pizza
Prementha Panichese Narayana release on October
అక్టోబ‌ర్ 5న వ‌స్తోన్న `ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌`
You are at idlebrain.com > News > Functions
Follow Us


22 September 2018
Hyderabad

జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస రావు ద‌ర్శ‌క‌త్వంలో సావిత్రి జొన్న‌ల‌గ‌డ్డ నిర్మిస్తున్న చిత్రం `ప్రేమెంత ప‌ని చేసె నారాయ‌ణ‌`. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని అక్టోబ‌ర్ 5న విడ‌దుల‌వుతోంది. ఈ సంద‌ర్బంగా ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో పాత్రికేయ‌లు స‌మావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు జొన్న‌ల‌గ‌డ్డ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ...``సినిమా మొత్తం పూర్త‌యింది. అక్టోబ‌ర్ 5న వ‌రల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు నేను పెద్ద హీరోల‌తో ఎనిమిది సినిమాల‌కు డైర‌క్ష‌ణ్ చేశాను. ఇది నా 9వ సినిమా. అంతా కొత్త‌వారితో, కొత్త కాన్సెప్ట్ తో చేస్తున్నా. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో చాలా ల‌వ్ స్టోరీస్ వ‌చ్చాయి కానీ, మా సిన‌మా లో ఉన్న ట్విస్ట్ తో ఏ సినిమా రాలేదు. ఓ సాధార‌ణ‌మైన కుర్రాడు త‌న ప్రేమ‌ను ఎలాంటి వెప‌న్ ఉప‌యోగించి సాధించుకున్నాడు అన్న‌ది ఆస‌క్తిక‌ర‌మైన అంశం. పేరెంట్స్ కు, యూత్ కు ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్టయ్యే సినిమా ఇది. మా అబ్బాయి హ‌రి ఈ సినిమా ద్వారా మీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇప్ప‌టికే పాట‌లకు, ట్రైల‌ర్స్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ముఖ్యంగా డాన్స్ గురించి అంద‌రూ చెబుతున్నారు. మా సినిమాకు జ‌గ‌ప‌తి బాబు గారు ఇచ్చిన వాయిస్ ఓవ‌ర్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. నన్ను ఆద‌రించినట్టుగానే ఈ సినిమా ద్వారా హీరోగా ప‌రిచ‌యం అవుతోన్న మా అబ్బాయిని కూడా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా`` అన్నారు.

హీరో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ...`` ఇది రెగ్యుల‌ర్ సినిమా కాదు. ల‌వ్ స్టోరీల్లో డిఫ‌రెంట్ గా ఉంటుంది. హీరో ప్రేమ‌ని గెలిపించ‌డానికి ఫ్రెండ్స్ ప‌డే త‌ప‌న‌. స్నేహం యొక్క గొప్ప‌త‌నం చెప్పేవిధంగా ఉంటుంది . సినిమా ప్ర‌తి ల‌వ‌ర్ కి క‌నెక్ట‌వుతుంది`` అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు యాజ‌మాన్య మాట్లాడుతూ...``ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ముఖ్యంగా ఈ బుజ్జిగాడికి న‌చ్చేశావే పాట‌కు రెస్పాన్స్ బావుంది. సినిమాకు నేప‌థ్య సంగీతం అందిస్తూ చాలా ఎంజాయ్ చేశాను. ప్ర‌తి ఒక్క‌రం ఫుల్ ఎఫ‌ర్ట్ పెట్టి సినిమా చేశాం`` అన్నారు.

పాట‌ల ర‌చ‌యిత గోసాల రాంబాబు మాట్లాడుతూ...``ఇందులో పాట‌ల‌న్నీ రాశాను. మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా కూడా స‌క్సెస్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు.

ఝాన్సీ , చిలుకూరి గంగారావు, ఎఆర్‌సి.బాబు, రాహుల్ బొకాడియా , పింగ్ పాంగ్, రాఘ‌వ‌పూడి, రాజారావు త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి క‌థఃజేయ‌స్ఆర్ మూవీస్; స‌్క్రీన్ ప్లేః భూప‌తిరాజా, మ‌రుధూరిరాజా, రాజేంద్ర‌కుమార్; మాట‌లుఃసుబ్బ‌రాయుడు బొంపెం; స‌ంగీతంః యాజ‌మాన్య‌; పాట‌లుః వ‌న‌మాలి, గోసాల రాంబాబు; ఎడిట‌ర్ః జాన‌కిరామ్‌; కెమెరాః పియ‌స్‌వంశీ ప్రకాష్‌; కొరియోగ్ర‌ఫీః ప్రేమ్ ర‌క్షిత్‌, విద్వాసాగ‌ర్‌, శ్రీధ‌ర్‌; నిర్మాతః సావిత్రి జొన్న‌ల‌గ‌డ్డ‌; ద‌ర్శ‌క‌త్వంః జొన్న‌ల‌గ‌డ్డ శ్రీనివాస‌రావు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved