pizza
Saaho pre release function
`సాహో` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


18 August 2019
Hyderabad

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్ నిర్మాత‌లుగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `సాహో`. బాలీవుడ్ భామ శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రం ఆగ‌స్ట్ 30న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా..

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధాక‌పూర్‌, అల్లు అర‌వింద్‌, సుజిత్‌, దిల్‌రాజు, శ్యామ్‌ప్ర‌సాద్ రెడ్డి, సాబుసిరిల్, ముర‌ళీశ‌ర్మ‌, ర‌వివ‌ర్మ‌, `జిల్` ఫేమ్ రాధాకృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ర‌వివ‌ర్మ మాట్లాడుతూ - ``బిగ్గెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా `సాహో` రూపొందుతోంద‌ని నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రేపు థియేట‌ర్స్‌లో మీరే చూస్తారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నేను పార్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది`` అన్నారు.

ముర‌ళీశ‌ర్మ మాట్లాడుతూ - ``యు.వి.క్రియేష‌న్స్‌ను నా హోం బ్యాన‌ర్‌లానే ఫీల్ అవుతుంటాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు నిర్మాత‌ల‌కు థ్యాంక్స్‌. సుజిత్‌కి థ్యాంక్స్‌. త‌నొక యంగ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్‌. ప్ర‌భాస్‌గారు న‌న్ను ఎంత‌గానో ఆద‌రించారు. నేను 70 రోజులు వ‌ర్క్ చేశాను. అందులో 55 రోజులు ఆయ‌న ఇంటి నుండే నాకు తిండి తెచ్చిపెట్టారు. సినిమా షూటింగ్‌ను ఎంజాయ్ చేస్తూ చేశాం`` అన్నారు.

సాబుసిరిల్ మాట్లాడుతూ - ``సినిమాను చాలా బాగాఎంజాయ్ చేస్తూ చేశాం. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థ్యాంక్స్‌`` అన్నారు.

నిర్మాత విజ‌య్ చిల్లా మాట్లాడుతూ - ``ఈ వేడుక చూస్తుంటేనే సినిమా ఎలా ఉండ‌బోతుందో అర్థ‌మ‌వుతుంది. సినిమా ఇండియా సినిమా చ‌రిత్ర‌లో బిగ‌స్ట్ మూవీ అవుతుంద‌ని భావిస్తున్నాను`` అన్నాను

రాధాకృష్ణ మాట్లాడుతూ - ``ఇది మా మూవీ. నాలుగు సంవ‌త్స‌రాల క‌ష్టమిది. నిర్మాతల క‌ష్టానికి త‌ల వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. సుజిత్ చాలా మంది యువ ద‌ర్శ‌కుల‌కు ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచాడు`` అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ - ``ముందు రాజ‌మౌళిగారికి థ్యాంక్స్‌. ఒక తెలుగు సినిమాను ఇండియా లెవ‌ల్లో.. బాహుబ‌లి పార్ట్ 1, బాహుబ‌లి పార్ట్ 2తో తెలుగు సినిమా స‌త్తాను చాటారు. అందుకు ఆయ‌న‌కు ప్ర‌భాస్ ఫ్యాన్స్ త‌ర‌పున‌, తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ త‌ర‌పున థ్యాంక్స్ చెబుతున్నాను. యు.వి.క్రియేష‌న్స్ మిర్చి సినిమాను నేను చేసిన మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ కంటే ఎక్కువ బ‌డ్జెట్ పెట్టి చేశారు. అంత బ‌డ్జెట్‌లో ఎందుకు సినిమా చేస్తున్నారు అని అడిగితే మా ప్ర‌భాస్ కోసం క‌దా! అన్నారు. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ డేట్స్ ఇస్తే ఏ ప్రొడ‌క్ష‌న్ హౌస్ అయినా డ‌బ్బులు సంపాదించుకోవాల‌ని చూస్తుంది. బాహుబ‌లి పార్ట్ 2 కంటే ఎక్కువ బ‌డ్జెట్ పెట్టి ఈ సినిమాను చేశారు. మ‌ళ్లీ ఎందుకు ఇంత బ‌డ్జెట్ అంటే.. `అన్నా ప్ర‌భాస్ కోసమే` అన్నారు నిర్మాత‌లు. నిర్మాత వంశీ చెన్నైలో కూర్చుని సాహోను మ‌న‌కు చూపెట్ట‌డానికి 24 గంట‌లు క‌ష్ట‌ప‌డుతున్నారు. యు.వి.క్రియేష‌న్స్ నిర్మాత‌లైన వంశీ, ప్ర‌మోద్‌, విక్కీల‌కు ఆల్ ది బెస్ట్‌. వారు న‌న్ను చూసి సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చామ‌ని చెబుతారు. కానీ నేను వారిని చూసి ఆల్ ఇండియా సినిమా ఎలా తీయాలో నేర్చుకుంటున్నాను. మ‌న తెలుగు సినిమాను ఆల్ ఇండియా లెవ‌ల్‌కు తీసుకెళ్లారు. ఆగ‌స్ట్ 30 కోసం వెయిట్ చేస్తున్నాం. సుజిత్ అదృష్ట‌వంతుడు. రాజ‌మౌళికి తెలుగు సినిమాను ఆల్ ఇండియా రేంజ్ మూవీగా చేయ‌డానికి 15 ఏళ్లు ప‌డితే, సుజిత్ రెండో సినిమాకే ప్ర‌భాస్‌తో ఆల్ ఇండియా మూవీ చేశాడు. త‌న‌కు హ్యాట్సాఫ్‌. టీజ‌ర్ చూస్తుంటే నీ విజ‌న్‌కి ఆశ్చ‌ర్య‌పోయాను. సుజిత్ కీప్ ఇట్ అప్‌. చాలా మంది గ్రేట్ టెక్నిషియ‌న్స్ ఈ సినిమాకు ప‌నిచేశారు. టీజ‌ర్ చూస్తుంటే ప్ర‌భాస్ ఏ రేంజ్‌లో కొట్ట‌బోతున్నాడో అర్థ‌మ‌వుతుంది. ప్ర‌భాస్ ల‌వ‌బుల్ ప‌ర్స‌న్‌. బాహుబ‌లి1, బాహుబ‌లి 2లాగానే సాహో కూడా ఆల్ ఇండియాలెవ‌ల్లోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద హిట్ కావాలి. తెలుగు సినిమా, తెలుగు ప్ర‌జ‌లు గ‌ర్వ‌ప‌డేంత హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు సుజిత్ మాట్లాడుతూ - ``సాధార‌ణంగా ఫ్యాన్స్ అంద‌రికీ ఉంటారు. కానీ ప్ర‌భాస్‌కి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే వారి ఓపిక‌కు నా హ్యాట్సాఫ్‌. బాహుబ‌లి త‌ర్వాత వెంట‌నే ప్ర‌భాస్ సినిమా రావాల‌ని అభిమానులు కోరుకుంటారు. కానీ మ‌రోసారి రెండేళ్లు `సాహో` కోసం వెయిట్ చేశారు. మిర్చి స‌మ‌యంలో నేను చేసిన షార్ట్ ఫిలింస్ చూసిన ప్ర‌భాస్‌గారి నుండి నాకు పిలుపొచ్చింది. నేనెక్క‌డ? ప‌్ర‌భాస్ గారెక్క‌డ‌? అనిపించింది. నేను వెళ్ల‌లేదు. త‌ర్వాత వెళ్లి క‌లిస్తే.. అదేంటి డార్లింగ్ అప్పుడెప్పుడో పిలిస్తే రాలేదు అన్నారు. త‌ర్వాత `సాహో` సినిమా కుదిరింది. ప్ర‌భాస్‌గారికి సినిమా అంటే ప్యాష‌న్‌. రాజ‌మౌళిగారితో ప‌నిచేసిన ప్ర‌భాస్‌గారు `సాహో`సినిమాలో నాతో వ‌ర్క్ చేశారు. నన్ను న‌మ్మి ప్ర‌భాస్ అన్న‌.. సినిమా చేశాడు. `నువ్వు తీయ‌గ‌లుగుతావ్ డార్లింగ్‌` అంటూ నాలో కాన్ఫిడెంట్‌ను పెంచారు. క‌థ‌ను న‌మ్మి నాతో వ‌ర్క్ చేసిన టెక్నీషియ‌న్స్‌కు థ్యాంక్స్‌. మ‌దిగారు నా ప‌క్క‌న లేకుంటే ఈ సినిమా ఇంత‌లా చేసుండేవాడిని కానేమో. అలాగే బాహుబ‌లి చేసిన సాబుసిరిల్‌గారు .. ఏదైనా కొత్త‌గా చేయాల‌ని ప్ర‌య‌త్నించారు. అలాగే శ్రీక‌ర్ ప్ర‌సాద్‌గారు పెద్ద పెద్ద ద‌ర్శ‌కుల వ‌ద్ద ప‌నిచేశారు. ఆయ‌న క‌థ విని ప్రాప‌ర్‌గా ముందుకు తీసుకెళ్లారు. క‌మ‌ల్ క‌ణ్ణన్‌గారికి థ్యాంక్స్‌. జిబ్రాన్ నా సోద‌రుడితో స‌మానం. సినిమా కోసం ది బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చారు. నిర్మాత‌లు వంశీ, ప్ర‌మోద్‌, విక్కీలు నా అన్న‌య్య‌ల్లా నా ప‌క్క‌న నిల‌బ‌డ్డారు. నాపై ఎలాంటి ప్రెష‌ర్ లేకుండా చూసుకున్నారు. ఇంత మంచి నిర్మాత‌ల‌ను చూడ‌నేమో. హీరోయిన్‌గా ఎవ‌రిని తీసుకోవాల‌ని అనుకున్న‌ప్పుడు శ్ర‌ద్ధాక‌పూర్ అయితే బావుంటుంద‌ని అనుకున్నాం. త‌ను ఎంత క‌ష్ట‌ప‌డిందో ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మై ఉంటుంది. రేపు సినిమాలో చూస్తారు. త‌ను తెలుగును చాలా క‌ష్ట‌ప‌డి నేర్చుకుని మ‌రీ న‌టించింది. అరుణ్ విజ‌య్‌గారికి థ్యాంక్స్. నీల్ నితిన్ ముఖేష్‌గారికి, చంకీపాండేగారికి,ముర‌ళీశ‌ర్మ‌గారికి, లాల్‌గారికి అంద‌రికీ థ్యాంక్స్‌`` అన్నారు.

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ - ``సాధార‌ణంగా ఏ ప‌ని అయినా చేసేట‌ప్పుడు గ‌ణ‌ప‌తిపూజ చేసుకుంటాం.అలాగే పెద్ద సినిమాకు బాహుబ‌లిని త‌లుచుకుంటాం. అలాంటి సినిమాలో అప్ప‌ట్లో మామూలు హీరో.. ఇవాళ ఆల్ ఇండియా స్టార్స్ వారితో పోల్చుకోలేని రేంజ్‌కి ఎదిగిన మ‌న తెలుగువాడు.. మ‌న హీరో ఇంత పెద్ద‌వాడు కావ‌డం చాలా గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం. త‌ర్వాత నిర్మాత‌లు వంశీ, ప్ర‌మోద్‌, విక్కీల‌కు భ‌య‌మేంటో తెలియ‌దు. దానివ‌ల్ల వంద‌ల‌కోట్లు ఖ‌ర్చు పెట్టి `సాహో` సినిమాను చేశారు. ఇంత పెద్ద సినిమా రాలేదు.. ఇక ఎప్ప‌టికొస్త‌దో అనే రేంజ్‌కి తీసుకెళ్లిన ద‌ర్శ‌కుడికి, నిర్మాత‌ల‌కు, ఆ ధైర్యానిచ్చిన రాజ‌మౌళికి థ్యాంక్స్‌. త‌ర్వ‌లోనే రాబోతున్న ఈ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

శ్ర‌ద్ధాక‌పూర్ మాట్లాడుతూ - ``సాహో సినిమా కార‌ణంగా హైద‌రాబాద్ నా సెకండ్ హోంలా మారింది. ఈ సినిమాకు ప‌నిచేయ‌డం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్‌. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది. నా తొలి తెలుగు చిత్రమిది. ప్ర‌భాస్‌తో వ‌ర్క్ చేయ‌డం అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్‌. అంద‌రికీ థ్యాంక్స్‌`` అన్నారు.

డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ - ``నా ప్ర‌భ.. మా అంద‌రీ ప్ర‌భ.. మ‌న ప్ర‌భాస్‌. యు.వి.క్రియేష‌న్స్ నిర్మాత‌లు వంశీ, ప్ర‌మోద్‌, విక్కీల‌కు మ‌నుషుల‌కు ఉండే గుండె కాదు.. సింహాలు..పులల‌కు ఉండే గుండె ఏదో ఉండి ఉంటుంది. అంద‌రికీ భ‌యం ఉంది కానీ.. వారికి మాత్రం భ‌యం లేదు. అందుకు కార‌ణం వారి వెన‌క ప్ర‌భాస్ ఉన్నాడ‌నే ధైర్యం. ప్ర‌భాస్‌ను ప్రేమించే ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాను ఎక్క‌డికో తీసుకెళ‌తార‌నే ధైర్యం. సుజిత్‌కి ఆల్ ది బెస్ట్‌. బాహుబ‌లి త‌ర్వాత ఎలాగైతే రాజ‌మౌళి గురించి ప్ర‌పంచం అంతా మాట్లాడుకున్నారో.. సాహో త‌ర్వాత సుజిత్ గురించి ప్ర‌పంచం అంతా మాట్లాడుకోవాల‌నుకుంటున్నాను. ప్ర‌భాస్ మీ అంద‌రికీ హీరోగానే తెలుసు. మా అంద‌రికీ త‌నో గొప్ప స్నేహితుడు. త‌న‌లాంటి ఫ్రెండ్ మ‌న జీవితంలో ఉంటే మ‌న‌కేం అవ‌స‌రంలేదు. త‌ను ఫ్రెండ్స్ అంత గొప్ప వేల్యూ ఇస్తాడు. ట్రైల‌ర్ చూసి ఆల్ రెడీ పిచ్చెక్కిపోయింది. ఇప్పుడు సాంగ్ చూసి పిచ్చెక్కింది. ప్ర‌భాస్ అంత సూప‌ర్‌గా ఉన్నాడు. త‌న లుక్ అదిరిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు హిందీలో రూ.42కోట్లు షేర్ వ‌చ్చింది. అదే హ‌య్య‌స్ట్ అంటున్నారు. ఈ సినిమాకు రూ.50కోట్లు షేర్ వ‌స్తుంద‌ని చెప్పుకుంటున్నారు. మ‌న ప్ర‌భాస్ అంత పెద్ద స్టార్ అయినందుకు హ్యాపీగా ఉంది. త‌ను ఇంకా తెలుగు సినిమాను ఎక్క‌డికో తీసుకెళ్లాలి. 1000కోట్లు, 2000 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌కి తీసుకెళ్లాల‌ని కోరుకుంటున్నాను. నువ్వు నిజంగా ఆ స్థాయికి ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి మాట్లాడుతూ - ``సాధార‌ణంగా ఏహీరో ఫ్యాన్స్ అయినా వారి హీరో సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటారు. కానీ ప్ర‌భాస్ సినిమా హిట్ కావాల‌ని అంద‌రి హీరోల ఫ్యాన్స్ కోరుకుంటారు. త‌ను చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. త‌ను ఎవ‌రి గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడ‌డు. అదే త‌న‌కి అంత మంది ఫ్యాన్స్‌ని సంపాదించిపెట్టింది. ఇప్పుడు సాహో వ‌స్తుంది. ప్ర‌భాస్‌కి దూర‌దృష్టి ఎక్కువ‌. బాహుబ‌లి సినిమా క‌థ చెప్పిన‌ప్పుడు త‌ర్వాత సినిమా ఏంట‌ని? చాలా త‌పన‌ప‌డ్డాడు. బాహుబ‌లి చాలా పెద్ద హిట్ అవుతుంది. దీని త‌ర్వాత ఏ సినిమా చేయాల‌ని త‌ప‌న ప‌డేవాడు. ఓరోజు చాలా ఎగ్జ‌యిటెడ్‌గా వ‌చ్చాడు. సుజిత్ క‌థ చెప్పాడు ఫెంటాస్టిక్‌గా ఉందని చెప్పాడు. బాహుబ‌లి త‌ర్వాత మ‌రో పెద్ద డైరెక్ట‌ర్‌తో సినిమా చేయాల‌ని కాకుండా సుజిత్ చెప్పిన క‌థ‌ను న‌మ్మి సాహో సినిమా చేశాడు. సుజిత్ చాలా చిన్న కుర్రాడు. ఇంత పెద్ద సినిమాను హ్యాండిల్ చేయ‌గ‌ల‌డా? లేదా? అని చాలా మంది అనుకున్నారు. టీజ‌ర్‌క‌న్నా ముందు ఫ‌స్ట్ లుక్ వ‌చ్చిన‌ప్పుడే చాలా మందికి అర్థ‌మైపోయుండాలి. టీజ‌ర్ త‌ర్వాత, ట్రైల‌ర్ త‌ర్వాత సుజిత్ కెప‌బులిటీ ఏంటో అంద‌రికీ అర్థ‌మైపోయింది. త‌ను చాలా బాగా చేశావ్‌. అంత పెద్ద టెక్నీషియ‌న్స్‌, అంత పెద్ద బ‌డ్జెట్‌ని, ప్ర‌భాస్‌లాంటి ఆల్ ఇండియా స్టార్‌ని హ్యాండిల్ చేయ‌డం అంత సుల‌భం కాదు. త‌నే బ్యాక్‌బోన్‌లా ఉన్నాడు. త‌న భుజాల‌పైనే సినిమా నిల‌బ‌డింది. త‌న‌కు మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు. ప్ర‌మోద్‌, వంశీల‌కు సింహాలు, పులుల‌కు ఉండే గుండె ఉండాలి. ప్ర‌భాస్ ఏమ‌డిగితే అదిచ్చారు. అంద‌రూ సుజిత్ క‌థ‌ను న‌మ్మారు. ఆగ‌స్ట్ 30న సినిమా చాలా పెద్ద రేంజ్‌.. చాలా పెద్ద రికార్డులు సాధిస్తుంది. నిర్మాత‌ల‌కు వాళ్లు పెట్టిన‌దానికి డ‌బుల్‌, ట్రిపుల్ రావాల‌ని కోరుకుంటున్నాను. ప్ర‌భాస్ ఆల్ రెడీ ఆల్ ఇండియా స్టార్. త‌న‌ని ఇక్క‌డి నుండి ఎంత ముందుకు తీసుకెళ్ల‌గ‌లిగితే అంత ముందుకు తీసుకెళ్లాలి. ఎంటైర్ టీమ్‌కు కంగ్రాట్చ్యులేష‌న్స్‌. సాహో సూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంది`` అన్నారు.

రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ - ``చాలా హ్యాపీగా ఉంది. నేను విన్న‌దాన్ని బ‌ట్టి, ప్రభాస్ ఇంట‌ర్వ్యూస్‌లో చెప్పిన దాన్ని బ‌ట్టి.. మొద‌టి టీజ‌ర్ త‌ర్వాత చాలా ఫోన్స్ వ‌చ్చాయి. ప్ర‌భాస్ ఇంకా కాసేపు క‌న‌ప‌డి ఉండుంటే బావుండ‌ని అన్నారు. కొన్ని పోస్ట‌ర్స్ రిలీజ్ చేసిన త‌ర్వాత చాలా బావున్నాయ‌ని అన్నారు. త‌ర్వాత టీజ‌ర్ విడుద‌ల త‌ర్వాత అహో, ఓహో అన్నారు. ట్రైల‌ర్ విడుద‌ల త‌ర్వాత అబ్బో అన్నారు. ఆ లెవ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్‌కి వెళ్లింది. హాలీవుడ్ లెవ‌ల్ స్థాయి సినిమాల‌కు కాంపీట్ చేసేటువంటి గొప్ప సినిమా అని చాలా మంది చెప్పారు. హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ ఇక్క‌డ‌కు వ‌చ్చి లొకేష‌న్స్ చూసుకుని రిహార్స‌ల్ చేసుకుని స్టంట్స్ చేశారు. ప్ర‌భాస్ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. సుజిత్ చిన్న‌వాడైనా, అత‌నిపై న‌మ్మ‌కంతో, క‌థ‌పై న‌మ్మ‌కంతో నిర్మాత‌ల‌ను పిలిచి ప్ర‌భాస్ సినిమా చేస్తాన‌ని ఒప్పించ‌డం త‌న అదృష్టం. త‌ను కూడా శ‌భాష్ అనిపించుకున్నాడు. సినిమాకు ప‌నిచేసిన అంద‌రూ ఇది త‌మ సినిమాగా భావించి వ‌ర్క్ చేశారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. నా 45ఏళ్ల అనుభ‌వంతో చెబుతున్నాను.. సినిమా 150 శాతం అభిమానుల అంచ‌నాల‌ను మించేలానే ఉంటుంది. 30 త‌ర్వాత మ‌రో బాహుబ‌లి అంతా పేరు వ‌చ్చి ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ అవుతాడ‌ని న‌మ్మ‌కంతో ఉన్నాను`` అన్నారు.

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ మాట్లాడుతూ - ``సాంగ్స్‌, సినిమా కోసం వాడిన ఆర్టిక‌ల్స్ అంద‌రికీ న‌చ్చే ఉంటాయ‌ని అర్థ‌మ‌వుతుంది. ఫ్యాన్స్‌, డైహార్డ్ ఫ్యాన్స్ డైలాగ్స్ రాసింది డైరెక్ట‌ర్ సుజితే. త‌న‌కు మాస్ ప‌ల్స్ బాగా తెలుసు. మ‌ది నా కుటుంబ స‌భ్యుడిలా స‌పోర్ట్ చేశారు. సాబుసిరిల్‌గారిని నేను ఈ సినిమా చేయ‌మ‌ని అడిగాను.. ఆయ‌న క‌థ విన్నారు. ఆయ‌న‌కు న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ శ్రీక‌ర్‌గారు చేసిన సాయం చాలా పెద్ద‌దే. క‌మ‌ల్ క‌ణ్ణ‌న్‌గారు సినిమాకు ఇంట‌ర్నేష‌న‌ల్ లుక్ తీసుకొచ్చారు. జిబ్రాన్ అద్భుత‌మైన సంగీతం ఇచ్చారు. జాకీష్రాఫ్‌గారికి, చంకీగారికి, అరుణ్ విజయ్‌గారికి, లాల్‌గారికి, నీల్ నితిన్ ముఖేష్‌గారు స‌హా అంద‌రికీ థ్యాంక్స్‌. అనీల్ ట‌డాని తొలి రోజు నుండే స‌పోర్ట్ చే్స్తూ వ‌చ్చారు. మా ఫ్యామిలీ మెంబ‌ర్‌లా మారిపోయారు. భూష‌ణ్‌గారికి థ్యాంక్స్‌. సుజిత్ నిక్క‌రేసుకొచ్చి క‌థ చెప్పాడు. వంశీ, ప్ర‌మోద్‌, విక్కీలు అప్ప‌టికే క‌థ విన్నారు. వారికి న‌చ్చింది. సుజిత్ క‌థ చెప్పేట‌ప్పుడ త‌న వ‌య‌సు 23ఏళ్లు. నల‌భై ఏళ్ల వ్య‌క్తిలా క‌థ చెప్పాడు. సినిమాను ఓ స్టేజ్ అనుకున్నాం. సినిమా చాలా పెద్ద‌దైంది. సుజిత్ ఈ సినిమా కోసం చాలా ప్రీ ప్రొడ‌క్ష‌న్ చేశాడు. సినిమా షూటింగ్ స‌మ‌యంలో పెద్ద పెద్ద స్టార్స్‌, టెక్నీషియ‌న్స్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడోన‌ని అనుకున్నాను. త‌ను హ్యాండిల్ చేసిన విధానానికే గ్రేటెస్ట్ డైరెక్ట‌ర్ అయిపోతాడ‌నిపించింది. నాలుగేళ్ల పాటు సినిమా కోసం క‌ష్ట‌ప‌డ్డాడు. త‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అయిపోతాడ‌ని అనుకుంటున్నాను. శ్ర‌ద్ధాక‌పూర్‌.. రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం ప‌నిచేసింది. ఓ న‌టి ముంబై నుండి వ‌చ్చి ఇక్క‌డ రెండేళ్లు ప‌నిచేసింది. ఒకరోజు కూడా స‌మ‌స్య రాలేదు. శ్ర‌ద్ధాక‌పూర్‌లాంటి హీరోయిన్ సాహోకు దొర‌క‌డం మా అదృష్టం. త‌ను సూప‌ర్బ్ పెర్ఫామ‌ర్‌. యాక్ష‌న్ సీన్స్ ఇర‌గ‌దీసింది. గ‌త సినిమా స‌మ‌యంలో ఏడాదికి రెండు సినిమాలు చేస్తాన‌ని మాటిచ్చా.. మిస్స‌య్యాం. కానీ ఈసారి మాట ఇవ్వ‌కుండా ఏడాది రెండు సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. వంశీ, ప్ర‌మోద్‌, విక్కీ వంద‌కోట్ల లాభం వ‌దులుకుని ఈ సినిమా చేశారు. చాలా మంచి స్నేహితులు`` అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved