pizza
Lakshmi's NTR success meet
`లక్ష్మీస్ ఎన్టీఆర్‌` స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


01 April 2019
Hyderabad

`లక్ష్మీస్ ఎన్టీఆర్‌` స‌క్సెస్ మీట్‌

విజ‌య్‌కుమార్‌, య‌జ్ఞాశెట్టి, శ్రీతేజ్ త‌దిత‌రులు న‌టించిన చిత్రం `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`. రాంగోపాల్ వ‌ర్మ, అగ‌స్త్య మంజు ద‌ర్శ‌కులు. మార్చి 29న సినిమా విడుదలైంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన స‌క్సెస్‌మీట్‌లో...

శ్రీతేజ్ మాట్లాడుతూ - ``లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు చాలా మంది స్పంద‌న వ‌స్తుంది. సినిమా చూసిన వారంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. నేను నారా చంద్ర‌బాబునాయుడుగారి పాత్ర చేశాను. చాలా చేశాన‌ని అంటుంటే సంతోషంగా ఉంది. ఎన్టీఆర్‌గారు క్యారెక్ట‌ర్ విజ‌య్‌కుమార్‌గారు, ల‌క్ష్మీపార్వ‌తిగారు య‌జ్ఞాశెట్టి అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన రాంగోపాల్ వ‌ర్మ‌గారికి థాంక్స్‌. వంగ‌వీటిలో దేవినేని నెహ్రుగారి పాత్ర చేసినా.. ఈ సినిమాలో చంద్ర‌బాబునాయుడుగారి పాత్ర చేసినా అందుకు ప్ర‌ధాన కార‌ణం డైరెక్ట‌ర్ అగ‌స్త్య‌మంజుగారే. ఆయ‌న్ను నా పెద్ద‌న్న‌గా భావిస్తున్నాను. ఆర్‌జివిగారి ద‌గ్గ‌ర చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ఓ న‌టుడిగా మ‌న‌స్ఫూర్తిగా సంతోషంగా ఉన్నాను. డిసెంబ‌ర్ 6న నా జీవితంలో మ‌ర‌చిపోలేని రోజు. ఆ రోజు నుండి చంద్ర‌బాబు నాయుడిగారి ఫోటోలు ఓ వెయ్యి క‌లెక్ట్ చేసుంటాను. నా పాత్ర మాత్ర‌మే క‌న‌ప‌డాల‌ని త‌ప‌న ప‌డ్డాను. లుక్స్‌, బాడీ మేన‌రిజ‌మ్స్ ఇలా అన్నీ విష‌యాల్లో కేర్ తీసుకుని చేశాను. 100 శాతం ఎఫ‌ర్ట్ పెట్టి చేశాను. ప్ర‌తి సినిమాలో ఇలాంటి ఎఫ‌ర్ట్‌నే చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. ఎక్కువ‌గా పాత్ర గురించి రీసెర్చ్‌చేసి చేశాను`` అన్నారు.

య‌జ్ఞా శెట్టి మాట్లాడుతూ - ``ఆర్‌జివిగారితో కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌లో ప‌నిచేశాను. త‌ర్వాత ఆయ‌న‌తో చేసిన రెండో సినిమా. అమేజింగ్ డైరెక్ట‌ర్ ఆర్‌జివిగారు .. సెన్సిటివ్ స‌బ్జెక్ట్‌ను ఈ సినిమాలో ట‌చ్ చేశారు. ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ చేశారు. ఆయ‌న‌కు న‌చ్చ‌డంతో స్క్రిప్ట్ పంపారు. తెలుగు రాని నేను చాలా క‌ష్ట‌ప‌డి డైలాగ్స్ నేర్చుకున్నాను. ఆర్‌జివిగారు, మంజుగారు మంచి స‌ల‌హాల‌నివ్వ‌డంతో సినిమాను చ‌క్క‌గా పూర్తి చేశాను. విజ‌య్‌కుమార్‌గారు అద్భుతంగా న‌టించారు. ఆయ‌న‌తో పోటీగా నేను ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చాను. శ్రీతేజ్ స‌హా సినిమాలో ప్రతి ఒక క్యారెక్ట‌ర్ అద్భుతంగా న‌టించారు`` అన్నారు.

విజ‌య్‌కుమార్ మాట్లాడుతూ - ``45 సంవ‌త్స‌రాలుగా నేను నాట‌కాల్లో ఉన్నాను. న‌న్ను హేళ‌న చేసిన వారు కూడా ఉన్నారు. జీవితంలో ట‌ఫ్‌గా రోజుల‌ను గ‌డిపాను. అలా గ‌డ‌పాను కాబ‌ట్టే.. క‌ళామ‌త‌ల్లి నాకు రాంగోపాల్ వ‌ర్మ‌గారి రూపంలో అవ‌కాశం ఇచ్చారు. సోష‌ల్‌, పౌరాణిక నాట‌కాల్లో అన్నీ పాత్ర‌లు పోషించిన నటుడ్ని. చ‌క్క‌టి న‌టుడిగా మంచి పేరు సంపాదించుకున్నాను. మా ఆర్‌జివిగారికి థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయ‌న అవకాశం ఇచ్చారు. అలాగే నాలో న‌టుడ్ని బ‌య‌ట‌కు తెచ్చిన డైరెక్ట‌ర్ మంజుగారికి థాంక్స్`` అన్నారు.
గంగాధ‌ర్ మాట్లాడుతూ - ``నేను నాట‌క రంగానికి చెందిన‌వాడినే. ఉద్యోగం వ‌దిలేసి సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. ప‌దేళ్లుగా సినిమా రంగంలోనే ఉంటున్నాను. భైర‌వ‌గీతలో నేను హీరోకి స‌పోర్టింగ్ రోల్ చేశాను. ఆ సినిమా స‌మయంలో హ‌రికృష్ణ పాత్ర‌కు న‌న్ను ఎంపిక చేశారు`` అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved