pizza

Sarkaru Vaari Paata Pre Release Event
Sarkaru Vaari Paata Will Be A Festival For All Of Us: Superstar Mahesh Babu
సర్కారు వారి పాట'తో మళ్ళీ మనందరికీ పండగే: సూపర్ స్టార్ మహేష్ బాబు

You are at idlebrain.com > News > Functions
Follow Us


07 May 2022
Hyderabad

Superstar Mahesh Babu's Sarkaru Vaari Paata mania is gripping the audience. The recently released trailer is a sensational hit rising expectations for the movie releasing on May 12th. The Pre-release event of the film happened on Saturday in Hyderabad and recorded a massive turnout.

Speaking at the event, Mahesh Babu said, "It is a pleasure to meet the fans through this celebration after two years. Director Parasuram designed my character wonderfully. Dialogue Delivery and body language are all new and entertaining. Some scenes have reminded me of Pokiri days. Parasuram will be a favorite director for my fans after watching this film. The Hero - Heroine track will be the highlight of the film. The character of Keerthy Suresh is awesome. Thaman Gave wonderful music. You all know how big hit Kaalavathi song became. I am a big fan of Thaman's re-recording work. His work is sensational in this film. The Mass song steps are far better than Mind Block in Sarileru Neekevvaru. Ram - Lakshman masters choreographed excellent fights. Editor Marthand K Venkatesh always said the movie would cross Pikiri. DOP Madhie gave another amazing output. I thank the producers. We should work for many more blockbusters".

Mahesh Babu got emotional towards the end of his speech. He almost choked when saying, "A lot has happened in these two years. People very close to me passed away. But no matter what happens, your love does not change. Your blessings and admiration drive me forward. You will love Sarkaru Vaari Paata releasing on May 12th. It will be a festival for all of us".

Director Parasuram spoke very confidently. "Director Koratala Siva helped me take the story to Mahesh Babu. First of all, I would like to thank him. I was initially scared when I went to narrate the story to Mahesh Babu. After five minutes of narration, a smile appeared on his face. I will thank him all my life for believing in me so much. The producers helped me take my vision on screen without compromising anywhere. Everyone worked very hard. Thaman gave wonderful music. Re-recording is also going on very well. We are giving a blockbuster hit on May 12th," he said.

Thaman who delivered a sensational album for the film said - "Working for Mahesh Babu's film is always special. After the sensational success of Dookudu and Businessman, I want this movie with Mahesh to be special. We started the work in Lockdown itself. We got an amazing album. It is a pleasure to work with these producers who did not compromise anywhere. The movie will surely achieve big success".

Keerthy Suresh was all smiles as the crowd cheered for Kalaavathi. "Very happy to work with these producers. Thank you for giving me Kalaavathi as a gift. The character is amazing. Madhie's visuals, and Thaman's wonderful songs helped big time. Mahesh's energy and timing are amazing. I was tensed to match his energy. It is an honor to work with him. Everyone, please watch the film on May 12th".

సర్కారు వారి పాట'తో మళ్ళీ మనందరికీ పండగే: సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులు కేరింత మధ్య హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సహా చిత్ర యూనిట్ తో పాటు ప్రముఖ దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు.. ప్రముఖులు అతిధులుగా పాల్గొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆద్యంతం అలరించించింది.

ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ.. రెండేళ్ళ తర్వాత అభిమానులని ఈ వేడుక ద్వారా కలుసుకోవడం ఆనందంగా వుంది. దర్శకుడు పరశురాం గారు సర్కారు వారి పాటలో నా పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్ని కొత్తగా, వినోదాత్మకంగా వుంటాయి. కొన్ని సీన్లు చేస్తున్నపుడు పోకిరి రోజులు గుర్తుకు వచ్చాయి. పరశురాంకి కథ ఓకే చెప్పిన తర్వాత ఇంటికి వెళ్లి నాకో మెసేజ్ పెట్టారు. '' ఒక్కడు సినిమా చూసి డైరెక్టర్ అవుదామని వచ్చాను. మీరు అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ఎలా తీస్తానో చూడండి'' అన్నారు. ఆయన చెప్పినట్లే అద్భుతంగా తీశారు. నా అభిమానులకు, నాన్న గారి అభిమానులకు పరశురాం ఒక అభిమాన దర్శకుడు అవుతారు. సర్కారు వారి పాటలో చాలా హైలెట్స్ వుంటాయి. హీరో హీరోయిన్ ట్రాక్ కోసం రిపీట్ ఆడియన్స్ వస్తారు. కీర్తి సురేష్ పాత్ర అద్భుతంగా వుంటుంది. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. కళావతి పాట ఎంత పెద్ద విజయమో మీ అందరికీ తెలుసు. తమన్ రీరికార్డింగ్ కి పెద్ద ఫ్యాన్ నేను. సర్కారు వారి పాటలో ఇరగాదీశాడు. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ యాక్షన్ అద్భుతంగా డిజైన్ చేశారు. సరిలేరు నికెవ్వరు లో 'మైండ్ బ్లాక్' మించి సర్కారు వారి పాటలకు కోరియోగ్రఫీ చేశారు శేఖర్ మాస్టర్. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు కూడా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ గారు మొదటి రోజు నుంచి ఈ సినిమా పోకిరిని దాటుతుందని పాజిటివ్ ఎనర్జీ నింపారు. అనంత్ శ్రీరామ్ గారు మంచి సాహిత్యం అదించారు. డీవోపీ మధి గారు మరో అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు.

మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నా. మన కాంబినేషన్లో మరో బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. ఎగ్జిక్యుటీవ్ నిర్మాతలు రాజు, చందులు ప్రాణాలు పెట్టి పని చేశారు. ఈ రెండేళ్ళలో చాలా జరిగాయి మారాయి. నాకు బాగా దగ్గరైన వాళ్ళు దూరమయ్యారు. కానీ ఏది జరిగినా మీ అభిమానం మాత్రం మారలేదు. ఇది చాలు ధైర్యంగా ముందు సాగడానికి. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడూ వుండాలని కోరుకుంటున్నాను. 12తేదిన మీ అందరికీ నచ్చే సినిమా సర్కారువారి పాట రాబోతుంది. మళ్ళీ మనందరికీ పండగే.'' అన్నారు.

దర్శకుడు పరశురాం మాట్లాడుతూ.. నేను తయారు చేసుకున్న 'సర్కారు వారి పాట' కథని మహేష్ బాబు గారి దగ్గరకి తీసుకెళ్లడానికి దర్శకుడు కొరటాల శివగారు హెల్ప్ చేశారు. ముందుగా ఆయనకి ధన్యవాదాలు చెబుతున్నాను. మహేష్ బాబు గారికి మొదట కథ చెప్పినపుడు భయం వేసింది. ఐదు నిమిషాల నేరేషన్ తర్వాత మహేష్ గారి ముఖం పై ఒక నవ్వు కనిపించింది. ఆ నవ్వే ఇక్కడి వరకూ తీసుకొచ్చింది. నన్ను ఇంత నమ్మిన మహేష్ గారికి లైఫ్ లాంగ్ థ్యాంక్స్ చెప్పిన సరిపోదు. నా విజన్ తెరపై చూపించడానికి ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు, డీవోపి మధి, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ , తమన్ , రామ్‌ల‌క్ష్మణ్, ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ గారు అనంత శ్రీరామ్ .. యూనిట్ మొత్తానికి ధన్యవాదాలు. కో డైరెక్టర్ ప్రసాద్ గారు, సీతారాం, అశోక్, స్వప్నిక , అరవింద్, నాగార్జున , రవి , గాంధీ శ్రీనివాస్.. ఇలా డైరెక్టర్ టీం లో అందరూ చాలా కష్టపడి చేశారు. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రీరికార్డింగ్ కూడా అదిరిపోతుంది. మే 12 బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం'' అన్నారు.

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. మహేష్ గారు మాకు శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్తర్ హిట్ ఇచ్చి ఇండస్ట్రీలోకి గ్రాండ్ వెల్ ఇచ్చారు. మహేష్ గారితో మరిన్ని సినిమాలు చేయాలనీ వుంది. దర్శకుడు కథ చెప్పినప్పటి నుంచి జర్నీ ఒక పండగలా జరిగింది. పరశురాం గారు ఈ కథ మహేష్ గారి కోసం పుట్టిందని అన్నారు. ట్రైలర్, మామా మహేషా పాట చుసిన తర్వాత పరశురాం అలా ఎందుకు అన్నారు అర్ధమైయింది. కీర్తి సురేష్ ని కొత్తగా చూస్తాం. తమన్ గారు అద్భుతమైన ఆల్బం ఇచ్చారు. సినిమా యూనిట్ అందరికీ కృతజ్ఞతలు. సినిమా మీరు ఊహించిన దాని కంటే సినిమా అద్భుతంగా వుంటుంది''అన్నారు

నిర్మాత రామ్ ఆచంట మాట్లాడుతూ.. పరశురాం గారు మహేష్ బాబుగారి అద్భుతంగా ప్రజంట్ చేశారు. మే 12 అభిమానులకు ఒక పండగలా వుంటుంది''అన్నారు

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. మహేష్ బాబు గారి సినిమాకి పని చేయడం స్పెషల్ గా వుంటుంది. దూకుడు, బిజినెస్ బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ గారితో చేస్తున్న ఈ సినిమా స్పెషల్ గా వుండాలని అనుకున్నా. లాక్ డౌన్ లోనే వర్క్ స్టార్ చేశాం. అద్భుతమైన ఆల్బమ్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నిర్మాణంలో వర్క్ చేయడం ఆనందం ఇచ్చింది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది'' అన్నారు

హీరోయిన్ కీర్తి మాట్లాడుతూ..మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నిర్మాణంలో పని చేయడం ఆనందంగా వుంది. కళావతిని నాకు బహుబతికి గా ఇచ్చినందుకు ధన్యవాదాలు. కళావతి పాత్రని అద్భుతంగా చిత్రీకరించిన కెమారా మెన్ మధి గారికి, అద్భుతమైన పాటలు ఇచ్చిన తమన్ గారికి హాట్సప్. మహేష్ గారితో వర్క్ చేసినప్పుడు ఆయన ఎనర్జీ టైమింగ్ మ్యాచ్ చేయడానికి టెన్సన్ పడ్డా. మహేష్ గారితో పని చేయడం ఒక గౌరవం. ''మహేష్ గారు వున్నారు .. ఆయన విన్నారు.. అందరూ మే 12న థియేటర్ లో సర్కారు వారి పాట చూడండి'' అన్నారు.

లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. సర్కారు వారి పాటలన్నీ రాసే అవకాశం ఇచ్చిన దర్శకుడు పరశురాం గారికి నిర్మాతలకు మహేష్ బాబు గారికి ధన్యవాదాలు. సర్కారు వారి పాట నాకు స్పెషల్ ఆల్బమ్. కళావతి ,పెన్నీ, టైటిల్ సాంగ్ , మామా మహేష్ సూపర్..ఇలా పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. థియేటర్ లో మరింత అలరిస్తాయి. మహేష్ బాబు గారి అభిమానులకు ఈ సినిమా పండగలా ఉండబోతుంది'' అన్నారు.

నటుడు సముద్రఖని మాట్లాడుతూ.. సర్కారు వారి పాటలో భాగమవ్వడం ఆనందంగా వుంది. మహేష్ బాబు గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు. పరశురాం గారు ప్రతి రోజు ఒక కొత్త విషయం నేర్పించారు. ఆయన ఒకొక్క డైలాగు కత్తిలా వుంటుంది. మహేష్ బాబు గారిని చూస్తూనే ఒక ఎనర్జీ. సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది'' అన్నారు

నిర్మాత ఆది శేషగిరిరావు మాట్లాడుతూ.. సర్కారు వారి పాట కోసం మంచి టీం జరిగింది. రిలీజ్ కి ముందే డెఫినెట్ బ్లాక్ బస్టర్ అని ముద్ర వేసుకుంది. దీనికి మహేష్ బాబుని అభినందిస్తున్నాను. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కీర్తి సురేష్, సముద్ర ఖని .. ఇలా అందరూ అందరూ అద్భుతమైన నటన కనబరిచారు. మన సినిమాలు దేశ విదేశాలకు వెళుతున్నాయి. ఇలాంటి గొప్ప చిత్రాలు నిర్మిస్తున్న నిర్మాతలకు అభినందనలు. వేడుకకు హాజరైన అభిమానులకు కృతజ్ఞతలు. సర్కారు వారి పాట పెద్ద విజయం సాధిస్తుంది'' అన్నారు.

హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ... ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లా లేదు సినిమా సక్సెస్ మీట్ లా వుంది. దీనికి కారణం ఇప్పటివరకూ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ సూపర్ హిట్ అయ్యింది. ట్రైలర్ చూసి చాలా మంది వింటేజ్ మహేష్ బ్యాక్ అంటున్నారు. కానీ నా వరకూ.. మహేష్ అంటేనే వింటేజ్. ఈ మధ్య పాన్ ఇండియా సినిమా అని ఎక్కువగా వినిపిస్తుంది. మహేష్ బాబు గారికి వరకూ పాన్ ఆడియన్స్ అనిఅంటాను. మహేష్ క్లాస్ సినిమా చేస్తే మనం క్లాస్ ఆడియన్స్ , ఆయన మాస్ సినిమా చేస్తే మాస్ ఆడియన్స్. సినిమా యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. సర్కారు వారి పాట 150కోట్ల షేర్ నుండి మొదలవ్వాలి'' అని కోరుకున్నారు సుదీర్ బాబు.

హీరో గల్లా అశోక్ మాట్లాడుతూ.. సర్కారు వారి పాట ట్రైలర్ చూస్తుంటేనే సినిమా బ్లాక్ బస్టర్ అర్ధమౌతుంది. పరశురాం గారు సినిమాని అద్భుతంగాతీశారు. మంచి టీమ్ వర్క్ కుదిరింది. మా మావయ్య ఒక సూపర్ స్టార్ అని అనుకునేవాడిని. కానీ ఇక్కడ అభిమానులని చూస్తుంటే ఆయన మొదట మీకు సూపర్ స్టార్ అని అర్ధమైయింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మీ అందరిలానే 12వ తేది వేలం కోసం ఎదురుచుస్తూన్నాను'' అన్నారు

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. సర్కారు వారి పాట ట్రైలర్ చూసినప్పటి నుంచి థియేటర్ లో సినిమా ఎప్పుడు చూస్తానా ? అనే ఆసక్తి పెరిగిపోతుంది. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నాకు బాగా కావలసిన వాళ్ళు. నిర్మాతలకు బెస్ట్ విషెస్ చెబుతున్నా. దర్శకుడు పరశురాం సహాయ దర్శకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇప్పుడున్న డైలాగ్ రైటర్స్ లో ది బెస్ట్ రైటర్ పరశురాం. అతని డైలాగ్ రైటింగ్ అంత బావుంటుంది. గీత గోవిందంలో పరశురాం క్లాస్ టచ్ చూశాం. అలాంటి దర్శకుడు మాస్ సినిమా చేస్తే ఎలా వుంటుందో సర్కారు వారి పాట లో చూస్తారు. మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నపుడు సెట్ లో దర్శకుడు కింగ్ లా వున్నాడు. అంత కాన్ఫిడెన్స్ ఇస్తారు. నా జీవితంలో వన్ నేనొక్కడినే చేసిన రోజులు మర్చిపోలేను. ప్రతి రోజు ఒక అద్భుతమైన మూమెంట్. మైత్రీ మూవీస్ సక్సెస్ లో సర్కారు వారి పాట పెద్ద మైలు రాయి అవుతుంది. సినిమా యూనిట్ అంతటికి నా బెస్ట్ విశేష్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ... మహేష్ బాబు గారితో పని చేయడంలో కిక్ వుంటుంది. సరిలేరు నికెవ్వరు సినిమా చేస్తున్నపుడు ఆ కిక్ ని ప్రతి రోజు ఎంజాయ్ చేశాను. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు వంశీ పడిపల్లిగారు తన మహర్షి సినిమా రికార్డులన్నీ సరిలేరు నీకెవ్వరు బ్రేక్ చేయాలనీ కోరుకున్నారు. నేను కూడా ఇప్పుడు అదే మాట చెబుతున్నా.. సర్కారు వారి పాట ..సరిలేరు నీకెవ్వరు రికార్డులన్నీ బ్రేక్ చేయాలి. కరోనా కష్ట కాలం దాటుకొని ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని తెరకెక్కించారు నిర్మాతలు. ఈ సినిమా వడ్డీతో సహా వసూలు చేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు, దర్శకుడు పరశురాం గారికి, చిత్ర యూనిట్ మొత్తానికి అల్ ది బెస్ట్. మే 12 బ్లాక్ బస్టర్'' అని చెప్పారు.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లుడుతూ.. మహర్షి కథతో మహేష్ గారికి దగ్గరికి వెళ్లాను. కానీ మహేష్ గారు తన జీవితంలో నాకు ఇచ్చిన స్థానానికి ఎప్పుడూ రుణపడి వుంటాను. దర్శకుడు పరశురాం చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. పరశురాం జర్నీ నాకు తెలుసు. మహేష్ గారిని అద్భుతంగా చూపించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది'' అన్నారు.

దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. 'సర్కారు వారి పాట ట్రైలర్, మహేష్ బాబు గారి ఎనర్జీ p చూసి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఎంత క్లాస్ గా వున్నారో అంత మాస్ గా వున్నారు. దర్శకుడు పరశురాం మహేష్ గారి గ్రేస్ ని అద్భుతంగా వాడుకున్నారని అర్ధమౌతుంది. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్. సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి'' అని కోరుకున్నారు.

దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ.. మహేష్ బాబు గారి గ్రేస్ గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన 14 రీల్స్ , శ్రీమంతుడు ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ కలసి చేస్తున్న సినిమా ఎలా ఉండాలో సర్కారు వారి పాట అలా వుంది. సర్కారు వారి పాటని గొప్పగా ప్రజంట్ చేశారు . ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది'' అన్నారు

దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. మహేష్ గారిని మొదటిసారి వన్ సినిమా షూటింగ్ లో చూశాను. అబ్బాయిలు కూడా అందంగా ఉంటారని మహేష్ గారిని చూస్తే అనిపించింది. ఆయన సెట్ లో ఆయన్ని చూస్తూ వుండిపోతాం. ఆయన్ని చూస్తూనే గొప్ప ఎనర్జీ వస్తుంది. సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది'' అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ మాట్లాడుతూ.. మహేష్ బాబు గారి సినిమాకి వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. సినిమా కోసం అద్భుతమైన సెట్స్ వేశాం. సినిమా కన్నుల పండగలా ఉండబోతుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ టీమ్ అంతటి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నా. ఈ సినిమా కోసం పని చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, దర్శకుడు పరశురాం గారికి, మహేష్ బాబుగారి ప్రత్యేక ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు

ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ..మహేష్ బాబు గారి తో 'సర్కారు వారి పాట' నాలుగో సినిమా. ముందు మూడు సినిమాల కంటే సర్కారు వారి పాటలో మహేష్ బాబు గారు కొత్తగా డిఫరెంట్ గా కనిపిస్తారు. అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్ లు కంపోజ్ చేశాం. 12వ తేది మహేష్ బాబు గారి అభిమానులకు ఒక పండగా వుంటుంది. ఈ సినిమా చేయడానికి అవకాశం ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు, దర్శకుడు పరశురాం గారికి, మహేష్ బాబు గారికి ధన్యవాదాలు'' అని చెప్పుకొచ్చారు

 

 


Photo Gallery

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved