pizza
Dil Raju pressmeet about Hushaaru
'హుషారు' ప్రెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

13 December 2018
Hyderabad


బెక్కెం వేణుగోపాల్‌, రియాజ్‌ నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'హుషారు'. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మంచు, దినేష్‌ తేజ్‌, దక్ష నగార్కర్‌, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో...

దిల్‌రాజు మాట్లాడుతూ - ''ఒకరిద్దరు మినహా అందరూ కొత్తవాళ్లతో బెక్కెంవేణుగోపాల్‌ ప్రొడక్షన్‌లో వస్తోన్న చిత్రం 'హుషారు'. ఆల్‌ రెడీ ఆడియో చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. రేపు విడుదలవుతున్న ఈ చిత్రం. ఐదుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల మధ్య జరిగే చిత్రమిది. సినిమా చాలా పెద్ద సక్సెస్‌ కావాలి. ఇందులో నటించిన వారందరికీ మంచి ఫ్యూచర్‌ ఉండాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాకు బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్‌కి, ఎంటైర్‌ యూనిట్‌కు అభినందనలు'' అని తెలిపారు.

బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ - ''చిన్న సినిమాలను దిల్‌రాజుగారు ఎప్పుడూ ఎంకరేజ్‌ చేస్తుంటారు. అలాగే మా సినిమాకు ఆయన తనవంతు ఎంకరేజ్‌మెంట్‌ ఇస్తున్నారు. ఈ సందర్భంగా దిల్‌రాజుగారికి థాంక్స్‌. చాలా ఎగ్జయిట్‌గా వెయిట్‌ చేస్తున్నాం. సినిమా 250 థియేటర్స్‌లో సినిమాను విడుదల చేస్తున్నాం. యు.ఎస్‌లో కూడా సినిమాను విడుదల చేస్తున్నాం. అన్నీ ఏరియాల్లో మంచి థియేటర్స్‌లో సినిమాను విడుదల చేస్తున్నాం. రేపు విడుదలవుతోన్న హుషారు యూత్‌ అందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెబుతున్నాను. చిన్న సినిమాకు మంచి అంచనాలు రావడం ఆనందంగా ఉంది. డైరెక్టర్‌ శ్రీహర్ష సినిమాను చక్కగా తెరకెక్కించాడు. తప్పకుండా సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకంగా ఉన్నాం'' అన్నారు.

దర్శకుడు శ్రీహర్ష మాట్లాడుతూ - ''దిల్‌రాజుగారికి థాంక్స్‌. ఫ్రెండ్‌ఫిప్‌ ఆధారంగా మా హుషారు సినిమా ఉంటుంది. యంగ్‌స్టర్స్‌కి నచ్చే సినిమా అవుతుంది. అందరికీ కనెక్ట్‌ అవుతుంది'' అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved