pizza
Prema Antha Easy Kadu press meet
`ప్రేమ అంత ఈజీ కాదు` ప్రెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


27 March 2019
Hyderabad

రాజేష్ కుమార్‌, ప్ర‌జ్వ‌ల్ జంట‌గా ఈశ్వ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `ప్రేమ అంత ఈజీ కాదు`. టి. న‌రేష్‌, టి. శ్రీధ‌ర్ నిర్మాత‌లు. ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి

స‌మ‌ర్ప‌కుడు టి. అంజ‌య్య మాట్లాడుతూ ``ప్రేమ‌కు సంబంధించి ఇప్ప‌టికే చాలా సినిమాలు వ‌చ్చాయి. ఈ సినిమాలో కొత్త కోణంలో ప్రేమ‌ను ఆవిష్క‌రించాం. సెన్సార్ స‌భ్యులు క్లీన్ యు స‌ర్టిఫికెట్ ఇచ్చారు. మంచి సినిమా చూశామ‌ని వారు స్పందించ‌డం నేను మ‌ర్చిపోలేను. మా అబ్బాయిల‌కు సినిమా తీయాల‌ని ఎప్ప‌టి నుంచో కోరిక‌. ఈ సినిమా గురించి చెప్పిన‌ప్పుడు కూడా మంచి సినిమా తీయ‌మ‌నే అన్నాను. ట్రైల‌ర్ బావుంద‌ని చూసిన వారంద‌రూ అంటున్నారు. సినిమా పెద్ద హిట్ కావాలి`` అని అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ ``మంచి డిస్ట్రిబ్యూట‌ర్లు మా సినిమాను విడుద‌ల చేస్తున్నారు. తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉన్న బంధాన్ని చెప్పే సినిమా ఇది. మెసేజ్ ఉంటుంది. పుట్టుక‌తోనే ప్రేమ‌లో ప‌డ్డ ఇద్ద‌రు.. వారు పెరిగే కొద్దీ వారి ప్రేమ పెరిగిన తీరును ఈసినిమాలో చెబుతున్నాం`` అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``కొత్త‌వాళ్ల‌కు చాన్స్ ఇచ్చాం. నేను చిరంజీవిగారికి పెద్ద ఫ్యాన్‌. ఆయ‌న సినిమాలు చూస్తూ పెరిగాను. ఇంట్లో ఫాద‌ర్‌, స‌న్ రిలేష‌న్‌షిప్ ఎలా ఉంటుందో ఈ సినిమా అలాగే ఉంటుంది. మ‌న జీవితాన్ని ప్ర‌తిబింబిస్తుంది. మ‌న ఇంటి చుట్టుప‌క్క‌ల చూసే చాలా అంశాలు ఈ సినిమాలో ఉంటాయి`` అని అన్నారు.

హీరోయిన్ మాట్లాడుతూ ``ఇందులో ప్రేమ అనే పాత్ర చేశాను. ఫ్యామిలీ సెంటిమెంట్లు బాగా ఉన్న చిత్ర‌మిది. తండ్రీ కొడుకుల మ‌ధ్య అనుబంధాన్ని చూపిస్తుంది`` అని చెప్పారు.


హీరో మాట్లాడుతూ ``ఎవ‌రైనా రూ.100 పెట్టి టిక్కెట్ కొంటే, వారికి రూ.1000 వినోదం ద‌క్కుతుంది. మా సినిమాకు బిజినెస్ బాగా జ‌రిగింది. పెద్ద హిట్ కావాల‌ని ఆకాంక్షిస్తున్నాం`` అని అన్నారు.

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved