pizza
Sirivennela press meet
ప్రియమణి నటిస్తున్న "సిరివెన్నెల" మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్
You are at idlebrain.com > News > Functions
Follow Us


20 February 2019
Hyderabad

ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని ఎన్నో ప్రశంసలు అందుకున్న ప్రియమణి... తెలుగులో పలు కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త దూరమైంది. అయితే తాజాగా ఓ చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంది. ఏ ఎన్ బి కోర్డినేటర్స్ బ్యానర్ పై ఏ ఎన్ భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో తెరకెక్కించనున్న "సిరివెన్నెల" అనే చిత్రం ద్వారా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తెలుగు చిత్ర సీమలో క్లాసిక్ మూవీగా చెప్పుకునే "సిరివెన్నెల" సినిమా టైటిల్ ఇన్నాళ్ల తర్వాత మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరిగిన షూటింగ్ స్పాట్ లో ప్రియమణి ప్రకటించింది. ప్రియమణి చాలా కథలు విన్నప్పటికీ "సిరివెన్నెల" కథ బాగా నచ్చడం పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో నటించేందుకు ఒప్పుకుంది. ప్రియమణికి పర్ ఫెక్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మూవీగా సిరివెన్నెల ఉండనుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు... జూనియర్ మహానటిగా మంచిపేరు తెచ్చుకున్న సాయి తేజస్విని, బాహుబలి చిత్రంలో కిలి కిలి భాషతో భయంకరమైన విలన్ గా నటించిన కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా...

డైరెక్టర్ ప్రకాష్ పులిజాల మాట్లాడుతూ... సిరివెన్నెల మూవీ టాకీ పార్ట్ పూర్తయ్యింది. బ్యాలెన్స్ రెండు పాటలున్నాయి. కె విశ్వనాథ్ గారు సిరివెన్నెల అనే గొప్ప సినిమా తీశారు. మా సినిమా జోనర్ వేరు. కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ సిరివెన్నెల. కొంత గ్యాప్ తర్వాత ప్రియమణి గారు మా సినిమా చేస్తున్నారు. ఆమె కొత్త లుక్ లో కనిపిస్తారు. థ్రిల్లర్ హార్రర్ జోనర్ లో ఈ సినిమా ఉంటుంది. కాలకేయ ప్రభాకర్ విలన్ గా నటిస్తున్నారు. మహా నటి ఫేమ్ సాయి తేజ మంచి పాత్ర చేస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. మా షూటింగ్ ఇంత బాగా జరిగిందంటే మా నిర్మాతలు కమల్, బాషా, రాం సీతా గారి వల్లే.  అని అన్నారు

ప్రియమణి మాట్లాడుతూ...
చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాను. నాకోసం ముంబై వచ్చి కథ చెప్పారు. థ్రిల్లర్ జోనర్ అయినప్పటికీ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. చిన్న వయసులో సాయి తేజ మంచి పాత్ర చేస్తుంది. మా డైరెక్టర్ చాలా కూల్. ప్రభాకర్ చాలా మంచి క్యారెక్టర్ చేశారు. మా నిర్మాతలకు చాలా థాంక్స్. సూపర్ నేచురల్ సంబంధ విషయాలు నేర్చుకునే ప్రాసెస్ లో
కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటిని డైరెక్టర్ థ్రిల్లింగ్ గా చెప్పారు. అని అన్నారు.

కాలకేయ ప్రభాకర్ మాట్లాడుతూ... కన్నింగ్ బిసినెస్ మ్యాన్ క్యారెక్టర్ చేశా. చాలా మంచి పాత్ర. కామెడీ కూడా చేశాను. డబ్బింగ్ చెప్పాను సినిమా బాగా వచ్చింది. ప్రియమణి గారితో కలిసి నటించే అవకాశం వచ్చింది. అని అన్నారు.

నిర్మాత భాషా మాట్లాడుతూ.... కీరవాణి గారి దగ్గర నేను బాహుబలి 2 వరకు మేనేజర్ గా పని చేసాను. మా నిర్మాత కమల్ గారు లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. మా తొలి సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది.  అని అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved