20 November 2023
Hyderabad
'Kota Bommali PS', directed by Teja Marni of 'Arjuna Phalguna' fame, stars Rahul Vijay and Shivani Rajasekhar in lead roles. Starring Srikanth and Varalaxmi Sarathkumar in pivotal roles, the film is produced by Bunny Vass and Vidya Koppineedi under Geetha Arts2 banner. The film is going to release in theaters on November 24. The unit is handling film promotions innovatively.
On Monday, the pre-release ceremony of this film was held in a grand manner in Hyderabad under the name of 'Kota Bommali PS Prachara Sabha'. The engaging event witnessed something unique. For a change, journalists took questions from filmmakers instead of it being the other way round.
Mega producer Allu Aravind said, "Police chasing other policemen is what this film is about. That's what makes it different from other films. There is no hero in this movie. The story itself is the hero. I thank Boyapati Srinu for being here today despite being a busy man. Srikanth is close to me. He started out big with our film 'Pelli Sandadi'. Rahul's father Vijay started out as a fight master under our banner. How are politicians making puppets out of policemen? That's what this film brings out. This film doesn't intend to target any leader or police officer. The film raises its voice against the entire system prevalent across the country. It is just a coincidence that this film is coming out in the election season. My contribution has only been in selecting the story and in giving input in the edit room. The rest of the responsibility has been taken by Bunny Vass, Vidya, Bhanu and Riyaz. Introducing actors is something all production houses do. I am happy to be honing new producers under the aegis of Geetha Arts. 'Baby' producers came out from us. I hope many more are made in the future."
Chief guest Boyapati Sreenu began his speech by talking about 'Lingi Lingi Lingidi' and its popularity. "Usually the film's dialogues, visuals, teaser and trailer do the job of popularizing a film. In this case, a song has done that. I have watched the trailer for this movie and I must say that the film conveys its convictions effectively," he added. The 'Akhanda' maker praised the film's cast and crew, and particularly talked about Shivani Rajasekhar and Rahul Vijay. He added that the 'Kota Bommali Prachara Sabha' was an interesting event.
Successful producer Dil Raju said that Srikanth had to work on 'Game Changer' while doing 'Kota Bommali PS', resulting in a delay in the shoot of the latter to an extent. He described the film as a commercial outing with an interesting concept. He added that his 16-months-old son enjoys listening to 'Lingi Lingi Lingidi'. "I have continuously been listening to the song since my wife told me about it. The song has surely ensured hype for the movie," Dil Raju added, hoping that the movie becomes a solid hit upon its release on November 24.
Producer Bunny Vass said that the movie has been written without filters. He added that Allu Aravind's guidance helped them maintain moderation in making the film in such a way that it doesn't hurt anybody. "Thanks to the strength he gave us, we could write some things in a frank manner. This film shows how a small incident blows up and becomes the main talking point at the time of elections. This is a thought-provoking movie. Director Teja Marni has a great future ahead," he added.
'Baby' producer SKN said that Geetha Arts is to production houses what Charminar is to Hyderabad and Taj Mahal is to Agra. "This banner has introduced so many heroes, directors and technicians. Thanks to this banner, Rahul, Shivani, director Teja, producer Vidya garu and co-producer are advancing to the next stage. 'Lingi Lingi Lingidi' is the reason why 'Kota Bommali PS' has reached every street and gully. I want to know what political messaging this film is going to come up with about contemporary politics. Those who don't give even a Frooti bottle after winning the election promise to give a scooty before the election. I want to know how this film is going to bring out all this," he added.
'Baby' director Sai Rajesh spoke of the care taken by Allu Aravind in honing the careers of the individuals he likes. "Many individuals who are close to my heart have worked on this movie. Co-Producer Bhanu is my friend. I hope this project becomes huge for him. I wish Vijay Master, Shivani, Rahul all the best. Teja Marni deserves a huge hit. I hope Dheeraj and Vidya akka go on to become big producers. Bunny Vass garu is our strength. He is always there for us," he added.
Srikanth said that the story is the hero of the film. "You will see only my character Ramakrishna while watching the movie. The treatment is so natural. I see Geetha Arts as my own banner because of 'Pelli Sandadi', 'Pellam Oorelithe', and 'Sarrainodu'. When Bunny Vass garu narrated the story to me, it was so clear that I asked him why he was not wielding the megaphone. I will remember 'Kota Bommali PS' for a long time," he added.
Hero Rahul Vijay said, "Everyone dreams of working with Geetha Arts in the industry. I never imagined that the opportunity would come my way this early in my career. I accepted the offer without listening to the story. Bunny Vass garu treated me with so much respect. A week after the shoot began, I met with an accident. I thought I would be replaced. But the makers waited for me till my recovery. If I got to learn so much from this movie, that's because of Teja Marni garu. Visuals, background score, dialogues, dances and music are perfect in this film. The BGM is especially solid. The dialogues are highly effective."
Heroine Shivani Rajasekhar said that she felt lucky to work with Teja Marni after having watched 'Johar'. "Shooting for this movie was not easy, because we shot in tough terrain. But all that gave me a kick. It was a joy working with Rahul and Srikanth garu. It was fun shooting in Araku. Jagadeesh garu's visuals are amazing. 'Lingi Lingi Lingidi' is great. We are proud to present 'Kota Bommali PS' to all the Telugu people across the world. Please watch this movie only in theatres. Don't encourage piracy," she added.
Director Teja Marni thanked the producers for trusting him with the project. He revealed that 'Lingi Lingi Lingidi' was written off by a lyricist who refused to change a particular line. Post the song's release, the song became a sensation. 'Kota Bommali PS', story-wise, brings out how the police system has been gamed by the political system. "Everyone with a Voter ID needs to watch this movie. You will know why I am saying this on November 24. The producers have pushed me towards the best. I worked with greater conviction on this project. This film is an emotional thriller. If the first half is thrilling, the second half is emotional," he added.
Dialogue writer Nagendra Kasi said that producer Bunny Vass appreciated his writing right from the first day. He lauded the writing style and treatment sense of director Marni. "The dialogues are going to receive applause in theatres. Every word in this film is measured and purposive," he added.
Music director Ranjin Raj said, "This is my first Telugu film. I am happy to be getting introduced with a brilliant movie. It is a dream debut, thanks to Geetha Arts producing it. We have carried out a few experiments in 'Kota Bommali PS'. This November 24, the audience are in for a wow experience."
Cinematographer Jagadeesh Cheekati said that Geetha Arts is synonymous with commercial and creative content. He added that he received all the support from the director and the producers.
Choreographer Vijay thanked the audience for making 'Lingi Lingi Lingidi' such a huge hit. "I am proud to have worked with Geetha Arts. I have choreographed two songs in this movie," he added.
ఏ వ్యక్తుల్ని ఉద్దేశించి కాదు.. ఓ వ్యవస్థని ఖండిస్తూ తీసిన సినిమా ‘కోట బొమ్మాళి పీఎస్’: ‘ఎస్ ప్రొడ్యూసర్’ అల్లు అరవింద్
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌ను యూనిట్ వినూత్నంగా నిర్వహిస్తోంది. సోమవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ‘కోట బొమ్మాళి పీఎస్ ప్రచార సభ’ పేరుతో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో స్టేజ్‌పైకి వచ్చిన వారంతా ఓటు వేసే థీమ్‌తో పాటు, ఎప్పుడూ మీడియా వారే సినిమా వాళ్లని ప్రశ్నలు అడిగే ట్రెండ్‌కు బ్రేక్ వేస్తూ.. మీడియా వారిని స్టేజ్‌పై కూర్చోబెట్టి సినిమా వారు ప్రశ్నలు అడిగారు. ఈ కార్యక్రమం అందరినీ అలరించింది. అనంతరం చిత్ర బృందం సినిమా విశేషాలను తెలిపితే.., హాజరైన అతిథులు యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. ఎవరూ చెప్పని ఒక చిన్న కథ చెబుదామనే.. అంటే పోలీసులు క్రిమినల్స్‌ని, క్రిమినల్స్ వాళ్లకి లొంగేవారిని లొంగదీసుకోవడం వంటిది జరుగుతుంటుంది. ఈ కథలో ప్రత్యేకం ఏమిటంటే.. సింపుల్.. ‘పోలీస్ చేజేస్ పోలీస్’. పోలీసులని పోలీసులు పట్టుకోవాలనే ఒక విచిత్రమైన కథ. ఈ సినిమాలో ఎవరూ హీరోలు లేరు. కథే హీరోగా వెళుతుంటుంది. తప్పకుండా ఈ వెరైటీని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. చాలా బిజీగా ఉండి కూడా ఈ వేడుకకు వచ్చిన బోయపాటిగారికి ధన్యవాదాలు. శ్రీకాంత్ నాకు ఆత్మీయుడు. మా బ్యానర్‌లో ‘పెళ్లిసందడి’తో మొదలయ్యాడు. అప్పటి నుంచి ఎక్కడ అవకాశం ఉన్నా మా సినిమాల్లో నటిస్తుంటాడు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. హీరో రాహుల్ వాళ్ల నాన్న మా బ్యానర్‌లో ఫైట్ మాస్టర్‌గా చేశాడు. వాళ్లబ్బాయి హీరోగా చేస్తున్నాడు. పోలీసుల్ని రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారు? అనేది చెప్పడం కోసం కోటబొమ్మాళి అనేది తీసుకున్నాం. ఇది ఏ రాజకీయ నాయకుడిని, పోలీస్ ఆఫీసర్‌ని ఉద్దేశించి మేము తీయలేదు. ఆల్ ఇండియాలో ఉన్న ఓ వ్యవస్థని ఖండిస్తూ తీసిన సినిమా ఇది. పోలీసులను న్యాయం చేయనీయరు అనేది చెప్పడం జరిగింది తప్పితే.. ఎవరినీ ఉద్దేశించింది మాత్రం కాదు. ఈ మెసేజ్‌ని ఈ ఎలక్షన్ల టైమ్‌లో తీసుకెళ్లే సందర్భం మాకు కుదిరింది. కథ ఎన్నుకునే సమయంలోనూ, అలాగే ఎడిటింగ్ రూమ్‌లో మాత్రమే నేను.. మిగతా అంతా బన్నీవాసు, విద్య, భాను, రియాజ్‌లే చూసుకున్నారు. హీరోలని, హీరోయిన్లని ఇంట్రడ్యూస్ చేయడం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. వారితో పాటు నిర్మాతలని కూడా తయారు చేసి పంపుతున్నాను. ‘బేబి’ నిర్మాతలు మా సంస్థ నుంచి వచ్చిన వారే. ఇంకా ఎంతో మంది నూతన నిర్మాతలు మా సంస్థ నుంచి రావాలని కోరుకుంటున్నాను. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ.. ఆల్ ద బెస్ట్’’ అని అన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘‘మీడియా మిత్రులకు, ఈ వేడుకకు హాజరైన పెద్దలకు, వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కోట బొమ్మాళి సినిమా గురించి చెప్పాలంటే.. ‘లింగిడి లింగిడి’ సాంగ్ ప్రతి ఒక్కరికీ చేరింది అనేది నిజం. ఈ సాంగ్ ప్రతి ఒక్కరి మైండ్‌లోకి, హార్ట్‌లోకి వెళ్లి కూర్చుంది. కాబట్టి ఈ పాట సినిమాకు అద్భుతమైన ప్లస్. ఒక డైలాగ్, విజువల్స్, పంచ్, టీజర్, ట్రైలర్ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇక్కడ ట్రైలర్‌తో పని లేకుండా ఈ సాంగ్ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చింది. అందుకు కారణమైన ప్రతి ఒక్కరికీ కంగ్రాట్స్ చెబుతున్నాను. ఇది ఒక మంచి మూమెంట్. సినిమా మంచి హిట్ అవుతోంది. నేను ట్రైలర్ చూశాను.. ఇప్పుడున్న పరిస్థితులకి చెప్పాలి అనుకున్న విషయాన్ని క్లియర్ గా చెప్పాడు. అలాంటి వాటిని ఏ ప్రేక్షకుడైనా ఆదరిస్తాడు. ఈ సినిమా ఇప్పటికే సక్సెస్ కొట్టినట్లే. తెలుగమ్మాయి, జీవిత రాజశేఖర్ గార్ల కూతురు శివాని చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కానీ.. మంచి నటి. ఆమెకు గర్వంగా చెప్పుకునే పాత్ర ఇంకా పడలేదు. అది ఈ సినిమాతో నెరవేరుతుందని అనుకుంటున్నాను. హీరో రాహుల్ స్టేజ్ మీద మాట్లాడుతుంటే వాళ్ల నాన్నగారు విజయ్ మాస్టర్‌గారు వచ్చారు. మా గురువుగారు ముత్యాల సుబ్బయ్య గారు సినిమాలో విజయ్ గారు ఫైట్ చేస్తూ ఉంటే.. ఆయన్ని చూస్తూ మేము ఎదిగాము. ఈ రోజు ఇక్కడ ఉన్నాం. ఆయన ఇక్కడికి వచ్చి ఈ ఎమోషన్‌ని తట్టుకోలేక లైట్లు పడుతున్నాయ్.. కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయ్ ఏమి అనుకోవద్దు అన్నాడు. ఎమోషన్‌లో వచ్చినవి అవి. నీ తండ్రి ఎమోషన్‌ని రాహుల్.. నువ్వు నిలబెట్టాలి. ఆ రోజే నువ్వు సక్సెస్ అయ్యినట్లు. ‘కోటబొమ్మాళి’ ప్రచార సభ అని మొదలెట్టిన ఈ ఎలక్షన్‌లో.. రేపు ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఆశిస్తూ.. చిత్రయూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని తెలిపారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘కోట బొమ్మాళి సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా. నాకు కూడా ఒక స్పెషల్‌గా ఉండబోతుందీ సినిమా. చాలా రోజుల తర్వాత మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తుంది. ఇందులో మాకంటే.. కథే సినిమా. ఈ సినిమాలో శ్రీకాంత్ కంటే రామకృష్ణే కనబడతాడని అనుకుంటున్నాను. ఎందుకంటే అలా నాచురల్‌గా ఉండేలా తీసుకెళ్లారు. పోలీసులే పోలీసులను వెంటాడితే... ఇదే కాన్సెప్ట్. ఎందుకు ఫాలో చేశారు? దీని వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్ ఏంటి? పొలిటీషియన్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఎంత ఉంది? పోలీసులని పొలిటీషియన్స్ ఎలా వాడుకుంటున్నారు? అనేవి ఇందులో టచ్ చేసుకుంటూ వెళ్లారు. తప్పకుండా ఈ సినిమా మా అందరికీ మంచి సినిమా అవుతుందని.. బ్యానర్‌కి కూడా మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు మొదటగా వాసు గారు కథ చెప్పినప్పుడు.. మీరే డైరెక్ట్ చేయొచ్చు కదా అని అన్నారు. ఎందుకంటే సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఆయన వివరించిన తీరు అలా ఉంది. గీతా ఆర్ట్స్‌ని నా సొంత బ్యానర్‌లా ఫీల్ అవుతాను. పెళ్లి సందడి, పెళ్ళాం ఊరెళితే, సరైనోడు, ఇప్పుడు ఈ సినిమా కూడా అదే బ్యానర్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చేసిన తేజ గారు, హీరో హీరోయిన్లు కానీ, ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు మంచి సినిమా ఇచ్చారు. ఈ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ముందు ముందు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ మిమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను. ఈ నెల 24న వస్తుంది.. అందరూ ఈ సినిమాని థియేటర్‌కు వచ్చి చూడండి. కచ్చితంగా చూసిన అందరికీ ఒక డిఫరెంట్ ఫీల్ కలుగుతుంది.. థ్యాంక్యూ ఆల్’’ అని అన్నారు.
సక్సెస్‌ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా నా కారణంగా కూడా కాస్త ఆలస్యమైంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా. ఈ సినిమాకు శ్రీకాంత్‌గారి షెడ్యూల్ ఉన్నప్పుడు ఆయనని ‘గేమ్ చేంజర్’ సినిమా షూటింగ్‌కి లాక్కెళ్లిపోయేవాడిని. దీనితో రెండు షెడ్యూల్స్ వాయిదా పడ్డాయి. థ్యాంక్యూ వాసు.. ‘గేమ్ చేంజర్’ కోసం ఆ టైమ్‌లో నాకు ఎంతో హెల్ప్ చేశావ్. ‘కోట బొమ్మాళి పీఎస్’.. ఒక మంచి కాన్సెప్ట్‌తో తయారు చేసుకున్న కమర్షియల్ ఫిల్మ్. ఈ సినిమా మాములుగా వస్తే ఎలా ఉండేదో తెలియదు కానీ.. వైరల్ అవుతున్న ‘లింగిడి లింగిడి’ సాంగ్ తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. మా అబ్బాయికి ఇప్పుడు 16 నెలలు. వాడికి రోజు రెండు సార్లు అయినా ఆ పాట పెట్టాల్సిందే. (నవ్వుతూ..) మా ఆవిడ చెప్పే వరకు ఈ సాంగ్ గురించి నాకు తెలియదు. తను చెప్పిన తర్వాత కంటిన్యూస్‌గా సాంగ్ వినిపిస్తూనే ఉంది. ఆ సాంగ్‌తో ఈ మూవీకి హైప్ క్రియేట్ అయింది. చిత్రయూనిట్ అనుకున్నది ఆడియన్స్‌కి రీచ్ అయింది. నవంబర్ 24న ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా ఎగ్జయిట్‌మెంట్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాసుకి సెంటిమెంట్.. నేను ఈవెంట్‌కి రావడం. నేను వస్తాను.. వాసు హిట్‌లు కొడుతూనే ఉంటాడు. ఆల్ ద బెస్ట్ టు టీమ్’’ అని అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘కోట బొమ్మాళి సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా. నాకు కూడా ఒక స్పెషల్‌గా ఉండబోతుందీ సినిమా. చాలా రోజుల తర్వాత మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తుంది. ఇందులో మాకంటే.. కథే సినిమా. ఈ సినిమాలో శ్రీకాంత్ కంటే రామకృష్ణే కనబడతాడని అనుకుంటున్నాను. ఎందుకంటే అలా నాచురల్‌గా ఉండేలా తీసుకెళ్లారు. పోలీసులే పోలీసులను వెంటాడితే... ఇదే కాన్సెప్ట్. ఎందుకు ఫాలో చేశారు? దీని వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్ ఏంటి? పొలిటీషియన్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఎంత ఉంది? పోలీసులని పొలిటీషియన్స్ ఎలా వాడుకుంటున్నారు? అనేవి ఇందులో టచ్ చేసుకుంటూ వెళ్లారు. తప్పకుండా ఈ సినిమా మా అందరికీ మంచి సినిమా అవుతుందని.. బ్యానర్‌కి కూడా మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు మొదటగా వాసు గారు కథ చెప్పినప్పుడు.. మీరే డైరెక్ట్ చేయొచ్చు కదా అని అన్నారు. ఎందుకంటే సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఆయన వివరించిన తీరు అలా ఉంది. గీతా ఆర్ట్స్‌ని నా సొంత బ్యానర్‌లా ఫీల్ అవుతాను. పెళ్లి సందడి, పెళ్ళాం ఊరెళితే, సరైనోడు, ఇప్పుడు ఈ సినిమా కూడా అదే బ్యానర్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చేసిన తేజ గారు, హీరో హీరోయిన్లు కానీ, ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు మంచి సినిమా ఇచ్చారు. ఈ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ముందు ముందు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ మిమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను. ఈ నెల 24న వస్తుంది.. అందరూ ఈ సినిమాని థియేటర్‌కు వచ్చి చూడండి. కచ్చితంగా చూసిన అందరికీ ఒక డిఫరెంట్ ఫీల్ కలుగుతుంది.. థ్యాంక్యూ ఆల్’’ అని అన్నారు.
చిత్ర నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘‘మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. వారితో చేసిన ప్రోగ్రామ్ ఈ సినిమాకు మంచి పబ్లిసిటీగా మారుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమా నాకు ఎందుకు ఇష్టమంటే.. ఎటువంటి ఫిల్టర్ లేకుండా కాశీగారు ఈ సినిమా రాశారు. నిర్మాతలుగా కొన్ని విషయాలు చెప్పడానికి భయపడుతుంటాం. ఎవరినీ హర్ట్ చేయకుండా ఈ మీటర్ వరకు వెళ్లవచ్చంటూ అల్లు అరవింద్‌గారు బ్యాలెన్స్ చేశారు. ఆయనిచ్చిన ధైర్యంతో ఈ సినిమాలో కొన్ని పాయింట్స్ స్ట్రయిట్‌గా చెప్పడం జరిగింది. నేను చాలా ఎలక్షన్స్ చూశాను. అందులో చిన్న చిన్న విషయాలు చాలా పెద్ద స్థాయికి వెళ్తాయి. అటువంటి ఒక చిన్న విషయం.. పెద్ద విషయంగా మారి ఒక ఎలక్షన్‌నే శాసించగలదనేది ఈ సినిమాలో చూపించాం. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడతాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. ఆల్రెడీ నేను సినిమా చూశాను.. డైరెక్టర్ తేజకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. రాహుల్, శివానిలకు ఈ సినిమా మంచి ఫ్లాట్‌ఫామ్ కావాలని కోరుకుంటున్నాను. శ్రీకాంత్‌గారికి థ్యాంక్యూ. ‘ఖడ్గం’లో రాధాకృష్ణ అనే పాత్ర ఎంత పేరు తీసుకువచ్చిందో.. ‘కోట బొమ్మాళి పీఎస్’లో రామకృష్ణ పాత్ర అంత పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన బోయపాటి గారికి థ్యాంక్యూ’’ అని అన్నారు.
‘బేబి’ చిత్ర నిర్మాత SKN మాట్లాడుతూ.. ‘‘ముఖ్య అతిథిగా విచ్చేసిన బోయపాటిగారికి కృతజ్ఞతలు. హైదరాబాద్‌కి చార్మినార్, తాజ్‌మహల్‌కి ఆగ్రా, క్రికెట్‌కు ఈడెన్ గార్డెన్స్ ఎలాగో.. ప్రొడక్షన్ హౌస్‌లకు గీతా ఆర్ట్స్ ఒక ల్యాండ్ మార్క్. ఎంతో మంది హీరోలని, హీరోయిన్లని, దర్శకులని, నిర్మాతలని కూడా పరిచయం చేసిన సంస్థ ఇది. ఈ సంస్థ ద్వారా మరొక మెట్టు ఎక్కుతున్న రాహుల్, శివాని, దర్శకుడు తేజ, నిర్మాత విద్యగారికి, కో ప్రొడ్యూసర్స్‌కి, విజయ్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ రోజు కోటబొమ్మాళి సినిమా వీధివీధికీ వెళ్లిందంటే.. అందుకు కారణం ‘లింగిడి లింగిడి’ పాటే. ఈ పాటే రేపు థియేటర్లకి ప్రేక్షకులను తీసుకువస్తుంది. సమకాలీన రాజకీయాలపై సినిమా అంటున్నారు.. అలాగే ఏవో విమర్శలు కూడా ఉన్నాయని అంటున్నారు. అవేంటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో గెలిచిన తర్వాత ఫ్రూటీ కూడా ఇవ్వరు కానీ.. గెలవక ముందు స్కూటీ ఇస్తామంటూ హామీలు ఇస్తున్నారు. అలాంటివి ఏమున్నాయో ఈ సినిమాలో తెలుసుకోవాలని ఉంది. ఈ సినిమాలో నటించిన శ్రీకాంత్‌గారికి, వరలక్ష్మీ శరత్ కుమార్‌గారికి అందరికీ ఆల్ ద బెస్ట్. అరవింద్ గారు అందరినీ చల్లని చూపుతో చూస్తూ.. ఆయన బావుండి.. మమ్మల్నందరినీ బాగుండేలా చూడాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
‘బేబి’ దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘‘అందరికీ నమస్కారం. అందరూ వేలు పట్టి నడిపిస్తారు.. కానీ అరవింద్ గారు మమ్మల్ని బెత్తం పట్టుకుని నడిపిస్తున్నారు. ఈ సినిమాకు నాకు ఆత్మీయులైన వారు పనిచేశారు. కో ప్రొడ్యూసర్ భాను నాకు ఫ్రెండ్. అతనికి ఈ సినిమా బిగ్ ప్రాజెక్ట్ కావాలని కోరుకుంటున్నాను. విజయ్ మాస్టర్, శివానీ, రాహుల్ అందరికీ గుడ్ లక్. తేజగారు ఈ ప్రాజెక్ట్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టాలని.. ధీరజ్, విద్యక్క ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతలుగా పేరు పొందాలని కోరుకుంటున్నాను. మాకు ఏదైనా కష్టం వస్తే తీర్చడానికి వాసుగారు ఉన్నారనే ధైర్యం ఉంది. ప్రతి విషయంలో ఆయన సపోర్ట్ ఇస్తూ వచ్చారు. సినిమా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్..’’ అని అన్నారు.
హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు వచ్చిన అతిరథ మహారధులందరికీ ధన్యవాదాలు. మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా ఇండస్ట్రీలో గీతా ఆర్ట్స్‌లో చేయాలని ప్రతి ఒక్కరికీ ఓ డ్రీమ్ ఉంటుంది. అయితే నేను మాత్రం ఎప్పుడు అలా అనుకోలేదు. కారణం నేను అంత గమ్యం చేరుకుంటానా? అని అనుకునేవాడిని. అలాంటిది గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి కాల్ రాగానే.. ఫస్ట్ నమ్మలేదు. ఇదంతా స్కామ్ అనుకున్నా. కానీ గీతా ఆర్ట్స్ అంటున్నారు కదా.. అని వెళ్లాను. తర్వాత నమ్మలేకపోయా. కథ కూడా చెప్పవద్దు. ఎక్కడ సంతకం పెట్టమంటారో చెప్పండి అని అడిగాను. అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం పెట్టేసి వచ్చేశా. ఇక షూటింగ్‌కి వెళ్లినప్పుడు బన్నీ వాస్‌గారు నన్ను చూసుకున్న విధానం, పిలిచే విధానం, ఆ రెస్పెక్ట్‌కి ఫిదా అయిపోయా. అలాగే ఈ సినిమా ఓకే చేసి, వారం షూటింగ్ తర్వాత నాకు ఓ యాక్సిడెంట్ అయింది. నన్ను రీప్లేస్ చేస్తారేమో అని భయం ఉండేది. కానీ విద్యక్క.. నువ్వు కోలుకున్నాకే షూటింగ్ అని అన్నారు. థ్యాంక్యూ అక్కా. ఈ సినిమాతో నేను చాలా నేర్చుకున్నాను. అందుకు కారణం దర్శకుడు తేజా గారు. ఒక్క సీన్‌ని రెండు మూడు రకాలుగా చేయించేవారు. మేకింగ్ ఏ బెటర్ యాక్టర్‌గా నన్ను తయారు చేసిన తేజా గారికి ధన్యవాదాలు. విజువల్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్, డ్యాన్స్, సంగీతం ఇలా అన్ని డిపార్ట్‌మెంట్స్ వారు ఈ సినిమాకు మంచి ఎఫర్ట్ పెట్టారు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూస్తానా? అని వెయిట్ చేస్తున్నా. టీజర్‌లోని ‘వేలు మాత్రమే మనది.. గన్ గవర్నమెంట్‌ది’ అనే డైలాగ్ నాకు బాగా ఇష్టం. ఇంకా చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి. సినిమా విషయానికి వస్తే.. కష్టపడి, ఇష్టపడి మీ అందరికీ నచ్చుతుందని చేశాం. నవంబర్ 24న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. తప్పకుండా అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడండి.. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. గీతా ఆర్ట్స్ అనే మహావృక్షాన్ని నిర్మించి.. మేమంతా ఆ వృక్షానికి ఉయ్యాలలు ఊగేలా చేసిన అల్లు అరవింద్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా నాకు గొప్ప అవకాశం అయితే మా నాన్నకు గొప్ప జ్ఞాపకం. అందుకు కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. బోయపాటిగారు ఈ వేడుకకు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు.
హీరోయిన్ శివాని రాజశేఖర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొదటగా ధీరజ్‌గారు నాకు కాల్ చేసి.. గీతా ఆర్ట్స్ వాళ్ళు కోట బొమ్మాళి అనే సినిమా తీస్తున్నారు.. చేస్తావా అని అడిగారు. డైరెక్టర్ ఎవరని అడిగితే తేజ అని అన్నారు. నేను తేజగారి ‘జోహార్’ సినిమా చూసి.. ఆయనకి కాల్ చేసి సర్ మీరు చేసే సినిమాలో చేయడం ఒక లక్.. ఎప్పుడైనా నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాను. తర్వాత ఈ సినిమా కోసం ఆయనని కలిశాను. ఈ సినిమా షూటింగ్ చాలా కష్టంగా ఉంటుంది. కొండలు, కోనలు చెప్పులు లేకుండా ఎక్కాల్సి ఉంటుంది ఓకేనా అన్నారు. అప్పుడు నేను సర్ ఒక యాక్టర్‌గా కొత్త కొత్త క్యారెక్టర్స్ చేయాల్సి ఉంటుంది.. నాకు అవన్నీ ఒక కిక్ ఇస్తాయి.. మీరవేవి పట్టించుకోకండి అనేసి.. కథ చెప్పండి సర్ అన్నాను. కథ విని ఓకే అన్నాను. రాహుల్, శ్రీకాంత్ గారితో మొదటి నుండి షూటింగ్‌లో బాగా ఎంజాయ్ చేశాను. అరకులో షూటింగ్ చాలా బాగా అనిపించింది. జగదీష్ గారి విజువల్స్ అద్భుతంగా ఉన్నాయ్. ఇంకా లింగిడి సాంగ్ లో నటించడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఈ సాంగ్ ఇక్కడే కాకుండా న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో ప్లే అయినప్పుడు ఇంకా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మేము, ఈ సినిమా దగ్గరవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇంతలా ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్యూ సో మచ్. ఈ సినిమాని అందరూ థియేటర్లో మాత్రమే చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. అందరికీ తప్పకుండా ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తూ.. ఈ సినిమాకు నాతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.
చిత్ర దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ.. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చిన అల్లు అరవింద్‌గారికి, బోయపాటిగారికి, దిల్ రాజు గారికి, ఇతర పెద్దలందరికీ ధన్యవాదాలు. ‘కోట బొమ్మాళి పీఎస్’.. లాస్ట్ ఇయర్ ఈ సినిమా జర్నీ స్టార్ట్ చేశాను. నన్ను నమ్మి నాకీ ప్రాజెక్ట్ ఇచ్చిన విద్యాగారు, వాసుగారు, అల్లు అరవింద్‌గారికి థ్యాంక్యూ సో మచ్. ‘లింగిడి లింగిడి’ పాట. ఈ పాట నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆ పాట బాణీ కట్టించి, తయారు చేయించినప్పుడు మధ్యలో ఓ చోట లిరిక్ కావాలి. చాలా మంది లిరిసిస్ట్‌లని అడిగాను. ఒక లిరిసిస్ట్ సీరియస్‌గా అసలు ఇది ఒక పాటేనా? అంటూ ఒక మెసేజ్ పెట్టారు. ఇలా రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ తర్వాత అది ఎందుకు మార్చాలి అని అలా ఉంచేశాను. నేను స్ట్రెస్ ఫీలైనప్పుడు మా డాడీకి కాల్ చేస్తాను.. కానీ ఈ మధ్య ఈ పాట వింటున్నాను. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పోలీస్ ఛేజింగ్ పోలీస్. ఇప్పుడున్న సిస్టమ్‌లో పోలీసులు ఎలా నలిగిపోతున్నారనేది చూపించాలనుకున్నాం. ఒక పొలిటీషియన్ చేతుల్లో పోలీసులు ఎలా కీలుబొమ్మలుగా మారుతున్నారనేది చూపించాం. పవన్ కళ్యాణ్‌గారిని రోడ్ షో చేయకుండా ఆపడం, జగన్‌గారిని ఎయిర్‌పోర్ట్‌లో ఆపడం, చంద్రబాబుగారిపై ప్రస్తుతం జరుగుతున్న సినారియో.. ఇలా ఒక పొలిటికల్ లీడర్ ఎంత ఇంపార్టెంట్. ఆ లీడర్‌ని ఎన్నుకునే ఓటర్ ఎంత ఇంపార్టెంట్? ఓటర్ ఐడీ ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది. ఎందుకు చూడాలనేది అందరికీ 24న తెలుస్తుంది. ఈ సినిమాకు నాకు అన్నీ సమకూర్చిన నిర్మాతలకు, నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన టెక్నీషియన్లు, నటీనటులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బన్నీ వాస్‌గారు, విద్యగారు ఎంతగానో పుష్ చేశారు. నాలో కసి పెంచారు. ఖచ్చితంగా చెప్పగలను.. ఈ సినిమాతో నేను చాలా నేర్చుకున్నాను. సినిమా నుంచి బయటికి వచ్చే ప్రేక్షకులు.. సినిమాలోని మూడు పాత్రలతో మమేకమై వస్తారు. ఇది ఒక ఎమోషనల్ థ్రిల్లర్. ఫస్టాఫ్ అంతా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ని, సెకండాఫ్ అంతా మంచి ఎమోషన్స్‌తో అందరినీ ఈ సినిమా అలరిస్తుంది. రాహుల్, శివాని చాలా చక్కగా నటించారు. వారంతా మిమ్మల్ని హంట్ చేస్తారు. 24న వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ.. అందరికీ ధన్యవాదాలు చెప్పారు.
డైలాగ్ రైటర్ నాగేంద్ర కాశీ మాట్లాడుతూ.. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డే 1 నుంచి నేను రాసిన డైలాగ్స్ పేపర్స్‌ని చూసి.. ఎంకరేజ్ చేసిన బన్నీ వాస్‌గారికి ధన్యవాదాలు. తేజాగారి నెరేటివ్ స్టైల్, టేస్ట్.. ఖచ్చితంగా అందరికీ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. కొన్ని మంచి డైలాగ్స్‌ని కూడా తీసేశారు. ఎందుకంటే.. తూకం తెలిసిన వ్యక్తి. సన్నివేశంతో మంచి అనుభూతిని ఇద్దామనే కన్వెన్షన్‌తో ఆయన ఈ సినిమాకి పనిచేశారు. ఇంత మంచి సినిమాని ప్రేక్షకులకు ఇచ్చిన తేజాగారికి థ్యాంక్స్. ఇదొక కమర్షియల్ ఎంటర్‌టైనర్. అన్ని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ.. నవంబర్ 24న వస్తున్న ఈ సినిమాని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నామని అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ రంజిన్ రాజ్ మాట్లాడుతూ.. ఈ స్టేజ్‌పై ఇలా నిలబడి ఉన్నందుకు ఎంతగానో ఎగ్జయిట్ అవుతున్నాను. ఇది తెలుగులో నా మొదటి చిత్రం. ఒక బ్రిలియంట్ మూవీతో తెలుగుకు పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. 4 రోజుల క్రితమే సినిమాకు సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయి. గీతా ఆర్ట్స్ ద్వారా పరిచయం అవుతున్నందుకు నా కల నెరవేరినట్లుగా భావిస్తున్నాను. ఇందులో కొన్ని ఎక్స్‌పర్‌మెంట్స్ చేశాం. దర్శకుడు తేజ ఎంతగానో సపోర్ట్ చేశారు. నవంబర్ 24న ప్రేక్షఖులు గొప్ప ఎక్స్‌పీరియన్స్‌ను పొందబోతున్నారని ఖచ్చితంగా చెప్పగలను. మంచి లిరిక్స్ అందించిన లిరిక్ రైటర్స్‌కి థ్యాంక్యూ. నాకీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని అన్నారు.
డిఓపి జగదీష్ మాట్లాడుతూ.. గీతా ఆర్ట్స్ అంటేనే మంచి కమర్షియల్ కంటెంట్స్ చేస్తూ.. మంచి క్రియేటివ్ కన్వెన్స్ కూడా చేస్తారు. అందుకే గీతా ఆర్ట్స్‌లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. దర్శకనిర్మాతలు ఎంతగానో సపోర్ట్ అందించారు. శ్రీకాంత్‌గారి సినిమాలకి ఒకప్పుడు నేను అసిస్టెంట్ కెమెరామెన్‌గా వర్క్ చేశాను. ఆయనతో మళ్ళీ వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే రాహుల్ గారు, శివాని రాజశేఖర్ గారికి కూడా.. మేము ఉదయాన్నే రావాలి అంటే వచ్చేసే వారు. కాశీ గారు రాసిన డైలాగులు మంచి ఇన్స్పిరేషన్ గా ఉండేవి. మ్యూజిక్ డైరెక్టర్స్ మిథున్, రంజిత్, కార్తీ శ్రీనివాస్.. ఎడిటర్ గాంధీ గారికి థ్యాంక్ యు. తేజ గారితో నాకిది మూడో సినిమా. ఖచ్చితంగా ప్రేక్షకులని మెప్పిస్తుందని తెలిపారు.
కొరియోగ్రాఫర్ విజయ్ మాట్లాడుతూ.. నాకు అసలు మాటలు రావడం లేదు. ‘కోట బొమ్మాళి’ పాటని ఇంతగా హిట్ చేసిన అందరికి చాలా థ్యాంక్ యు. గీతా ఆర్ట్స్ వర్క్ చేయడం ఎప్పటికీ ప్రౌడ్‌గా ఫీలవుతాను. ఇందులో రెండు పాటలు చేశాను. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు చైతన్య, కౌశిక్.. లిరిక్ రైటర్ రాంబాబు గోశాల, సింగర్ రఘు వంటి వారంతా ప్రసంగిస్తూ.. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరారు. జర్నలిస్ట్‌లైన నాగేంద్ర కుమార్, నిషాంత్, యజ్ఞామూర్తి, లక్ష్మీనారాయణ, వెంకట్, రాజేష్ మన్నె, రాజాబాబు.. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.