pizza
Raa Raa pre release function
`రా..రా` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

17 February 2018
Hyderabad

హీరో శ్రీకాంత్ , నాజియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రా రా’. . శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 23న విడుద‌ల‌వుతుంది. విజీ చెర్రిష్ ద‌ర్శ‌కుడు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో శ్రీకాంత్‌, నాని, త‌రుణ్‌, రఘుబాబు, అలీ, హేమ‌, సదానంద్, నిర్మాత అశోక్‌, ప్ర‌తాప్‌, ఖ‌య్యుమ్‌, భూపాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

స‌దానంద్ మాట్లాడుతూ - ``ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌. సినిమా పెద్ద స‌క్సెస్ సాధించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

నాని మాట్లాడుతూ - ``నాకు అష్టాచ‌మ్మా నుండి శ్రీకాంత్‌గారితో మంచి ప‌రిచ‌యం ఉంది. న‌టుడిగా ఆయ‌నేంటో అంద‌రికీ తెలుసు. ఇప్పుడు హార‌ర్ మూవీ రా.. రా చేస్తున్నారు. ఈ సినిమా ఆయ‌న‌కు మ‌రో పెద్ద హిట్ చిత్రంగా నిలవాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

త‌రుణ్ మాట్లాడుతూ - ``శ్రీకాంత్‌గారి 125వ సినిమా ఇది. అంద‌రూ క‌మెడియన్స్ క‌లిసి ఈ సినిమాలో న‌టించారు. సినిమా పెద్ద స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

అలీ మాట్లాడుతూ - ``శ్రీకాంత్ తొలిసారి హార‌ర్ సినిమా చేస్తున్నారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌గారి చంద్ర‌ముఖి సినిమాలో రా..రా... అనే ప‌దం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ నెల 23న సినిమా విడుద‌ల‌వుతుంది`` అన్నారు.

ర‌ఘుబాబు మాట్లాడుతూ - ``నిర్మాత విజ‌య్‌తో మంచి అనుబంధం ఉంది. ద‌క్షిణాది ఉన్న సినిమా ప‌రిశ్ర‌మ‌లో తెలుగులోనే ఎక్కువ మంది క‌మెడియ‌న్స్ ఉన్నారు. ప్ర‌తి స‌న్నివేశాన్ని ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తారు`` అన్నారు.

నిర్మాత శ్రీమిత్ర చౌద‌రి మాట్లాడుతూ - ``శ్రీకాంత్‌గారితో 24 సంవ‌త్స‌రాల అనుబంధం ఉంది. నా స్వంత బ్ర‌ద‌ర్‌లాంటి వ్య‌క్తి. ఈ క‌థ విన్న త‌ర్వాత విజ‌య్ డైరెక్ట్ చేయాల‌ని అనుకున్నాం. శ్రీకాంత్‌గారి వంటి సీనియ‌ర్ హీరో ఇలాంటి సినిమా చేయ‌డం గొప్ప విషయం. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది`` అన్నారు.

నిర్మాత విజ‌య్ మాట్లాడుతూ - ``శ్రీకాంత్‌గారితో ఉన్న అనుబంధ‌మే ఈ సినిమా చేయ‌డానికి మ‌మ్మ‌ల్ని ముందుకు న‌డిపించింది. సినిమా బాగా వ‌చ్చింది. ఈ నెల 23న సినిమా విడుద‌ల‌వుతుంది. త‌ప్ప‌కుండా ఎంటైర్‌టైనింగ్‌గా ఆక‌ట్టుకుంటుంది`` అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు ష‌కీల్ మాట్లాడుతూ - ``నాపై న‌మ్మ‌కంతో నాకు సినిమాకు సంగీతం అందించే అవకాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, హీరో శ్రీకాంత్ అన్న‌య్య‌కు థాంక్స్‌`` అన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ - ``నాని, త‌రుణ్‌ల‌కు నా స్పెష‌ల్ థాంక్స్‌. మ‌మ్మ‌ల్ని స‌పోర్ట్ చేయ‌డానికి ఇక్క‌డ‌కు వ‌చ్చిన అంద‌రికీ థాంక్స్‌. హార‌ర్ జోన‌ర్‌లో నేను చేసిన తొలి సినిమా. హార‌ర్ సినిమాలు చాలానే ఉన్నా.. ఈ సబ్జెక్ట్ కొత్త‌గా ఉంటుంది. ఈ 23న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా నాకు మంచి స‌క్సెస్ అవుతుందనే న‌మ్మ‌కం ఉంది. నిర్మాత‌లు విజ‌య్‌, శ్రీమిత్ర చౌద‌రిల‌కు థాంక్స్‌`` అన్నారు.

 


 
Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved