pizza
Dubsmash press meet
జ‌న‌వ‌రి 30న విడుద‌ల‌వుతున్న `డబ్‌శ్మాష్‌` త‌ప్ప‌కుండా పెద్ద విజ‌యం సాధిస్తుంది - చిత్ర స‌మ‌ర్ప‌కులుసుబ్రమణ్యం మలసాని
You are at idlebrain.com > News > Functions
Follow Us


26 January 2020
Hyderabad

వీత్రి ఫిలిమ్స్ పతాకంపై సుబ్రమణ్యం మలసాని సమర్పణలో ఓంకార లక్ష్మీ నిర్మాతగా పవన్ కృష్ణ, సుప్రజ, హీరో హీరోయిన్లుగా గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `డబ్‌శ్మాష్‌`. కేశవ్ దేపూర్ దర్శకుడు. జ‌న‌వ‌రి 30న విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్య‌క్ర‌మం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో..

మ్యూజిక్ డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ - " ఈ సినిమా పాటలు ఇంతబాగా రావడానికి మా నిర్మాత సుబ్రమణ్యం గారు, దర్శకుడు కేశవ గారే కారణం. కేశవ్ ముందు నుండి మంచి రిఫరెన్స్ చేసుకొని వచ్చి సంగీతం చేయించుకున్నారు. అలాగే సుబ్రమణ్యం గారి వల్లే లహరి మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. తప్పకుండా మీ అందరికి నచ్చే మూవీ అవుతుంది" అన్నారు.

నటి స్పందన మాట్లాడుతూ - " నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి దన్యవాదాలు. టిక్ టాక్ వీడియో చూసి నన్ను ఈ పాత్ర కోసం సెలెక్ట్ చేశారు. సుబ్రమణ్యం గారు ఒక ఫాదర్ లా చూసుకున్నారు" అన్నారు.

నిర్మాత సుబ్రమణ్యం మాట్లాడుతూ - " మా నాన్న గారికి సినిమా అంటే ఇష్టం. ఆయన సినిమా చూసేవారు నేను సినిమాలు చేస్తున్నాను. దేవిశ్రీ ప్రసాద్ గారికి నవ్వుతూ బ్రతకాలిరా సినిమాలో అవకాశం ఇచ్చాను. మా దర్శకుడు కేశవకు సినిమా అంటే ఉన్న తపన నాకు అర్థమై ఆయనతోఈ సినిమా చేశాను. అందరూ కొత్తవారే అయినా చాలా చక్కగా నటించారు. గెటప్ శ్రీను గారు చాలా కోపరేట్ చేశారు. లహరి మనోహరన్ గారు నాకు మంచి మిత్రులు. నేను అడగగానే లహరి మ్యూజిక్ ద్వారా మా సినిమా పాటలను విడుదల చేశారు" అన్నారు.

దర్శకుడు కేశవ్ దేపూర్ మాట్లాడుతూ - "ఒక సినిమా కి ఏం కావాలన్న ఇవ్వగలిగే టెక్నీషియన్స్ దొరికితే ఆ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. అలా ఈ సినిమాకి అందరూ బెస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేయడం జరిగింది. దాదాపు 20 నిమిషాలు వి ఎఫ్ ఎక్స్ ఉంటుంది. ఒక లైన్ విని ఈ సినిమా చేసిన మా నిర్మాత సుబ్రమణ్యం గారికి థాంక్స్. అలాగే శ్రీను నాకు పదేళ్లుగా తెలుసు. మంచి క్యారెక్టర్ చేశారు. స్టూడెంట్స్ మీద వచ్చిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి. అలాగే మా సినిమా స్టూడెంట్స్ చేసే డబ్ స్మాష్ ల వల్ల ఏం జరిగింది అన్నేదే ఈ సినిమా కథాంశం. జనవరి 30 విడుదలవుతున్న ఈ మూవీ తప్పకుండా విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉంది. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం" అన్నారు.

హీరో పవన్ కృష్ణ మాట్లాడుతూ - "నా ఫస్ట్ మూవీ. పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. మా చిత్ర నిర్మాతలు, దర్శకులు చాలా కష్టపడి ఈ సినిమాను తీశారు. మీ అందరికి ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను" అన్నారు

సహా నిర్మత గజేంద్ర మాట్లాడుతూ - "చిన్న సినిమా అయినా సరే ప్యాషన్ తో నిర్మించాం. మీడియా మిత్రులు మా సినిమాను సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాను" అన్నారు.

గెటప్ శ్రీను మాట్లాడుతూ - " దాదాపు పదకొండు సంవత్సరాల క్రితం 'తెలుగబ్బాయి' సినిమా చేస్తున్నప్పుడు కేశవ మాస్టర్ పరిచయం అయ్యారు. అప్పటి నుండి నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. చాలా కష్టపడి ఈ సినిమా కథ రాసుకొని నాకు అవకాశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ చాలా బాగా నటించారు. జనవరి 30 న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా అందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను" అన్నారు.

గెటప్ శ్రీను, పవన్ కృష్ణ, సుప్రజ, స్పందన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

దర్శకత్వం: కేశవ్ దేపూర్,
నిర్మాత: ఓంకార లక్ష్మీ,
సహా నిర్మాత: గజేంద్ర తిరకాల,
కెమెరామెన్: ఆర్.రమేష్,
మ్యూజిక్:వంశీ,
ఎడిటర్: గ్రేసన్,
ఫైట్స్: ఫైర్ కార్తిక్,
లిరిక్స్: బాల వర్ధన్,
కాస్ట్యూమ్స్: డయానా,
మేకప్: రామ్ మోహన్,
ప్రొడక్షన్ మేనేజర్: మారుతి ప్రసాద్,
కథ, మాటలు: ఏ.వి.రావ్,
వి.ఎఫ్.ఎక్స్:మహిందిరన్,
అసోసియేట్ డైరెక్టర్: సుబ్రమణ్యం, లోకేష్ పెరత్తుర్,
పి.ఆర్.ఓ: సాయి సతీష్.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved