pizza
Padi Padi Leche Manasu pre release function
'పడి పడి లేచె మనసు' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

17 December 2018
Hyderabad

శర్వానంద్‌, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'పడి పడి లేచె మనసు'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పూ హను రాఘవపూడి దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 21న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా...

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మాట్లాడుతూ - ''చాలా తక్కువ ట్రైలర్స్‌నే చూడగానే నచ్చేస్తాయి. అలాంటి ట్రైలర్స్‌లో 'పడి పడి లేచె మనసు' ఒకటి. నాకు బేసిక్‌గా లవ్‌స్టోరీస్‌ అంటే ఇష్టం. మేజిక్‌గా అనిపించింది. ఇంత మంచి సినిమాను తొలి సినిమాగా ప్రొడ్యూస్‌ చేసిన సుధాకర్‌గారికి అభినందనలు. దర్శకులు, హీరోలే కాదు, నిర్మాతలు కూడా మారాలి. కొత్త సినిమాలు రావాలనే ట్రెండ్‌కు నిర్మాతలు కూడా కారణం కావాలి. లిరిక్‌ రైటర్‌ కృష్ణకాంత్‌, రైటర్‌ హనురాఘవపూడిగారికి కంగ్రాట్స్‌. కెమెరామెన్‌ జె.కెగారు చాలా మంచి విజువల్స్‌ ఇచ్చారు. విశాల్‌గారు పిచ్చెకించేంత మ్యూజిక్‌ ఇచ్చారు. తెలుగు సినిమాల్లో మంచి మ్యూజిక్‌కి కరువుంది. దాన్ని తీర్చే పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్‌ కావాలని, ఆయన జర్నీ బాగా సాగాలని కోరుకుంటున్నాను. ప్రేమమ్‌ మలయాళం చూశాను. తర్వాత ఫిదా, తర్వాత ఎం.సి.ఎ సినిమాలు చూశాను. తను ఎక్స్‌ట్రార్డినరీ ఆర్టిస్ట్‌. అందులో డౌటే లేదు. కానీ.. తనతో సినిమా చేస్తే, తనతో సీన్‌ చేయడానికంటే సాంగ్‌ చేయాలని వెయిట్‌ చేస్తున్నాను. ఎందుకంటే, తను యాక్ట్‌ చేసిన వచ్చిండే సాంగ్‌ను సాయిపల్లవి కూడా చూసుండదు.. అన్నిసార్లు చూసేశాను. వన్‌ ఆఫ్‌ మై ఫేవరేట్‌ డాన్సర్‌, పెర్ఫామర్‌, హీరోయిన్‌ సాయిపల్లవి. డైరెక్టర్‌ హను రాఘవపూడి గురించి చెప్పాలంటే ఆయన అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, లై సినిమాలు చూశాను. ఆయన లవ్‌ సీన్స్‌ను చక్కగా చేశారు. ఆయనతో ఓ లవ్‌ సినిమా చేయాలనుకుంటున్న తరుణంలో శర్వానంద్‌ ఆ ఛాన్స్‌ కొట్టేశాడు. ఆయన సినిమాలన్నింటిలోనూ ఇదే బెస్ట్‌ సినిమా అవుతుందనిపిస్తుంది. ఆయనకి కంగ్రాట్స్‌. శర్వా నాంటే చిన్నోడు. తను గౌరవంగా గారు.. అని సంబోధిస్తున్నానంటే ప్రేక్షకులు తన సినిమాలు చూసి ఓ స్ట్రేచర్‌ ఇచ్చారు. అందుకే తనను గారు అని సంబోధిస్తున్నాను. కె.సి.ఆర్‌, చంద్రబాబు, చిరంజీవి, పవన్‌కల్యాణ్‌.. అని పిలిచేస్తుంటారు. కానీ ఓ పొలిటీషియన్‌కు గౌరవం ఇవ్వకూడదని ఎక్కడా లేదు. ఎవరైనా గౌరవం ఇస్తే తప్పేం లేదు. గమ్యం, ప్రస్థానం నుండి తనని గమనిస్తున్నాను. తను మంచి పెర్ఫామర్‌. తను మంచి పెర్ఫామర్‌ అని అంటే ఓ డైరెక్టర్‌ అన్నాడు. 'లేదండి, తను కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటివి చేయలేడండి' అన్నాడు. 'లేదండి స్కోప్‌ వచ్చినప్పుడు బాగా చేస్తాడు' అన్నాను. తను చేసిన రన్‌ రాజా రన్‌ చూసి ఆయనకు పిచ్చెక్కిపోయింది. నేను ఫోన్‌ చేసి అదేంటిసార్‌ 'శర్వాకు కామెడీ చేయడం రాదు' అన్నారుగా అంటే 'బాబూ నా తప్పు ఒప్పుకుంటాను' అని ఆయన అన్నారు. ఫస్ట్‌ సినిమా నుండి నేను శర్వాను గమనిస్తున్నాను. తను ప్రతి సినిమాకు పెరుగుతున్నాడు. జనం నుండి సంపాదించుకున్న సెల్ఫ్‌ మేడ్‌ హీరో తను. అలాంటి హీరో పక్కన నేను నిలబడటం హ్యాపీగా ఉంది. శర్వాగారికి ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ 21న నా సొంత తమ్ముడు వరుణ్‌తేజ్‌ సినిమా 'అంతరిక్షం' విడుదలవుతుంటే దాన్ని నా ఫ్రెండ్‌ క్రిష్‌ నిర్మించారు. రెండు సినిమాలు బావుండాలి. తెలుగు ఇండస్ట్రీ బావుండాలి. అంతరిక్షం కూడా ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ - ''బన్ని చాలా గోల్డెన్‌ హ్యాండ్‌. తను నా ఫంక్షన్‌కి వచ్చాడు కాబట్టి సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుంది. నేను బన్నికి ఫోన్‌ చేసి 'బన్ని..టచ్‌ చేసి విజయ్‌ దేవరకొండకి రెండు హిట్స్‌ ఇచ్చావ్‌, నన్ను కూడా వచ్చి టచ్‌ చేసి వెళ్లవా!' అన్నాను. అడగ్గానే, ముంబైలోని తను బిజీగా ఉన్నా కూడా, సినిమా 21న కాబట్టి నీ ఫ్లెక్సిబిలిటీని బట్టి నువ్వే చెప్పు.. దాన్ని బట్టి నేను డేట్‌ ఇస్తాను' అన్నాడు. అది అల్లు అర్జున్‌. బన్నికి థాంక్స్‌. చాలా మందికి బన్ని ఇన్‌స్పిరేషన్‌. అందరం మంచి సినిమాలు, డిఫరెంట్‌ సినిమాలు చేస్తాం. కానీ బన్ని మా కంటే ఎందుకు ముందుంటాడంటే తను 100కి 150 పర్సెంట్‌ ఎఫర్ట్‌ పెడతాడు. అలా మా నటులందరికీ తను ఇన్‌స్పిరేషన్‌. చిన్నా, పెద్దా అని లేకుండా, మంచి సినిమా వస్తే, తొలి అప్రిషియేషన్‌ ఫోన్‌ బన్ని నుండే వస్తుంది. సినిమా విషయానికి వస్తే.. హను 'లై' అనే ప్లాప్‌ సినిమా తీశాడు.. శర్వా, సాయిపల్లవికి కలిపితే ఇంతే మార్కెట్‌ ఉంటుంది. దానికి మించి ఖర్చు పెట్టారని అందరూ అడిగారు. కానీ కథను నమ్ముకుని యూనిట్‌ అంతా ట్రావెల్‌ చేశాం. క్రియేటివిటీతో ఇష్టపడి, ఓ మంచి ప్రొడక్ట్‌ను మీ ముందుకు తీసుకొచ్చాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అందుకు కారణం స్క్రిప్టే. నిర్మాతగారు నాకు బ్రదర్‌లా అయిపోయారు. హను నాకు గురువులాగా అయిపోయాడు. కొత్త శర్వాను చూస్తారు. సాయిపల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. డేడికెటేడ్‌ నటి, మంచి నటి. ఈ సినిమా వల్ల తనలాంటి మంచి ఫ్రెండ్‌ నాకు దొరికింది. విశాల్‌ వాళ్ల తండ్రి చనిపోయినా, ఆ బాధను లోపలే పెట్టుకుని ఆర్‌.ఆర్‌ కంప్లీట్‌ చేసిచ్చాడు. తన డేడికేషన్‌కి హ్యాట్సాఫ్‌. జె.కె సినిమాటోగ్రఫీ కారణంగా చాలా అందంగా కనపడ్డాను. కె.కెగారు చాలా మంచి లిరిక్స్‌ అందించారు. 21న మా సినిమాతో పాటు నా తమ్ముడు వరుణ్‌తేజ్‌ సినిమా అంతరిక్షం కూడా విడుదలవుతోంది. తను కూడా కథలను నమ్ముకునే డిఫరెంట్‌ సినిమాలు చేస్తున్నాడు. క్రిస్మస్‌ సీజన్‌ పదిరోజుల సెలవులున్నాయి. రెండు సినిమాలు చూడండి. తెలుగు సినిమాని హిట్‌ చేయండి. ఈ క్రిస్మస్‌ సీజన్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌కి తిరుగేలేదు. రెండు సినిమాలను హిట్‌ చేయండి'' అన్నారు.

డైరెక్టర్‌ హను రాఘవపూడి మాట్లాడుతూ - ''సుధాకర్‌గారు నాకు ఫోన్‌ చేసి మీకొక సర్‌ప్రైజ్‌ అన్నారు. నేను ఏం చెబుతారా? అని అనుకుంటే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు బన్నిగారు గెస్ట్‌ అనగానే షాకయ్యాను. హ్యాపీగా ఫీలయ్యాను. ఇక సినిమా విషయానికి వస్తే.. ఇది చాలా చాలా స్పెషల్‌ మూవీ. దీని ముందు నేను ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్న సమయం. నేను సినిమా చేయాలనుకున్న తరుణంలో పదమూడేళ్లుగా పరిచయం ఉన్న శర్వాను కలిశాను. లవ్‌స్టోరీ అయితే మరో ఆలోచన లేకుండా చేసేద్దాం అన్నారు. రెండున్నర గంటల పాటు సినిమా ప్రేక్షకులను సినిమాల్లోకి తీసుకెళ్లిపోతుంది. ఆ రెండున్నర గంటలు సూర్య, వైశాలి కథలు మాత్రమే కనపడతాయి. అందుకు కారణంగా సూర్యగా నటించిన శర్వానంద్‌, వైశాలిగా సాయిపల్లవినే కారణం. వారి పెర్ఫామెన్స్‌ అందరినీ కట్టిపడేస్తుంది. సినిమాకు తగ్గ కథ, సంగీతం, నటులు ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయి. ఈ మూడు కూడా అద్భుతంగా కుదిరాయి. నెవర్‌ బిఫోర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఉంటుంది. విశాల్‌ చంద్రశేఖర్‌ మంచి పాటలు ఇచ్చాడు. పాటలు రాసిన కె.కెకి థాంక్స్‌. కెమెరామెన్‌ జయకృష్ణతో పన్నెండేళ్ల తర్వాత కలిసి చేస్తున్నాం. కోల్‌కత్తాను ఎవరూ క్యాప్చర్‌ చేయనంత అందంగా చేశాడు. పారిస్‌కు లవ్‌ అనే ఎలిమెంట్‌ను ఎలా కనెక్ట్‌ చేస్తారో, ఈ సినిమా చూసిన తర్వాత మీకు అదే అనుభూతి కలుగుతుంది. నిర్మాత సుధాకర్‌గారికి సినిమా అంటే పిచ్చి. సినిమాలపై అంత పిచ్చి ఉన్న నిర్మాతను నేను కలవలేదు. రైట్‌ టైంలో, కరెక్ట్‌ సపోర్ట్‌ను ఇచ్చారు. ఆయనకు ఎన్నిసార్లు థాంక్స్‌ చెప్పినా తక్కువే. అందరికీ థాంక్స్‌'' అన్నారు.

సాయిపల్లవి మాట్లాడుతూ - ''బన్నిగారి డాన్సులకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన ఈరోజు మా ఫంక్షన్‌కి అతిథిగా రావడం కల నిజమైనట్లుగా ఉంది. హనుగారికి థాంక్స్‌. అలాగే శర్వానంద్‌ వండర్‌ఫుల్‌ కోస్టార్‌. చాలా మంచి వ్యక్తి. జె.కె. అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. ప్రతి ఎమోషన్‌ను చక్కగా క్యాప్చర్‌ చేశారు. విశాల్‌గారు తన మ్యూజిక్‌తో సినిమాను నెక్స్‌ట్‌ లెవల్‌కు తీసుకెళ్లారు. నిర్మాత సుధాకర్‌గారి వల్లనే ఇంత మంచి సినిమా చేయగలిగాం'' అన్నారు.

నటుడు అజయ్‌ మాట్లాడుతూ - ''నిర్మాత సుధాకర్‌గారికి అభినందనలు. శర్వానంద్‌, సాయిపల్లవి యాక్టింగ్‌ ఈ సినిమాలో అమేజింగ్‌గా ఉంటుంది. మంచి ఎమోషన్స్‌ ఉంటాయి. విశాల్‌గారికి నేను పెద్ద ఫ్యాన్‌గా మారిపోయాను. అమేజింగ్‌ మ్యూజిక్‌ అందించారు. డైరెక్టర్‌ హను నాకు మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు'' అన్నారు.

పాటల రచయిత కృష్ణకాంత్‌ మాట్లాడుతూ - ''హను రాఘవపూడి ప్రతి సినిమాలో నేను పాట రాశాను. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఆరు పాటలు రాశాను. ఒక్కొక్క పాటకు విశాల్‌ చంద్ర శేఖర్‌ ఎంత మంచి మ్యూజిక్‌ ఇచ్చాడో.. అంతే మంచి లిరిక్స్‌ కుదిరాయి. హను రాఘవపూడి ఎంతో విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు. ఒకే ఒక పదం తప్ప.. ఇంగ్లీష్‌ పదం లేకుండా రాశాను. ఆల్బమ్‌ను హిట్‌ చేసిన ప్రేక్షకులు, సినిమాను కూడా పెద్ద హిట్‌ చేస్తారని నమ్ముతున్నాను. నిర్మాతగారు పెట్టిన ప్రతి రూపాయికి పది రూపాయలు లాభంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

డైరెక్టర్‌ సుధీర్‌ వర్మ మాట్లాడుతూ - ''నేను హను రాఘవపూడికి పెద్ద ఫ్యాన్‌ని. నేను శర్వాతో సినిమా స్టార్ట్‌ చేసినప్పుడే తను కూడా మూవీ స్టార్ట్‌ చేశాడు. కాకపోతే ముందుగానే సినిమాను పూర్తి చేసేశాడు. పాటలు, విజువల్స్‌ చాలా బావున్నాయి. అందరికీ కెరీర్‌ బెస్ట్‌ మూవీ అవుతుందనిపిస్తుంది. నిర్మాతగారికి అభినందనలు. సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది'' అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ విశాల్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమాకు పనిచేయడం వల్ల కొత్త విషయాలు నేర్చుకున్నాను. నాకొక కొత్త స్టార్ట్‌. ఇలాగే ప్రతి సినిమాకు మంచి మ్యూజిక్‌ ఇస్తాను'' అన్నారు.

ప్రియదర్శి మాట్లాడుతూ - ''పడి పడి లేచె మనసు' ఓ బ్యూటీఫుల్‌ క్రియేషన్‌. హను అన్నకు థాంక్స్‌. విశాల్‌ అద్భుతమైన మ్యూజిక్‌ అందించారు'' అన్నారు.

నిర్మాత అనీల్‌ సుంకర మాట్లాడుతూ -''హను సినిమా పట్ల పైశాచికమైన ప్రేమ ఉండే వ్యక్తి. సినిమా విజువల్స్‌ చాలా బావున్నాయి. విశాల్‌ చంద్రశేఖర్‌ బ్యూటీఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. శర్వా, సాయిపల్లవిని తెరపై చూడటానికి చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను'' అన్నారు.

 



Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved