pizza
Ee Maya Peremito press meet
ఎవ‌రినీ కించ ప‌ర‌చాల‌నే ఉద్దేశం లేదు - `ఈ మాయ పేరేమిటో` నిర్మాత దివ్యా విజ‌య్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


22 September 2018
Hyderabad

రాహుల్ విజ‌య్‌, కావ్యా థాప‌ర్ జంట‌గా న‌టించిన చిత్రం `ఈమాయ పేరేమిటో`. రాము కొప్పుల ద‌ర్శ‌కుడు. దివ్యా విజ‌య్ నిర్మాత‌. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 21న విడుద‌లైంది. ఈ సినిమాలో సాంగ్‌లోని రెండు, మూడు లైన్స్ జైన మ‌త‌స్థులు ఆరాధించే మంత్రాన్ని కించ‌ప‌రిచేలా ఉన్నాయని భావించి.. తెలుగు రాష్ట్రాల్లో ప‌లు చోట్ల నిర‌స‌న‌లు జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ శ‌నివారం పాత్రికేయుల స‌మావేశాన్ని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో...

దివ్యా విజ‌య్ మాట్లాడుతూ - `` మా చిత్రం `ఈ మాయ పేరేమిటో` నిన్న విడుద‌లైంది. అంతా పాజిటివ్ టాక్ విన‌ప‌డుతుంది. విడుద‌లైన త‌ర్వాత ముంబై నుండి నాకొక ఫోన్ కాల్ వ‌చ్చింది. ఓ సాంగ్ వ‌ల్ల జైన్స్‌ను బాధ‌ప‌డ్డ‌ట్టు వారు తెలిపారు. నేను కంటెంట్ చూపిస్తాను. ఒక‌వేళ నిజంగా మీకు అభ్య‌త‌రక‌రంగా అనిపిస్తే చెప్పండి.. తీసేస్తాం అని వారితో అన్నాను. ఎదుటి వ్య‌క్తి అర్థం చేసుకున్నారు. గంట త‌ర్వాత ఇండియాలోని ప‌లు ప్రాంతాల నుండి చాలా ఫోన్ కాల్స్ వ‌చ్చాయి. ఎవ‌రినీ కించ‌ప‌ర‌చాల‌నేది మా ఉద్దేశం కాదు. సాంగ్ అర్థం తెలియ‌క సాంగ్‌ను సినిమాలో పెట్టాం అని చెప్పం కానీ.. అది ఎవ‌రినీ బాధించ‌దు అనే ఉద్దేశంతోనే పెట్టాం. ఆ సాంగ్ రెండు నెల‌లుగా యూ ట్యూబ్‌లో ఉంది. అప్పుడే ఇలాంటి అభ్యంత‌రాలుంటే సాల్వ్ చేసుకుని ఉండేవాళ్లం. మీ సెంటిమెంట్స్ ఇబ్బంది ప‌డ్డాయి కాబ‌ట్టి .. మా టీమ్‌తో మాట్లాడుతాను. నిన్న సాయంత్రం నెల్లూరులో 20-30 మంది మా సినిమా షోను ఆపేశామ‌ని ఫోన్ వ‌చ్చింది. నేను ఆ సాంగ్‌లోని ప‌దాన్ని తీసేస్తాన‌ని చెప్పిన త‌ర్వాత కూడా నెల్లూరే కాదు.. కాకినాడ‌, గుంటూరు, రాజ‌మండ్రి ఏరియాల్లో షోల‌ను ఆపేశారు. దాంతో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని మీడియాకు బైట్ ఇచ్చాం. సాంగ్‌లోని లైన్స్‌ను క్యూబ్‌లో మ్యూట్ చేసేశాం. హైద‌రాబాద్‌లో ఈరోజే అప్‌డేట్ అయిపోతుంది. బ‌య‌ట ఉన్న థియేట‌ర్స్‌లో రేప‌టికీ మ్యూట్ అయిపోతుంది. నాకు తెలియ‌ని వాళ్ల ద‌గ్గ‌ర నుండి కాల్స్ వ‌స్తున్నాయి. బెదిరిస్తున్నారు. నేను కో ఆప‌రేట్ చేస్తున్నాన‌ని చెప్పిన త‌ర్వాత‌.. కూడా ఇంత‌లా రియాక్ట్ కావ‌డం స‌రైన ప‌ద్ధ‌తి కాదు`` అన్నారు.

ద‌ర్శ‌కుడు రాము కొప్పుల మాట్లాడుతూ - ``సినిమా నిన్న విడుద‌లైంది. అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ వ‌స్తుంది. ఇలాంటి త‌రుణంలో స‌మ‌స్య‌లు రావ‌డం బాధ‌గా ఉంది. ఈ సినిమా కోసం రెండేళ్లు క‌ష్ట‌పడ్డాం. సాంగ్స్ యూ ట్యూబ్‌లో ఉండి రెండు నెల‌లు అవుతుంది. ఇప్పుడు స‌మ‌స్య‌లు క్రియేట్ చేశారు. షోస్ ఆపేశారు. చిన్న చాన్స్ ఇచ్చుంటే బావుండేది. ఇంత హ్యాపీ మూమెంట్‌లో ఇలా జ‌ర‌గ‌డం బాధ‌గా ఉంది. ఆల్‌రెడీ లైన్స్‌ను మ్యూట్ చేసేశాం. హీరోయిన్ క్యారెక్ట‌ర్ జైన్స్ నుండి ఉంటుంది. ఆ క్యారెక్ట‌ర్‌ను ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నంలో భాగంగా రాసిన లైన్సే ఇవి. అంతే త‌ప్ప ఎవ‌రినీ హ‌ర్ట్ చేయ‌లనేది ఉద్దేశం కాదు`` అన్నారు.

ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ మాట్లాడుతూ - ``అబ్బాయి రాహుల్ హీరోగా.. అమ్మాయి దివ్య నిర్మాత‌గా చేసిన చిత్ర‌మిది. పాజిటివ్ టాక్ రావ‌డంతో చాలా హ్యాపీగా అనిపించింది. అదే స‌మ‌యంలో మా సినిమాపై విమ‌ర్శ‌లు రావ‌డం బాధ‌గా అనిపించింది. ఎవ‌రినో ఇబ్బంది పెట్టేలా సినిమా తీయాల‌నేది మా ఉద్దేశం కాదు. ఎందుకంటే 33 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాను. సరే! కొంద‌రు వాద‌న‌లు విన్న త‌ర్వాత తీసేయాల‌నే నిర్ణ‌యించుకున్నాం. ఇత‌రుల‌ను ఇబ్బంది పెట్టి క్యాష్ చేసుకునే ఉద్దేశం లేదు. నేనే కాదు.. మా ఫ్యామిలీ ఎవ‌రైనా అలాంటి ప‌ని చేస్తే నేను క్ష‌మించ‌ను. ఎవ‌రినైనా తెలియ‌క ఇబ్బంది పెట్టుంటే క్ష‌మించాలి. ఆల్ రెడీ లైన్స్‌ను క్యూబ్‌లో మ్యూట్ చేశాం. ఒక క‌మ్యూనిటీ విష‌యంలో మేం కావాల‌నే త‌ప్పు చేయం. ఎక్క‌డో మిస్ క‌మ్యూనికేట్ అయ్యింది. అంద‌రినీ మ‌న‌స్ఫూర్తిగా క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నాం. చిన్న స్థాయి నుండి క‌ష్ట‌ప‌డి వ‌చ్చాను. ఇన్నేళ్లు క‌ష్ట‌ప‌డి నా సినిమాలో ఇలాంటి మిస్టేక్ జ‌రిగిందా? అని తెలిసి బాధ‌ప‌డుతున్నాను. తెలియ‌క జ‌రిగిన త‌ప్పుకు క్ష‌మించ‌మ‌ని వేడుకుంటున్నాను`` అన్నారు.

జైన్ క‌మిటీ స‌భ్యులు మాట్లాడుతూ - ``లివ్‌.. అండ్ లెట్ లివ్ అనేదే జైన్ స‌మాజ్ పాల‌సీ. జైన్ స‌మాజ్‌కు చెందిన న‌మోకార్ మ‌హా మంత్రం అనేది గాయ‌త్రి మంత్రం వంటి ప‌వ‌ర్‌ఫుల్ మంత్రం. మన సంస్కృతిలో న‌మోకార్ మంత్రం ఆధ్యాత్మిక మంత్రం. సినిమాలో సాంగ్ అయినా.. సాంగ్‌లోని మంత్రానికి సంబంధించిన లైన్స్ అయినా తొల‌గించమ‌ని కోరుతున్నాం`` అన్నారు.

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved