pizza
Jersey pre release function
‘జెర్సీ’ ప్రీ రిలీజ్‌ వేడుక
You are at idlebrain.com > News > Functions
Follow Us


15 April 2019
Hyderabad

నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించిన చిత్రం ‘జెర్సీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మాత. గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు. ఈ కార్యక్రమంలో నాని క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసే వీడియో మోహన చెరుకూరి చేతుల మీదుగా విడుదలైంది. వెంకటేష్‌ తొలి టిక్కెట్‌ను విడుదల చేశారు.

సినిమాటోగ్రాఫర్‌ సాహు మాట్లాడుతూ ‘‘ఇంటెన్స అంశాలు, సరదా విషయాలు ఈ చిత్రంలో చాలా ఉంటాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులుఉ ఏప్రిల్‌ 19 వరకు వెయిట్‌ చేయడంలో తప్పులేదు’’ అని అన్నారు.

మారుతి మాట్లాడుతూ ‘‘రోజూ ఈ టైమ్‌లో టీవీల్లో క్రికెట్‌ చూస్తున్నాం. బిగ్‌ స్ర్కీన మీదకు క్రికెట్‌ను నానిగారు తీసుకురావడం ఆనందంగా ఉంది. హీరోలకు ఫ్యాన్స ఉంటారు. దర్శకుడిగా నేను నానిగారికి పెద్ద ప్యానని. వంశీ ఈ ట్రైలర్‌ నాకు పంపిన రోజు ట్రైలర్‌ చూసి చాలా షాక్‌ అయ్యా. గౌతమ్‌ సిన్సియర్‌ ఎఫర్ట్‌ పెట్టి సినిమా చేశారు. ఒన్లీ కంటెంట్‌ మాట్లాడుతుంది. సమ్మర్‌లో రెగ్యులర్‌ క్రికెట్‌ ఎంత ఎంటర్‌టైన చేస్తుందో, అంతకు మించి ఈ సినిమా ఎంటర్‌టైన చేస్తుందని భావిస్తున్నా’’ అని అన్నారు.

సత్యరాజ్‌ మాట్లాడుతూ ‘‘ఫస్ట్‌ టైమ్‌ నా లైఫ్‌లో యాక్ట్‌ చేశాను. ఇందులో నేను క్రికెట్‌ కోచగా నటించాను. ఇన్నేళ్ల కెరీర్‌లో మిగిలిన పాత్రలన్నీ యాక్ట్‌ చేసినట్టుగా అనిపించలేదు. ఈ సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా అనిపించింది. దర్శకనిర్మాతలకు, చిత్ర యూనిట్‌కి చాలా ధన్యవాదాలు’’ అని అన్నారు.

ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ ‘‘ఫన్నీయెస్ట్‌ ఫంక్షన ఇది. రోజూ మా అబ్బాయి సాయంత్రాల్లో క్రికెట్‌ ఆడమని అడుగుతుంటాడు. నేను ఆడను. ఇప్పుడు స్టేజ్‌ మీద ఆడుతున్నది అతను చూస్తుంటాడనే అనుకుంటున్నాను. నానితో ఏం చేసినా నాకు స్పెషల్‌గానే ఉంటుంది. కారణం అందరికీ తెలుసు. నాని ‘వరల్డ్‌ స్పేస్‌’లో ఆర్‌.జె.గా పనిచేస్తున్నప్పుడు ‘అష్టాచమ్మా’కు ఆడిషనకు వచ్చాడు. అప్పుడు నేను నానికి ఈమెయిల్‌ చేశాను. ‘నాని... నీకు నీ గురించి ఎంత తెలుసో నాకు తెలియదు కానీ, నువ్వు స్టార్‌ మెటీరియల్‌’ అని. ఇప్పుడు దాదాపు దశాబ్దం తర్వాత నా ప్రెడిక్షన కరెక్టేనని గర్వంగా ఉంటుంది. నేను కొంతకాలం క్రితం ‘గోల్కొండ హైస్కూల్‌’ అని ఒక సినిమా చేశాను. ఇప్పుడు ఇక్కడుంటే ఆ సినిమా ట్రైలర్లు గుర్తుకొస్తున్నాయి. ఇటీవలి కాలంలో నేను చూసిన జెన్యూన ట్రైలర్‌ ఇది. అదే విషయాన్ని నేను ట్విట్టర్‌లోనూ పెట్టా. ఈ సినిమా తప్పకుండా హిట్‌ అవుతుంది. శ్రద్ధ, అనిరుద్‌ అందరూ బాగా చేశారు. నిర్మాత, గౌతమ్‌ చాలా బాగా కృషి చేశారని అర్థమవుతోంది. గౌతమ్‌ ‘మళ్లీ రావా’ నాకు బాగా నచ్చుతుంది. ఈ సినిమా అంతకన్నా పెద్ద హిట్‌ కావాలి’’ అని అన్నారు.

సుధీర్‌ వర్మ మాట్లాడుతూ ‘‘అందరం ట్రైలర్‌ చూశాం. సినిమా అంతకన్నా బావుండాలని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు.

వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘‘నాక్కూడా క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ప్రొఫెషనల్‌ క్రికెట్‌ కాకపోయినా ట్రైనింగ్‌ తీసుకుని నాని ఆ పోస్టర్లకు ఫోజులివ్వడం చాలా బావుంది. దర్శకుడు రాసుకున్న సీనను నెక్స్ట్‌ లెవల్‌కి తీసుకెళ్లే నటుడు నాని. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రుతగా ఉంది. గౌతమ్‌ ‘మళ్లీ రావా’ సినిమా నాకు బాగా నచ్చింది. ఈ ప్రొడక్షన హౌస్‌ నాకు సొంత సంస్థలాంటిది. సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని అన్నారు.

విక్రమ్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘‘నాని నాకు ఒకరోజు సాయంత్రం ఈ కథ చెప్పాడు. నాకు చాలా నచ్చింది. ఆ కథలో అన్నీ ఉన్నాయి. డ్రామా నుంచి ప్రతిదీ ఉంది. నాలుగైదు సార్లు ఏడుపొచ్చింది. అంత ఎమోషన కూడా ఉంది. నేను ట్రైలర్‌ చూశా. చాలా బావుంది. సినిమా స్ర్కీన మీద ఇంకా బావుండాలని అనుకుంటున్నా. అనిరుద్‌ చాలా చక్కటి బాణీలిచ్చాడు. రీరికార్డింగ్‌ చాలా బాగా వస్తోందని నాని చెప్పాడు. సత్యరాజ్‌గారు ట్రైలర్‌లో చాలా బాగా ఉన్నారు’’ అని అన్నారు.

ప్రవీణ్‌ మాట్లాడుతూ ‘‘కొట్టబోయే హిట్టుకు మూడు రోజుల ముందుగానే టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నా’’ అని అన్నారు.

శ్రద్ధా శ్రీనాథ్‌ మాట్లాడుతూ ‘‘నేను శ్రద్ధా శ్రీనాథ్‌. కన్నడలో ‘యూ టర్న్‌’ నా తొలి సినిమా. ఆ తర్వాత తమిళ్‌, మలయాళం, హిందీ సినిమాలు చేశాను. ‘జెర్సీ’తో తెలుగు సినిమా ఇండసీ్ట్రలో అడుగుపెట్టాను. అది నా అదృష్టం. నేను నాలుగేళ్ల క్రితం ఇండసీ్ట్రకి వచ్చినప్పుడు సినిమా కెమెరా ఎలా ఉంటుందో నాకు తెలియదు. మిడ్‌ షాట్‌, వైడ్‌ షాట్‌ కూడా తెలియదు. కానీ మంచి సినిమా, మంచి సా్ట్రంగ్‌ ఫీమేల్‌ పాత్ర చేయాలని అనుకున్నా. ఈ సినిమాలో నా పాత్ర చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. గౌతమ్‌ మంచి పాత్ర రాశారు. నిర్మాతలు చాలా బాగా నిర్మించారు. నా హీరో అర్జున.. నానికి పెద్ద థాంక్స్‌. ఆయన అర్జున పాత్రను చాలా బాగా సెన్సిటివ్‌గా చేశారు. ఆయన ఆ పాత్రలో నటించబట్టే సారా పాత్రలో నేను బాగా చేయగలిగాను. నాకు ఈ సినిమా చాలా స్పెషల్‌’’ అని చెప్పారు.

కె.కె. మాట్లాడుతూ ‘‘టెక్నికల్‌ కారణాల వల్ల అనిరుద్‌, గౌతమ్‌ ఇక్కడికి రాలేదు. స్టోరీతో పాటు కలిసి వచ్చే పాటలు రాశాను. అందరికీ నచ్చేలా రాశానని అనుకుంటున్నా. క్రికెట్‌ ఎక్కడుంటే వెంకటేష్‌గారు అక్కడుంటారు. అందుకే ఇక్కడున్నారు. పాటల కోసం అక్కడక్కడా కొన్ని బిట్స్‌ చూశా. తప్పకుండా సినిమా హిట్‌ అవుతుందని నమ్ముతున్నా’’ అని చెప్పారు.

వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘క్రికెట్‌ ఇష్టం కాబట్టి ఇక్కడికి రాలేదు. చాలా జెన్యూనగా, ప్రేమగా ఇక్కడికి వచ్చాను. ట్రైలర్‌ చూడగానే జెర్సీ రూమ్‌లో ఫస్ట్‌లుక్‌ వచ్చినప్పుడే చాలా ఇంప్రెస్‌ అయ్యాను. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి లుక్‌ చూసి ఇంప్రెస్‌ అయ్యా. గౌతమ్‌ ఈ సినిమాలో ఏం చూపించాలనుకున్నారో క్లారిటీగా అదే చూపించారు. ట్రైలర్‌ చూశాక మైండ్‌ బ్లోయింగ్‌గా అనిపించింది. జెన్యూన సినిమాలు రేర్‌గా వస్తాయి. నానిని ఇలాంటి సినిమాలో చూసేసరికి చాలా బాగా అనిపించింది. ఇలాంటి పాత్రల్లో నటించేటప్పుడు చాలా ఎమోషనల్‌గా ఇన్వాల్వ్‌ అవుతుంటాం. అందుకే ట్రైలర్‌ చూడగానే ఈ తరహా సినిమాలు స్ఫూర్తిగా అనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ హీరో పాత్ర చూసి ఇనస్పయిర్‌ అవుతారు. ప్రతి ఒక్కరూ లైఫ్‌లో స్ట్రగుల్‌ అవుతుంటారు. అలాంటప్పుడు జీవితంలో మనం వదిలేయకూడదు. గట్టిగా ప్రయత్నించి సక్సెస్‌ సాధించాలని ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, లైఫ్‌ లెసన అని అర్థం చేసుకుంటాం. సినిమా ఔట్‌స్టాండింగ్‌గా ఉంటుంది. నిర్మాతలు నాకు చాలా మంచి మిత్రులు. దర్శకుడికి కంగ్రాట్స్‌. నానిని చూస్తే గర్వంగా ఉంటుంది. తను మనకున్న నేచురల్‌ స్టార్‌’’ అని అన
్నారు.

నాని మాట్లాడుతూ ‘‘వెంకటేష్‌గారు ఆవకాయలాంటి వ్యక్తి. ఆయన నచ్చని తెలుగువారు ఉండరు. నేను బిగ్‌స్ర్కీన మీద చూసిన ఒక స్టార్‌ని నేరుగా కలిసినప్పుడు మరింతగా నచ్చింది వెంకటేష్‌గారిని చూసినప్పుడే. ఆయన ఫంక్షనకి వెళ్లాలనే నా కోరిక ‘బాబు బంగారం’తో తీరిపోయింది. ఆయన నా ఫంక్షనకు రావాలనే కోరిక ‘జెర్సీ’తో తీరింది. ఆయనతో స్ర్కీన షేర్‌ చేసుకోవాలనే కోరిక ఇప్పటికీ అలాగే ఉంది. తప్పకుండా తీరుతుందనే నమ్మకం ఉంది. మల్టీస్టారర్‌ టాపిక్‌ వచ్చిన ప్రతిసారీ ‘నువ్వూ, వెంకటేష్‌గారు కలిసి చేస్తే చాలా బావుంటుంది’ అని నాతో చాలా మంది చెప్పారు. ఆ క్షణం కోసం వెయిట్‌ చేస్తున్నా. ఈ రోజు ఈ ఈవెంట్‌కి ఛీఫ్‌ గెస్ట్‌గా వచ్చారు ఆయన. నాకు ‘జెర్సీ’ చాలా స్పెషల్‌ సినిమా. ఆయన రాకతో మరింత స్పెషల్‌ అయింది. ఈ సినిమాకు ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏప్రిల్‌ 19న అందరూ చాలా గర్వపడతారు. గౌతమ్‌ని చూసి, అర్జునని చూసి, నానిని చూసి, శ్రద్ధను చూసి అందరూ గర్వపడతారు. మా నాన్న, మా అబ్బాయి అందరూ గర్వపడతారు. అందరూ గర్వించదగ్గ సినిమాలో నేను నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. బ్లాక్‌బస్టర్‌ వంటి మాటలు నాకు ఆనడం లేదు. గొప్ప సినిమాలో చేశాననే శాటిస్‌ ఫేక్షన ఉంది. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ముందు గౌతమ్‌ గురించి చెప్పాలి. గౌతమ్‌ చెన్నైలో ఉన్నాడు. యు.ఎస్‌. ప్రింట్స్‌ ఈ రోజు 9 గంటలకు వెళ్తాయి. వాటికోసం అక్కడే ఉన్నాడు. ఈ నెల 19న అతను తీసిన సినిమా మాట్లాడుతుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ కథ చెప్తారు. చాలా బ్యూటీఫుల్‌ సినిమా అవుతుంది. గౌతమ్‌ చాలా పెద్ద డైరక్టర్‌ అవుతాడని గౌతమ్‌ కొడుక్కి ఇవాళ చెబుతున్నా. గౌతమ్‌ కొడుకు పెద్దయ్యాక వాళ్ల నాన్ననే స్ఫూర్తిగా తీసుకుంటాడు. ‘జెర్సీ’ ట్రైలర్‌ స్టైల్‌లోనే చెప్పాలంటే, ఇంత పెద్ద ప్రపంచంలో ఇప్పటిదాకా నన్ను జడ్జి చేయంది తెలుగు ప్రేక్షకులు మాత్రమే. వాళ్ల దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను. ఏప్రిల్‌ 19న థియేటర్‌లో కలుసుకుందాం’’ అని అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved