pizza
Prema Janta pre release function
`ప్రేమ‌జంట‌` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


18 June 2019
Hyderabad

సన్ వుడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ప్రణీత్, సుమయ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `ప్రేమ‌జంట‌`. స్క్రీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ద‌గ్గుబాటి వ‌రుణ్ ఈ చిత్రాన్ని జూన్ 28న విడుద‌ల చేస్తున్నారు. మహేష్ మొగుళ్ళూరి నిర్మాత. నిఖిలేష్ తొగరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా రీసెంట్‌గా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్‌ను పొందింది. మంగ‌ళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథులుగా డైరెక్ట‌ర్ సాగ‌ర్‌, టి.ప్ర‌స‌న్న‌కుమార్ పాల్గొన్నారు. డైరెక్ట‌ర్ సాగ‌ర్ ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా..

డైరెక్ట‌ర్ సాగ‌ర్ మాట్లాడుతూ ``ట్రైల‌ర్‌, పాట‌ల్లో చూపించినట్టుగా ఈ చిత్రంలోని ప్రేమ జంట సూసైడ్ వరకు వెళ్లారంటే ఎన్ని కష్టాలు పడ్డారో అర్థమవుతోంది. పిక్చరైజేషన్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వేల్యూస్ కూడా చాలా బావున్నాయి. అమ్మాయి అబ్బాయి కూడా బాగా నటించారు. అందంగా ఉన్నారు అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ``సినిమాను ప్రతిఒక్కరూ నిర్మిస్తారు కానీ విడుదల వరకు తీసుకురావడం అంత తెలికేమీ కాదు. కానీ ఈ చిత్ర నిర్మాత మహేష్ గారు ఆ కష్టాన్ని అధిగమించినట్టు కనిపిస్తున్నారు.

ఆయన పెట్టిన డబ్బు తిరిగి రావాల‌ని కోరుకుంటున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా కనపడుతుంది. ఇటీవల వచ్చిన యూత్ ఫుల్ కంటెంట్‌తో ఉన్న మూవీస్ అన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఈ `ప్రేమ జంట` కూడా విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను`` అన్నారు.

దగ్గుబాటి వరుణ్ మాట్లాడుతూ ``మా బ్యానర్ లో ఈ సినిమా విడుదల కానుండడం చాలా ఆనందంగా ఉంది. కంటెంట్ గురుంచి తెలియగానే వెంటనే సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాము. నిఖిలేష్ మహేశ్ ఇద్దరూ స్నేహితులు అవడంతో ఈ సినిమాను ఎంకరేజ్ చేశాను. మంచి సబ్జెక్ట్ తో వస్తున్నాం ఆదరించండి`` అన్నారు.

నిర్మాత మహేష్ మాట్లాడుతూ `` సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న నేను సినీ ఫీల్డ్ లోనికి రావడం జరిగింది. కంటెంట్ చాలా బాగుంది. గ్రేస్ ఫుల్ అబ్బాయి, బ్యూటిఫుల్ అమ్మాయి ల ప్రేమే ఈ చిత్రం. అందరికీ నచ్చేలా తెరకెక్కించాడు దర్శకుడు నిఖిలేష్ మిమ్మల్ని తప్పకుండా అలరించే చిత్రం అవుతుంది`` అన్నారు.

దర్శకుడు నిఖిలేష్ మాట్లాడుతూ `` పదమూడేళ్ల క్రితం ఓ కల కన్నాను. ఆ కల ఇప్పుడు ఇలా నిర్మాత మహేష్ వలన ఈ రోజు నిజమైంది. మహేష్ నా స్నేహితుడు మా జర్నీ లో సినిమాపై ఇంట్రెస్టింగ్ తో అడుగుపెట్టడం జరిగింది. ఔట్ ఫుట్ చాలా బాగోచ్చింది. పెళ్లి చేసుకోవడానికి ఉన్న వయసు. ప్రేమించడానికి పనికి రాదా... ? ఒక వేళ ప్రేనిస్తే ఎలాంటి పరుణామాలను ఎదుర్కుంటారనే ముఖ్యాంశాలు ఈ ప్రేమజంట సినిమాలో చూపించాం. సహజంగా తీసిన కథాంశం కనుకే సహజంగా ఉన్న యాక్టర్స్‌ని తీసుక‌న్నాం. మ్యూజిక్ కూడా అద్భుతంగా వచ్చింది. నిర్మాత మహేష్ పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగితీరుతుంది..అది ఈ నెల 28న సినిమా విడుదలైన తరువాత మీకే అర్థం అవుతుందని చెప్పుకొచ్చారు.

హీరోయిన్ సుమయ‌ మాట్లాడుతూ `` నాకు యాక్టింగ్ లో జీరో నాలెడ్జ్. కానీ డైరెక్టర్ సర్ ఎంతో ప్రొత్సహించారు. అందరం కష్టపడి పనిచేసాము. మా కష్టం యెక్క ఫలితం దాని తాలూకు విజయం సినిమా విడుదల అయ్యాక తెలుస్తుంది. బ్యూటిఫుల్ లవ్ స్టొరీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా`` అని తెలిపారు.

ప్రసన్న కుమార్, టిక్ టాక్ దినేష్, బెంజ్ బాబు, సురేష్ శెట్టి పల్లి లతో పాటు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రామ్ ప్రణీత్, సుమయ , రాజా రవీంద్ర, ఉత్తేజ్, షఫీ, సూర్య, బెంజ్ బాబు, దినేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: నిఖిలేష్, డిఓపి: సురేష్ శెట్టిపల్లి, ఎడిటర్: ఎమ్ ఆర్. వర్మ, డిటీఎస్: కృష్ణం రాజు, సౌండ్ ఈఫ్: యతి రాజు, ప్రొడ్యూసర్: మహేష్ మొగులూరి, డైరెక్టర్: నిఖిలేష్ తోగరి.

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved