pizza
KGF pre release function
'కె.జి.ఎఫ్‌' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

9 December 2018
Hyderabad

కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై రాకింగ్‌ స్టార్‌ యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో విజయ్‌ కిరగందూర్‌ నిర్మాతగా రూపొందుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'కేజీఎఫ్‌(కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌)'. ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలన చిత్రం విడుదల చేస్తుంది. ఈ సందర్భంగా బిగ్‌ సీడీ, ఆడియో సీడీలను ఎస్‌.ఎస్‌.రాజమౌళి విడుదల చేశారు. తొలి సీడీని యష్‌ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ....

శోభు యార్లగడ్డ మాట్లాడుతూ - ''ట్రైలర్‌ చాలా బావుంది. యూనిట్‌ పడ్డ కష్టం తెరపై కనపడుతుంది. దేశమంతటా డిసెంబర్‌ 21న విడుదలవుతోన్న ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.

కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ - ''చాలా సంతోషంగా ఉంది. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌ రెండు సినిమాలు చాలా చక్కగా ఆడాయి. ఇది వారి బ్యానర్‌లో వస్తోన్న మూడో సినిమా. ఈ సినిమా నిర్మాణంలో మా అబ్బాయి కూడా పాలు పంచుకున్నాడు. ఈ సినిమా పార్ట్‌ వన్‌తో పాటు రెండో భాగం కూడా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ట్రైలర్‌ చూస్తే చాలా థ్రిల్లింగా అనిపించింది. సినిమా ఇంకా థ్రిల్లింగ్‌గా ఉంటుందని భావిస్తున్నాను. సక్సెస్‌కు ట్రైలర్‌ ఓ నాందిగా అనిపిస్తుంది. నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలుగా ఉన్నాను. దాదాపు 800 సినిమాల్లో పనిచేశాను. హీరో, విలన్‌, కమెడియన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా... అన్ని రకాల జోనర్స్‌ సినిమాల్లో నటించాను. కన్నడలో కంఠీరవ నాకు మంచి మిత్రుడు. ఇప్పుడు యష్‌ కెరీర్‌ ప్రారంభంలో చాలా పెద్ద పేరు సంపాదించుకున్నాడు. తను భవిష్యత్‌లో ఇంకా ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. తను బ్రహ్మాండంగా నటిస్తున్నాడు. ప్రారంభంలోనే ఓ హీరోకి అన్ని సక్సెస్‌లు రావడం అరుదైన విషయం. యష్‌కి ఆల్‌ ది బెస్ట్‌. దర్శకుడు ఎంత బాగా డైరెక్ట్‌ చేశాడనే విషయం ట్రైలర్‌ చూస్తేనే తెలుస్తుంది. నిర్మాతలు చాలా ఎంకరేజ్‌ చేస్తూ లావిష్‌గా సినిమా చేశారు. కన్నడలో ఇంత లావిష్‌ సినిమా చేయడం అరుదు. నిర్మాతలకు గొప్ప విజయం రావాలి. భవిష్యత్‌లో వారికి మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ - ''కన్నడ నాకు ఇష్టమైన భాష. నా తొలి పాట కూడా కన్నడలోనే రాశాను. ఇక కె.జి.ఎఫ్‌ విషయానికి వస్తే ఈ టీమ్‌ చాలా ప్యాషనేట్‌ టీం. అందరూ మంచి ఔట్‌పుట్‌ రావడానికి ఎంతగానో కష్టపడ్డారు. మంచి నిర్మాణ విలువలతో చక్కగా తీశారు. నాలుగు పాటలు, బిట్‌ సాంగ్స్‌ రాశాను. సంతృప్తిగా వర్క్‌ చేసుకున్నాను. యష్‌గారి ఫాలోయింగ్‌ మరింత పెరిగింది. ఆయనకు తెలుగులో ఈ సినిమా మంచి డెబ్యూ అవుతుందని భావిస్తున్నాను'' అన్నారు.

సినిమాటోగ్రాఫర్‌ భువన్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్‌, నిర్మాత విజయ్‌గారికి థాంక్స్‌. ఈ సినిమాను టీం అందరూ కలిసి ఫుల్‌ ఎఫర్ట్‌తో చేశాం'' అన్నారు.

ఎన్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''కె.జి.ఎఫ్‌' సినిమా బిగ్గెస్ట్‌ హిట్‌ కావాలి. ఈ సినిమా గురించి ఆయనతో దాదాపు గంటకు పైగానే మాట్లాడాను. కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. సౌతిండియన్‌ సినిమా మార్కెట్‌ ఈరోజు ఎంతగానో విస్తరించింది. ఇది వరల్డ్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవి మాట్లాడుతూ - ''ఇంత మంచి సినిమా అవకాశం ఇచ్చినందుక థాంక్యూ. టీం అందరం పగలు, రాత్రిళ్లు బాగా కష్టపడ్డాం. సినిమా బాగా వచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ - ''మేమంతా ఇక్కడ ఈరోజు నిలబడి ఉన్నామంటే కారణం రాజమౌళిగారు. ఆయన ఇండియన్‌ సినిమా స్థాయిని పెంచారు. పెద్దగా కలలు కనండి అని మాకు నేర్పించారు. సినిమాలకు సరిహద్దులను చేరిపేశారు. ఇప్పుడు బడ్జెట్‌ చిన్న విషయమైపోయింది. విజన్‌ చాలా పెద్ద విషయంగా నిలుస్తుంది. కైకాల సత్యనారాయణగారి పేరుని మా పోస్టర్‌పైనే వేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాం. రామారావుగారు అసోసియేట్‌ అయినందుకు ఆయనకు థాంక్స్‌. సాయిగారు మాకు డిస్ట్రిబ్యూషన్‌ విషయంలో ఎంతో అండగా నిలబడ్డారు. ఓ పిచ్చి వ్యక్తికి పేపర్‌ పెన్ను ఇచ్చి కథ రాయమంటే అసలు ఎలాంటి కథ రాయాలి. మనం ఏ ఇండస్ట్రీలో ఉన్నాం అనే విషయాలను ఆలోచిస్తాడు. ఒక పిచ్చి మనిషి రాసిన కథను చేయాలంటే ఇంకా ఎక్కువ మంది పిచ్చోళ్లు ఉండాలి. అలాంటి వ్యక్తులే నిర్మాత విజయ్‌గారు, హీరో యష్‌గారు. వాళ్లు నాకంటే ఎక్కువ ప్యాషన్‌తో ఈ సినిమా కోసం పనిచేశారు. ఈ సినిమాను కన్నడలోనే చేద్దామని ముందుగా అనుకున్నాను. అయితే మేం అనుకున్న స్కేల్‌ కన్నడ పరిశ్రమలో చాలా పెద్దది. నిర్మాతలు మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కావద్దని ముందుగానే చెప్పారు. కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు. సమయాన్ని ఇచ్చారు. ఒకవేళ రేపు ఏమైనా తప్పులుంటే ఆ బాధ్యత నాదే. నా టెక్నీషియన్స్‌ వల్లే ఇంత పెద్ద సినిమాను చేయగలిగాను. అలాగే ఆర్టిస్టులు ఎంతగానో సహకారం అందించారు. యూనివర్సల్‌ కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది'' అన్నారు.

చిత్ర నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ మాట్లాడుతూ ''తెలుగులో కె.జి.ఎఫ్‌ సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతుండటానికి కారణం సాయి కొర్రపాటిగారు. మా యూనిట్‌ను అభినందించడానికి వచ్చిన రాజమౌళిగారికి థాంక్స్‌. అందరికీ థాంక్స్‌'' అన్నారు.

ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ - ''నాలుగైదు సంవత్సరాల క్రితం సాయిగారితో మాట్లాడుతూ అక్కడ ఎవరు టాప్‌ హీరో అని అడిగాను. ఆయన ఓ కొత్తకుర్రాడు వచ్చి.. అందరినీ దాటేసి వరుస హిట్స్‌ అందుకుంటున్నాడని .. తన పేరు యష్‌ అని చెప్పాడు. ఎప్పుడు వినలేదు.. ఎక్కడ నుండి వచ్చాడు? తన బ్యాగ్రౌండ్‌ ఏంటి? అని అడిగితే ఓ బస్‌ డ్రైవర్‌ కొడుకు అని చెప్పారు సాయిగారు. ఓ బస్‌ డ్రైవర్‌ కొడుకు కన్నడ ఇండస్ట్రీలో పెద్ద స్టార్‌ అయ్యారు. మరో గొప్ప విషయమేమంటే కొడుకు సూపర్‌స్టార్‌ అయినా తండ్రి మాత్రం ఇంకా బస్‌ డ్రైవర్‌గానే ఉన్నారు. యష్‌ కంటే ఆయన తండ్రే పెద్ద సూపర్‌స్టార్‌ అని నాకు అనిపించింది. ఆయనకు నా హ్యాట్సాఫ్‌. ఈ సంవత్సరం బెంగళూరుకి ఆర్‌ ఆర్‌ ఆర్‌ కథా చర్చలకు వెళ్లాను. తాజ్‌ హోటల్‌కు వెళ్లినప్పుడు అక్కడున్న యష్‌ వచ్చి రెండు నిమిషాల టైమ్‌ అడిగి 'కె.జి.ఎఫ్‌' విజువల్స్‌ చూపించారు. నేను నిజంగా బ్లోన్‌ అవే. వాళ్ల ఎఫర్ట్స్‌, ఒరిజినాలిటీతో చేసిన వారి ప్రయత్నం అమేజింగ్‌గా అనిపించింది. ఫెంటాస్టిక్‌ అనుకున్నాను. తర్వాత వాళ్లు ఈ సినిమా కోసం పడ్డ మూడేళ్ల కష్టం గురించి తెలిసింది. వాళ్లు దీన్ని పేన్‌ ఇండియా మూవీగా చేయాలనుకున్నారని తెలిసింది. బడ్జెట్‌ పెట్టిన ప్రతి సినిమా పేన్‌ ఇండియా సినిమా అయిపోదు. ఓ రీజన్‌కు కట్టుబడకుండా.. అందరికీ నచ్చే కథాంశం ఉంటేనే పేన్‌ ఇండియా సినిమా అవుతుంది. కెజిఎఫ్‌ను చూసినప్పుడు నాకు పేన్‌ ఇండియా సినిమా అవుతుందనిపించింది. వెంటనే ఫోన్‌ చేసి ముంబైలోని అనిల్‌ టాండన్‌కి నీకు వీలైనంత సపోర్ట్‌ చేయి అన్నాను. అలాగే శోభుగారికి కూడా చెప్పాను. ఇప్పుడు కెజిఎఫ్‌ కన్నడ సినిమాలా కాకుండా పేన్‌ ఇండియా సినిమాగా విడుదలవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. అంత మంచి విజువల్స్‌ రావాలంటే డబ్బులు పెడితేనో.. హీరో డేట్స్‌ ఇస్తేనో రావు. కంప్లీట్‌ టీం ఎఫర్ట్‌ ఉండాలి. అంత మంచి టీం దొరికింది కాబట్టే సినిమా బాగా వచ్చింది. సినిమా నచ్చితే ఏ భాష సినిమా.. ఎవరు చేశారు అని ఆలోచించకుండా ఆదరించే ప్రేక్షకులు తెలుగువాళ్లు మాత్రమే. ఆ విషయంలో నేను గర్వంగా ఫీల్‌ అవుతుంటాను. ట్రైలర్‌లో ఉన్నట్లు గొప్ప విజువల్స్‌లో సినిమా బావుంది. తప్పకుండా సినిమా తెలుగులోనే కాదు.. ఇండియా అంతటా బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది. ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

రాకింగ్‌ స్టార్‌ యష్‌ మాట్లాడుతూ - ''కె.జి.ఎఫ్‌' సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్‌ ఒక్కొక్క డైమండ్‌లా పనిచేశారు. వాళ్ల కారణంగా ఈ సినిమాను చక్కగా చేయగలిగాం. ఓ రైతు మొక్కజొన్న పండించేవాడు. తనకి ఉత్తమ రైతు అవార్డు వరుసగా వస్తుంటుంది. మీకే ఉత్తమరైతు అవార్డు ఎందుకు వస్తుంది? అని తనని అడిగితే..తను పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ అందరూ ఒకే రకమైన విత్తనాలు వాడుతూ కనిపించారు. మీ సీక్రెట్‌ చెప్పేస్తే ఎలా సార్‌ అని ఉత్తమరైతుని అడిగారు. దానికి ఆ రైతు .. నేను పనిరాని విత్తనాలు ఇస్తే పక్షుల ఆ విత్తనాలను నా నేలలోనికి చేరవేస్తాయి. దాంతో నా పంట క్వాలిటీ తగ్గిపోతుంది. కాబట్టి నేను మంచి విత్తనాలే అందరికీ ఇస్తాను. అయితే నేను మంచి పంటను పండిస్తాననే నమ్మకంతోనే పనిచేస్తున్నాను అన్నారు. అలాంటి ఉత్తమరైతు రాజమౌళిగారు. మీ సినిమాలు బావుంటే మేం సపోర్ట్‌ చేస్తాం. మా సినిమాలు బావుంటే మీరు సపోర్ట్‌ చేయండి. ఉదాహరణకు బాహుబలి చిత్రాన్ని మేం గొప్పగా ఆదరించాం. శోభుగారికి థాంక్స్‌. కొన్నేళ్ల క్రితం నేను నటించిన సీరియల్‌ను శోభుగారే నిర్మించారు. ఆయన కారణంగానే కెజిఎఫ్‌ సినిమాను హిందీలో విడుదల చేస్తున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలనే తేడాలు ఉండకూడదు. మనమంతా ఇండియన్‌ సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లం. యూనివర్సల్‌ కాన్సెప్ట్‌ ఉండటంతో మా సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాం. ప్రశాంత్‌ అద్భుతంగా సినిమా కోసం వర్క్‌ చేశారు. తను ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తారు. ఇంత పెద్ద సినిమాను నిర్మించిన విజయ్‌గారికి థాంక్స్‌. సైనికుల్లా ఈ సినిమా కోసం పనిచేశాం. సాయి కొర్రపాటిగారు ఎంతగానో సపోర్ట్‌ చేస్తున్నారు. సపోర్ట్‌ చేస్తున్న అందరికీ థాంక్స్‌'' అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved