, మూడు వంద‌ల రెట్లు పెద్ద హిట్ అవుతుంది`` అని చెప్పారు.

అజ‌య్ భూప‌తి మాట్లాడుతూ - ``కార్తికేయ హీరో కాదు.. న‌టుడు. త‌న‌లాంటి యాక్ట‌ర్ నా ఫ‌స్ట్ సినిమాకు దొర‌క‌డం నా అదృష్టం. హిప్పీ టీంకు ఆల్ ది బెస్ట్‌. ఆర్‌.ఎక్స్ 100 కంటే పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

జె.డి. చ‌క్ర‌వ‌ర్తి మాట్లాడుతూ ``విచిత్రంగా `ప్రొడ్యూస‌ర్‌` అనే ప‌దంలోనే `స‌ర్` అని ఉంటుంది. కంప్లీట్‌గా ఆ `స‌ర్‌` థానూ స‌ర్‌కి సూట్ అవుతుంది. థానుగారి మంచి పొయెట్‌. మంచి మ్యూజిక్ డైర‌క్ట‌ర్‌. ఆయ‌న చాలా మంచి సినిమాను తెర‌కెక్కించారు. ఆయ‌న ద‌ర్శ‌కుడిగా సాధ‌క‌బాధ‌కాలు తెలుసుకున్న త‌ర్వాత నిర్మాత‌గా మారారు. ఒక‌సారి ఆయ‌న నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి `నాకు తెలుగు బాగా అర్థ‌మ‌వుతుంది. కానీ ఇంకాస్త బాగా వ‌చ్చి ఉంటే బావుండేది` అని అన్నారు. `ఎందుక‌న్నా` అని అడిగా. వెంట‌నే ఆయ‌న `కృష్ణ నాకు చెప్పింది చెప్పిన‌ట్టు చేశాడు. అది నాకు బాగా అర్థ‌మైంది. కానీ నాతో పాటు సినిమా చూసిన కొంత‌మంది ప‌డీ ప‌డీ న‌వ్వుతున్నారు. అలా నేను కూడా న‌వ్వాలంటే తెలుగు ఇంకాస్త బాగా రావాలి. అందుకే నేర్చుకుంటా` అని అన్నారు. ఆయ‌న త‌ర్వాత కృష్ణ‌గారి గురించి చెప్పాలి. నా జీవితంలో రామ్‌గోపాల్ వ‌ర్మ అనే రాముడున్నాడు. ఆయ‌న కృష్ణ‌లీల‌ల‌కు ఫేమ‌స్‌. ఈ కృష్ణ‌గారు రామ త‌త్వానికి ఫేమ‌స్‌. నేను తొలిరోజు షూటింగ్ కి వెళ్లిన‌ప్పుడు నాకు తెలంగాణ శ్లాంగ్ చెప్పారు. ఫ‌స్ట్ షాట్ చేయ‌గానే న‌న్ను మెచ్చుకున్నారు. కెమెరా ముందు త‌ప్ప‌.. కార్తికేయ‌కు కెమెరా వెనుక యాక్టింగ్ చేయ‌డం రాదు. త‌న‌తో వ‌ర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

డైరెక్ట‌ర్ టి.ఎన్‌.కృష్ణ మాట్లాడుతూ - ``నేను హిప్పీ సినిమాను కార్తికేయ‌తో చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం త‌న క‌ళ్లే. ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండే త‌న క‌ళ్ల‌ను చూసే త‌న‌తో సినిమా చేయాల‌నుకున్నాను. క‌చ్చితంగా త‌ను రాకింగ్ హీరో అవుతాడు. కార్తి ప్లేబాయ్‌, ల‌వ‌ర్ బాయ్ కాదు.. స్పాంటేనియ‌స్ బాయ్‌. హిప్పీ క్యారెక్ట‌ర్ గురించి చెప్పాలంటే ఇదే. జెడిగారు చాలా ఇంట్ర‌స్టింగ్ క్యారెక్ట‌ర్ చేశారు. ఆయ‌న‌తో పనిచేయ‌డం ఆనందంగా ఉంది. ఫైట్స‌, డ్యాన్సులు అన్నీ వ‌చ్చిన హీరో. డైరెక్ట‌ర్ ఏం చెబితే చేసేవాడు. త‌ను బ‌ర్న్ ఆర్టిస్ట్‌. దివ్యంగ‌న నేచుల్ యాక్ట‌ర్‌. క్ర‌మశిక్ష‌ణ‌, అంకిత భ‌వం ఉన్న హీరయ‌న్‌. త‌మిళంలో అప్‌క‌మింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయిన న‌వాస్‌, సోల్ ఉన్న మ్యూజిక్‌ను అందించారు. చాలా కొద్ది మందికి మాత్ర‌మే ఈ క్వాలిటీ ఉంటుంది. ప్ర‌వీణ్‌గారు ఎడిట‌ర్‌గా, ఆర్‌.డి.రాజ‌శేర్‌గారు అద్భుత‌మైన విజువ‌ల్స్ అందించారు. థానుగారు లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు. క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌నే న‌మ్మారు. త‌ప్ప‌కుండా సినిమా 100 శాతం పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ - ``జూలై 12, 2018.. నేను మ‌ళ్లీ పుట్టిన‌రోజు. నాకు పున‌ర్జ‌న్మ ద‌క్కిన‌రోజు. ఆరోజు `ఆర్‌.ఎక్స్ 100` విడుద‌లైంది. ఈ సినిమా లేక‌పోతే నేను లేను. కాబ‌ట్టి ఎన్ని సినిమాలు చేసినా నా తొలి సినిమా గురించి త‌ప్ప‌కుండా మాట్లాడుతాను. నేను పుట్టి 11 నెల‌లు అయ్యింది. నా పుట్టుక‌ను అంద‌రూ సెల‌బ్రేట్ చేసుకున్నారు. త‌ర్వాత వ‌దిలేయ‌కుండా జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్నారు. నన్ను మోటివేట్ చేస్తూ, భ‌రోసా ఇచ్చారు. అంద‌రి ఆశీర్వాదాల‌తో ఓ చిన్న‌బాబులా `హిప్పీ`తో తొలి అడుగు వేయ‌బోతున్నాను. ప్ర‌తి త‌ల్లిదండ్రుల‌కు వాళ్ల క‌న్న‌బిడ్డ‌లు ఎంత‌గానో సంతోష‌ప‌డ‌తారు. ఏదో సాధిస్తార‌ని గ‌ట్టిగా న‌మ్ముతారు. ఇంత ప్రేమ‌ను చూపిస్తున్న మీకు .. హిప్పీ సినిమాతో నా కొడుకు అవుతున్నాడ్రా అనిపిస్తాను. ఫ‌స్ట్ స్టెప్‌తో ఆ కాన్ఫిడెన్స్ వ‌చ్చేసింది. హీరో అయితే చాలు. నా సినిమాను కొంత మంది చూస్తే చాలు అనుకునేవాడిని. హీరో కావాల‌ని చిన్న‌ప్ప‌ట్నుంచి క‌ల‌లు క‌న్నాను. అస‌లు హీరోలు ఎలా ఉంటార‌బ్బా? వారికి బాత్ రూమ్‌లు వ‌స్తాయా? అనిపించేది. కానీ స‌డెన్‌గా న‌న్ను హీరో అంటుంటే మామూలు మ‌నిషినే. నేను ఇంత క‌ష్ట‌ప‌డితే ఎంతో ఇచ్చారు. మీ ప్రేమ‌ను చూశాను. అందుక‌నే ఇక‌పై ముందుకే వెళ‌తాను. కానీ వెన‌క్కి వెళ్ల‌లేను. అలా వెళ్ల‌కూడ‌ద‌నే `హిప్పీ ` సినిమా సెల‌క్ట్ చేసుకున్నాను. ఒళ్లు ద‌గ్గర పెట్టుని ప‌నిచేస్తాను. మీ ప్రేమ త‌ర్వాతే ఏదైనా. దాని ముందు ఎంతైనా క‌ష్ట‌ప‌డొచ్చు. మీ ప్రేమ‌ను వ‌దులుకోలేను. హిప్పీతో స‌క్సెస్ కొడుతున్నాం. హిప్పీ సినిమా విష‌యంలో నేను ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండ‌టానికి కార‌ణం డైరెక్ట‌ర్ కృష్ణ‌గారే. నాలో ఏం న‌చ్చిందో నాకు తెలియ‌దు. కృష్ణ‌గారు నాలో ఏం చూశారో నాకు తెలియ‌దు. నాతో ఫైట్స్ చేయించాడు, డ్యాన్సుల చేయించాడు. ఆర్‌.ఎక్స్ 100 త‌ర్వాత నేను ల‌వ్ ఫెయిల్యూర్‌కి నేను బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిపోయాను. ప్ర‌తి దానికి నేను సింబ‌ల్ అయిపోయాను. కానీ నేను మీరు కోరుకునే స్థాయికి వెళ్లాలంటే డిఫ‌రెంట్ సినిమాలు చేయాలి. ఆర్‌.ఎక్స్ 100లో అమ్మాయి వ‌దిలేసిందని ఏడ్చిన నేను.. ఇక్క‌డ ఇద్ద‌ర‌మ్మాయిల‌తో తిరుగుతూ ఫిలాస‌ఫీ చెబుతున్నాను. ప్ర‌తి అబ్బాయి అమ్మాయితో ఉన్న‌ప్పుడే మ‌రో అమ్మాయిని చూడాల‌నుకుంటాడు. ప్ర‌తి ఒక్కరిలోనూ ఈ ఎమోష‌న్ ఉంటుంది. ప్ర‌తి సీన్‌లో మీరు, మీ స్నేహితులు క‌న‌ప‌డ‌తారు. ఫ‌స్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వ‌ర‌కు ఎంజాయ్ చేస్తారు. టి.ఎన్‌.కృష్ణ‌గారు త‌మిళ డైరెక్ట‌ర్ కాదు.. ప‌క్కా మాస్ తెలుగు డైరెక్ట‌ర్‌. టి.ఎన్‌.కృష్ణ‌గారు నాకు స్టోరి నెరేట్ చేసిన త‌ర్వాత క‌లైపులిథానుగారు ఫోన్ చేశారు. ఆయ‌న ఫోన్ చేశారంటే ముందు నేను న‌మ్మ‌లేదు. అంత ప్రొడ్యూస‌ర్ నాకెందుకు ఫోన్ చేస్తార‌నుకున్నాను. `స్క్రిప్ట్ న‌చ్చింది చెన్నై రండి` అని థానుగారు అన్నారు. చెన్నైకు వెళ్లాను. ఆయ‌న అడ్వాన్స్ చెక్ ఇచ్చారు. ర‌జ‌నీకాంత్ వంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసిన పెద్ద నిర్మాత నాతో సినిమా చేయ‌డం.. అందులోనూ అడ్వాన్స్ చెక్ ఇవ్వ‌డంతో షాక్‌లోనే ఉండిపోయాను. జె.డి.చ‌క్ర‌వ‌ర్తిగారి ఎన‌ర్జీ లెవ‌ల్స్ సూప‌ర్బ్‌. ఆయ‌న సినిమా చేయ‌డం పెద్ద రిలీఫ్‌. సినిమాలో జె.డిగారి గురించే మాట్లాడుకుంటారు. మా యాట క‌త్తి దివ్యాన్ష గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌ను గిఫ్టెడ్ ప‌ర్స‌న్‌. ఇంత మంచి టాలెంట్ ఉన్న న‌టితో చేయ‌డం ఆనందంగా ఉంది. మా ముగ్గురి మ‌ధ్య సీన్స్‌ను ఎంజాయ్ చేస్తారు. నివాస్‌గారు పిల్లారాను మించిన సాంగ్స్ ఇచ్చారు. థానుగారు తెలుగు సినిమా మీద ప్రేమ‌తో, నామీద ఇష్టంతో తెలుగులో ఆయ‌న నిర్మించిన చిత్ర‌మిది. ప్యూర్ తెలుగు సినిమా. జూన్ 6న గ‌ట్టిగా కొడుతున్నాం. నేను ఒక్క‌డినే కాదు.. మీరు కూడా ష‌ర్ట్ తిప్పి ఎగ‌రేస్తారు. జూన్ 6న అంద‌రం హిప్పీలుగా మారుతాం. సినిమా చూసిన త‌ర్వాత మీకు సినిమా న‌చ్చితే ష‌ర్ట్ తిప్పి వైకి ఎగ‌రేసి పిక్ తీయండి. దాన్ని ట్రెండ్ చేద్దాం`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved