pizza
బోనాల పోత‌రాజు ప్రెస్ మీట్
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 March 2015
Hyderabad

పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి క‌థానాయ‌కుడిగా అల్లాణి శ్రీ‌ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సానాయాదిరెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ఫిల్మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై బోనాల పోత‌రాజు సినిమా రూపొంద‌నుంది.ఈ సంద‌ర్భంగా సానాయాది రెడ్డి రికార్డింగ్ థియేట‌ర్ లో పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్య‌క్ర‌మంలో అల్లాణి శ్రీ‌ధ‌ర్, ఆర్.నారాయ‌ణ‌మూర్తి. సానాయాదిరెడ్డి పాల్గొన్నారు.

అల్లాణి శ్రీ‌ధ‌ర్ మాట్లాడుతూ
పోత‌రాజు అన‌గా దేవుడితో స‌మాన మైన వాడు ఏడు గురు అమ్మ‌వార్ల‌కు త‌మ్ముడు అయి వారిని కాస్తూ ఉంటాడు.పోత‌రాజు సంస్కృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఈ సినిమాలో జాన‌ప‌ద గాధ‌ల‌ను చెపుతూనే ప్ర‌జా సినిమాగా తీర్చి దిద్ద‌నున్నాము .. ఈ సినిమాలో ముఖ్యంగా అక్కా త‌మ్ముళ్ల మ‌ధ్య ఉండే ప్రేమాభిమానాల‌ను చూపెడుతున్నాము.ప్ర‌జ‌ల కొర‌కు సినిమా తీస్తూ ప్ర‌జా తార‌గా కీర్తింప‌బ‌డుతున్న ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి గారు ఈ సినిమా కు క‌థ‌ను ఇవ్వ‌డ‌మే కాకుండా పోత‌రాజు పాత్ర‌ను చేయ‌డం మా అదృష్టం. అలాగే ప్ర‌ముఖ నిర్మాత, ద‌ర్శ‌కుడు సానా యాదిరెడ్డి గారు ఈ సినిమాకు స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రించ‌డానికి ముందుకు వ‌చ్చినందుకు వారికి ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాము.ఏప్రిల్ నెల 15 నుండి సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది జూలై నెల లో అమ్మ‌వారి ఉత్స‌వాల సంద‌ర్భంగా సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాము అన్నారు.

సానా యాదిరెడ్డి మాట్లాడుతూ
యుగాది రోజున ఒక మంచి సినిమాను వివ‌రాలు వెల్ల‌డించాల‌ని అనుకున్నాము.తెలంగాణ ఉద్య‌మ నేప‌ధ్యంలో ఎన్నో సినిమాలు తీసిన ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి తో ఈ సినిమా చేయ‌డం మాకు ఆనందంగా ఉంది.అత‌ను న‌టుడిగానే కాకుండా మ‌నిషిగా కూడా ఉన్న‌త మైన వ్య‌క్తి.ఈ సినిమా విష‌యానికి వ‌స్తే ఆయ‌న క‌థ‌ను ఇవ్వ‌డ‌మే కాకుండా మీరు చేయండి అంటూ మ‌మ్మ‌ల్ని ప్రోత్స‌హించారు.మేము ఈ సినిమాను నిర్మాణ విలువ‌లు ఉన్న చిత్రంగా తీర్చిదిద్ద‌డానికి ప్ర‌య‌త్నిస్తాము అన్నారు.

ఆర్.నారాయ‌ణ‌మూర్తి మాట్లాడుతూ అల్లాణి శ్రీ‌ధ‌ర్ ..సానాయాదిరెడ్డిలు నాకు ఈ అవ‌కాశం ఇవ్వ‌డం నా అదృష్టం ..ఇది మామూలు పాత్ర కాదు య‌న్‌.టి.ఆర్, శివాజీ గ‌ణేష్ లు చేయ‌త‌గ్గ పాత్ర ఇంత గొప్ప పాత్ర ఇచ్చిన వీరికి నేను ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాను.నాది అల్లాణి గారిది ముప్ప‌యి ఏండ్ల ప్ర‌యాణం .. అత‌ను మా గురువు గారు దాస‌రి ద‌గ్గ‌ర ఉన్న‌ప్పుడు దాస‌రి గారి శ్రీ‌మ‌తి మా ప‌ద్మ‌మ్మ నాకు ప‌రిచ‌యం చేసింది .. అప్ప‌టి నుండి మా ప్ర‌యాణం కొన‌సాగుతూనే ఉంది.అత‌ను యుక్త వ‌య‌సులోనే కొమ‌రంభీమ్, ర‌గులుతున్న భార‌తం లాంటి సినిమాల‌ను తీసిన ద‌ర్శ‌కుడు..అప్ప‌ట్లో అత‌ను టి.కృష్ణ త‌ర‌హా ద‌ర్శ‌కుడు అవుతాడ‌ని అనుకున్నాము. అలాగే సానాయాది రెడ్డిగారు మంచి విజ‌య‌వంత‌మైన సినిమాలు చేశారు. ఆయ‌న ఈ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డం మాకు ఆంనందాన్ని క‌లిగిస్తోంది. ఈ సినిమా విడుద‌లైన త‌రువాత ప్ర‌పంచం న‌లుమూల‌లా ఉండే తెలుగు వారు వారు పూజించే అమ్మ వార్ల‌ను త‌లుచుకుంటారు..శ్రీ‌ధ‌ర్ గారు న‌న్ను బోనాల పోత‌రాజు సినిమా చేయ‌మ‌ని అడ‌గ గానే నా శ‌రీరంలో జిగేల్ మంది..ఇది త‌ప్ప‌కుండా ఒక మంచి సినిమా అవుతుంది అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved