pizza
Sri Sri online release on 3 June
ఎంఫ్లిక్స్ వరల్డ్ ద్వారా ఆన్ లైన్ లో జూన్ 3న విడుదలవుతున్న ‘శ్రీశ్రీ’
ou are at idlebrain.com > News > Functions
Follow Us

28 May 2016
Hyderabad

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌విజ‌య‌నిర్మలన‌రేష్‌సుధీర్ బాబు ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం ‘శ్రీశ్రీ. ఎస్‌.బి.ఎస్‌.ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ముప్ప‌ల‌నేని శివ ద‌ర్శ‌క‌త్వంలో చాట్ల సాయిదీప్‌బాలు రెడ్డి.వైషేక్ సిరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 3న సినిమా విడుదలవుతుంది. సినిమా ఆన్ లైన్ లో ఎమ్ ఫ్లిక్స్ వరల్డ్ లో విడుదలవుతుండటం విశేషం. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....

సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ ‘’తెలుగువారు ఏ దేశంలో ఉన్న సినిమాలను బాగా చూస్తారు. సినిమాయే ముఖ్య వినోదాంశంగా భావిస్తారు. 50 ఏళ్ల నా సినీ ప్రస్థానంలో ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం నా అభిమానులు, ప్రేక్షకులే కారణం. ఎన్నో రకాల ప్రయోగాలు చేసినా తెలుగువారు ఆదరించారు. తేనె మనసులు మొదటి ఈస్ట్ మన్ కలర్ సోషల్ మూవీ. అలాగే మోసగాళ్లకు మోసగాడు తొలి కౌబోయ్ మూవీ, అల్లూరి సీతారామరాజు తొలి సినిమా స్కోప్, సింహాసనం తొలి 70 ఎం.ఎం. చిత్రం, గూఢచారి 116తో తొలి డిటెక్టివ్ మూవీ ఇలా చేసిన ప్రతి ప్రయత్నాని హృదయపూర్వకంగా ఆదరించారు. ఇప్పుడు శ్రీశ్రీ చిత్రంలో హీరోగా చేశాను. ఈ చిత్రం జూన్ 3న విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని కూడా ఎమ్ ఫ్లిక్స్ వరల్డ్ ద్వారా ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నాం. ఈ ప్రయోగాన్ని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు.

శ్రీమతి విజయనిర్మల మాట్లాడుతూ ‘’నేను, కృష్ణగారు కలిసి చాలా సంవత్సరాలు తర్వాత చేస్తున్న చిత్రమిది. ముప్పలనేని శివగారు కథ నచ్చడంతో కృష్ణగారు, నేను ఈ చిత్రంలో నటించాం. సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ చక్కగా కుదిరాయి. ఈ సినిమాలో ఎన్నెనో జన్మల బంధం ...అనే సాంగ్ నాకు ఇష్టమైనది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చక్కగా నిర్మించారు. అందరూ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఎంఫ్లిక్స్ వరల్డ్ డైరెక్టర్ రాజు నడింపల్లి మాట్లాడుతూ ‘’సూపర్ స్టార్ కృష్ణగారు తెలుగు చిత్రానికి సంబంధించిన ఎన్నో ప్రయోగాలను పరిచయం చేసిన వ్యక్తి. ఇప్పుడు మా ఎంఫ్లిక్స్ ద్వారా శ్రీశ్రీ చిత్రాన్న ఆన్ లైన్ లో విడుదల చేయడం ద్వారా మరో సంచలనం క్రియేట్ చేయబోతున్నారు. సగటు తెలుగు సినిమా అభిమాని విడుదలైన రోజునే సినిమాను చూడాలనుకుంటున్నాడు. దీని వల్లనే పైరసీ అనేది ఏర్పడింది. తప్పని తెలిసిన తప్పక పైరసీ ద్వారా సినిమాలను చూస్తున్నారు. ఈ పైరసీని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే మా ఎంఫ్లిక్స్ ద్వారా సినిమాలను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నాం. దీని ద్వారా సినిమాను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి చూడవచ్చు. ఇక శ్రీశ్రీ విషయానికి వస్తే ఇండియా మినహా ప్రపంచ దేశాలన్నింటిలో మా ఎంఫ్లిక్స్ ద్వారా శ్రీ శ్రీ సినిమా విడుదలవుతుంది. ఇంగ్లీష్, హిందీ భాషలు సహా అన్నింటిలో సినిమా విడుదలవుతున్న రోజునే ఆన్ లైన్ లో సినిమా విడుదలవుతున్న చిత్రమిదే. కృష్ణగారి అభిమానులుగా మేం ఆయనతో ఈ చిత్రం ద్వారా అసోసియేట్ కావడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.

ముప్పలనేని శివ మాట్లాడుతూ ‘’కృష్ణ, విజయనిర్మలగారు మంచి నటులే కాదు, మంచి దర్శకులు కూడా వారిని డైరెక్ట్ చేయడం నా అదృష్టం. పండంటి కాపురం సినిమా చూసి ఆయన అభిమానిగా మారాను. కృష్ణగారు నటించిన కిరాయికోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు సహా పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. తర్వాత కృష్ణగారే ఘరానా అల్లుడు చిత్రంతో నన్ను దర్శకుడిగా పరిచయం చేశారు. దర్శకుడిగా 20 సినిమాలను డైరెక్ట్ చేసిన నాకు మూడు నాలుగేళ్లుగా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు కృష్ణగారిని శ్రీశ్రీ చిత్రంలో డైరెక్ట్ చేయడం ఆనందంగా ఉంది. నిర్మాతలు చాట్ల సాయిదీప్‌బాలు రెడ్డి.వైషేక్ సిరాజ్ కూడా కృష్ణగారి అభిమానులే. ఎక్కడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందించారు. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రం ఎంఫ్లిక్స్ ద్వారా ఆన్ లైన్ లో విడుదల అవుతుంది. ఇది కృష్ణగారు చేస్తున్న మరో ప్రయోగం. సినిమా జూన్ 3న విడుదలవుతుంది. అందరికీ నచ్చే చిత్రమవుతుంది’’ అన్నారు.

నిర్మాతలు చాట్ల సాయిదీప్‌బాలు రెడ్డి.వైషేక్ సిరాజ్ మాట్లాడుతూ ‘’మేం ముగ్గురం మంచి మిత్రులం, ముగ్గురం కూడా కృష్ణగారి అభిమానులమే. ఆయన నటించిన శ్రీశ్రీ చిత్రాన్ని మేం నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నాం. సినిమాను జూన్ 3న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved