pizza
Ishq Pre Release function
`ఇష్క్` ట్రైల‌ర్ చాలా బాగుంది... డెఫినెట్‌గా సినిమా మీ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నాను - ద‌ర్శ‌కుడు శ్రీ రామ్ వేణు.
You are at idlebrain.com > News > Functions
Follow Us


17 April -2021
Hyderabad



యంగ్ హీరో తేజ స‌జ్జ‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోహీరోయిన్లుగా య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తూ దక్షినాదిలోని సుప్ర‌సిద్ద నిర్మాణ ‌సంస్థ‌ల్లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న చిత్రం `ఇష్క్‌`. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌23న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ పార్క్‌హ‌యాత్ హోట‌ల్‌లో `ఇష్క్` గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించింది చిత్ర యూనిట్‌. ఈ కార్య‌క్ర‌మంలో ఇష్క్ మూవీ బిగ్ టికెట్‌ని వేణు శ్రీ‌రామ్‌, నారా రోహిత్‌, సందీప్ కిష‌న్‌, నందినీ రెడ్డి, శ్రీ విష్ణు, ప్ర‌శాంత్ వ‌ర్మ సంయుక్తంగా ఆవిష్క‌రించారు.

ద‌ర్శ‌కురాలు నందనీ రెడ్డి మాట్లాడుతూ - ``ముందుగా టీమ్ అంద‌రికీ కంగ్రాచ్యులేష‌న్స్‌. సూప‌ర్ గుడ్ ఫిలింస్ ఆర్ బి చౌద‌రి గారు అన‌గానే ఆటోమేటిక్‌గా సినిమా వాళ్లంద‌రికీ ‌పండ‌గ వాతావ‌ర‌ణం ఉంటుంది. సౌత్ ఇండియాలో వ‌న్ ఆఫ్ ది మోస్ట్ స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్‌. ఈ బ్యాన‌ర్‌లో వ‌ర్క్ చేయ‌డం తేజ‌కి నిజంగా ప్రౌడ్ మూమెంట్‌. సాగ‌ర్‌కి ఈ సినిమా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. ప్రియా చాలా అందంగా ఉంది. ఈ సినిమాతో మ‌రిన్న అవకాశాలు వ‌స్తాయ‌ని ఆశిస్తున్నాను. తేజ‌లో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే ఎంత సేపు మాట్లాడిన సినిమా గురించే మాట్లాడుతాడు. వెరీ డెడికేటెట్ ఫెలో. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్‌. ప్ర‌తి సినిమాని చాలా జాగ్ర‌త్త‌గా సెల‌క్ట్ చేస్తున్నాడు. తేజ‌కు ఇది హ్యాట్రిక్ మూవీ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ వాకాడ అప్పారావు మాట్లాడుతూ - ``ఆర్ బి చౌద‌రి గారి ఆధ్వ‌‌ర్యంలో సూపర్‌గుడ్‌ ఫిలింస్, మెగా సూపర్‌గుడ్ బేన‌ర్‌లో తెలుగులో 35-40 ఫిలింస్ తీశాం. అన్ని భాష‌ల‌లో కలిపి 94సినిమాలు నిర్మించారు. ఎంతో మంది హీరోల‌ని ,టెక్నీషియ‌న్స్‌ని ప‌రిచ‌యం చేశారు. దాదాపు 30 సంవ‌త్స‌రాల నుండి ఈ బేన‌ర్‌తో అసోసియేట్ అయినందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను. హీరో హీరోయిన్లు తేజ‌, ప్రియా చాలా క‌ష్ట‌ప‌డి సినిమా చేశారు. యూత్‌కి న‌చ్చే సినిమా. త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు.

మెగా సూప‌ర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్ బి చౌద‌రి మాట్లాడుతూ - ``ఇది బా బేన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న 94వ చిత్రం. మా బేన‌ర్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులుని, టెక్నీషియ‌న్స్‌ని ప‌రిచ‌యం చేశాం. ఇప్పుడు మ‌రో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తున్నాం. అలాగే యంగ్ టాలెంట్ తేజ స‌జ్జ‌, ప్రియా ప్ర‌కాశ్ కి ఆల్ ది బెస్ట్‌. అలాగే సంగీత ద‌ర్శ‌కుడు మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్, సినిమాటోగ్రాఫ‌ర్‌ శ్యామ్ కె. నాయుడు, ఎడిట‌ర్ వ‌ర‌ప్ర‌సాద్ స‌హా ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్‌. ఇష్క్ సినిమా ఏప్రిల్ 23న థియేట‌ర్‌ల‌లో రిలీజ‌వుతుంది. 23 త‌ర్వాత ఈ మూవీ స‌క్సెస్ మీట్‌లో మ‌ళ్లీ క‌లుద్దాం`` అన్నారు.

నిర్మాత ఎన్వీ ప్ర‌సాద్ మాట్లాడుతూ - ``మెగా సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్‌లో `సుస్వాగ‌తం` లాంటి యూత్ కి సంభందించిన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఖ‌చ్చితంగా మిమ్మ‌ల్నంద‌రినీ అల‌రిస్తుంది. తేజ జూనియ‌ర్ ఆర్టిస్టుగా మ‌న‌కు ఎప్ప‌టినుంచో ప‌రిచ‌యం, అయితే ఓబేబి, జాంబీరెడ్డి వంటి స్క్రిప్ట్‌ల‌ను ఎంచుకుంటున్నాడు. ఈ సినిమాలో కూడా ఒక సీనియ‌ర్ యాక్ట‌ర్‌లాగా మంచి పెర్‌ఫామెన్స్ చేశాడు. ప్ర‌స్తుతం యువ హీరోలు ప్ర‌మోష‌న్స్ అనేవి ఒక బాధ్య‌‌తాయుతంగా భావించి వాటిలో భాగం అవ‌డం చాలా హ్యాపీ.. ప్ర‌స్తుతం సినిమాల‌కు అది అవ‌స‌రం. తేజ న‌న్ను కలిసిన ప్ర‌తిసారి సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాలో దాని గురించే మాట్లాడాడు. ఒక మంచి సినిమాని మీరంద‌రూ ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్, చౌద‌రి గారి ఆద్వ‌ర్యంలో మా బేన‌ర్‌లో మ‌రిన్ని మంచి సినిమాలు ప్రేక్ష‌కుల‌కు అందిస్తాం`` అన్నారు.

‌చిత్ర దర్శకుడు య‌స్‌.య‌స్‌. రాజు మాట్లాడుతూ - ``నేను డైరెక్ట‌ర్ అవ‌డానికి కారణం అయిన మా గురువు గారు స‌మీర్ రెడ్డి గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. అలాగే నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజ‌న్ కుమార్, జైన్ గారు, వాకాడా అప్పారావు గారికి థ్యాంక్స్‌. ఈ సినిమాను 29 డేస్‌లో ఇంత క్వాలిటీగా చేయడానికి కారణం శ్యామ్‌కేనాయుడు గారు. తేజ‌, ప్రియా, రవీందర్ ఇలా అందరు బాగా చేశారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. నా టీమ్‌లో నాకు స‌హ‌క‌రించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ అవ‌కాశం ఇచ్చిన మెగా సూప‌ర్‌గుడ్ ఫిలింస్ వారికి నా జీవితాంతం రున‌ప‌డి ఉంటాను. టీమ్ అంద‌రికీ థ్యాంక్స్‌`` అన్నారు.

హీరో నారా రోహిత్ మాట్లాడుతూ - ``ట్రైల‌ర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. తేజ నాకు దాదాపు ఐదు సంవ‌త్స‌రాల‌నుండి బాగా ప‌రిచ‌యం. సినిమాలంటే చాలా ప్యాష‌న్‌. ఈ సినిమా జాంబీరెడ్డిలాగా మంచి హిట్ అవ్వాల‌ని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే టీమ్ అంద‌రికీ మంచి పేరు రావాల‌ని కోరుకుంటూ అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ - ``సూప‌ర్ గుడ్ ఫిలింస్ తో చిన్న‌ప్ప‌టినుండి మంచి అనుభందం ఉంది. మంచి మ్యూజిక్‌తో ఫ్యామిలీకి న‌చ్చే సినిమాలు తీశారు. ఈ మ‌ధ్య వ‌చ్చిన హీరోల‌లో తేజ నాకు చాలా ఇష్టం. తేజ వ‌రుస స‌క్సెస్‌లు సాధిస్తున్నాడు. ఈ సినిమా కూడా పెద్ద స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

హీరో సందీప్ కిష‌న్ మాట్లాడుతూ - ``తేజ కూడా నాలాగే ఎప్పుడూ సినిమాల విష‌యంలో, రిలీజ్‌ల విష‌యంలో చాలా టెన్ష‌న్ ప‌డుతుంటాడు. ప్ర‌తి సినిమాకి చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. శ్యామ్ గారు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌. ప్రియ నైస్ కోస్టార్‌. పాజిటివ్ ప‌ర్స‌న్‌. చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తుంది. మెగా సూప‌ర్‌గుడ్ ఫిలింస్ వారు ఇప్ప‌టికే 94 సినిమాలు చేశారు. అది గొప్ప విష‌యం. ఎన్వీ ప్ర‌సాద్ గారు చాలా ఏళ్లుగా సినిమా ప‌రిశ్ర‌మ‌కి సేవ‌లందిస్తున్నారు. ఆయ‌న‌కి ఈ సంద‌ర్భంగా ద‌న్య‌వాదాలు. ఇష్క్ సినిమా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటూ టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్` అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ మాట్లాడుతూ - ``తేజ‌కి ఓబేబి, జాంబీరెడ్డి ఎంత‌పెద్ద హిట్ అయ్యిందో ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. జాంబీరెడ్డి టైమ్‌లో తేజకు చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. మెగా సూప‌ర్‌గుడ్ ఫిలింస్ అన్నీ మంచి సినిమాలే తీశారు. వారి ఆద్వ‌ర్యంలో వ‌స్తోన్న ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి టీమ్ అంద‌రికీ మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

హీరోయిన్ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ మాట్లాడుతూ - ``ఇది తెలుగులో నా సెకండ్ మూవీ. న‌న్ను న‌మ్మి ఈ అవ‌కాశం ఇచ్చిన ఆర్‌బీ చౌదరి స‌ర్‌, ఎన్వీ ప్రసాద్ గారికి, అప్పారావు గారికి, జైన్‌గారికి థ్యాంక్స్‌. తేజ ఫ‌న్ కోస్టార్‌, షూటింగ్ అమేజింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌. అంద‌రూ ఏప్రిల్ 23న థియేట‌ర్‌ల‌లో సినిమా చూడండి`` అన్నారు.

ద‌ర్శ‌కుడు శ్రీ రామ్ వేణు మాట్లాడుతూ - ``ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ గారి సెకండ్ ఫిలిం `సుస్వాగ‌తం` ద‌గ్గ‌ర నుండి ఈ మెగా సూప‌ర్‌గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్ పరిచ‌యం. అప్ప‌టి ఎంతో మంచి టాలెంటెడ్ పీపుల్‌ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు. ఈ సినిమాతో మ‌రో కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తున్నందుకు వారికి థ్యాంక్స్‌. ఎన్వీ ప్ర‌సాద్‌గారితో మంచి అనుభందం ఉంది. తేజ కోవిడ్ త‌ర్వాత జాంబీరెడ్డితో ప్రేక్ష‌కుల‌కి థియేట‌ర్స్‌ని తిరిగి ప‌రిచ‌యం చేశాడు. భ‌విష్య‌త్తులో డెఫినెట్‌గా పెద్ద హీరో అవుతాడు. ప్రియా ఒక్క క‌న్నుగీటుతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యింది. ఈ సినిమా త‌న‌కి మంచి పేరు తెస్తుంద‌ని ఆశిస్తున్నాను. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు రాజా నా ద‌గ్గ‌ర ఎంసీఏ, వ‌కీల్‌సాబ్ సినిమాల‌కి వ‌ర్క్ చేశాడు. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. త‌న ద‌గ్గ‌ర మంచి మాస్ ప‌ల్స్ ఉంది. ట్రైల‌ర్ చాలా బాగుంది. డెఫినెట్‌గా మీ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు.

హీరో తేజ స‌జ్జ మాట్లాడుతూ - ``మెగా సూప‌ర్‌గుడ్ ఫిలింస్‌లో వ‌ర్క్ చేయ‌డం ఒక గౌర‌వంగా భావిస్తున్నాను. మంచి కంటెంట్ ని ప్రోత్స‌హించ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చిన వేణు శ్రీ‌రామ్‌, నందినీ రెడ్డి, నారా రోహిత్‌, సందీప్ కిష‌న్‌, శ్రీ విష్ణు, ప్ర‌శాంత్ వ‌ర్మ గారికి థ్యాంక్స్‌. ఈ ఏప్రిల్‌ 23న మా ‘ఇష్క్‌’ సినిమా థియేటర్స్‌లో వస్తుంది. మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలనే మెగా సూప‌ర్‌గుడ్ ఫిలింస్‌ వారు ప్రొత్సహిస్తుంటారు. ‘ఇష్క్‌’ సినిమాలో కూడా మంచి సోల్ ఉంది. ఇది ఒక కొత్త రకం కథ. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇంత వ‌ర‌కూ ఏ సినిమా రాలేదు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి కూడా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్‌గారితో వ‌ర్క్ చేయ‌డం చాలా హ్యాపీ.. సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కె. నాయుడుగారికి, ఎడిట‌ర్ ఎ. వ‌ర‌ప్ర‌సాద్ గారికి థ్యాంక్స్‌. ద‌ర్శ‌కుడు రాజుగారు చాలా పెద్ద పెద్ద సినిమాల‌కి వ‌ర్క్ చేశారు. ఈ సినిమా త‌ర్వాత మ‌రిన్ని పెద్ద సినిమాల‌కి వ‌ర్క్ చేయాల‌ని కోరుకుంటున్నాను. ప్రియా ప్రకాశ్ వారియ‌ర్ నైస్ కోస్టార్‌. ఈ సినిమాలో చాలా బాగా చేసింది. ఏప్రిల్ 23న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాని అంద‌రూ చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. ‌

తారాగ‌ణం:
తేజ స‌జ్జా, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్, తమిళ నటుడు రవీందర్‌

సాంకేతిక బృందం:
డైరెక్ట‌ర్‌: య‌స్‌.య‌స్‌. రాజు
నిర్మాత‌లు: ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఆర్‌.బి. చౌద‌రి
బ్యాన‌ర్‌: మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్‌
మ్యూజిక్‌: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటింగ్‌: ఎ. వ‌ర‌ప్ర‌సాద్‌
ఆర్ట్‌: విఠ‌ల్ కొస‌నం
లిరిక్స్‌: శ్రీ‌మ‌ణి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్.

 



Photo Gallery
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved