pizza
Celebrity Cricket Carnival press meet
చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం సినీ తారలు వర్సెస్ ప్రవాసభారతీయుల క్రికెట్
You are at idlebrain.com > News > Functions
Follow Us


5 July 2019
Hyderabad

ఎవరికీ ఎలాంటి చిన్న కష్టం వచ్చినా... ఏ స్వార్ధం లేకుండా సినీ తారలు ముందుండి బాధితుల బాధలను పంచుకుంటారు.. కాగా ప్రతి ఏడాది సినీ తారలందరూ క్రికెట్ ఆడటం సర్వసాధారణం. ఆ వచ్చిన డబ్బుతో ఎదో ఒక వేల్ఫేర్ కు అందచేసి వారికి కాస్తంత చేయూతను అందింపచేస్తుంటారు టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్. ఈ దిశలోనే భాగంగా ఈ సంవత్సరం కూడా మన సినీ స్టార్స్ క్రికెట్ ఆడటానికి ముందుకు వచ్చారు. ఈ విశేషాలను తెలియచేయడానికి శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు..

ఈ సమావేశంలో ముందుగా హీరో తరుణ్ మాట్లాడుతూ.. ప్రతి సారి లానే ఈ సారి కూడా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ మంచి కాజ్ కోసమే క్రికెట్ ఆడటానికి ముందుకు రావడం జరుగుతోంది. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ సంస్థ అధినేత వర ప్రసాద్ గారు యుఎస్ లోని హ్యూ స్టెన్ లో ఈవెంట్ ను ఆర్గనైజ్ చేస్తున్నారు. మొన్న సౌత్ ఆఫ్రీకాలో క్యాన్సర్ పేషంట్స్ కోసం ఆడాము. మరొకసారి బ్లైండ్ ఛారిటీకోసం క్రికెట్ ఆడటం జరిగింది. అలానే ఇప్పుడు చైల్డ్ ఎడ్యుకేషన్ చారిటీ కోసం మ్యాచ్ ఆడటం జరుగుతోంది. ఈ మ్యాచ్ ఆగస్టు 17 న జరగనుంది. అలానే ఈ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ ఆర్గనైజషన్ తో నెక్స్ట్ 5ఇయర్స్ వరకు ప్రతి ఏటా ప్రతి ఆరు నెలలకు ఓ సారి ఈ మ్యాచెస్ ను ఆడటానికి అగ్రిమెంట్ కూడా చేసుకున్నాము. ఇప్పుడు హ్యూస్టెన్ లో, నెక్స్ట్ న్యూ జెర్సీ, ఆతరువాత ఫ్లోరిడా ఇలా ఆల్ ఓవర్ ది యూస్ లో మ్యాచ్ ను ఆడనున్నాము. చాలా స్ట్రాంగ్ టీమ్ తో వెళ్తున్నాము.. అంటూ తెలియచేసారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ మంచి కాజ్ కోసం ఆడుతున్నాము.. సీరియస్ గా గెలవాడానికే ఆడనున్నాము.. మన దేశంలో కాకుండా ఇతర దేశంలో ఆడటం డిఫరెన్ట్ ఎక్సపీరియెన్స్ ను కలిగిస్తోంది.. తెలిసిన వారందరికీ తెలియచేసి సపోర్ట్ చేయమని కోరుకుంటున్నా అన్నారు.

నటుడు పృథ్వి మాట్లాడుతూ ఎప్పటినుంచో నేను క్రికెట్ టీమ్ లో భాగం అవ్వాలని అది ఇప్పటికి కుదిరింది. శ్రీకాంత్ తరుణ్ నన్ను సపోర్ట్ చేశారు. 1992లో రంజీ ట్రోఫీ టీమ్ లో నేను మెంబర్ ను.. బాగానే ఆడేవాణ్ణి. ఇప్పడు ఈ టాలీవుడ్ క్రికెట్ టీమ్ లో ఆడటం సంతోషంగా ఉంది అన్నారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా టి సి ఏ మంచి కాజ్ కోసం ఆడుతూనూనే ఉంది.. అదే దిశగా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ ఈవెంట్ చేయడం వారి ఆధ్వర్యంలో టిసిఎ క్రికెట్ ఆడటం ఆనందం గా ఉంది. ఆగస్టు 15న యు ఎస్ లో ఫ్లాగ్ హ్యస్టింగ్ చేసి 17న మ్యాచ్ ను ప్రారంభించనున్నాము.. అక్కడ ఉన్న బిడ్డింగ్ టీమ్ ను సెలెక్ట్ చేయనున్నారు.. వారు కూడా మాపై గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిన ఇండియన్స్ తో మేము ఆడటం చాలెంజింగ్ గా అనిపిస్తోంది. ప్రతి ఒక్క ఇండియన్ ఇందులో పార్టిసిపేట్ చేయచ్చు.. ఎన్నో మంచి కాజ్ లకోసం ఆడిన మేము ఈసారి చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం ఆడటం మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. తెలిసిన వారందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.. అలానే ఈ ఈవెంట్ సక్సెస్ అవుతుందని అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అని అన్నారు.

ఈ కార్యక్రమంలో భూపాల్, సుదీర్ బాబు, ఖయ్యుమ్, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫణి లు పాల్గొన్నారు.

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved