pizza
Sri Kalasudha 20th awards press meet
20వ కళాసుధ అవార్డుల ప్రధానం
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

14 March 2018
Hyderabad

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్న ఈ సంస్థ ఈ ఉగాది సందర్భంగా కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 20వ ఉగాది పురస్కారాలను అందించనుంది.

ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో సంస్థ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 1998 నవంబర్ 21న ప్రారంభించబడి గత 20 సంవత్సరాలుగా తెలుగు సినీ కళాకారులకు అవార్డులు అందిస్తున్నాం. ఈ ఏడాది 20వ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఉగాది రోజున చెన్నయ్‌లో పురస్కారాల్ని అందజేయనున్నాం. ఈ సందర్భంగా ఎంపిక చేసిన 20 మంది అవార్డు గ్రహీతలకు వెండి కిరీట ధారణ చేయాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ మంత్రి ఘంటా శ్రీనివాసరావు, మండలి బుద్ధప్రసాద్, వరప్రసాద్‌రెడ్డి, ఎ.ఎమ్.రత్నం, రామ్మోహన్‌రావు లాంటి ప్రముఖులు హాజరవుతున్నారు. ఉగాది రోజున చెన్నయ్‌లోని మ్యూజిక్ అకాడమీలో ఈ వేడుక జరగనుంది అన్నారు.

ఫణిమాధవ్ మాట్లాడుతూ కళాసుధ 20వ వసంతోత్సవం సందర్భంగా అందిస్తున్న అవార్డులు ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఈ కార్యక్రమం త్రివేణి సంగమంగా జరగనుంది. సినీ అవార్డులతోపాటు మహిళారత్న పురస్కారాలు అందజేయనున్నాం. జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్‌గారికి అందిస్తున్నాం. బాపు-రమణ అవార్డును సాయికుమార్‌కు, బాపు బొమ్మ అవార్డును సీనియర్ నటి మాధవికి అందజేయనున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివా,నిర్మాత కిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కళాసుధ ఉగాది పురస్కార గ్రహీతలు:
ఉత్తమ చిత్రం- శతమానం భవతి
ఉత్తమ ఆధ్యాత్మిక చిత్రం- ఓం నమో వేంకటేశాయ
ఉత్తమ సామాజిక చిత్రం- నేనే రాజు నేనే మంత్రి
ఉత్తమ హీరో- రానా
ఉత్తమ దర్శకుడు- క్రిష్ (గౌతమీపుత్ర శాతకర్ణి)
ఉత్తమ నటి- కాజల్
ప్రత్యేక జ్యూరీ అవార్డు- విజయ్ దేవరకొండ
ఉత్తమ సంగీత దర్శకుడు- థమన్
ఉత్తమ కెమెరామెన్- ఛోటాకె.నాయుడు
ఉత్తమ నూతన నటుడు- ఘంటా రవితేజ్
ఉత్తమ నూతన నటీమణులు- రితికాసింగ్, సాయిపల్లవి, షాలినీ పాండే
ఉత్తమ పాటల రచయిత- సుద్దాల అశోక్‌తేజ
ఉత్తమ నూతన దర్శకురాలు- సుధా కొంగర (గురు)




 
Photo Gallery (photos by G Narasaiah)
   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved