pizza
Jawaan pre release function
`జ‌వాన్‌` ప్రీ రిలీజ్ వేడుక‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

27 November 2017
Hyderaba
d

సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్నచిత్రం `జవాన్`. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 1న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ వేడుక‌లో కె.రాఘ‌వేంద్రరావు ముఖ్య అతిథిగా హాజ‌రై యూనిట్ స‌భ్యుల‌ను అభినందించారు....

దిల్ రాజు మాట్లాడుతూ - ``ఈ ఏడాది ఇప్ప‌టికే ఐదు సినిమాలను మా సంస్థ నుండి రిలీజ్ చేసి స‌క్సెస్ కొట్టాం. ఇది మా సంస్థ‌కే కాదు, తెలుగు సినిమాకే మంచి పరిణామంగా భావిస్తున్నాం. డిసెంబ‌ర్ 21న విడుద‌లవుతున్న ఎం.సి.ఎతో ఆర‌వ స‌క్సెస్ అందుకోబోతున్నాను. ఈ సినిమాలు కాకుండా జ‌వాన్ రూపంలో మో ఎక్స్‌ట్రా సినిమా దొరికింది. క‌థ విన‌గానే నేను ర‌వి నేను బావుంద‌ని చెప్పి..ఎంక‌రేజ్ చేశాను. ముందుగా హ‌రీష్ శ‌కంర్‌, కృష్ణ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయాల‌నుకున్నారు. త‌ర్వాత ఈ ప్రాజెక్ట్‌లో న‌న్ను జాయిన్ చేయించారు. తేజు, ర‌వి, కృష్ణ అడగ్గానే సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడానికి అంగీక‌రించాను. ఈ సినిమాకు ఎమోష‌న‌ల్‌గా ఎటాచ్ అవుతూ మెల్ల‌గా ట్రావెల్ అవుతూ వ‌చ్చాను. సినిమా చూసుకున్న త‌ర్వాత ఏదో మిస్ అయ్యింద‌నిపించి అంద‌రం కూర్చొని, మ‌ళ్లీ వ‌ర్కువుట్ చేసి మంచి అవుట్ తీసుకొచ్చాం. జ‌వాన్‌తో మ‌రో సూప‌ర్ హిట సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాన‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నాను. ఒక మంచి సినిమా చేశాన‌ని ఆనందంగా అనిపించింది. మా యూనిట్ ప‌డ్డ క‌ష్టానికి త‌గ్గ సినిమా చేశామ‌నిపించింది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో పాటు మంచి కంటెంట్ ఉన్న సినిమాగా తేజుకి మిగిలిపోయే సినిమా ఇది. త‌మ‌న్ త‌న మ్యూజిక్‌, రీరికార్డింగ్‌తో సినిమాను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లాడు. కృష్ణ తొలి ప్ర‌యత్నం పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

కె.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ - ``జ‌వాన్ టైటిల్‌కి ఇంటికొక్క‌డు అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అంటే ఓ ఇంటికి మంచివాడు ఉంటే ఆ ఇల్లు బాగుప‌డుతుంది. బాగా చ‌దువుకోవ‌డ‌మే కాకుండా స‌మాజం, దేశం గురించి ఆలోచిస్తే రెండు బాగుప‌డుతాయి. టైటిల్‌కు త‌గ్గ‌ట్టే ఇంటికొక్క‌డు కుటుంబ స‌మేతంగా వ‌స్తే సినిమా పెద్ద హిట్ అవుతుంది. సినిమాను అంద‌రూ చూడాలి. అప్పుడే క‌మ‌ర్షియ‌ల్ హిట్ సాధిస్తుందన‌డంలో సందేహం లేదు. ర‌వి నాకు క‌థ చెప్పిన‌ప్పుడు నాకు సినిమా స‌క్సెస్ అవుతుంద‌ని అర్థ‌మైంది. సాయిధ‌ర‌మ్ నా కుటుంబ స‌భ్యుడు. త‌ను న‌టించిన పిల్లా నువ్వులేని జీవితం చూశాను. త‌ను న‌ట‌న‌, డ్యాన్స్ అన్ని చ‌క్క‌గా చేస్తున్నాడు. త‌న‌లో చిరంజీవిగారిలో గ్రేస్ క‌న‌ప‌డుతుంది. మెహ‌రీన్‌కు ఆల్ ది బెస్ట్‌. ఇత‌ర న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్‌కు అభినంద‌నలు`` అన్నారు.

మెహ‌రీన్ మాట్లాడుతూ - ``కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ త‌ర్వాత నేను సైన్ చేసిన సినిమాయే జ‌వాన్‌. భార్గ‌వి అనే క్యారెక్ట‌ర్‌ని నేను చేయ‌గ‌ల‌న‌ని భావించి నాకు అవ‌కాశం ఇచ్చిన రాజు, కృష్ణ‌గారు, ర‌విగారికి థాంక్స్‌. తేజు చాలా హ్యాపీయెస్ట్ హీరో. గుహ‌న్‌గారు ప్ర‌తి సీన్‌ను ఎంతో అందంగా చూపించారు. ఈ సినిమా జ‌ర్నీలో నాకు స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

బివిఎస్ ర‌వి మాట్లాడుతూ - ``ఈ సినిమా చేసే అవ‌కాశం ఇచ్చిన తేజు, కృష్ణ‌గారికి, సినిమాలో మాతో పాటు జ‌ర్నీ చేస్తూ వ‌స్తున్న రాజుగారికి థాంక్స్‌. పాట‌లు అల్రెడి పెద్ద హిట్ అయ్యాయి. ట్రైల‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మెహ‌రీన్ అయితే క‌థ విన‌కుండానే సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నందుకు ఆమెకు స్పెష‌ల్ థాంక్స్‌. నాగ‌బాబుగారు ఇందులో స్పెష‌ల్ రోల్ చేశారు. గుహ‌న్‌గారు ఫెంటాస్టిక్ విజువ‌ల్స్ ఇచ్చారు. నాకు మంచి టీం దొరికింది. నాతో పాటు అంద‌రూ చేసిన ట్రావెల్ వ‌ల్ల మంచి సినిమా తీయ‌గ‌లిగాను. కృష్ణ‌న్న నాకు నిర్మాత కంటే ఎక్కువ‌. మేం అడిగిన ప్ర‌తి చిన్న విష‌యాన్ని మాకు అందించారు. టెస్ట్‌ఫుల్ నిర్మాత‌గా కృష్ణ‌గారికి మంచి పేరు రావాలి. ఈ సినిమా డిసెంబ‌ర్ 1న విడుద‌ల‌వుతుంది`` అన్నారు.

సాయిధ‌ర‌మ్‌తేజ్ మాట్లాడుతూ - ``సినిమా డిసెంబ‌ర్ 1న `జ‌వాన్‌` విడుద‌ల‌వుతుంది. అలాగే దిల్‌రాజు సినిమా మ‌ధ్య‌లో మాతో జాయిన్ అయ్యి, సందేహ‌లు చెబుతూ, తీరుస్తూ మంచి సిన‌మా చేసేలా ప్లాన్ చేశారు. బ్ర‌హ్మ‌క‌డ‌లిగారికి, ఎడిట‌ర్స్ శేఖ‌ర్‌, మ‌ధుగారికి, స‌తీష్‌, వీరబాబుగారు, రాయుడుగారు, నిర్మాత కృష్ణ‌గారు ఎక్క‌డా స‌మ‌స్య రాకుండా చూసుకున్నారు. దిల్‌రాజుగారు వారింట్లో అబ్బాయిలా న‌న్ను చూసుకున్నారు. ద‌ర్శ‌కుడు ర‌విగారు అద్భుత‌మైన క‌థ‌ను రాసుకున్నారు. ఆయ‌న క‌న్విక్ష‌న్‌తో సినిమాను ఎక్స్‌ట్రార్డిన‌రీగా తెర‌కెక్కించారు. న‌వంబ‌ర్ 30న సినిమా ప్రీమియ‌ర్ వేస్తున్నాం`` అన్నారు.




Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved