pizza
Right Right trailer launch
రైట్ రైట్ ట్రైలర్ విడుదల
ou are at idlebrain.com > News > Functions
Follow Us

17 April 2016
Hyderabad

వత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పణలో సుమంత్ అశ్విన్ హీరోగా మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం `రైట్ రైట్‌`. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. `బాహుబ‌లిఫేమ్ ప్ర‌భాక‌ర్ ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. పూజా జ‌వేరి క‌థానాయిక‌. ఈ కార్యక్రమంలో ..

బి.గోపాల్ మాట్లాడుతూ ‘’రైట్ రైట్ అనే పాపులర్ పదంతో టైటిల్ పెట్టడం పాజిటివ్ పాయింట్. మను అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా తనకు మంచి బ్రేక్ కావాలి. సుమంత్ ఆశ్విన్ కు పెద్ద హిట్ చిత్రం కావాలి. యూనిట్ కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

మారుతి మాట్లాడుతూ ‘’సుమంత్ ఆశ్విన్ కొత్తగా చేసిన పాత్ర ఇది. విలేజ్ అబ్బాయి రోల్ తనకు మంచి పేరు తీసుకొస్తుంది. మంచి టీం చేసిన ఈ ప్రయత్నం పెద్ద సక్సెస్ అవుతుంది’’ అన్నారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘’సుమంత్ ఆశ్విన్ మంచి డైరెక్టర్ అవుతాడని అనుకున్నాను కానీ తను హీరో అయ్యాడు. ట్రైలర్ చాలా బావుంది. సుమంత్ రైట్ రైట్ పెద్ద హిట్ మూవీ కావాలి’’అన్నారు.

దర్శకుడు మను మాట్లాడుతూ ‘’డ్రైవర్, కండెక్టర్ మధ్య జరిగే కథ. అశ్విన్ కెరీర్‌లో మంచి సినిమా అవుతుంది. `ల‌వ‌ర్స్`, `కేరింత‌సినిమాల స‌క్సెస్‌లో ఉన్న ఆయ‌న‌కు ఈ సినిమా గుర్తుండిపోతుంది. నాజ‌ర్ చాలా అద్భుత‌మైన పాత్ర‌ను పోషించారు. తొలి స‌గం వినోదాత్మ‌కంగా సాగుతుంది. మ‌లి స‌గంలో మిస్ట‌రీ ఉంటుంది. మొత్తానికి ఉత్కంఠ‌భ‌రితంగా సాగే చిత్ర‌మ‌వుతుంది. `బాహుబ‌లిప్ర‌భాక‌ర్ ఇందులో డ్రైవ‌ర్‌గాసుమంత్ అశ్విన్ కండ‌క్ట‌ర్‌గా క‌నిపిస్తారు. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న `ఆర్డిన‌రీసినిమా స్ఫూర్తితో తెర‌కెక్కిస్తున్నాం. మ‌న తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు మార్పులుచేర్పులు చేశాం.  ఎస్‌.కోట నుంచి గ‌విటికి వెళ్లే ఓ ఆర్టీసీ బ‌స్సు ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. కామెడీల‌వ్‌మిస్ట‌రీ అంశాలున్న చిత్ర‌మిది. మే చివరి వారం లేదా జూన్ మొదటివారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

సుమంత్ ఆశ్విన్ మాట్లాడుతూ ‘’మంచి టీంతో కొత్తగా చేసిన ప్రయత్నం. అందరికీ మంచి పేరు వస్తుందని భావిస్తున్నాను’’ అన్నారు.

నిర్మాత వంశీ కృష్ణ మాట్లాడుతూ ‘’సినిమాను అరకు, ఒడిశా, వికారాబాద్, కేరళలలో చిత్రీకరించాం. సి నిమాలో 5 పాటలున్నాయి. పాటలను త్వరలోనే రిలీజ్ చేస్తాంసినిమా బాగా వచ్చింది. సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు ఎం.ఎస్.రాజుగారికి థాంక్స్’’ అనారు.

 నాజ‌ర్‌ధ‌న‌రాజ్‌, `ష‌క‌ల‌కశంక‌ర్‌తాగుబోతు ర‌మేశ్‌జీవారాజా ర‌వీంద్ర‌భ‌ర‌త్‌రెడ్డివినోద్‌పావ‌నిక‌రుణ‌జ‌య‌వాణి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు సంగీతం:  జె.బి.పాట‌లు:  శ్రీమ‌ణికెమెరా:  శేఖ‌ర్ వి.జోస‌ఫ్‌మాట‌లు:  `డార్లింగ్‌స్వామిఆర్ట్ :  కె.ఎమ్‌.రాజీవ్‌కో ప్రొడ్యూస‌ర్‌:  జె.శ్రీనివాస‌రాజునిర్మాత‌:  జె.వంశీకృష్ణ‌ద‌ర్శ‌క‌త్వం: మ‌నుస‌మ‌ర్ప‌ణ‌: వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు.​

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved