pizza
Talasani Srinivas Yadav press meet about film industry
ఇండస్ట్రీకి మేలు జరిగే విధంగా ఓ పాలసీ తీసుకొచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్ధంగా వుంది - సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
You are at idlebrain.com > News > Functions
Follow Us


05 May 2020
Hyderabad

 

కరోన కారణంగా ఇబ్బందులు పడుతున్న సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సి.కళ్యాణ్, నిర్మాతలు దిల్ రాజు, తుమ్మల ప్రసన్న కుమార్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అద్యేక్షుడు నారాయణ్ దాస్ నారంగ్ , సునీల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ....
ప్రధానంగా ఈరోజు కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ టైంలో ఫిలిం ఇండస్ట్రీ కూడా ఎంతో ఇబ్బంది పడుతుంది. ప్రభుత్వము సీఎం గారు కరోనా పైఎంటో సీరియస్ గా వున్న విషయం తెలిసింది. షూటింగ్ లకు ఇబ్బందులు అవుతున్న సమయంలో క్రైసిస్ ఛారిటీ 14000 మందికి సహాయం చేశారు, చిరంజీవి నాగార్జున గారు ఆధ్వర్యంలో ఓ పాలసీ తీసుకొచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్ధంగా వుంది, తెలంగాణా ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాలుగా సహాకారం అందిస్తుంది. లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత ఇండస్ట్రీ ప్రతినిధులతో మరోసారి చర్చలు జరిపి యధా విధి స్థానం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది, ఫిలిం ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ లో సెటిల్ అయిన ఇండస్ట్రీ. చలన చిత్ర పరిశ్రమ కు కులాలు ప్రాంతాలు వుండవు, ఏ విధంగా ఇండస్ట్రీని ప్రమోట్ చేసుకోవాలి అనేది చిరంజీవి నాగార్జున ఆధ్వర్యంలో చర్చలు జరిపాం. ఇప్పటికిప్పుడు తొందరపడి ఇబ్బందులు తెచ్చుకోవటం కంటే జూన్ లో అన్ని పరిస్థితులను క్షుణ్ణంగా ఆలోచించి షూటింగ్స్ చేసుకొనేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంటాము. జి.హెచ్.ఎమ్.సి నుంచి అన్నపూర్ణ భోజనం ఒక లక్ష మందికి ప్రతి రోజు పెడుతున్నాం, వలస కూలీలకు దాదాపు రెండు లక్షల మందికి 12కేజీల బియ్యం అయిదు వందల రూపాయలు ఇచ్చాము. ఇండస్ట్రీ విషయంలో లాక్ డౌన్ అయిన తరువాత ఎది బెస్ట్ అనేది అందరూ కూర్చొని మంచి నిర్ణయ ము తీసుకుందామని తెలిపారు.

సి.కళ్యాణ్ మాట్లాడుతూ...
చిరంజీవి గారు కరోనా క్రైసిస్ ఛారిటీ కి లీడ్ తీసుకొని చెయ్యడం చాలా గొప్ప విషయం, 14000 మంది సినీ వర్కర్స్ కి నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ వైజాగ్, విజయవాడ, తిరుపతి లో కూడా వున్న సినీ వర్కర్స్ కి ఇచ్చాము. ఎవరు ఇబ్బంది పడకుండా అందరికీ సీసీసీ సహాయం చేసింది లాక్ డౌన్ తరువాత చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు. నిర్మాత చెదలవాడ శ్రీనివాస్ ప్రొడ్యూసర్ కౌన్సెల్ లో ఉన్న మెంబెర్స్ అందరికి, ఛాంబర్ లో ఉన్న సభ్యులకు, కొంతమంది నిర్మాతలకు కరోన కారణంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి 10,000 ఆర్థిక సహాయం చేశారు, అలాగే ఛాంబర్, ప్రొడక్షన్ బాయ్స్ కు, మహిళ ఆర్టిస్టులకు, పేద ఆర్టిస్టులకు కూడా సహాయం చెయ్యడం జరిగింది, కార్డ్ లేని ఆర్టిస్ట్ లకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత చదలవాడ శ్రీనివాస్ గారికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved