pizza
Ninnila Ninnila Press Meet
అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ కాంబినేష‌న్‌లో రూపొందిన‌ `నిన్నిలా నిన్నిలా`... జీ ప్లెక్స్‌లో ఫిబ్ర‌వ‌రి 26న విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


21 February -2021
Hyderabad

అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం `నిన్నిలా నిన్నిలా`. బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్‌ల‌‌పై బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అని.ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జీ ప్లెక్స్‌లో ఫిబ్ర‌వ‌రి 26న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో...

సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి మాట్లాడుతూ - ``కొంత మంది స్నేహితులు క‌లిసి నిజాయ‌తీతో చేసిన ప్ర‌య‌త్న‌మిది. అంద‌రూ సినిమా చూడాల‌ని కోరుకుంటున్నాను. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల ప‌రంగా మంచి టీమ్ కుదిరింది`` అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు అని.ఐ.వి.శ‌శి మాట్లాడుతూ - ``సినిమాటోగ్రాప‌ర్ దివాక‌ర్ మ‌ణి చెప్పిన‌ట్లు స్నేహితులం అంద‌రూ క‌లిసి చేసిన సినిమా ఇదిఅంద‌రూ నిజాయ‌తీతో సినిమా చేశాం. . అంద‌రం లండ‌న్ వెళ్లి ఫ‌న్‌ను ఎంజాయ్ చేస్తూ సినిమాను పూర్తి చేశాం. సినిమా బాగా వ‌చ్చింది. సినిమా చూస్తున్నంత సేపు చిరున‌వ్వుతో ఉంటారు`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ రాజేశ్ మురుగేశ‌న్‌ మాట్లాడుతూ - ```నిన్నిలా నిన్నిలా నైస్ మూవీ. నాకు మ్యూజిక్ చేసే అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు అనికి, నిర్మాత‌ల‌కు థాంక్స్‌. సినిమాలో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది. సినిమాను అంద‌రూ చూసి ఎంక‌రేజ్ చేయండి`` అన్నారు.

హీరోయిన్ రీతూవ‌ర్మ మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడు అనిగారికి, నిర్మాత‌లు ప్ర‌సాద్‌గారికి, బాపినీడు గారికి థాంక్స్‌. నాజర్‌గారు, నిత్యామీన‌న్‌, అశోక్ సెల్వ‌న్‌తో క‌లిసి యాక్ట్ చేయ‌డం హ్యాపీగా అనిపించింది`` అన్నారు.

హీరోయిన్ నిత్యామీన‌న్ మాట్లాడుతూ - ``స్నేహితులంద‌రం క‌లిసి ఓ బ్యూటీఫుల్ సినిమా చేశాం. మా అంద‌రికీ ఎంతో న‌చ్చిన సినిమా. ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు అలా మొద‌లైంది గుర్తుకు వ‌స్తుంది. నందినీ, నేను, నాని క్లోజ్‌ఫ్రెండ్స్‌గా చేసిన సినిమా అది. ఆ సినిమా ఎంత బాగా హిట్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాలాగానే `నిన్నిలా నిన్నిలా` సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

చిత్ర నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌ మాట్లాడుతూ - ``ల‌వ్ అండ్ ఎమోష‌న్ మూవీ `నిన్నిలా నిన్నిలా`. అశోక్ సెల్వ‌న్‌, రీతూవ‌ర్మ‌, నిత్యామీన‌న్ స‌హా అని ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా జీ ప్లెక్స్‌లో ఫిబ్ర‌వ‌రి 26న విడుద‌ల‌వుతుంది. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు.

హీరో అశోక్ సెల్వ‌న్ మాట్లాడుతూ - ``ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన సినిమాల‌కు భిన్న‌మైన చిత్రం. ఫీల్ ఉండే ల‌వ్ స్టోరితో తెర‌కెక్కింది. ఫ్రెండ్స్‌లా అంద‌రం కలిసి ఎంజాయ్ చేస్తూ చేశాం. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సినిమా కూల్‌గా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపే ఓ స్మైల్ మీ మొహంలో ఉంటుంది. జీ ప్లెక్స్‌లో ఫిబ్ర‌వ‌రి 26న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాను అంద‌రూ చూసి మా ప్ర‌య‌త్నాని ఆశీర్వ‌దించాల‌ని కోరుతున్నాను`` అన్నారు.

 

న‌టీన‌టులు:
అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ, నాజర్‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: అని.ఐ.వి.శ‌శి
నిర్మాత‌: బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌
స‌మ‌ర్ప‌ణ‌: బాపినీడు.బి
సినిమాటోగ్ర‌ఫీ: దివాక‌ర్ మ‌ణి
సంగీతం: రాజేశ్ మురుగేశ‌న్‌
పాట‌లు: శ్రీమ‌ణి
డైలాగ్స్‌: నాగ చంద‌, అనుష‌, జ‌యంత్ పానుగంటి
ఆర్ట్‌: శ్రీ నాగేంద్ర తంగాల‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
డైలాగ్స్‌: నాగ చందు, అనుష, జ‌యంత్ పానుగంటి
పి.ఆర్.ఒ: వంశీ కాకా

 

Ashok Selvan, Nithya Menen, Ritu Varma-starrer 'Ninnila Ninnila' to stream on ZeePlex from February 26

'Ninnila Ninnila', starring Ashok Selvan, Nithya Menen and Ritu Varma, is a promising film presented by Bapineedu B and produced by Sri Venkateswara Cine Chitra LLP and Zee Studios. BVSN Prasad is producing it. Directed by Ani IV Sasi, the awaited movie is all set to release on ZeePlex on February 26.

The team of the movie on Sunday interacted with the media and spoke about the movie.

Cinematographer Divakar Mani said, "This film is a sincere attempt by a group of friends. I urge everyone to please watch it. A very talented set of people have worked on the movie."

Director Ani IV Sasi said, "This project is indeed the collective effort of a group of friends. We had so much fun shooting 'Ninnila Ninnila' in London. The output is superb. You are going to have a smile on your face while watching it."

Music director Rajesh Murugesan said, "This is such a nice story and I thank the director and producers for giving me the opportunity to set the songs to tune. Please do encourage our movie."

Ritu Varma said, "I thank the director, producers Prasad garu and Bapineedu garu on this occasion. I am extremely happy to have got to work with Nasser garu, Nithya Menen, and Ashok Selvan."

Nithya Menen said, "We all friends came together for this beautiful film. I am reminded of the days of 'Ala Modalaindi'. During its making, I, director Nandini Reddy and Nani became good friends. The film became a big hit. I wish that 'Ninnila Ninnila' repeats the feat."

Producer BVSN Prasad said, "This is a love and emotional movie. We are so happy to release it on ZeePlex this February 26."

Ashok Selvan said, "This film is entirely different from the kind of movies I have done before. It has got so much feel. We enjoyed ourselves together like friends while shooting for it. Each of the songs released so far has been received well by the listeners. Our film is going to leave you with a smile. I urge everyone to watch this movie from February 26 and bless us."

The film will also be releasing in cinemas in Overseas territories like the USA, Middle East, and Australia among others on February 26 along with the Tamil version, which is titled 'Theeni'.

Cast:

Ashok Selvan, Nithya Menen, Ritu Varma and others.

Crew:

Director: Ani IV Sasi
Producer: BVSN Prasad
Presenter: Bapineedu B
Cinematographer: Diwakar Mani
Music Director: Rajesh Murugesan
Lyrics: Sreemani
Dialogue writers: Naga Chanda, Anusha, Jayanth Panuganti
Art Director: Sri Nagendra Thangala
Editor: Naveen Nooli

 


Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved