pizza
Inttelligent pre release function
`ఇంటిలిజెంట్‌` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

4 February 2018
Hyderabad

"I Wish Teju To Become A Big Star Like Annayya Chiranjeevi, Pawan Kalyan" - Sensational Director V.V.Vinayak

Supreme Hero Sai Dharam Tej's next is 'Inttelligent' in Sensational Director VV Vinayak's Direction, Produced by C.Kalyan under his 'C.K. Entertainments Pvt Ltd' banner. Lavanya Tripathi is heroine. 'Inttelligent' has been made as an full length entertainer based on some real incidents. Film has completed all formalities and is getting ready to hit the screens worldwide on February 9th. A pre-release event was held at Rajahmundry in a grand manner on Feb 4th (Sunday). Speaking on this occasion,

Supreme Hero Sai Dharam Tej says, " After 'Attaku Yamudu Ammayiki Mogudu' 100 days function, today 'Inttelligent' function has been going on in a grand manner at the same place. We wish audiences blessings are there for us. V.V.Vinayak is my favourite director. Whenever I see him I feel like he is a part of my family. He gave me this opportunity to do a very good film like 'Inttelligent'. He is a very big Director. I wish him to score many more Hits in future. I thank him for doing a film with me who has directed the comeback film of Chiranjeevi Garu. I am very happy working with him. This will be a memorable film for Audiences and for Mega Fans. Thanks to C.Kalyan Garu who always keeps artist in a comfort zone and never compromise at quality and grandeur of the film. We released the remix of 'Chamaku Chamaku ' song by Illayaraja and Seetharama Sastry Garu. We are confident that we made a very good film. My friend Thaman gave superb music. Jaani, Sekhar made me dance for fantastic moves. I will continue working hard to meet the standards set by Chiranjeevi Garu who laid path for us. Megastar, Power Star, Mega Power Star, Stylish Star, Varun Tej are like 'The Five Elements' for me. Varun's film 'Tholi Prema' is also releasing on February 10th. Varun's film will definitely become a super hit too. It will give super kick that two mega heroes score superhits at the box-office on the same day. Megastar Chiranjeevi Garu, PowerStar Pawan Kalyan Garu, Natural Actor Nagababu Garu are like Guru's for me. Without them I wouldn't have made to this stage today."

Sensational Director V.V.Vinayak says," Thanks to Mega Family Fans. I request Pawan Kalyan Garu not to stop doing films. How big he may grow as politician and fight for people's problems, I request him to continue films too. 'Inttelligent' film has come out very well. It will definitely become a big hit. Everyone will enjoy watching this film. Thanks to Akula Shiva for providing good story, Cinematographer Visweswar, Editor Goutham Raju Garu, Thaman, Lyricists. Teju resembles Chiranjeevi Garu while doing 'Chamak Chamak' song. I intentionally shot 2,3 scenes with Teju resembling Pawan Kalyan. Teju's style has a combination of Megastar and PowerStar. Like everyone on Mega Family, Teju too has the quality of hard working nature. Like Chiranjeevi Garu Teju too mingles with everyone on the set. I wish Teju to become a big star like Annayya Chiranjeevi Garu, Pawan Kalyan Garu. My brother C.Kalyan preserved me like a glass toy. He took very good care for me. It's because of Producers only we were able to complete the film in such a short time. I will be with 'C.K.Entertainments' till they complete producing their 100th film. C.Kalyan is one among those who believed in me since I was working as an assistant director. He will produce 100 films like Ramanaidu Garu. I will be a part of his journey. I wish Varun Tej's 'Tholiprema', Mohan Babu gari 'Gayatri' which are releasing along with our 'Inttlligent' to become super hits too."

C.K.Entertainments Founder C.Kalyan says," We all know how big hit is 'Chamak Chamak' song, written by Seetharama Sastry, composed by Illayaraja for Trivikram Rao gari production Megastar's 'Kondaveeti Donga'. We remixed the song for our 'Inttelligent'. This song will be a feast for fans. Megastar Chiranjeevi, PowerStar Pawan Kalyan, Naga Babu wished Supreme Star Sai Dharam Tej to become another Megastar. This film will.be completely different from the films Sai Dharam Tej did so far. My Brother Vinayak made this film in an extra ordinary manner. Whenever I watch the songs, It is like watching Chiranjeevi gari songs. While February 9th is one festival, February 10th will become another festival with the release of Varun Tej's 'Tholi Prema'. Teju worked sincerely for this film. I thank Vinayak Garu for giving us such a good film. This film will create new records on February 9th. I saw that aura a Director carries around him in Vinayak only after our Guruvu Garu Dasari Garu. He always greets with a smile on his face even with a lot of tensions inside. Our combination will repeat in future. All The Best To entire unit."

Parliament Member Murali Mohan says, "
Not only pre release event, I wish Success Meet of 'Intillegent' will also be held at Rajahmundry. Sai Dharam Tej did superb dances. 35 years ago, Me and Megastar Chiranjeevi Garu acted as brothers for 'Manavoori Pandavulu'. Now Sai Dharam Tej made me remember then Chiranjeevi. I congratulate Vinayak Garu who is scoring many hits. C.Kalyan who grew up from small stage to a big producer is doing great now. In four years I wish he will the number of films produced by Ramanaidu Garu."

Lavanya Tripathi says, " I am very happy working with C.K.Entertainments banner. Kalyan Garu, Vinayak Garu treated me very well. Sai Dharam Tej did superb act. Thanks to all co-artists and technicians."

`ఇంటిలిజెంట్‌` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లి. అధినేత సి.కళ్యాణ్‌ నిర్మించిన చిత్రం 'ఇంటిలిజెంట్‌'. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్‌ అవుతుంది. ఈ సంద‌ర్భంగా రాజ‌మండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో...

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ - ```అత్త‌కి య‌ముడు అమ్మాయికి మొగుడు` సినిమా వంద రోజుల ఫంక్ష‌న్ త‌ర్వాత ఆ రేంజ్‌లో గ్రాండ్‌గా జరుగుతున్న ఫంక్ష‌న్ `ఇంటిలిజెంట్‌`. ప్రేక్ష‌కులు ఆశీర్వాదం మాకు ఉంటుంద‌ని భావిస్తున్నాం. వి.వి.వినాయ‌క్‌గారు నాకు ఎంతో ఇష్ట‌మైన డైరెక్ట‌ర్‌. ఆయన్ని చూడ‌గానే హోమ్లీ డైరెక్ట‌ర్ అనే ఫీలింగ్ క‌లుగుతుంది. ఇంత మంచి సినిమా చేసే అవ‌కాశాన్ని ఆయ‌న నాకు ఇచ్చారు. ఆయ‌న చాలా పెద్ద డైరెక్ట‌ర్. ఇంకా ఎన్నో హైట్స్ ఆయ‌న చేరుకోవాల‌ని కోరుకుంటున్నాను. చిరంజీవిగారి క‌మ్‌బ్యాక్ ఫిలింను డైరెక్ట్ చేసిన ఆయ‌న నాతో సినిమా చేసినందుకు ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు. ఆయ‌న‌తో ప‌ని చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ప్రేక్ష‌కుల‌కు, మెగాభిమానుల‌కు ఈ సినిమా గుర్తుండి పోయే సినిమా అవుతుంది. ఒక ఆర్టిస్ట్‌కు కంఫ‌ర్ట్ జోన్‌ను క్రియేట్ చేసి..సినిమాను గ్రాండ్‌గా తెర‌కెక్కించ‌డానికి వెనుకాడ‌ని సి.క‌ల్యాణ్‌గారికి థాంక్స్‌. చ‌మ‌కు చ‌మ‌కు సాంగ్‌ను ఇళ‌య‌రాజా, సీతారామ‌శాస్త్రి చేతుల మీదుగా విడుద‌ల చేశాం. మంచి సినిమా తీశామ‌ని న‌మ్మ‌కంతో ముందుకెళ్తున్నాం. నా స్నేహితుడు త‌మ‌న్ ఎంతో మంచి మ్యూజిక్ ఇచ్చాడు. జానీ, శేఖ‌ర్‌లు నాతో డ్యాన్స్‌ను కుమ్మించేశారు. చిరంజీవిగారు స్థాపించిన ఈ సామ్రాజ్యంలో జెండా రెప‌రెప‌ల‌నే నా గుండె చ‌ప్పుడులుగా భావించి క‌ష్ట‌ప‌డుతుంటాను. ఎప్ప‌టికీ ఇలాగే క‌ష్ట‌ప‌డుతుంటాను. నాకు మెగాస్టార్‌, ప‌వ‌ర్‌స్టార్‌, మెగాప‌వ‌ర్‌స్టార్‌, స్టైలిష్ స్టార్‌, వ‌రుణ్ ఇలా అంద‌రూ నాకు పంచ‌భూతాలు. మా బావ‌... బామర్ధి ఎప్పుడూ బావ మంచినే కోరుకుంటాడు. కాబ‌ట్టి.. వ‌రుణ్ సినిమా కూడా డెఫ‌నెట్‌గా హిట్ అవుతుంది. ఫిబ్ర‌వ‌రి 10న తొలిప్రేమ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఒకేరోజు ఇద్ద‌రు మెగా హీరోలు బాక్సాఫీస్ వ‌ద్ద‌కు వ‌చ్చి హిట్ కొడితే ఆ కిక్కే వేరు. ఆ రికార్డ్ మ‌నం మిస్స‌య్యాం. మెగాస్టార్ చిరంజీవిగారు, ప‌వ‌ర్‌స్టార్‌ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారు, స‌హ‌జ న‌టుడు నాగ‌బాబుగారు నాకు గురువులు. వారు లేకుండా ఈ స్టేజ్‌పై నేను లేను`` అన్నారు.

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ - ``మెగాఫ్యామిలీ అభిమానులకు థాంక్స్‌. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారికి ఓ రిక్వెస్ట్‌. ఆయ‌న సినిమాలు చేయ‌న‌ని అన్నారు. కానీ ఆయ‌న రాజ‌కీయంగా ఎంత ఎదిగినా, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఎంత పోరాడినా.. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా సినిమాలు చేయండి. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. సినిమాను చూసిన వారంద‌రూ సంతోషిస్తారు. మంచి క‌థ‌ను అందించిన ఆకుల శివ‌, సినిమాట‌గ్రాఫ‌ర్ విశ్వేశ్వ‌ర్‌, ఎడిట‌ర్ గౌతంరాజుగారు, గీతం అందించిన త‌మ‌న్‌, సాహిత్యం అందించిన ర‌చ‌యిత‌లు స‌హా అంద‌రికీ థాంక్స్‌. తేజుతో చ‌మ‌కు చ‌మ‌కు సాంగ్ చేసేట‌ప్పుడు నాకు చిరంజీవిగారే గుర్తుకు వ‌చ్చారు. అలాగే రెండు మూడు స‌న్నివేశాలు ప‌వ‌న్ క‌ల్యాణ్‌లా తేజు క‌న‌ప‌డేలా షూట్ చేశాను. ఎందుకంటే చిరంజీవిగారు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారు క‌లిస్తే ఎలా ఉంటుందో అలా తేజు స్టైల్ ఉంటుంది. మెగా ఫ్యామిలీలో క‌ష్ట‌ప‌డేత‌త్వం ఎలా ఉందో.. తేజులో ఆ త‌త్వం క‌న‌ప‌డుతుంది. చిరంజీవిగారిలా తేజు అంద‌రినీ కలుపుకు పోతుంటాడు. కాబ‌ట్టి తేజు కూడా అన్న‌యంత, ప‌వ‌న్‌కల్యాణ్‌గారంత‌ పెద్ద స్టార్ కావాల‌ని కోరుకుంటున్నాను. మా అన్న‌య్య క‌ల్యాణ్ న‌న్ను గాజు బొమ్మ‌లా చూసుకున్నారు. నన్నెంతో బాగా కేర్ తీసుకున్నారు. ఈ సినిమా ఇంత త్వ‌ర‌గా పూర్తి కావ‌డానికి నిర్మాత‌లే కార‌ణం. సి.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ వంద సినిమాలు పూర్త‌య్యే వర‌కు నా జ‌ర్నీ వారితో ఉంటుంది. నేను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఉన్న‌ప్ప‌ట్నుంచి పెద్ద డైరెక్ట‌ర్‌ని అవుతాన‌ని న‌మ్మిన‌వారిలో సి.క‌ల్యాణ్ అన్న‌య్య ఒక‌రు. ఆయ‌న రామానాయుడిగారిలా వంద సినిమాలు తీస్తారు. ఆ జ‌ర్నీలో నేను కూడా ఉంటాను. మాతో పాటు విడుద‌ల‌వుతున్న‌తొలిప్రేమ‌, మోహ‌న్‌బాబుగారి గాయ‌త్రి సినిమాలు పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ - ``త్రివిక్ర‌మ‌రావుగారి నిర్మాణంలో ఇళ‌య‌రాజాసంగీతంలో సీతారామ‌శాస్త్రి ర‌చించిన చ‌మ‌కు చ‌మ‌కు సాంగ్ ఎంత పెద్ద హిట్టో మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు ఇంటిలిజెంట్ సినిమాలో మేం రీమేక్ చేశాం. ఈ చ‌మ‌కు చ‌మ‌కు సాంగ్ ఫ్యాన్స్‌కు పండ‌గే అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, నాగ‌బాబు మావ‌య్యుల కలిసి మ‌రో మెగాస్టార్ కావాల‌నుకున్న‌ది ఈ సుప్రీమ్ స్టార్ సాయిధ‌ర‌మ్‌తేజ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు సాయిధ‌ర‌మ్ తేజ్ చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. డెఫ‌నెట్‌గా ఈ సినిమా వేరు. మా సోద‌రుడు వినాయ‌క్ సినిమాను ఇర‌గ‌దీయించారు. పాట‌లు చూస్తుంటే చిరంజీవిగారి సాంగ్స్ చూస్తున్న‌ట్లుంటుంది. ఫిబ్ర‌వ‌రి 9న ఓ పండుగ ఉంటే, ఫిబ్ర‌వ‌రి 10న వ‌రుణ్ న‌టించిన తొలిప్రేమ మ‌రో పండుగ అవుతుంది. తేజు ఎంతో సిన్సియ‌ర్‌గా ఈ సినిమా కోసం ప‌నిచేశాడు. మా యూనిట్‌కు ఇంత మంచి సినిమా ఇచ్చిన వినాయ‌క్‌గారికి థాంక్స్‌. ఫిబ్ర‌వ‌రి 9న ఈసినిమా చరిత్ర తిర‌గ‌రాస్తుంది. ఓ ద‌ర్శ‌కుడు కారు దిగగానే ..సింహం,పులి, ఎనుగులాగంభీరంగా అనిపించే వారిలో మా గురువుగారు దాస‌రిగారుంటే.. త‌ర్వాత అలా అనిపించే ద‌ర్శ‌కుడు వినాయ‌క్ మాత్ర‌మే. లోప‌ల ఎంత టెన్ష‌న్ ఉన్నా బ‌య‌ట‌కు న‌వ్వుతూ ప‌ల‌క‌రిస్తుంటాడు. మా కాంబినేష‌న్‌లో ఫ్యూచ‌ర్‌లో ఇంకా రిపీట‌వుతుంది. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

పార్ల‌మెంట్ స‌భ్యులు ముర‌ళీమోహ‌న్ మాట్లాడుతూ - ``ప్రీ రిలీజ్ వేడుక‌నే కాదు, స‌క్సెస్ మీట్‌ను కూడా రాజమండ్రిలోనే జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను. సాయిధ‌ర‌మ్ తేజ్ డాన్సుల‌ను అద్భుతంగా చేశాడు.35 ఏళ్ల క్రితం నేను, చిరంజీవిగారు క‌లిసి `మ‌న వూరి పాండ‌వులు` సినిమాలో న‌టించాం. ఇప్పుడు సాయిధ‌ర‌మ్‌ను చూస్తుంటే చిరంజీవిగారే గుర్తుకు వ‌స్తున్నారు. మామకు త‌గ్గ అల్లుడుగా సాయిధ‌ర‌మ్ నిరూపించుకుంటున్నాడు. రేపు మామ‌ను మించిన అల్లుడు కావాల‌ని కోరుకుంటున్నాను. ఎన్నో హిట్స్ మీద హిట్స్ తీస్తున్న వినాయ‌క్‌గారికి అభినంద‌న‌లు. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదిగిన క‌ల్యాణ్ ఇప్పుడు పెద్ద నిర్మాత‌గా రాణిస్తున్నారు. మ‌రో నాలుగేళ్ల‌లో రామానాయుడుగారిని మించి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను`` అని తెలిపారు.

లావ‌ణ్య త్రిపాఠి మాట్లాడుతూ - ``సి.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌లో ప‌నిచేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. క‌ల్యాణ్‌గారు, వినాయ‌క్‌గారు చాలా బాగా ట్రీట్‌చేశారు. సాయిధ‌ర‌మ్ తేజ్ సూప‌ర్బ్‌గా యాక్ట్‌చేశాడు. సినిమాలో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌`` అన్నారు.


 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved