pizza
MAA press meet
`మా` ప్రెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


16 March 2019
Hyderabad

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా) కొత్త అధ్య‌క్షుడు న‌రేష్ .. గ‌త పాల‌క క‌మిటీ అధ్య‌క్షుడు శివాజీ రాజా ప్యానెల్‌ను ఉద్దేశించి ..అంద‌రం క‌లిసి మా అభ్యున్న‌తికి ప‌నిచేస్తామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన ఎన్నిక‌ల్లో..

మా అధ్య‌క్షుడు న‌రేష్ వి.కె.మాట్లాడుతూ - ``గ‌త సారి లోక్‌స‌భ ఎన్నిక‌లు మే నెల‌లో జ‌రిగాయి. ఈసారి ఏప్రిల్‌లో జ‌రుగుతున్నాయి. ఏప్రిల్‌లో ప్ర‌ధాని ఎన్నిక కాబ‌డితే మే వ‌ర‌కు సీట్‌లో కూర్చోకూడ‌ద‌నే రూల్ ఏమైనా ఉందా? గ‌త ట‌ర్మ్‌లో న‌న్ను కార్య‌ద‌ర్శిగా ప‌నిచేయ‌నివ్వ‌లేద‌ని, కొన్ని అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని, రెండేళ్ల ఆడియో రికార్డులు మాయ‌మ‌య్యాయ‌ని కూడాచెప్పాను. నాకు అన్నీ విష‌యాలు తెలియ వ‌చ్చాయి లైఫ్ ఇన్‌సూరెన్స్ ఉంది. `మా`లోని స‌భ్యుడెవ‌రైనా చ‌నిపోతే .. వెంట‌నే రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇచ్చి వెంట‌నే క్లెయిం చేసుకుంటారు. ఇది ఎక్స్‌పెయిర్ అయిపోయింది. దీన్ని ప‌ట్టించుకోలేదు. ఇలాంటి సంద‌ర్భంలో ఎవ‌రైనా దుర‌దృష్ట‌వ‌శాతు చ‌నిపోతే రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇవ్వ‌డానికి `మా`కు అవ‌కాశం ఉండ‌దు. ఇది క‌రెక్టా? మ‌నుషుల ప్రాణాల‌తో ఆడుకోవ‌డం క‌రెక్టా? ఉదాహ‌ర‌ణ‌కు ముర‌ళీమోహ‌న్‌గారు ఓడిపోయిన రోజున.. ఆయ‌న నెక్ట్స్ క‌మిటీ ఎన్నికైన రోజునే గౌర‌వంగా చార్జ్ ఇచ్చేసి వెళ్లిపోయారు. పేర్లు చెప్ప‌ను కానీ.. చెక్కుల‌పై సంత‌కం పెట్టండి పెండింగ్ ఉంద‌ని అంటే.. మేం పెట్ట‌మ‌ని అన్నారు. ఇవి మాట్లాడ‌కూడ‌దు .. ఇంటి గుట్టుని బ‌య‌ట‌కు పెట్ట‌కూడ‌ద‌ని అనుకున్నాను. కానీ చెప్ప‌క త‌ప్ప‌డం లేదు. శుభ‌కార్యం జ‌రుగుతున్న‌ప్పుడు ఎందుకు ఆపుతున్నారు. చేయాల్సిన ప‌నులు చాలా ఉన్నాయి. చాలా స‌మ‌స్య‌లున్నాయి. నేను వేటినీ చెప్ప‌డం లేదు. కానీ మ‌మ్మ‌ల్ని ఎందుకు ఇలా హింస పెట్ట‌డం? ఒక మార్పు కావాల‌ని అడిగాం. అది ఎన్నిక‌లు ద్వారా జ‌రిగింది. కానీ దీన్ని డిస్‌క్వాలిఫై చేయాల‌ని చూస్తున్నారు. కొంత మంది స‌భ్యుల‌ను ఎత్తుకెళ్లిపోయారు. అవ‌న్నీ నేను మాట్లాడాల‌ని అనుకోవ‌డం లేదు. నీకెందుకు అన్ని ఓట్లు వ‌చ్చాయి. రీ కౌంటింగ్ పెట్టించు అంటున్నారు. త‌ప్పు చేస్తున్నారు. `మా` స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌.. పొలిటిక‌ల్ పార్టీలాగా కాకూడ‌దు.. మాఫియా అస‌లు కాకూడ‌ద‌ని ఎన్నిక‌లు పెట్టుకున్నాం. అంద‌రి కోసం, మా కోసం శివాజీరాజాతో అంద‌రం క‌లిసి ప‌నిచేద్దామ‌ని చెప్పాం. ఇప్ప‌టికి దిగ‌జారిపోయారు. ఇంకా ఈ ప‌నులెందుకు. ఈ సంద‌ర్భంలో శ్రీకాంత్ గురించి ఓ మంచి మాట చెప్పాలి. గెలిచిన‌రోజునే త‌ను ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పాడు. అయ్యిందేదో అయ్యింది.. క‌లిసి ప‌నిచేద్దామ‌ని అన్నాడు. సాయికుమార్, శ్రీకాంత్‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, రాజీవ్ క‌న‌కాల మీరంద‌రూ దీనికి ఒప్పుకుంటారా? అని అడుగుతున్నాను. మా అధ్య‌క్షుడిగా ఈ నెల 22న పాల‌క వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారానికి మంచి ముహుర్తం ఉంద‌ని పురోహితులు చెప్పారు. అది మిస్ అయితే.. ఉగాది వ‌ర‌కు మంచి ముహుర్తాలు లేవ‌ని అన్నారు. పెన్ష‌న్స్ ఇవ్వాలి. కార్య‌క్ర‌మాలు జ‌ర‌గాలి. ఉగాది త‌ర్వాతే కొత్త పాల‌క వ‌ర్గం కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంది. ఈ మ‌ధ్య‌లో ఎవ‌రికైనా ఏమైనా అయితే ఆయ‌న్నే డ‌బ్బులు క‌ట్ట‌మ‌నండి. ఇక రెండో ఆప్ష‌న్ ప్ర‌కారం సినీ పెద్ద‌లు అంద‌రూ ఒప్పుకుంటే.. వారి నిర్ణ‌యానికి అనుగుణంగానే ముందుకు వెళ‌తాం`` అన్నారు.

`మా` ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ డా.రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ - ``నాకు గ‌తంలో ఏం జరిగిందో తెలియ‌దు.. పాత క‌థ‌లు వ‌ద్దు, కొత్త క‌థ‌లు వ‌ద్దు.. అన్నీ ప‌క్క‌న పెట్టేస్తాం. ఇప్పుడు మ‌మ్మ‌ల్ని ప‌నిచేయ‌డానికి అనుమ‌తించండి. ఇలా అడ్డంకులు పెట్ట‌డం .. ఆక‌తాయి గేమ్స్ ఆడుకోవ‌డం ఎవ‌రికీ మంచిది కాదు.. అంద‌రం క‌లిసి అన్నీ ప‌నులు చేసుకుందామ‌నే ముందు నుండి చెబుతూ వ‌స్తున్నాం. ఇది ఒక ప్యానెల్‌లోని స‌భ్యుల వ‌ల్ల కాదు. క‌మిటీలు వేసి అంద‌రం క‌లిసి ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంది. అన్నీ మ‌రచిపోతాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఉన్న‌తికి పాటుప‌డుదాం`` అన్నారు.

`మా` జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జీవితా రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ - ``అస‌లు `మా` ఎన్నిక‌లకు వెళ్ల‌డ‌మే షేమ్‌గా అనిపించింది. స‌రే! స‌మ‌స్య‌లు వ‌చ్చాయి క‌దా! అని ఎన్నిక‌ల‌కు వెళ్లాం. సరే జ‌రిగిన విష‌యాల‌ను మ‌ర‌చిపోదాం అనుకుని ముందుకెళ‌దామ‌ని అనుకున్నాం. మేం గెలిచాం.. వారు ఓడిపోయారు. ఎన్నిక‌లు త‌ర్వాత ఇలా ఇబ్బందులు పెడుతున్నారెందుకో అర్థం కావ‌డం లేదు. నేను గెలిచిన త‌ర్వాత కూడా నా ఎలిజిబిలిటీ గురించి కూడా ప్ర‌శ్నిస్తున్నారు. అంద‌రం క‌లిసి ప‌నిచేయాల‌నే అనుకుంటున్నాం. మాకు స‌మ‌స్య‌లు వ‌ద్దు. `మా`కు మంచి జ‌ర‌గాల‌నే అనుకున్నాం. ఆల్ రెడి న‌ష్టం జ‌రిగింది. `మా`లో ఉన్న‌వాతావ‌ర‌ణాన్నితెలియ‌జేయ‌డానికి మీడియా ముందుకు వ‌చ్చాం. ప‌దిరోజుల త‌ర్వాత మ‌మ్మ‌ల్ని వ‌ర్క్ చేయ‌మ‌న్నా మాకేం అభ్యంత‌రం లేదు. అయితే అన్నీ ప‌నులు ఎందుకు ఆగిపోవాలి. పోనీ పాత క‌మిటీవాళ్లు ప‌నులు చేస్తామంటే.. మాకెలాంటి అభ్యంత‌రం లేదు. మా పెద్ద‌లు కూడా మేం క‌రెక్ట్ అనే అంటున్నారు.

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved