pizza
Mehbooba pre release function
యూత్‌కు `మెహ‌బూబా` ప్ర‌ద‌ర్శ‌న‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

9 May 2018
Hyderabad

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'మెహబూబా'. ఈ చిత్రానికి సందీప్‌ చౌతా సంగీతం అందిస్తున్నారు. 1971 ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆకాష్‌ పూరి సరసన నేహాశెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఈ నెల 11న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లో యూత్‌కి చిత్రాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించారు.

దిల్‌రాజు మాట్లాడుతూ ``ఈ నెల 11న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. సినిమా మీద న‌మ్మ‌కంతో ముందు కాలేజీ యూత్‌కి ప్ర‌ద‌ర్శించాం. సినిమా జ‌నాల్లోకి వెళ్ల‌డం చాలా కీల‌కం. కొత్త‌వాళ్ల‌తో తెర‌కెక్కించిన సినిమా త‌ప్ప‌కుండా జ‌నాల్లోకి వెళ్లాలి. పూరి మ‌న‌సు పెట్టి స్క్రిప్ట్ రాస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. 1971 క‌థ‌ని 2018 క‌థ‌తో అందంగా క‌నెక్ట్ చేశారు. జెన్యూన్ ల‌వ్‌స్టోరీ ఇది. డ‌బుల్ పాజిటివ్ చూసిన‌ప్పుడే సినిమా మీద న‌మ్మ‌కం కుదిరింది. మామూలుగా పూరి స్టైల్‌లో ఒక సెటైర్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలాంటిదేమీ ఉండ‌దు`` అని చెప్పారు.

పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ ``సినిమా న‌చ్చ‌డంతో దిల్‌రాజుగారు యువ‌త‌కు ప్ర‌ద‌ర్శించ‌మ‌ని చెప్పేశారు. నిజంగానే జెన్యూన్‌గానే చేశాను. సీన్లు, డైలాగులు బావున్నాయి. ఇడియ‌ట్‌, పోకిరి త‌ర్వాత మా ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఆడియన్స్ ఒక‌చోట న‌వ్వుతార‌ని నేననుకుంటే, వాళ్లు నాలుగు చోట్ల న‌వ్వుతున్నారు. ఇది నాకు స్పెష‌ల్ థ్రిల్‌ని క‌లిగించింది`` అని అన్నారు.

ఛార్మి మాట్లాడుతూ ``ఈ షో పూర్త‌యిన త‌ర్వాత నేరుగా ఎయిర్‌పోర్టుకి వెళ్తున్నాను. టీజ‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి మా సినిమాకు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. యు.ఎస్‌.లో ఈ సినిమాను ప్రీమియ‌ర్ వేస్తున్నాం. ఈ నెల 10న రాత్రి 8 గంట‌ల‌కు అక్క‌డ ప్రీమియ‌ర్ వేస్తాం. యు.ఎస్‌.లో రెండు వారాలుంటాం. అక్క‌డ చాలా థియేట‌ర్ల‌ను, చాలా మందిని క‌లుస్తున్నాం`` అని అన్నారు.

విష్ణు మాట్లాడుతూ ``దిల్‌రాజుగారు సినిమాకు చాలా స‌పోర్ట్ చేస్తున్నారు. సీన్స్ చూస్తుంటే ఒళ్లు గ‌గుర్పొడుస్తోంది`` అని తెలిపారు.

నేహాశెట్టి మాట్లాడుతూ ``యూత్‌తో క‌లిసి సినిమా చూశాక‌, వాళ్లు స్పందించిన తీరు చూసి న‌మ్మ‌కం రెట్టింప‌యింది`` అని అన్నారు.

ఆకాష్ మాట్లాడుతూ ``ఈ షో ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో యు.ఎస్‌.కి వెళ్తున్నాం. మే 11న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం`` అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: సందీప్‌ చౌతా, సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ, యాక్షన్‌: రియల్‌ సతీష్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

 



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved