pizza
Duppatlo Minnagu teaser launch
యండమూరి "దుప్పట్లో మిన్నాగు" టీజర్ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us


2 March 2019
Hyderabad


యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతొన్న చిత్రం "దుప్పట్లో మిన్నాగు". చిరంజీవి క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి అమర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‌ ‌సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో ప్రఖ్యాత కన్నడ కధానాయిక చిరాశ్రీ నటిస్తొంది.

నవ్య వారపత్రికలో నవలల పోటీలో 50,000 ప్రథమ‌బహుమతి పొందిన దిండు కింద నల్ల త్రాచు నవల ఆధారంగా రూపొందుతొన్న చిత్రమిది.‌ఈ చిత్ర టీజర్ ను పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రసాద్ ల్యాబ్స్ లొ విడుదల చేశారు. చిత్రానికి సంబందించిన కొన్ని సన్నివేశాలను విచ్చెసిన అతిథుల చేత పదర్శించారు.

యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ..‌12 సం. క్రితం వచ్చిన ఓ చిన్న ఐడియా తో ఈ కథ రాయటం జరిగింది. ఓ ఇంటర్యూ లొ,ఓ అర్దరాత్రి,నీ జెండర్ మారిపొతే ఏ చెస్తారు అన్న ప్రశ్న కు. ఓ అమ్మాయి చెప్పిన సమాదానం , అందులొ ఉన్న డెప్త్ ను అర్దంగా చెసుకుని ఈ కథను రాయటం జరిగింది. కాశ్మీర్ ఉగ్రవాదం నేపథ్యంలో అకస్మాత్తుగా తప్పిపొయిన తండ్రిని , ఓ కూతురు ఎలా వెతికి పట్టుకుంది. తీవ్రవాదులని ఎలా మట్టు పెట్టిందన్న కథాశంతో రూపొందించిన చిత్రమిది.నిర్మాత..కె.ఎస్.రామారావు, మిత్రుడు కొదండ రామిరెడ్డి వారిరువురు రావటం సంతోషమన్నారు.

కె.ఎస్.రామారావు మాట్లాడుతూ.. దుప్పట్లో మిన్నాగు కథ చదివాను.‌ సినిమాగా చాలా అప్డెటెడ్ గా యండమూరి గారు తీశారు. కాంటెపరరీ టెక్నిషియన్స్ కు ఏమాత్రం తీసిపొకుండా అడ్వాన్స్‌డ్ గా తీశారన్నారు.

మేథా చిరంజీవి మాట్లాడుతూ.. యండమూరి గారు ఈ సినిమాకు అన్నీ తానే తీశారు. రచయితగా , దర్శకుడు గా ఆయన ప్రూవ్డ్. సినిమా ఆకట్టుకుంటుంది అలాగే ఆలొచింప చెస్తుందన్నారు

దర్శకులు కొందడరామిరెడ్డి మాట్లాడుతూ.. సినిమా చూశాను. అంతా బాగుంది.‌ఇప్పుడున్న పరిణామాలకు కరెక్ట్ గా సరిపొయె చిత్రం. ఆయన 12 నవలలు నేను సినిమాలుగా చేశాను. అవి అన్నీ హిట్టె. నాకు దర్శకుడిగా పేరు తెచ్చాయి.‌గురువుగారి సినిమా బాగా ఆడాలని ఆశిస్తున్నానన్నారు.

దర్శకులు అజయ్ మాట్లాడుతూ.. యండమూరి దారి సినిమా అంటే మా సొంత సినిమా లెక్క. "దుప్పట్లొ మిన్నాగు" టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. యువ దర్శకులకు స్పూర్తి గా ఈ సినిమా మేకింగ్ ఉంటుందన్నారు‌

నిర్మాత చల్లపల్లి అమర్ మాట్లాడుతూ: 1992 నుంచి ప్రొడక్షన్ లో ఉన్నాను. యాడ్ ఫిలింస్, డాక్యుమెంటరీలు చెస్తుంటాను.‌ఇది మా తొలి చిత్రం . ఈ సినిమా ను చాలా తక్కువ టైమ్ లో తీశాం. అందరి సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాను. యండమూరి గారు నాకు స్పూర్తి నిచ్చిన వ్యక్తి. ఈ రోజు ఆయనతో సినిమా చేయటం ఆనందంగా ఉందన్నారు.

హీరొయిన్ చిరాశ్రీ మాట్లాడుతూ.. యండమూరి గారు ఇచ్చిన సపోర్ట్ తో సినిమాను చాలా బాగా చేశాము. సార్ చాలా స్పొర్టీవ్ అన్నారు.

దశరధ్ మాట్లాడుతూ .. గురువు గారు వల్లే నేను ఈ స్దాయికి‌ వచ్చాను.‌ఆయన పుస్తకాలే నాకు స్పూర్తి. ‌ఈ కథ ఓ సూపర్ థ్రిల్లర్. అన్నీ పాత్రలు ఎక్సెలెంట్ ఉంటాయి. కమర్షియల్ గా కూడా ఇది ది బెస్ట్ మూవీ అని చెప్పుకొవచ్చు అన్నారు.

సిరి వెన్నెల సీతారామ శాస్తి మాట్లాడుతూ.. యండమూరి గారితో నాకు ఎప్పటినుంచో పరిచయం.తెలుగు తెలిసిన వారందరికి ఆయన తెలిసిన వ్యక్తి. సెలెబ్రటీలు కూడా ఆయనకు అభిమానులు.ఆయన ప్రత్యేకమైన ,పాపులర్ రచయిత. అన్నీ తరహా పాఠకలకు ఆయన రచనా శైలీ నచ్చుతుంది. కథలొ ఆసక్తికరంగా ఓ పాయింట్ తో, అవసరమైన ఎదొ ఒక విషయం ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు. బేతాళ విక్రమార్కుడు లా అందరికీ అవసరమయ్యేలా ఆయన కథలు చెపుతూనె ఉన్నాడు. ఇప్పుడు సినిమా చెస్తున్నారు. ఇది అంతే అర్దంవంతంగా , కాంటెపరరీ ఇష్యూష్ ను టచ్ చెస్తూ ఈ చిత్రాన్ని తీశారనిపించింది.‌యండమూరి రచనకు నేను అభిమానిని. విశిష్టమైన రచయిత.నా ఆలోచనలకు ఇంథనం ఇచ్చే రచనలు ఆయనవి.
ఇంకా ఎంతో పేరు రావాల్సిన రచయిత ఆయన. ఈ కథను నేను చదివాను. సినిమా సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సుబ్బరాయ శర్మ, శ్రీశైల మూర్తి పండరీ నాధ్ తదితరులు పాల్గొన్నారు.

చిరాశ్రీ ,విశ్వజిత్, నవీన్ తీర్దహళ్ళ, సుబ్బరాయ శర్మ,సుథీర్ కుమార్ ,మఢథా చిరంజీవి, అమర్ ప్రసాద్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి మాటలు: శ్రీశైల మూర్తి, కెమెరా: నిరంజన్ బాబు, ఎటిడింగ్: పవన్ ఆర్.ఎస్. , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: సతీష్ బాబు, సౌండ్ ఇంజనీర్ : శ్రీరామ్,
పి.ఆర్.ఓ: సాయి సతీష్‌,
బ్యానర్: చిరంజీవి క్రియేషన్స్,
నిర్మాత : చల్లపల్లి‌అమర్,రచన- దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved