pizza

RRR press meet
`ఆర్ ఆర్ ఆర్` ప్రెస్ మీట్‌

You are at idlebrain.com > News > Functions
Follow Us


14 March 2019
Hyderabad



What we know about #RRR so far

#RRR (which stands for Rajamouli, Tarak Ram and Ram Charan) is a 350 cr epic period drama based on the characters of Komaram Bheem (Telangana) and Alluri Seetharamaraju (Andhra). Though it’s based on true characters, the story is inspirational. The story of this film deals with the young days of Komaram Bheem and Alluri Seetharama Raju before they become legends. The inspiration for telling younger days of legends came from Hollywood film ‘The MotorCycle Diaries’ which is based Che Guevera’s life story. Tarak plays the role of Komaram Bheem and Ram Charan plays the role of Alluri Seetharamaraju. Story of the film opens in North India (Delhi) where there two characters meet in early 1920’s. Daisy Edgar Jones and Alia Bhat play the love interest to Tarak and Ram Charan respectively. Bollywood star Ajay Devgan is cast in a pivotal role.

This film sports a lot of visual effects. These visual effects will make the scenes in film look natural. SS Rajamouli has allocated a time limit of 6 months for his VFX team after the shoot is over. Producer Danayya is planning to release the film on 30 July, 2020.

యంగ్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రాంచరణ్‌ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌, హై టెక్నికల్‌ వేల్యూస్‌ చిత్రం 'ఆర్‌ ఆర్‌ ఆర్‌'. ప్రస్తుతం ఈ ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ - ''థియేటర్‌కు వచ్చే ఆడియెన్స్‌ సినిమాలో ఏం చూడబోతున్నాం. ఎలాంటి కంటెంట్‌ చూడబోతున్నాం. ఈ సినిమా ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ మనకు ఇవ్వబోతుంది అనే ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తారు. అలాంటివి ఉండేలా చూసుకోవాలి. అందుకనే నేను ఎప్పుడూ ఆడియెన్స్‌కు ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ రాబోతుందని ముందే చెప్పడానికి ట్రై చేస్తుంటాను. సాధారణంగా షూటింగ్‌ మొదలు పెట్టడానికి ముందే అలాంటి విషయాన్ని నిర్వహిస్తాను. ఈ సినిమా విషయానికి వస్తే కొన్ని కారణాలతో ఏ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఇంకా బిగినింగ్‌ స్టేజస్‌లోనే ఉన్నాను. ప్లాట్‌ పాయింట్‌ విషయానికి వస్తే.. 1897లో ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. ఆయన ఇంగ్లీష్‌ చదువులే కాకుండా పురాణాలు, ఇతిహాసాలు బాగా చదువుకున్నారు. యోగా ఎక్స్‌పర్ట్‌. అయితే యుక్త వయసులో ఉండగానే ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయారని అంటారు. తీర్థయాలకని అంటారు.. తపస్సుకని అంటారు.. దేశం కోసం త్యాగం చేశారని అంటారు. ఎక్కడికి వెళ్లారో, ఏం చేశారో తెలియదు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన గిరిజనుల బాగు కోసం స్వాతంత్య్ర ఉద్యమం స్టార్ట్‌ చేశారు. అక్కడి నుండి అన్నీ విషయాలు మనకు తెలుసు. ఆయనెలా పోరాడారు, గెరిల్లా వార్‌, పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేయడం, గన్స్‌ తీసుకోవడం, జనాల్ని ఉత్తేజ పరచడం. తర్వాత బ్రిటీషర్స్‌ చేతిలో చనిపోయారు. ఇవన్నీ మనకు తెలిసినవే. అల్లూరి సీతారామరాజు పుట్టిన రెండు, మూడేళ్ల గ్యాప్‌లో అంటే 1901లో ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్‌ జిల్లాలో కొమరం భీమ్‌ పుట్టారు. ఆయన కూడా యుక్త వయసులో ఉండగా.. ఇల్లు వదిలి వెళ్లిపోయారు. వెళ్లిన తర్వాత ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. వెళ్లే ముందు ఆయన నిరక్షరాస్యుడు.. తిరిగి వచ్చిన తర్వాత చదువుకున్నవాడిగా తిరిగొచ్చాడు. ఆయన కూడా నిజాం ప్రభుత్వం మీద, గిరిజనుల స్వాతంత్య్రం పోరాడారు. అల్లూరి సీతారామరాజు ఎలాగైతే ఫైట్‌చేశారో ఆయన కూడా అలాగే గెరిల్లా వార్‌, పోలీస్‌ స్టేషన్‌పై దాడి, గన్స్‌ తీసుకోవడం, ప్రజలను ఉత్తేజపరచడం చేశారు. వీరిద్దరి గురించి చదువుతున్నప్పుడు యాదృచ్చికంగా ఇద్దరూ ఒకే టైంలో పుట్టడం, ఒకే టైంలో వెళ్లిపోవడం.. వెళ్లిన తర్వాత ఏం జరిగిందో తెలియకపోవడం... వచ్చిన తర్వాత ఒకేలా ఫైట్‌ చేయడం చూసి నాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. దాన్ని మా సినిమాలో ప్లేస్‌ చేశాం. ఇద్దరు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే ఇద్దరు పోరాట యోధులు చరిత్రలో ఎప్పుడూ కలవని వారు.. ఒకరికొకరు సంబంధం లేనివాళ్లు, నిజంగా మనకు తెలియని టైంలో వాళ్లు కలుసుకుంటే ఒకళ్లకు ఒకరు ఇన్‌స్పిరేషన్‌ అయ్యుంటే.. తర్వాత వాళ్లు బ్రిటీష్‌ ప్రభుత్వంపై, నిజాం ప్రభుత్వంపై పోరాడారు. ఆ పోరాటం వాళ్ల మధ్య ఏర్పడిన స్నేహం ద్వారా ఏర్పడి ఉంటే ఎలా ఉంటుందనేది నాకు ఆసక్తికరంగా అనిపించింది. అదే మా సినిమాలో కథగా పెట్టబోతున్నాం. ఇది మనకు తెలిసిన స్టోరీ కాదు.. తెలియని స్టోరీ. ఫిక్షియస్‌ స్టోరీ. కంప్లీట్‌గా ఫిక్షనల్‌ స్టోరీ అది కూడా మనకు తెలిసిన ఇద్దరు రియల్‌ హీరోస్‌ గురించిచెప్పడమే ఈ సినిమా. ఇది లార్జ్‌ స్కేల్‌లో చేస్తున్నాం. చిన్న స్కేల్‌లో చేయడం కాకుండా పెద్ద ప్లాట్‌ ఫాంలో సినిమాను చేస్తున్నాం. చాలా రీసెర్చ్‌ చేశాం. 19వ దశాబ్దంలో జరిగిన కథ.. ఉత్తర బారతదేశంలో జరిగిన కథ. చాలా రీసెర్చ్‌ చేయాల్సి వచ్చింది. ఆరోజుల్లో జీవన విధానం ఎలా ఉండేది? దుస్తులు ఎలా ఉండేవి? వర్తకం ఎలా ఉండేది? ఇలాంటి విషయాలపై చాలా పెద్ద రీసెర్చ్‌ చేశాం. అందుకే ఈ సినిమా స్టార్ట్‌ చేయడానికి సమయం పట్టింది. ఇంత పెద్ద హీరోలున్న ఈ సినిమాకు సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ కూడా పెద్దగా, స్ట్రాంగ్‌గా ఉండాలి. అజయ్‌దేవగణ్‌గారు ఈ సినిమాలో స్ట్రాంగ్‌ రోల్‌ చేయడానికి యాక్సెప్ట్‌ చేశారు. ఈగ సమయంలో ఆయనతో పరిచయం ఉంది. ఆయనకు మెసేజ్‌ పెట్టి వెళ్లి కలిశాను. వెళ్లి క్యారెక్టర్‌ ఎక్స్‌ప్లెయిన్‌ చేయగానే. ఇమీడియట్‌గా డేట్స్‌ ఎప్పుడు కావాలని అడిగారాయన. ఆయన ఈ సినిమాలో పార్ట్‌ కావడం పట్ల చాలా ఎగ్జయిట్‌ అయ్యారు. ఫాష్‌ బ్యాక్‌లో వచ్చే ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో అజయ్‌దేవగణ్‌ నటిస్తున్నారు. అలియా భట్‌, చరణ్‌ జతగా నటిస్తుంది. ముంబై నుండి వస్తుంటే మేం ఎయిర్‌పోర్టులో కలుసుకున్నాం. అప్పుడే మాట్లాడుకున్నాం. నీ పాత్ర ఇలా ఉంటుందని రఫ్‌గా చెప్పాను. నేను ఏ పాత్ర అయినా చేస్తానంది. తర్వాత తనతో చర్చలు జరిపాం. తన క్యారెక్టర్‌ చేయడానికి ఎగ్జయిట్‌ అయ్యింది. డైజీ ఎడ్గ‌ర్ జోన్స్‌ అనే బ్యూటీఫుల్‌ యంగ్‌ లేడీ, తారక్‌ పక్కన నటిస్తుంది. సముద్రఖని మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమాకు ఆయన పాత్ర బ్యాక్‌బోన్‌లా ఉంటుంది. చాలా స్ట్రాంగ్‌ సపోర్టింగ్‌ క్యాస్ట్‌ దొరికింది. ముందు ఆర్‌ ఆర్‌ ఆర్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌ అనుకున్నాం. అయితే డిస్ట్రిబ్యూటర్స్‌, ఫ్యాన్స్‌ నుండి టైటిల్‌ చాలా బావుంది అని రెస్పాన్స్‌ వచ్చింది. ఆర్‌ ఆర్‌ ఆర్‌ అనే ఎలా పెడదాం అని ఆలోచించాం. అయితే అన్నీ భాషల్లో ఆర్‌ ఆర్‌ ఆర్‌ కామన్‌ టైటిల్‌గా ఉంటుంది. అయితే దానికి వివరణాత్మక టైటిల్‌ మాత్రం తెలుగులో, హిందీ, తమిళం, మలయాళ భాషలకు తగిన విధంగా ఒక్కొక్క స్టయిల్లో ఉంటుంది. ఆర్‌ ఆర్‌ ఆర్‌ అనే టైటిల్‌ అనుకోగానే అందరూ ట్విట్టర్‌ , ఫేస్‌బుక్‌ సహా ఇతర సోషల్‌ మీడియా మాధ్యమాల్లో అందరరూ కొన్ని సలహాలు ఇచ్చారు. సరే ప్రేక్షకులు ఇంత ఆసక్తిగా ఉన్నారు కదా.. ఆర్‌ ఆర్‌ ఆర్‌ కి వాళ్లనే ఎక్స్‌పెన్‌షన్‌ ఇవ్వమని అడిగాం. మేం ఊహించిన దానికంటే బావుంటే, కచ్చితంగా ఆ టైటిల్‌తోనే ముందుకెళతామని అనుకుంటున్నాం. నా సినిమాలో అల్లూరి సీతారామరాజుకి యంగర్‌ వెర్షన్‌గా రామ్‌చరణ్‌.. కొమరం భీమ్‌కు యంగర్‌వెర్షన్‌గా తారక్‌ కనిపిస్తారు. ఇద్దరూ ఆ క్యారెక్టర్స్‌లో ఇన్‌వాల్వ్‌ కావడం ఆనందంగా ఉంది'' అన్నారు.

మెగాపవర్‌స్టార్‌ రాంచరణ్‌ మాట్లాడుతూ - ''నేను రియాలిటీలో లేను. ఇది నిజమా? కాదా? అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో పార్ట్‌ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుండో రాజమౌళిగారితో పనిచేయాలని అనుకోవడం.. నాకు ఇండస్ట్రీలో బెస్ట్‌ ఫ్రెండ్‌, దగ్గరైన వ్యక్తి, చాలా చాలా నచ్చే వ్యక్తి తారక్‌తో, మాకు బాగా తెలిసిన దానయ్యగారితో పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ ఎలా స్టార్ట్‌ అయ్యిందో చెప్పాలని నాకు ఆసక్తిగా ఉంది. కొన్ని నెలలు క్రితం నేను ఎయిర్‌పోర్ట్‌కు వెళుతున్నప్పుడు.. ఆయన ఇళ్లు మధ్య దారిలోనే. వచ్చే దారిలో అలా క్యాజువల్‌గా వచ్చేసి వెళ్లు అన్నారు. వెళ్లాను. లోపలికి వెళ్లగానే తారక్‌ నేలమీద మంచి ఫోజులో అలా ఉండటాన్ని చూసి తనేంటి ఇక్కడున్నాడు అనుకున్నాను. అదేంటి బ్రో నువ్విక్కడ అని తారక్‌ అడిగాడు. నువ్వేం చేస్తున్నావ్‌ అని అడిగాను. తారక్‌ ఈలోపు మీరేమైనా మాట్లాడుకోవాలా రాజమౌళిగారు నేను.. బయటకు వెళతాను అన్నారు. కానీ నేను.. నా ఫ్లైట్‌కి ఇంకా టైముంది మీరేమైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి నేను వెయిట్‌ చేస్తాను అన్నాను. కొంత సేపు కన్‌ఫ్యూజన్‌లో ఉంచి.. మమ్మల్ని లోపలికి తీసుకెళ్లి ఆయన ప్రాజెక్ట్‌ని అనౌన్స్‌ చేశారు. మా ఇద్దరికీ చాలా ఆనందమేసింది. కచ్చితంగా మాకు ఇద్దరికీ ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది ఇద్దరం ఒకేసారి చెప్పాం. ఆ సంఘటన నా జీవితంలో మరచిపోలేని సంఘటన. దాని తర్వాత తీసిన ఫోటోనే సోఫాలో కూర్చున్న ఫోటోని అందరూ చూశారు. చాలా బాధ్యతగా డిజైన్‌ చేసిన క్యారెక్టర్స్‌ని మేం కూడా అలాగే ఫీల్‌ అవుతూ చేస్తున్నాం. ఇదొక ఫిక్షనల్‌ స్టోరి. చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. మా ఇద్దరి కాంబినేషన్‌లో ఇంతకు వచ్చిన సినిమా కంటే ఇది పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. నేను తారక్‌తో వర్క్‌ చేయడాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాను. మా ఇద్దరి షెడ్యూల్స్‌ ఇంకా గట్టిగా స్టార్ట్‌ కాలేదు. నేను నా బద్రర్‌ తారక్‌తో పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను'' అన్నారు.

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ - ''సాధారణంగా ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌కి వచ్చేటప్పుడు కాన్ఫిడెంట్‌గా వస్తాను. కానీ ఎందుకో ఈసారి కాస్త నెర్వస్‌గా ఉంది. ఓవర్‌ వెల్మింగ్‌గా అనిపిస్తుంది. ఇది జక్కన్నతో నా నాలుగో చిత్రం. అన్నింటి కంటే ఇదొక స్పెషల్‌ మూవీగా నా కెరీర్‌లో మిగిలిపోతుంది. ఎందుంటే జక్కన్నతో పనిచేయడం దాంతో పాటు.. చరణ్‌తో నటించడం. మా ఇద్దరి బాండింగ్‌ ఈ చిత్రంతో మొదలవలేదు. నాకు తెలిసిన ఓ మంచి మిత్రుడు. నా కష్టసుఖాలు పంచుకునే స్నేహం ఉన్న మిత్రడు. ఈ సినిమాలో పనిచేయడాని కంటే ముందే ఈ బాండింగ్‌ ఎప్పుడైతే ఏర్పడిందో అది చిత్రంలోకి వచ్చేసరికి .. ఈ సినిమాలో కలిసి పనిచేసేసరికి మా బాండింగ్‌ వేరే లెవల్‌కి వెళ్లిపోయింది. ఈ స్నేహం ఇలాగే ఉండిపోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. ఆర్‌ ఆర్‌ ఆర్‌ .. ఎ ఫిలిం డిమాండ్స్‌ ఎ లాట్‌ ఫ్రమ్‌ యాక్టర్స్‌. మనకు తెలియని ఓ గీత ఉంది. అల్లూరి సీతారామరాజుగారి గురించి కానివ్వండి.. కొమరం భీమ్‌గురించి కానివ్వండి.. ఇద్దరి గొప్ప వ్యక్తులు గురించి మనకు తెలియని గీత ఒకటి ఉంది. ఇప్పుడు ఇద్దరూ కనుక కలిసుంటే.. ఏం జరిగుండేది? అనే తాత్పర్యాన్ని దర్శకుడు కథలోకి తీసుకొచ్చాడో నటులుగా అది మాకు కొత్త అయ్యింది. కంప్లీట్‌ బ్లాంక్‌గా ఉన్నాను. ఎందుకంటే ఓ నటుడికి ఇన్‌ఫర్మేసన్‌ ఎంత తక్కువగా ఉంటే.. అంత పెర్ఫామెన్స్‌ బయటకు వస్తుందని నేను నమ్ముతాను. నాకు, చరణ్‌కి నటులుగా ఎదగడానికి ఈ చిత్రం ఎంతగానో దోహదపడుతుంది. ఈ చిత్రానికి షూటింగ్‌ ప్రారంభించడానికి ముందు మేం చేసిన వర్క్‌ షాప్స్‌ ఫెంటాస్టిక్‌. ఇప్పటి దాకా చేసిన 28 సినిమాల్లో నేను చేసిన దాని కంటే ఈ సినిమాలో నేను తీసుకున్న శిక్షణ.. మా ఫ్యూచర్‌ ఫిలింస్‌కు హెల్ప్‌ అవుతుంది.

ఇలాంటి గొప్ప పాత్రలను చేయడం చాలా గొప్ప విషయం. రాజమౌళిగారి బ్రెయిన్‌లో నుండి వచ్చిన ఈ థాంట్‌ 101 శాతం గొప్ప చిత్రంగా నిలుస్తుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. నటులుగా ఈ సినిమాలో భాగం కావడం మా అదృష్టం. ఈ అవకాశాన్ని కల్పించినందుకు జక్కన్నకి కృతజ్ఞతలు. ఆయన అడిగిన వెంటనే నాతో ఏకీభవించి ఎలాంటి బేషజాలు లేకుండా, స్క్రీన్‌ స్పేస్‌ను షేర్‌ చేసుకోవడానికి అంగీకరించినందుకు చరణ్‌కు థాంక్స్‌. మా జనరేషన్‌లో మేం దీన్ని సాధ్యమయ్యేలా చేశాం. ఇది సాధ్యమవడానికి కారణం జక్కన్నపై మాకున్న నమ్మకమే. మా ఫ్రెండ్‌షిప్‌పై మాకున్న నమ్మకం. మా నమ్మకం ఈ చిత్రానికి ఓ పాజిటివిటీగా మారి ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతికి లోనవుతారని నమ్ముతున్నాను'' అన్నారు.

నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ - ''భారతదేశం గర్వించే దర్శకులు ఎస్‌.ఎస్‌.రాజమౌళిగారితో ఈ సినిమా చేయడం నా పూర్వజన్మ సుకృతమో, నా భార్య పిల్లల అదృష్టం తెలియదు.రెండు పెద్ద ఫ్యామిలీస్‌తో వచ్చిన ఇద్దరు సమ ఉజ్జీలైన హీరోలతో సినిమా చేసే అవకాశం కల్పించిన రాజమౌళిగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పటికీ రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి. ఈ నెలాఖరున అహ్మదాబాద్‌, పూణేలో 30 రోజుల షెడ్యూల్‌ ఉంది. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో సినిమాను నిర్మిస్తున్నాం. ఈ సినిమాను 2020 జూలై 30 ప్రపంచ వాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నాం. వేరే భాషల్లో కూడా సినిమాను విడుదల చేయాలని డిమాండ్స్‌ వస్తున్నాయి. 10 ఇండియన్‌ లాంగ్వేజెస్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాం'' అన్నారు.

మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు యూనిట్‌ సమాధానాలు ఇచ్చారు..

చరిత్రలో అల్లూరి సీతా రామరాజు, కొమరం భీమ్‌ బ్రహ్మచారులు కదా! వారికి రొమాంటిక్‌ యాంగిల్‌ చూపించడం ఎంత వరకు కరెక్ట్‌?
రాజమౌళి: చరిత్ర ప్రకారం కొమరం భీమ్‌గారికి ఇద్దరు భార్యలు.. రామరాజుగారికి ఆయన మరదలు సీత అంటే చాలా ఇష్టం. నేను తెలిసిన కథ చెప్పడం లేదు.. తెలియని కథ చెబుతున్నాను.

ఫిక్షన్‌ స్టోరి అన్నారు. రియల్‌ క్యారెక్టర్స్‌ అంటున్నారు. కథ ఫిక్షనలా, రియలా?
రాజమౌళి: ఫిక్షనల్‌ స్టోరి బేస్‌డ్‌ అన్‌ రియల్‌ క్యారెక్టర్స్‌.

దేశంలోని ప్రాంతాలను(ఆంధ్ర, తెలంగాణ, ఉత్తర భారతదేశం) కలిపారుగా?
రాజమౌళి: థాంక్యూ.. ఇది ఇన్‌టెన్షనల్‌గా జరగలేదు. తెలంగాణ ప్రారతం నుండి వచ్చిన ఉద్యమవీరుడు, ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన ఓ ఉద్యమ వీరుడు కలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన, వారి స్నేహం అనే పాయింట్‌ ఎగ్జయిటింగ్‌గా అనిపించింది.

కథ స్వాతంత్య్రం రాక ముందే చూపిస్తారా? లేక ప్రెజంట్‌ జనరేషన్‌కి కనెక్ట్‌ చేస్తారా?
రాజమౌళి: స్వాతంత్య్రానికి ముందే .. 1920 బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుంది. ఇప్పటి జనరేషన్‌కి సంబంధం లేదు.

రాజమౌళి కాకుండా.. వేరే డైరెక్టర్‌ అప్రోచ్‌ అయ్యుంటే తారక్‌, చరణ్‌ కలిసి సినిమా చేసేవారా?
తారక్‌: వేరే దర్శకుడితో సినిమా కథతో అపోచ్‌ అయితే మేం కలిసి చేస్తామా? లేదా? అనేది ఫ్యూచర్‌. దాన్ని ఎలా చెప్పగలం. అయితే జక్కన్న కాబట్టి ఈ సినిమా పాజిబుల్‌ అయ్యిందని కచ్చితంగాచెప్పగలను. ఇది నాకు, చరణ్‌కు మధ్య ఉన్న స్నేహంపై ఉన్న నమ్మకంతో కూడా కుదిరింది.

బాహుబలి తర్వాత పేన్‌ ఇండియా డైరెక్టర్‌ అయ్యారు కదా? మళ్లీ తెలుగు హీరోలతోనే సినిమా చేయడానికి కారణమేంటి?
రాజమౌళి: తెలుగు వీరుల గురించి కథ చెబుతున్నప్పుడు తెలుగు హీరోలతో చేయడమే కరెక్ట్‌. బాహుబలితోనే పేన్‌ ఇండియా సినిమా చేశాం కదా.. మనం కథను స్ట్రాంగ్‌ ఎమోషన్స్‌తో సిన్సియర్‌గా చేస్తే.. ఆర్టిస్టులు గురించి పెద్దగా ఆలోచించకుండా ఆడియెన్స్‌ సినిమా చూడటానికి ఇష్టపడతారు.

చరణ్‌, తారక పుట్టినరోజులకు మీ నుండి సినిమాకు సంబంధించి అవుట్‌పుట్‌ ఏమైనా ఎక్స్‌పెక్ట్‌ చేయవచ్చా?
రాజమౌళి: లేదండి.. దానయ్యగారు చెప్పినట్లు 2020 జూలై 30 సినిమా విడుదల ఉంటుంది. ఆలోపు అవుట్‌ ఇవ్వడం అంటే టూ ఎర్లీ అవుతుంది.

బాహుబలి తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే డైలమా ఉండేదా? స్వాతంత్య్రవీరులకు సంబంధించిన కథలో సినిమాటిక్‌ లిబర్టీ తీసుకుంటే వివాదాలకు ఆస్కారం ఉంటుంది కదా?
రాజమౌళి: ప్రతి సినిమాను ఇదే ఫస్ట్‌ సినిమా అనుకునే చేస్తాను. పాత సినిమాల తాలూకా ప్రభావం ఉంటుంది. బాహుబలి హిట్‌ అయ్యింది. ఆ ఎంజాయ్‌మెంట్‌ పూర్తయ్యింది. కాబట్టి దాన్ని పక్కకు పెట్టి.. ఫ్రెష్‌గా ఏం చేయాలనే ఆలోచిస్తాను. ప్రేక్షకుల అంచనాలు నాకు తెలిసినా.. అవి నా జడ్జ్‌మెంట్‌పై ప్రభావం పడకుండా చూసుకుంటాను. దాని కోసం సిన్సియర్‌గా ప్రయత్నిస్తాను. ఇక వివాదాలంటారా? అవి కామన్‌గా మారిపోయాయి. లాంటి సబంధం లేని బాహుబలికి కూడా వివాదాలు వచ్చాయి. వివాదాలు వస్తాయి. అలా వచ్చినప్పుడ..సినిమా తీయడం మానేయలేం కదా.

చరిత్రకు సంబంధించిన హీరోలను ఎలా చూపిస్తారో అనేది కూడా ముఖ్యం కదా?
రాజమౌళి: నేను మన హీరోలను సూపర్‌హీరోలుగా చూపిస్తాను. అలాంటి రియల్‌ హీరోలను ఇంకెలా చూపిస్తానో మీరే ఆలోచించుకోండి.

కాన్‌టెంపరరీ స్టార్‌ హీరోల మధ్య వచ్చే సన్నివేశాలను హ్యాండిల్‌ చేసే సందర్భంలో మీ సంఘర్షణ ఏంటి?
రాజమౌళి: సంఘర్షణ అంటూ ఏమీ లేదు. టాప్‌స్టార్‌డమ్‌ ఉన్న ఇద్దరు హీరోలతో సినిమా చేసేటప్పుడు కాస్త అటు ఇటు అయితే అమ్మో మా వాడికి ఎక్కువ సీన్స్‌ ఉన్నాయి. మా వాడికి తక్కువ సీన్స్‌ ఉన్నాయని అభిమానులు గొడవ పడతారేమోనని ఆలోచించి ఇక్కడొక ఫైట్‌.. అక్కడొక ఫైట్‌.. ఇక్కడొక సాంగ్‌.. అక్కడొక సాంగ్‌.. ఇక్కడొక పంచ్‌.. అక్కడొక పంచ్‌.. అంటూ చేసుకుంటూ వెళితే కథలోని రసం మిస్‌ అయిపోతుంది. ఓ ఫిలిం మేకర్‌గా స్ట్రాంగ్‌ అయిన కథ ఉందా లేదా? అని ఆలోచిస్తాను. ఆడియెన్స్‌ థియేటర్‌కు వచ్చిన పది నిమిషాల్లో చరణ్‌ని, తారక్‌ని మరచిపోయి.. మనం చూపించిన క్యారెక్టర్‌ని చూడగలరా! అనేదే పెద్ద ఎక్సర్‌సైజ్‌గా భావించి వర్క్‌ చేశాను. స్ట్రాంగ్‌ కంటెంట్‌ ఉంది అని నమ్మిన తర్వాతే కథలోకి వెళ్లాను. బ్యాలెన్స్‌ ఉండాలి. ఫైట్స్‌లోనో, పంచ్‌ల్లోనో కాదు.. ఆడియెన్స్‌ను హత్తుకునే రేంజ్‌లో బ్యాలెన్స్‌ ఉండాలి. నా దగ్గర అన్‌ బ్యాలెన్స్‌డ్‌ స్టోరి లేదని అనుకుంటున్నాను. సినిమా ముగిసే సమయానికి కొమరం భీమ్‌ క్యారెక్టర్‌లో తారక్‌ ఎలా నచ్చుతాడో.. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్‌ కూడా అంతే నచ్చుతాడు. ఇద్దరిపై ఆడియెన్స్‌కు ఎంపతీ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను.

ఇందులో విలన్‌గా ఎవరిని ఎంత బలంగా చూపించబోతున్నారు?
రాజమౌళి: సినిమాలో హీరోలతో పాటు అజయ్‌దేవగణ్‌, సముద్రఖని, ఆలియా, డేజి.. ఇలా చాలా పవర్‌ఫుల్‌రోల్స్‌ సహా విలన్‌ క్యారెక్టర్స్‌ కూడా ఉంటాయి. హీరో విలన్‌ అంటే వాళ్లే, హీరో హీరోయిన్‌ అన్నా కూడా వాళ్లే. ఎన్టీర్‌, చరణ్‌ పాత్రలే కీలకం. వారికి మిగిలిన క్యారెక్టర్స్‌ సపోర్ట్‌ చేస్తాయంతే.

తెలుగు స్వాతంత్య్ర యోధులను ఇతర భాషల్లోకి తీసుకెళుతున్నారు కదా.. ఈ పాత్రల ప్రాముఖ్యతను వాళ్లు అర్థం చేసుకుంటారని భావిస్తున్నారా?
రాజమౌళి: వేరే వాళ్లు తెలియక పోతే తెలుసుకుంటారని ఆశ. తెలుసుకోవాలండి. చాలా మంది వీరుల కథలు మరుగున పడిపోయాయి. ఇద్దరు తెలుగు వీరుల గురించి ఈ సినిమాలో చెబుతున్నారట కదా! అని వేరే భాషలవాళ్లు గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే అదే నేను వాళ్లకిచ్చే గౌరవంగా భావిస్తాను. ఇందులో పాత్రల ఎమోషన్స్‌, క్యారెక్టరైజేషన్‌ తాలూకా బలంపైనే ఈ కథ నడుస్తుంది కానీ.. వాళ్లు ఎంత పెద్ద వీరులు అనే దానిపైన సినిమా కథ నడవదు. ఇది తెలియని కథ. వాళ్లు అలా తయారు కావడానికి కారణమేంటనేదే ఈసినిమాలో చూపిస్తున్నాం.

బాహుబలి తరహాలో స్ట్రాంగ్‌ ఫిమేల్‌ క్యారెక్టర్స్‌ ఈ సినిమాలో ఉంటాయా?
- నేను కథను రాసుకునేటప్పుడు స్ట్రాంగ్‌ ఫిమేల్‌క్యారెక్టర్స్‌ ఉన్నాయా? లేవా? అని ఆలోచించను. ఏ సన్నివేశం ఆడియెన్స్‌పై ఎలా ప్రభావం చూపిస్తుందనే రాసుకుంటాను. కథ డిమాండ్‌ చేస్తే నేను స్ట్రాంగ్‌ ఫిమేల్‌ క్యారెక్టర్‌ను పెడతాను. అవసరం లేదనుకుంటే ఏ పాత్రను పెట్టాను. ఆలియా భట్‌ చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. కథ మలుపులో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది. సీత అనే బలమైన పాత్రను ఆమె పోషించింది.

ఈ సినిమాకు సీక్వెల్‌ తీస్తారా?
- రాజమౌళి: నవ్వుతూ.. ఆ పాయింట్‌ని ఆలోచించాలండి.. మనకు తెలిసిన కథ అల్లూరి, కొమరం భీమ్‌లు స్వాతంత్య్రం పోరాటంలో ఏం చేశారని తెలుసు. కానీ అలా తిరిగి రావడానికి వాళ్లు ఏం చేశారనేదే. వాళ్లు మనకు తెలసిన లెజెండ్స్‌ ఎలా మారారనడంతో నా కథ అయిపోతుంది.

ఈ కథాలోచన ఎవరిది?మీదా.. మీనాన్నగారిదా?
రాజమౌళి: ఐడియా నాదే. చాలా ఏళ్ల క్రితం మోటార్‌ సైకిల్‌ డైరీ చూశాను. సినిమా ఆసక్తికరంగా సాగే క్రమంలో.. షే అనే పాత్ర గురించి సినిమా ఉంటుంది. చివర్లో ఆ పాత్ర చేగువేరాకు సంబంధించిందంటూ ఇచ్చే ట్విస్ట్‌ చూసి షాకయ్యాను. చాలా బావుంది కదా? అనిపించింది. రాజు అనే కుర్రాడు గురించి కథ చెప్పి అతనే అల్లూరి సీతారామరాజు అని రివీల్‌ చేస్తే ఎలా ఉంటుదోనని చాలా సంవత్సరాల క్రితం అనుకున్నదే. సడెన్‌గా కొమరం భీమ్‌ గురించి చదువుతుంటే.. ఇద్దరి జీవితాల్లో విషయాలు ఒకేలా జరగడం గమనించాను. ఈ కథకు ఆలోచన మోటర్‌ సైకిల్‌ డైరి అనే సినిమా నుండే పుట్టింది.

బాహుబలి తర్వాత గ్రాఫిక్స్‌ లేకండా సినిమా చేయాలనుకున్నారు కదా.. కానీ ఇప్పుడు గ్రాఫిక్స్‌ అవసరం అయ్యేలా ఉందే?
రాజమౌళి: నవ్వుతూ అవసరం అయ్యేలానే ఉంది.. కుక్కతోక వంకరలా ..

చిరంజీవి సైరాలో స్వాతంత్య్రయోధుడుగా.. ఈ సినిమాలో మీరు అల్లూరి సీతారామరాజుగా చేయడం ఎలా అనిపిస్తుంది?
చరణ్‌: ఆయనదేమో ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమా విడుదలైతే.. అదే పీరియడ్‌లో నేను సినిమా చేయడం యాదృచ్చికమే.

ఎన్టీఆర్‌ ఇప్పుడు తెలంగాణ మాండలికం ప్రాక్టీస్‌ చేస్తున్నారా?
ఎన్టీఆర్‌: కొమరం భీమ్‌గారి మాండలికం ఏదైతే ఆ మాండలికమే.

Photo Gallery (photos by G Narasaiah)





 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved