దక్షిణాది సినిమా పరిశ్రమలో ఉత్తమ చిత్రాలకు అందులో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్‌కు అవార్డ్స్‌ను అందించే ఐఫా వేడుకలు ఆదివారం సోమవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్నాయి. ఈ వేడుకలకు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ పరిశ్రమలకు చెందిన పలువరు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టి.సుబ్బరామిరెడ్డి, అస్కార్ అవార్డ్ విన్నర్ రసూల్ పూకుట్టి, రాష్ట్ర టూరిజం సెక్రటరీ వెంకటేశం, శివరాజ్‌కుమార్, దేవిశ్రీ ప్రసాద్, సురేష్‌బాబు, శ్రియ, తాప్సీ, ప్రియమణి, ఆదాశర్మ, మమతామోహన్‌దాస్, నాజర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
రాష్ట్ర టూరిజం సెక్రటరీ వెంకటేశం మాట్లాడుతూ ``ప్రతిష్టాత్మకంగా జరిగే ఐఫా వేడుకలకు హైదరాబాద్ నగరం వేదిక కావడం ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఈ వేడుకలకు తమ వంతు సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది`` అన్నారు.
రసూల్ పూకుట్టి మాట్లాడుతూ ''ఇండియన్ సినిమాలో సౌత్ సినిమా నలబై శాతం కలిగి ఉంది.అంతే కాకుండా ప్రతి సంవత్సరం జాతీయ అవార్డులను కూడా దక్షిణాది కళాకారులే దక్కించుకుంటున్నారు. బాహుబలితో దక్షిణాది సినిమా అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకుంది. ఎంతోప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ నగరంలో ఐఫా వేడుకలు జరగడం ఎంతో ఆనందాయకం`` అన్నారు